(శిష్యుని దగ్గరకు తీసుకొని వేదమును, దాని రహస్యార్థముతోను, కల్పముతోను అతనికి భోధించువాడు ఆచార్యుడు).
(చేయవలసిన పని చేయుచు, చేయరాని పని చేయక, తన స్వరూపమునకు అనుగుణ్యమైన ఆచారములను చేయచు నుండువాడు ఆచార్యుడనబడును).
(వేదములలోను, ఉపనిషత్తులలోను, శాస్త్రములలోను చెప్పిన విషయములను స్వయముగా అవగాహనము చేసుకొని ఇతరులచే ఆ ప్రకారముగా ఆచరింపచేయుచు, తాను ఆ ప్రకారముగా నాచరించువాడు ఆచార్యుడని చెప్పబడును).
సూత్రద్వారా శుష్యాణా మాచారే స్థాపనాత్ ఆచార్యత్వం.
(వేద వేదాంగములకు వ్యాఖ్యానము చేయువాడు - వాటిలోని సారమును, రహస్యములను తెలియునట్లు వ్యాఖ్యానము చేయువాడు. సూత్రములద్వారా - బ్రహ్మసూత్రములు, భక్తిసూత్రములు యోగసూత్రములు మొదలగువాటిద్వారా శిష్యులను ఆచారమందు, సదాచారమందు, ఆచరణ చేయుటలో, నియోగించువాడు).
(వేదవేదాంగవేది అయినవాడు, విష్ణుభక్తిగలవాడు మత్సరములేనివాడు, మంత్రములు తెలిసినవాడు, మంత్రములందు నమ్మకము, శ్రద్ధ, కలవాడు, ఎల్లపుడు మంత్రములనాశ్రయించి యుండువాడు, శుచిగా నుండువాడు గురువునందు భక్తిగలవాడు, పురాణములను విశేషముగా తెలిసినవాడు - ఈ పై లక్షణములుగలవాడు గురువు, ఆచార్యుడు.
(ఆచార్యుడు అనువాడు మూడు విధములుగా నుండును - చోదకుడు, అనగా, మార్గమును చూపించు వాడు; బోధకుడు మార్గమునాదేశించును. మోక్షకుడు అనగా మోక్షమునిచ్చువాడు - పరతత్వమును తెలుసుకొని మోక్షమునిచ్చువాడు, అనగా, మోక్షమార్గమును చూపించి ఉపదేశించువాడు. ఈ ముగ్గురులో మోక్షమునిచ్చువాడు గొప్పవాడు, ఉత్కృష్టమైనవాడు - పరమేశ్వరుడే).
(ఆచార్యుడు, - గురువు - గలవాడు తెలుసుకొనును - ఆచార్యునివలన సమస్తమైన జ్ఞానమును సంపాదింపవచ్చును వేదరహస్యములెన్నియో యుండును - అవి గురువు ముఖమున వినిననే గాని స్ఫురించవు - బోధపడవు - అందుచేత గురువు వలననే జ్ఞానము - బ్రహ్మజ్ఞానము - కలుగును – శాస్త్రములో నున్నది యేకాక, తన అనుభవములోను, అభిప్రాయములోను ఉన్నవన్నియు గురువు ద్వారా గ్రహించవలెను - స్వయంకృషివలన ఇట్టి జ్ఞానము కలుగదు).
(పైన చెప్పిన కారణమువలననే –
అని చెప్పబడినది. (“పురుషుల చేత ఎల్లపుడు సేవింప బడుచున్నటు వంటిన్నీ, సర్వపాపములను పోగొట్టి పరాత్పరుడైన పరమపురుషుని సన్నిధి చేర్చు బ్రహ్మవిద్యను - బ్రహ్మజ్ఞానమును - నాకు ఉపదేశించుము -” అని శిష్యుడు ఆచార్యుని - గురువును - చేరి ప్రార్థింపవలెను - అప్పుడు ఆచార్యుడు శిష్యునకు బ్రహ్మ జ్ఞానమునుపదేశించును.
(బ్రహ్మజ్ఞానము తెలుసుకొనుటకు గురువుని ఆశ్రయించవలెను).
