← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిమిధునము ādimidhunamu

Original — తెలుగు
  1. ఆది లక్ష్మి, ఆది నారాయణుడు - (లక్ష్మీనారాయణులు)., పార్వతీ పరమేశ్వరులు.

(“జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” - జగత్తునకు తలిదండ్రులు అయిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను). ప్రకృతి పురుషులు - (creation is the result of the combination of matter and emergy).

  1. “మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ||“.

“సర్వ యోనిషు కౌంతేయ మూర్తయః స్సంభవంతి యాః |

తాసాం బ్రహ్మమహద్యోనిః రహం అహం బీజప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 3, 4)

(ప్రకృతి నా యోని - గర్భము ధరించునది. దానిలో నేను నా బీజమును - చైతన్యశక్తిని - ఉంచుచున్నాను - అందువలన అది గర్భము ధరించుచున్నది. ఇట్లే ప్రకృతి పరిణామములైన సమస్త వస్తువులు యోనులు. వాటి అన్నింటిలోను నా బీజము ఉండుటవలన వాటినుండు సమస్త రూపములు కలుగుచున్నవి. ప్రతి వస్తువులోను ప్రకృతి అంశ, భగవంతు ని అంశ కలిసియే యుండుటవలన ఆ వస్తువులన్నియు - ఒకదానిలోనుండి ఒకటిగా - పుట్టుచున్నవి. అందుచేత ఈ యోనులన్నింటికి మూలమైన ప్రకృతి మహద్యోని, ఆది యోని, మూలయోని, తల్లి. వీటి అన్నింటిలోను నా శక్తి ఉంచుటవలన వాటికి (ఉత్యపత్తి) బీజమునిచ్చు తండ్రిని నేనే. అందుచేత ప్రకృతి, నేను జగత్తునకు తలిదండ్రులము - మాది ఆది మిధునము - మేము ఆది దంపతులము) - (పార్వతి ప్రకృతి స్వరూపిణి) (అట్లే శ్రీ ఆదిలక్ష్మి కూడ).

  1. “సకల మంత్రాది దేవతయగు శ్రీ యజ్ఞుండు దన బతిగం గోరెడు దక్షిణ యను కన్యకం బరిణయంబయ్యె. వారలాది మిధునంబుగావున నది నిషిద్ధంబుగాకుండె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - )

  2. “రుచి ప్రజాపతి బ్రహ్మ వర్చిస్వియు బరిపూర్ణ గుణుండును గావున జిత్తైకాగ్రతంజేసి యాకూతియందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుండగు పురుషుండుగను, జగదీశ్వరియగు నాది లక్ష్మి యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావున దదశంబున దక్షిణయను కన్యకారత్నంబుగను మిధునంబు సంభవించె. అందు స్యాయంభువుండు సంతుష్టాంతరంగుడగుచు బుత్రికా పుత్రుండును వితత తేజోధనుండు శ్రీవిష్ణుమూర్తి రూపుండగునవి యజ్ఞుని దనగృహంబునకు దెచ్చియునిచె. రుచియు దక్షిణయను కన్యకాలలామంబును దనయొద్ద నిలిపె. నంత సకలమంత్రాదిదేవతయగు శ్రీయజ్ఞుండు దనబతిగం గోరెడు దక్షిణయను కన్యకం బరిణయంబయ్యె. వారలాదిమిధునంబుగావున నది నిషిద్ధంబు గాకుండె” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 1 - 4)

  3. “నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్

మిమ్ము పురాణ దంపతుల మేలుభజింతు కదమ్మ - -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - - - )

Transliteration
  1. ādi lakṣmi, ādi nārāyaṇuḍu - (lakṣmīnārāyaṇulu)., pārvatī paramēśvarulu.

(“jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau” - jagattunaku talidaṃḍrulu ayina pārvatī paramēśvarulaku namaskariṃcucunnānu). prakṛti puruṣulu - (creation is the result of the combination of matter and emergy).

  1. “mama yōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bhārata ||“.

“sarva yōniṣu kauṃtēya mūrtayaḥ ssaṃbhavaṃti yāḥ |

tāsāṃ brahmamahadyōniḥ rahaṃ ahaṃ bījapradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 3, 4)

(prakṛti nā yōni - garbhamu dhariṃcunadi. dānilō nēnu nā bījamunu - caitanyaśaktini - uṃcucunnānu - aṃduvalana adi garbhamu dhariṃcucunnadi. iṭlē prakṛti pariṇāmamulaina samasta vastuvulu yōnulu. vāṭi anniṃṭilōnu nā bījamu uṃḍuṭavalana vāṭinuṃḍu samasta rūpamulu kalugucunnavi. prati vastuvulōnu prakṛti aṃśa, bhagavaṃtu ni aṃśa kalisiyē yuṃḍuṭavalana ā vastuvulanniyu - okadānilōnuṃḍi okaṭigā - puṭṭucunnavi. aṃducēta ī yōnulanniṃṭiki mūlamaina prakṛti mahadyōni, ādi yōni, mūlayōni, talli. vīṭi anniṃṭilōnu nā śakti uṃcuṭavalana vāṭiki (utyapatti) bījamuniccu taṃḍrini nēnē. aṃducēta prakṛti, nēnu jagattunaku talidaṃḍrulamu - mādi ādi midhunamu - mēmu ādi daṃpatulamu) - (pārvati prakṛti svarūpiṇi) (aṭlē śrī ādilakṣmi kūḍa).

  1. “sakala maṃtrādi dēvatayagu śrī yajñuṃḍu dana batigaṃ gōreḍu dakṣiṇa yanu kanyakaṃ bariṇayaṃbayye. vāralādi midhunaṃbugāvuna nadi niṣiddhaṃbugākuṃḍe” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - )

  2. “ruci prajāpati brahma varcisviyu baripūrṇa guṇuṃḍunu gāvuna jittaikāgrataṃjēsi yākūtiyaṃdu śrīviṣṇuṃḍu yajñarūpadharuṃḍagu puruṣuṃḍuganu, jagadīśvariyagu nādi lakṣmi yammahātmunaku nityānapāyini gāvuna dadaśaṃbuna dakṣiṇayanu kanyakāratnaṃbuganu midhunaṃbu saṃbhaviṃce. aṃdu syāyaṃbhuvuṃḍu saṃtuṣṭāṃtaraṃguḍagucu butrikā putruṃḍunu vitata tējōdhanuṃḍu śrīviṣṇumūrti rūpuṃḍagunavi yajñuni danagṛhaṃbunaku decciyunice. ruciyu dakṣiṇayanu kanyakālalāmaṃbunu danayodda nilipe. naṃta sakalamaṃtrādidēvatayagu śrīyajñuṃḍu danabatigaṃ gōreḍu dakṣiṇayanu kanyakaṃ bariṇayaṃbayye. vāralādimidhunaṃbugāvuna nadi niṣiddhaṃbu gākuṃḍe” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 1 - 4)

  3. “nammiti nāmanaṃbuna sanātanulaina umāmahēśulan

mimmu purāṇa daṃpatula mēlubhajiṃtu kadamma - -” (śrīmadāṃdhramahābhāgavatamu - - - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.