ఆత్మభూతః ఇతివా -
(ఆకాశమువలె స్వచ్ఛమైన, నిర్మలమైన సూక్ష్మశరీరము గలవాడు, లేక, ఆకాశముకన్న వేరైన ఇతరవస్తువులకు కారణభూయము - పుట్టుచోటు - అయిన ఆకాశమునకు కారణమైనవాడు).
(స్వయముగా ప్రకాశించువాడు, ఇతరవస్తువులను కూడ ప్రకాశింపచేయువాడు).
(ఆకాశమువంటి స్వరూపముగలవాడు - అనగా, ఆకాశమువలె అన్నింటిలోన వ్యాపించియుండుట, సూక్ష్మముగానుండుట, రూపము మొదలగునవి లేకుండుట. అనునవి కలిగియుండుటనుబట్టి ఆకాశమువంటి శరీరముగలవాడు అని చెప్పబడుచున్నాడు).
(ఆకాశమువంటి రూపముగలవాడు - అన్నింటిలోను వ్యాపించియుండుట మొదలగు ఆకాశ ధర్మములు కలిగియుండుటచేత ఆకాశమువంటివాడు అని చెప్పబడెను - “ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః” (ఆకాశము వలె అన్నింటిలోను వ్యాపించియుండి నిత్యుడైనవాడు), అని చెప్పబడినది).
(ఆకాశమే ఇతని శరీరము అని అర్థము చెప్పినప్పటికీ అది కూడ నిజమే - సమస్త జగత్తునకు కారణమైనటువంటిన్నీ, అన్నింటికీ ఆత్మ అయినటువంటిన్నీ పరబ్రహ్మకు ఇట్లు చెప్పుట సమజసమే - “సర్వకర్మా” అని బ్రహ్మగుఱించి చెప్పబడినది కనుక).
(ఆకాశమే శరీరముగా గలవాడు, పరమాకాశమందు గుహయందు - గుహవలె తనలోనున్న వస్తువును కనుపించకుండునట్లు చేయు దానియందు - హృదయాకాశమందు ఉండుదానిని ఎవడు తెలుసుకొనునో, ఆ హృదయాకాశమందుండువాడు ఉపాసించతగినవాడు, “ఆకాశమే బ్రహ్మ” నీవే ప్రత్యక్షముగా కంటికి కనబడు దైవము).
ātmabhūtaḥ itivā -
(ākāśamuvale svacchamaina, nirmalamaina sūkṣmaśarīramu galavāḍu, lēka, ākāśamukanna vēraina itaravastuvulaku kāraṇabhūyamu - puṭṭucōṭu - ayina ākāśamunaku kāraṇamainavāḍu).
(svayamugā prakāśiṃcuvāḍu, itaravastuvulanu kūḍa prakāśiṃpacēyuvāḍu).
(ākāśamuvaṃṭi svarūpamugalavāḍu - anagā, ākāśamuvale anniṃṭilōna vyāpiṃciyuṃḍuṭa, sūkṣmamugānuṃḍuṭa, rūpamu modalagunavi lēkuṃḍuṭa. anunavi kaligiyuṃḍuṭanubaṭṭi ākāśamuvaṃṭi śarīramugalavāḍu ani ceppabaḍucunnāḍu).
(ākāśamuvaṃṭi rūpamugalavāḍu - anniṃṭilōnu vyāpiṃciyuṃḍuṭa modalagu ākāśa dharmamulu kaligiyuṃḍuṭacēta ākāśamuvaṃṭivāḍu ani ceppabaḍenu - “ākāśavat sarvagataśca nityaḥ” (ākāśamu vale anniṃṭilōnu vyāpiṃciyuṃḍi nityuḍainavāḍu), ani ceppabaḍinadi).
(ākāśamē itani śarīramu ani arthamu ceppinappaṭikī adi kūḍa nijamē - samasta jagattunaku kāraṇamainaṭuvaṃṭinnī, anniṃṭikī ātma ayinaṭuvaṃṭinnī parabrahmaku iṭlu ceppuṭa samajasamē - “sarvakarmā” ani brahmaguṟiṃci ceppabaḍinadi kanuka).
(ākāśamē śarīramugā galavāḍu, paramākāśamaṃdu guhayaṃdu - guhavale tanalōnunna vastuvunu kanupiṃcakuṃḍunaṭlu cēyu dāniyaṃdu - hṛdayākāśamaṃdu uṃḍudānini evaḍu telusukonunō, ā hṛdayākāśamaṃduṃḍuvāḍu upāsiṃcataginavāḍu, “ākāśamē brahma” nīvē pratyakṣamugā kaṃṭiki kanabaḍu daivamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.