(గురువుని చేరి నమస్కరించి. ప్రశ్నలమూలముగా బ్రహ్మజ్ఞానమును తెలుసుకొనవలెను - బ్రహ్మతత్వ ము తెలిసిన జ్ఞానులు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు) - బ్రహ్మ జ్ఞానులయిన ఆచార్యుని ద్వారాగాని ఈ బ్రహ్మజ్ఞానము కలుగదు - అందుచేత ఆచార్యుడు అవసరము).
(పండితుడైన బ్రహ్మజ్ఞాని గాంధారదేశము వారినుండి ఒకనిని తెప్పించి తన గమ్య స్థానమునకు పంపెను - అట్లే ఆచార్యుడైనవాడుశిష్యుని బ్రహ్మజ్ఞాన సంపన్నునిగా చేయగలడు - ఉదాహరణము : - “యథాకశ్చి ద్గాంధార దేశే భ్యైశ్చోరై రన్యత్రారణ్యే బద్ధ నేత్ర ఏవత్యక్తః కేన చిన్ముక్త బంధః తదుక్తమార్గ గ్రహణ సమర్థః పండితః స్వయం తర్క కుశలో మేధావి స్వదేశానేవ ప్రామ్నయాత్, ఏవమేవ హావిద్యా కామాదిభి స్స్వరూపానం దాత్ ప్రచ్యావ్య అస్మిన్నరణ్యే సంసారే క్షిప్తః కేన చిద్దయా పరవశేనా చార్యేణ”నాసిత్వం సంసారీ, కింతు తత్వమసి” ఇత్యుపదిష్ట స్వరూపః స్వయం తర్క కుశలశ్చేత్ స్వరూపం జానీయా న్నాన్యథా” ఇతి.
(గాంధార దేశమునకు చెందినవానిని కొంతమంది దొంగలు ఇంకొక దేశములోని అరణ్యములో కళ్ళు కట్టివేసి, అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయిరి. అప్పుడు ఒక బంధ విముక్తుడు తర్క కుశలుడు అయిన పండితుడు, అతని గమ్యస్థానమునకు మార్గము తెలిసినవాడు అతనిని అతని దేశమునకు పంపివేసెను - ఆ ప్రకారముగానే అవిద్య, కామము మొదలగువాటిచేత తన స్వస్వరూపమునుండి - తనే పరమాత్మ అను జ్ఞానమువలన కలుగు ఆనందమునుండి - దిగజారిపోయి ఈ సంసారమను అడవిలో పడిపోయినవాడైఒకానొక దయామయుడైన ఆచార్యునిచే “నీవు సంసారివి కావు, నేవే పరమాత్మవు”, పరమాత్మకు నీకు బేధములేదు “అనిఉపదేశింపబడినవాడై, స్వయముగా తర్కకుశలుడైనచో అట్టివాడు తన స్వస్వరూపమును - తానే పరమాత్మయను జ్ఞానమును పొందును. అట్టి జ్ఞానము మఱియొకమార్గముగా కలుగదు - అందుచేత ఆచార్యుని ఆశ్రయించి, అతనిని సేవించి, అతని దయను పొందగలిగినవానికి ఆచార్యుడు తన బ్రహ్మజ్ఞానమును శిష్యునకిచ్చును - ఈ విధముగా బ్రహ్మజ్ఞానము పొందుటకు ఆచార్యుడు అవసరము).
(స్త్రీలు, శూద్రులు మున్నగువారలకు హితాహితములను బోధింపవచ్చును. కాని ఆచార్యత్వమునకు తగరు).
(స్త్రీలు, శూద్రులు, మంత్రముల నుపదేశింప కూడదు – మంచి కులమందు పుట్టినవాడైనను బ్రహ్మజ్ఞానము లేనివాడు, భగవంతుని యందు భక్తిలేనివాడు ఆచార్యుడు కానేరడు).
మతస్థాపకుడు - శ్రీమాన్ రామానుజాచార్య లవారు, శ్రీశంకరాచార్యులవారు, శ్రీమధ్వాచార్యులవారు, మొదలగువారు
గురువు.
