← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆచమనము ācamanamu

Original — తెలుగు
  1. ఆచమించుట, ఆపోశనము - భోజనసమయమున, భోజనమునకు ముందు, తర్వాతను, చూపుడువ్రేలు పైకి విడిచిపెట్టి, బొటనవ్రేలు చివరను నడిమివ్రేలు మొదటికి చేర్చి, ఆ పుడిసిటిలో నీళ్ళు పోసుకొని, “కేశవాయస్వాహా, నారాయణాయస్వాహా, మాధవాయస్వాహా” అను మంత్రములు చెప్పుచూ ఆ నీటిని అభిమంత్రించి మూడుమారులు పుచ్చుకొనుట.

  2. “తద్విద్వాంస శ్రోత్రియాఅశిష్యత ఆచమంత్యశిత్వా చాచమంతి. ఏతమేవ తదన మనగ్నం కుర్వంతో మన్యంతే”

(బృహదారణ్యకోపనిషత్)

(శ్రోత్రియులైన విద్వాంసులు భోజనమునకు ముందు, తర్వాతను, ఆచమనము చేయుదురు. ఇదియే ప్రాణవాయువును వస్త్రమువేసి ఆచ్ఛాదించుట - కప్పుట అని వారు తలచుచున్నారు. ప్రాణమునకు ఉదకము వస్త్రమని చెప్పబడియుండుటచేత - ఉదకములో ప్రాణవాయువున్నది - (hydrogen + oxygen = water).

(సూక్ష్మరూపములో ఉన్న జలము - hydrogen gas + ప్రాణవాయువు = స్థూలరూపములో ఉన్నజలము).

  1. “తస్మాద్వా ఏతదశిష్యంతః పురస్తాచ్ఛోదరిష్పాద ద్భిః పరిదధతి” (ఛాందోగ్యోపనిషత్ - 5 - 2 - 21)

(భోజనము చేయుటకు ముందును, తర్వాతను ప్రాణమును నీటితో పరిధానము చేయుదురు. ప్రాణమును నీరు అను వస్త్రముతో కప్పుచున్నామను అభిప్రాయముతో నీటిని ఆచమనము చేయుదురు).

(దీని అభిప్రాయము ఈ క్రింద విధముగా స్పురించుచున్నది : -

ప్రాణమునకు జలము బట్టవంటి ఆచ్ఛాదనము, కప్పు. ప్రాణము సూక్ష్మముకనుక జలములో నిమిడియున్నది - “వాయోరగ్నిః, అగ్నే రాపః” - (వాయువులోనుండి అగ్ని పుట్టినది, అగ్నినుండి నీరు పుట్టినది).

ఇట్లు చెప్పుటవలన వాయువుగుణము జలములో సూక్ష్మరూపములోనున్నది. ప్రాణవాయువు ముక్కుద్వారా ఊపిరి తిత్తులలోకి వెళ్ళి రక్తమును శుభ్రపఱచుటయే కాక జలములోని అంశమై ఆహారమును ద్రవరూపముగానుండి అన్నసారముతోబాటు శరీరమంతటను వ్యాపించి, ఆహారపరిణామములన్నింటినీ శుద్ధి చేయును - శరీర చర్మములోని ప్రతి అణుభాగము గాలి లోని ప్రాణవాయువును గ్రహించును. ఆరోగ్యమునకైనను,అజీర్ణముగానున్నపుడైనను శరీరమునకు కావలసినంత నీరు త్రాగవలెను, చర్మము శుభ్రముగా నుంచవలెను - బాహ్య శౌచము).

Transliteration
  1. ācamiṃcuṭa, āpōśanamu - bhōjanasamayamuna, bhōjanamunaku muṃdu, tarvātanu, cūpuḍuvrēlu paiki viḍicipeṭṭi, boṭanavrēlu civaranu naḍimivrēlu modaṭiki cērci, ā puḍisiṭilō nīḷḷu pōsukoni, “kēśavāyasvāhā, nārāyaṇāyasvāhā, mādhavāyasvāhā” anu maṃtramulu ceppucū ā nīṭini abhimaṃtriṃci mūḍumārulu puccukonuṭa.

  2. “tadvidvāṃsa śrōtriyāaśiṣyata ācamaṃtyaśitvā cācamaṃti. ētamēva tadana managnaṃ kurvaṃtō manyaṃtē”

(bṛhadāraṇyakōpaniṣat)

(śrōtriyulaina vidvāṃsulu bhōjanamunaku muṃdu, tarvātanu, ācamanamu cēyuduru. idiyē prāṇavāyuvunu vastramuvēsi ācchādiṃcuṭa - kappuṭa ani vāru talacucunnāru. prāṇamunaku udakamu vastramani ceppabaḍiyuṃḍuṭacēta - udakamulō prāṇavāyuvunnadi - (hydrogen + oxygen = water).

(sūkṣmarūpamulō unna jalamu - hydrogen gas + prāṇavāyuvu = sthūlarūpamulō unnajalamu).

  1. “tasmādvā ētadaśiṣyaṃtaḥ purastācchōdariṣpāda dbhiḥ paridadhati” (chāṃdōgyōpaniṣat - 5 - 2 - 21)

(bhōjanamu cēyuṭaku muṃdunu, tarvātanu prāṇamunu nīṭitō paridhānamu cēyuduru. prāṇamunu nīru anu vastramutō kappucunnāmanu abhiprāyamutō nīṭini ācamanamu cēyuduru).

(dīni abhiprāyamu ī kriṃda vidhamugā spuriṃcucunnadi : -

prāṇamunaku jalamu baṭṭavaṃṭi ācchādanamu, kappu. prāṇamu sūkṣmamukanuka jalamulō nimiḍiyunnadi - “vāyōragniḥ, agnē rāpaḥ” - (vāyuvulōnuṃḍi agni puṭṭinadi, agninuṃḍi nīru puṭṭinadi).

iṭlu ceppuṭavalana vāyuvuguṇamu jalamulō sūkṣmarūpamulōnunnadi. prāṇavāyuvu mukkudvārā ūpiri tittulalōki veḷḷi raktamunu śubhrapaṟacuṭayē kāka jalamulōni aṃśamai āhāramunu dravarūpamugānuṃḍi annasāramutōbāṭu śarīramaṃtaṭanu vyāpiṃci, āhārapariṇāmamulanniṃṭinī śuddhi cēyunu - śarīra carmamulōni prati aṇubhāgamu gāli lōni prāṇavāyuvunu grahiṃcunu. ārōgyamunakainanu,ajīrṇamugānunnapuḍainanu śarīramunaku kāvalasinaṃta nīru trāgavalenu, carmamu śubhramugā nuṃcavalenu - bāhya śaucamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.