(సూర్యునివలె నిత్య చైతన్య ప్రకాశము - వర్ణము - గలవాడు).
(సమస్త ప్రపంచమును ప్రకాశింపచేయు సూర్యునియొక్క ప్రకాశము - తేజస్సుగలవాడు),
స్వప్రకాశం (స్వయముగా ప్రకాశించువాడు).
ప్రకాశరూపః (కాంతియే రూపముగా గలవాడు).
“ఆదిత్య వర్ణం తనుసః పరస్తాత్”. (శ్వేతాశ్వతరోపనిషత్ - 3 - 8; శ్రీమద్భగవద్గీత - 8 - 9; శ్రీరామకర్ణామృతం - 2 - 96)
(సూర్యునికాంతి వంటి వర్ణముగలవాడు, మోహము, లేక అజ్ఞానము అను అంధకారమునకు ఆవలనుండువాడు, మోహము కలిగినవారికి అందనివాడు. ప్రలయకాలమందు ప్రకాశరూపములన్నియు లయమైపోయి ప్రపంచమంతయు అంధకారమ యమైనపుడు, ఆ అంధకారమునకవతల ఒక్కడే అయి వెలుగుచుండెడివాడు –
“క. లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగినతుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్ ||” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 75)
(sūryunivale nitya caitanya prakāśamu - varṇamu - galavāḍu).
(samasta prapaṃcamunu prakāśiṃpacēyu sūryuniyokka prakāśamu - tējassugalavāḍu),
svaprakāśaṃ (svayamugā prakāśiṃcuvāḍu).
prakāśarūpaḥ (kāṃtiyē rūpamugā galavāḍu).
“āditya varṇaṃ tanusaḥ parastāt”. (śvētāśvatarōpaniṣat - 3 - 8; śrīmadbhagavadgīta - 8 - 9; śrīrāmakarṇāmṛtaṃ - 2 - 96)
(sūryunikāṃti vaṃṭi varṇamugalavāḍu, mōhamu, lēka ajñānamu anu aṃdhakāramunaku āvalanuṃḍuvāḍu, mōhamu kaliginavāriki aṃdanivāḍu. pralayakālamaṃdu prakāśarūpamulanniyu layamaipōyi prapaṃcamaṃtayu aṃdhakārama yamainapuḍu, ā aṃdhakāramunakavatala okkaḍē ayi velugucuṃḍeḍivāḍu –
“ka. lōkaṃbulu lōkēśulu
lōkasthulu teginatudi nalōkaṃbagu peṃ
jīkaṭi kavvala nevvaṃ
ḍēkākṛti velugu natani nē sēviṃtun ||” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 75)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.