“సీ. అరయనాచార్యుండు పరతత్వరూపంబు ---”. (శ్రీమదాంధ్రమహా భాగవతము - 6 - 286)
(భగవంతుని మంచిహృదయము మనయడల కలిగియుండుట, యాదృచ్ఛిక పుణ్యకర్మ, విష్ణుని దయ, ద్వేషములేకుండుట, ఆభిముఖ్యము, సత్పురుషులసంభాషణము ఈ ఆరును గురువు లభించుటకుకారణములు).
(śiṣyuni daggaraku tīsukoni vēdamunu, dāni rahasyārthamutōnu, kalpamutōnu ataniki bhōdhiṃcuvāḍu ācāryuḍu).
(cēyavalasina pani cēyucu, cēyarāni pani cēyaka, tana svarūpamunaku anuguṇyamaina ācāramulanu cēyacu nuṃḍuvāḍu ācāryuḍanabaḍunu).
(vēdamulalōnu, upaniṣattulalōnu, śāstramulalōnu ceppina viṣayamulanu svayamugā avagāhanamu cēsukoni itarulacē ā prakāramugā ācariṃpacēyucu, tānu ā prakāramugā nācariṃcuvāḍu ācāryuḍani ceppabaḍunu).
sūtradvārā śuṣyāṇā mācārē sthāpanāt ācāryatvaṃ.
(vēda vēdāṃgamulaku vyākhyānamu cēyuvāḍu - vāṭilōni sāramunu, rahasyamulanu teliyunaṭlu vyākhyānamu cēyuvāḍu. sūtramuladvārā - brahmasūtramulu, bhaktisūtramulu yōgasūtramulu modalaguvāṭidvārā śiṣyulanu ācāramaṃdu, sadācāramaṃdu, ācaraṇa cēyuṭalō, niyōgiṃcuvāḍu).
(vēdavēdāṃgavēdi ayinavāḍu, viṣṇubhaktigalavāḍu matsaramulēnivāḍu, maṃtramulu telisinavāḍu, maṃtramulaṃdu nammakamu, śraddha, kalavāḍu, ellapuḍu maṃtramulanāśrayiṃci yuṃḍuvāḍu, śucigā nuṃḍuvāḍu guruvunaṃdu bhaktigalavāḍu, purāṇamulanu viśēṣamugā telisinavāḍu - ī pai lakṣaṇamulugalavāḍu guruvu, ācāryuḍu.
(ācāryuḍu anuvāḍu mūḍu vidhamulugā nuṃḍunu - cōdakuḍu, anagā, mārgamunu cūpiṃcu vāḍu; bōdhakuḍu mārgamunādēśiṃcunu. mōkṣakuḍu anagā mōkṣamuniccuvāḍu - paratatvamunu telusukoni mōkṣamuniccuvāḍu, anagā, mōkṣamārgamunu cūpiṃci upadēśiṃcuvāḍu. ī muggurulō mōkṣamuniccuvāḍu goppavāḍu, utkṛṣṭamainavāḍu - paramēśvaruḍē).
(ācāryuḍu, - guruvu - galavāḍu telusukonunu - ācāryunivalana samastamaina jñānamunu saṃpādiṃpavaccunu vēdarahasyamulenniyō yuṃḍunu - avi guruvu mukhamuna vininanē gāni sphuriṃcavu - bōdhapaḍavu - aṃducēta guruvu valananē jñānamu - brahmajñānamu - kalugunu – śāstramulō nunnadi yēkāka, tana anubhavamulōnu, abhiprāyamulōnu unnavanniyu guruvu dvārā grahiṃcavalenu - svayaṃkṛṣivalana iṭṭi jñānamu kalugadu).
(paina ceppina kāraṇamuvalananē –
ani ceppabaḍinadi. (“puruṣula cēta ellapuḍu sēviṃpa baḍucunnaṭu vaṃṭinnī, sarvapāpamulanu pōgoṭṭi parātparuḍaina paramapuruṣuni sannidhi cērcu brahmavidyanu - brahmajñānamunu - nāku upadēśiṃcumu -” ani śiṣyuḍu ācāryuni - guruvunu - cēri prārthiṃpavalenu - appuḍu ācāryuḍu śiṣyunaku brahma jñānamunupadēśiṃcunu.
(brahmajñānamu telusukonuṭaku guruvuni āśrayiṃcavalenu).
