(మాయతో కూడియున్న ఈశ్వరునికి సంబంధించినది; ఈశ్వరుని గుఱించి తెలియచేయునది)
ఈశ్వర సంబంధి. (ఈశ్వరునకు సంబంధించినది).
ఈశ్వరస్య ఇదం, విశ్వాత్మకం, మాయామయం, ఇత్యర్థః.
(ఈశ్వరునిదైనది; ప్రపంచాత్మకము; మాయతో నిండియున్నది).
తధాప్యహం సమస్తేషు సమస్తా ని మయీతిచ |
భూతానీ హాస్తి మాయేయం మహతీత్తైస్వరం మమ ||“. (గీతాభావ ప్రకాశము - 9 - 41, 42)
(దేనికైనను నేను, ఆధేయముకాను - ఏవస్తువునకు నేను ఆధారముకాను. అన్నివస్తువులందును నేను ఉందును. నాలో అన్ని వస్తువులుండును. ఇది నాదొక గొప్ప మాయ - ఈశ్వరుడనైన నా మాయ - ఇదియే ‘ఐశ్వర్యం’).
సర్వ భూత నియంతృత్వం. (సమస్త భూతములందుండి వాటిని వాటి వాటి పనులలో నియమించుట).
విశ్వరూపం మాయా మయం, నాస్త వంతు రూపం మాయా తీతం ఇతి ఐశ్వర్యం పదాత్ లభ్యతే.
(భగవంతుని విశ్వరూపము - భగవంతుడే ప్రపంచముగా రూపించుట మాయామయం - అంతయు అతని మాయాశక్తి వలన కలిగినదే _ భగవంతుని వాస్తవమైన రూపము, స్వస్వరూపము మాయాతీతము - మాయకు మించినది. అది ఐశ్వర్యము).
(māyatō kūḍiyunna īśvaruniki saṃbaṃdhiṃcinadi; īśvaruni guṟiṃci teliyacēyunadi)
īśvara saṃbaṃdhi. (īśvarunaku saṃbaṃdhiṃcinadi).
īśvarasya idaṃ, viśvātmakaṃ, māyāmayaṃ, ityarthaḥ.
(īśvarunidainadi; prapaṃcātmakamu; māyatō niṃḍiyunnadi).
tadhāpyahaṃ samastēṣu samastā ni mayītica |
bhūtānī hāsti māyēyaṃ mahatīttaisvaraṃ mama ||“. (gītābhāva prakāśamu - 9 - 41, 42)
(dēnikainanu nēnu, ādhēyamukānu - ēvastuvunaku nēnu ādhāramukānu. annivastuvulaṃdunu nēnu uṃdunu. nālō anni vastuvuluṃḍunu. idi nādoka goppa māya - īśvaruḍanaina nā māya - idiyē ‘aiśvaryaṃ’).
sarva bhūta niyaṃtṛtvaṃ. (samasta bhūtamulaṃduṃḍi vāṭini vāṭi vāṭi panulalō niyamiṃcuṭa).
viśvarūpaṃ māyā mayaṃ, nāsta vaṃtu rūpaṃ māyā tītaṃ iti aiśvaryaṃ padāt labhyatē.
(bhagavaṃtuni viśvarūpamu - bhagavaṃtuḍē prapaṃcamugā rūpiṃcuṭa māyāmayaṃ - aṃtayu atani māyāśakti valana kaliginadē _ bhagavaṃtuni vāstavamaina rūpamu, svasvarūpamu māyātītamu - māyaku miṃcinadi. adi aiśvaryamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.