← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆదిత్యగతం తేజః ādityagataṃ tējaḥ

Original — తెలుగు
  1. “యదాదిత్యగతం తేజః - - తత్తేజో విద్ధి మామకం” (శ్రీమద్భగవద్గీత -15 -12)

(సూర్యుని యందు గల తేజస్సు నాదే అని తెలుసుకొనుము - అని శ్రీకృష్ణభగవానుని వాక్యము).

  1. యదాదిత్యగతం ఆదిత్యాశ్రయం తేజః దీప్తిః ప్రకాశః అఖిలం జగత్ ప్రకాశయతి తత్తేజః విష్ణోః జ్యోతిః.అధవా, యదాత్యగతం తేజః చైతన్యాత్మకం జ్యోతిః, తత్తేజః విష్ణోః జ్యోతిః నను స్థావరేషు జంగమేషు చ తత్సమానం చైతన్యాత్మకం జ్యోతిః; తత్కథం ఇదం విశేషణం? - “యదాదిత్య గతం” ఇత్యాది?.

“నైష దోషః సత్వాధిక్యాత్, ఆవిస్తరత్పోపత్తేః ఆదిత్యాదిషు హి సత్వం అత్యంతప్రకాశం అత్యంత భాస్వరం అతః తత్రైవ ఆవిస్తరః జ్యోతిః ఇతి తత్ విశిష్యతే, నతు తత్రైవ తదథికం ఇతి - యథాహి లోకే తుల్యోపి ముఖ సంస్థానేన కాష్ట కుడ్యాదౌ ముఖమావిర్భవతి ఆదర్జాదౌతు స్వచ్ఛే స్వచ్ఛ తరేచ తారతమ్యేన ఆవిర్భవతి, తద్వత్” (శ్రీశంకరః)

(‘ఆదిత్య గతం’ అనగా ఆదిత్యునియందున్న తేజస్సు ప్రకాశము, దీప్తి, కాంతి - ఇది సమస్త జగత్తును ప్రకాశింప చేయుచున్నది. ఆ తేజస్సు విష్ణువుయొక్క జ్యోతిర్మయ రూపము - లేక, ఆదిత్యుని అంతర్గతమైన తేజస్సు - చైతన్యాత్మకమగు జ్యోతిస్సు. అది విష్ణువుయొక్క తేజస్సు, లేక విష్ణువుయొక్క తేజోరూపము. స్థావరములందు, జంగమములందు అన్నింటియందు సమానముగా చైతన్యాత్మకమై భగవంతుని యొక్క తేజస్సు ఉన్నది - అయిన ‘యదాదిత్యగతం తేజః’ అను విశేషణము చెప్పుట ఎందుకు?)

(ఇట్లు చెప్పుటవలన దోషము లేదు. ఎందుచేతననగా - ఆదిత్యునిలో సత్త్వము అధికముగా ఉండుటవలనను, బాగా విస్తరించియుండుటవలనను, ఆదిత్యుడు మొదలగువాటియందు సత్త్వము అత్యంత ప్రకాశముగానుండును - ఎక్కువగా ప్రకాశించుచుండును. అందుచేత అక్కడ జ్యోతిస్సు విస్తరించియుండును. లోకములో ముఖము ఒకటే అయినను కర్రలోను, గోడలోను కనబడదు - కాని అద్దములో కనబడును, శుభ్రముగానున్న అద్దములో బాగా కనబడును, అంతకంటె శుభ్రముగానున్న అద్దములో ఇంకా బాగా కనబడును).

  1. సర్వం స్వతః ఈశ్వర శేషభూతం సత్ తత్తత్కర్మానురూపాత్, తత్సంకల్పాత్ కి యుతం కాలం అన్యేషామపి శేషత్వం భజత ఇతి భావః. అత్ర తేజశ్శబ్దేన చైతన్య జ్యోతిర్వివక్షా - “జగద్భాసయతే అఖిలం” ఇత్యాదినా న సంగచ్ఛతే, న హ్యదిగతత్వేన చైతన్యం అస్మాకం ఘటాదీన్ ప్రకాశయతి సర్వత్ర చైతన్యా విశేషే అపి ఆదిత్యాదిషు సత్వాధిక్యాత్ దర్పణాదివత్ ఇత్యస్య సారం తన్మతే చైతన్యస్య వ్యంగత్వాద్య సంభవాత్ ఇతి జ్యోతిషాం ప్రకాశకత్వ శక్తిః స్వకీయా ఇత్యుక్తం ” (శ్రీ వేదాంత దేశికః)
Transliteration
  1. “yadādityagataṃ tējaḥ - - tattējō viddhi māmakaṃ” (śrīmadbhagavadgīta -15 -12)

(sūryuni yaṃdu gala tējassu nādē ani telusukonumu - ani śrīkṛṣṇabhagavānuni vākyamu).