(guruvuni cēri namaskariṃci. praśnalamūlamugā brahmajñānamunu telusukonavalenu - brahmatatva mu telisina jñānulu ā jñānamunu upadēśiṃcedaru) - brahma jñānulayina ācāryuni dvārāgāni ī brahmajñānamu kalugadu - aṃducēta ācāryuḍu avasaramu).
(paṃḍituḍaina brahmajñāni gāṃdhāradēśamu vārinuṃḍi okanini teppiṃci tana gamya sthānamunaku paṃpenu - aṭlē ācāryuḍainavāḍuśiṣyuni brahmajñāna saṃpannunigā cēyagalaḍu - udāharaṇamu : - “yathākaści dgāṃdhāra dēśē bhyaiścōrai ranyatrāraṇyē baddha nētra ēvatyaktaḥ kēna cinmukta baṃdhaḥ taduktamārga grahaṇa samarthaḥ paṃḍitaḥ svayaṃ tarka kuśalō mēdhāvi svadēśānēva prāmnayāt, ēvamēva hāvidyā kāmādibhi ssvarūpānaṃ dāt pracyāvya asminnaraṇyē saṃsārē kṣiptaḥ kēna ciddayā paravaśēnā cāryēṇa”nāsitvaṃ saṃsārī, kiṃtu tatvamasi” ityupadiṣṭa svarūpaḥ svayaṃ tarka kuśalaścēt svarūpaṃ jānīyā nnānyathā” iti.
(gāṃdhāra dēśamunaku ceṃdinavānini koṃtamaṃdi doṃgalu iṃkoka dēśamulōni araṇyamulō kaḷḷu kaṭṭivēsi, aḍavilō viḍicipeṭṭi veḷḷipōyiri. appuḍu oka baṃdha vimuktuḍu tarka kuśaluḍu ayina paṃḍituḍu, atani gamyasthānamunaku mārgamu telisinavāḍu atanini atani dēśamunaku paṃpivēsenu - ā prakāramugānē avidya, kāmamu modalaguvāṭicēta tana svasvarūpamunuṃḍi - tanē paramātma anu jñānamuvalana kalugu ānaṃdamunuṃḍi - digajāripōyi ī saṃsāramanu aḍavilō paḍipōyinavāḍaiokānoka dayāmayuḍaina ācāryunicē “nīvu saṃsārivi kāvu, nēvē paramātmavu”, paramātmaku nīku bēdhamulēdu “aniupadēśiṃpabaḍinavāḍai, svayamugā tarkakuśaluḍainacō aṭṭivāḍu tana svasvarūpamunu - tānē paramātmayanu jñānamunu poṃdunu. aṭṭi jñānamu maṟiyokamārgamugā kalugadu - aṃducēta ācāryuni āśrayiṃci, atanini sēviṃci, atani dayanu poṃdagaliginavāniki ācāryuḍu tana brahmajñānamunu śiṣyunakiccunu - ī vidhamugā brahmajñānamu poṃduṭaku ācāryuḍu avasaramu).
(strīlu, śūdrulu munnaguvāralaku hitāhitamulanu bōdhiṃpavaccunu. kāni ācāryatvamunaku tagaru).
(strīlu, śūdrulu, maṃtramula nupadēśiṃpa kūḍadu – maṃci kulamaṃdu puṭṭinavāḍainanu brahmajñānamu lēnivāḍu, bhagavaṃtuni yaṃdu bhaktilēnivāḍu ācāryuḍu kānēraḍu).
matasthāpakuḍu - śrīmān rāmānujācārya lavāru, śrīśaṃkarācāryulavāru, śrīmadhvācāryulavāru, modalaguvāru
guruvu.
“sī. arayanācāryuṃḍu paratatvarūpaṃbu ---”. (śrīmadāṃdhramahā bhāgavatamu - 6 - 286)
(bhagavaṃtuni maṃcihṛdayamu manayaḍala kaligiyuṃḍuṭa, yādṛcchika puṇyakarma, viṣṇuni daya, dvēṣamulēkuṃḍuṭa, ābhimukhyamu, satpuruṣulasaṃbhāṣaṇamu ī ārunu guruvu labhiṃcuṭakukāraṇamulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.