← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆధి దైవికము ādhi daivikamu

Original — తెలుగు
  1. దైవం హేతుః యస్య సః ఆధిదైవికః. (దైవము కారణముగా గలిగిన బాధ).

  2. యక్ష రాక్షస ప్రేత పిశాచగ్రహాది జన్యం, శీతవాతా తపాది జన్యం దుఃఖం ఆధి దైవీకం -

(యక్షులు, రాక్షసులు, ప్రేతములు, పిశాచములు, గ్రహములు మొదలయినవాటివలన, తీవ్రమైనగాలి, వాన, ఎండ మొదలగువాటివలనను కలుగు దుఃఖము ఆధి దైవికము).

  1. “అతి వాతాతి వృష్ట్యాధి దుఃఖం స్యాచ్చాధి దైవికం ||”. (గీతాభావప్రకాశము - 2 - 560)

(అతివృష్టి, అతివాతము - తుపాను - మొదలగువాటివలన కలుగు దుఃఖము ఆధి దైవికము).

  1. సూర్య చంద్రాది గ్రహంబులవలన కలుగు తాపము.

  2. అంతఃకరణ జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులు పదునాల్గును ఆధ్యాత్మకంబులు, వాటి విషయములు ఆధి భౌతికంబులు, వాటి అధిదేవతలు ఆధి దైవికంబులు (వివేకచింతామణి - పరమానందతీర్థ)

  3. స్వ శరీరాది సంఘాత వ్యతిరిక్తం సత్ యత్ చక్షురింద్రియా గోచరం తదధిదైవం. తతో జాయమానం దుఃఖాదికం ఆధి దైవికం

(విచారసాగరము)

(తన శరీరముకన్న వేరై చక్షురింద్రియములకు - కండ్లకు - గోచరముకానిది అధిదైవము. దానివలన కలుగు దుఃఖము మొదలగునవి ఆధి దైవికములు).

Transliteration
  1. daivaṃ hētuḥ yasya saḥ ādhidaivikaḥ. (daivamu kāraṇamugā galigina bādha).

  2. yakṣa rākṣasa prēta piśācagrahādi janyaṃ, śītavātā tapādi janyaṃ duḥkhaṃ ādhi daivīkaṃ -

(yakṣulu, rākṣasulu, prētamulu, piśācamulu, grahamulu modalayinavāṭivalana, tīvramainagāli, vāna, eṃḍa modalaguvāṭivalananu kalugu duḥkhamu ādhi daivikamu).

  1. “ati vātāti vṛṣṭyādhi duḥkhaṃ syāccādhi daivikaṃ ||”. (gītābhāvaprakāśamu - 2 - 560)

(ativṛṣṭi, ativātamu - tupānu - modalaguvāṭivalana kalugu duḥkhamu ādhi daivikamu).

  1. sūrya caṃdrādi grahaṃbulavalana kalugu tāpamu.

  2. aṃtaḥkaraṇa jñānēṃdriya karmēṃdriyaṃbulu padunālgunu ādhyātmakaṃbulu, vāṭi viṣayamulu ādhi bhautikaṃbulu, vāṭi adhidēvatalu ādhi daivikaṃbulu (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)

  3. sva śarīrādi saṃghāta vyatiriktaṃ sat yat cakṣuriṃdriyā gōcaraṃ tadadhidaivaṃ. tatō jāyamānaṃ duḥkhādikaṃ ādhi daivikaṃ

(vicārasāgaramu)

(tana śarīramukanna vērai cakṣuriṃdriyamulaku - kaṃḍlaku - gōcaramukānidi adhidaivamu. dānivalana kalugu duḥkhamu modalagunavi ādhi daivikamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.