  1. yadādityagataṃ ādityāśrayaṃ tējaḥ dīptiḥ prakāśaḥ akhilaṃ jagat prakāśayati tattējaḥ viṣṇōḥ jyōtiḥ.adhavā, yadātyagataṃ tējaḥ caitanyātmakaṃ jyōtiḥ, tattējaḥ viṣṇōḥ jyōtiḥ nanu sthāvarēṣu jaṃgamēṣu ca tatsamānaṃ caitanyātmakaṃ jyōtiḥ; tatkathaṃ idaṃ viśēṣaṇaṃ? - “yadāditya gataṃ” ityādi?.

“naiṣa dōṣaḥ satvādhikyāt, āvistaratpōpattēḥ ādityādiṣu hi satvaṃ atyaṃtaprakāśaṃ atyaṃta bhāsvaraṃ ataḥ tatraiva āvistaraḥ jyōtiḥ iti tat viśiṣyatē, natu tatraiva tadathikaṃ iti - yathāhi lōkē tulyōpi mukha saṃsthānēna kāṣṭa kuḍyādau mukhamāvirbhavati ādarjādautu svacchē svaccha tarēca tāratamyēna āvirbhavati, tadvat” (śrīśaṃkaraḥ)

(‘āditya gataṃ’ anagā ādityuniyaṃdunna tējassu prakāśamu, dīpti, kāṃti - idi samasta jagattunu prakāśiṃpa cēyucunnadi. ā tējassu viṣṇuvuyokka jyōtirmaya rūpamu - lēka, ādityuni aṃtargatamaina tējassu - caitanyātmakamagu jyōtissu. adi viṣṇuvuyokka tējassu, lēka viṣṇuvuyokka tējōrūpamu. sthāvaramulaṃdu, jaṃgamamulaṃdu anniṃṭiyaṃdu samānamugā caitanyātmakamai bhagavaṃtuni yokka tējassu unnadi - ayina ‘yadādityagataṃ tējaḥ’ anu viśēṣaṇamu ceppuṭa eṃduku?)

(iṭlu ceppuṭavalana dōṣamu lēdu. eṃducētananagā - ādityunilō sattvamu adhikamugā uṃḍuṭavalananu, bāgā vistariṃciyuṃḍuṭavalananu, ādityuḍu modalaguvāṭiyaṃdu sattvamu atyaṃta prakāśamugānuṃḍunu - ekkuvagā prakāśiṃcucuṃḍunu. aṃducēta akkaḍa jyōtissu vistariṃciyuṃḍunu. lōkamulō mukhamu okaṭē ayinanu karralōnu, gōḍalōnu kanabaḍadu - kāni addamulō kanabaḍunu, śubhramugānunna addamulō bāgā kanabaḍunu, aṃtakaṃṭe śubhramugānunna addamulō iṃkā bāgā kanabaḍunu).

  1. sarvaṃ svataḥ īśvara śēṣabhūtaṃ sat tattatkarmānurūpāt, tatsaṃkalpāt ki yutaṃ kālaṃ anyēṣāmapi śēṣatvaṃ bhajata iti bhāvaḥ. atra tējaśśabdēna caitanya jyōtirvivakṣā - “jagadbhāsayatē akhilaṃ” ityādinā na saṃgacchatē, na hyadigatatvēna caitanyaṃ asmākaṃ ghaṭādīn prakāśayati sarvatra caitanyā viśēṣē api ādityādiṣu satvādhikyāt darpaṇādivat ityasya sāraṃ tanmatē caitanyasya vyaṃgatvādya saṃbhavāt iti jyōtiṣāṃ prakāśakatva śaktiḥ svakīyā ityuktaṃ ” (śrī vēdāṃta dēśikaḥ)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.