← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందమ యః ānaṃdama yaḥ

Original — తెలుగు
  1. “ఆనందఘనః” (శ్రీరంగరామానుజః)

(కుద్దించి, కరడుకట్టినట్లు ఉన్న ఆనందముగలవాడు. - ఆనందముతో పూర్తిగా నిండియున్నవాడు).

  1. ఆనందప్రచురః - పూర్ణానందః ఇతి యావత్.

(అధికమైన ఆనందముకలవాడు. పూర్తిగా ఆనందము గలవాడు).

  1. “మనసో విషయ విషయ్యాకార స్పందనాయాస దుఃఖాభావాత్ ఆనందమయః, ఆనందప్రాయః”. (శ్రీశంకరః)

(విషయములవలన, వాటి ఆకారముల వలన మనసునకు కలిగెడి ఆయాసము, దుఃఖము మొదలగునవి లేకుండుట వలన కలిగెడి ఆనందముకలవాడు కనుక ఆనందమ యుడు).

  1. “యోహి అన్యానానందయతి సప్రచురానందః ఇతి ప్రసిద్ధం భవతి - యథాలోకే యో అన్యేషాం ధనికత్వ మాపాదయతి స ప్రచురధనః ఇతి గమ్యతే తస్మాత్ ప్రాచుర్యార్థేపి మయట్ సంభవాత్ ఆనందమయః పర ఏవ ఆత్మా” (శ్రీశంకరః)

(చూడుము - ‘ఆనందప్రచురః - 2’).

  1. “ఆనందప్రచురం బ్రహ్మ - - -” (చూడుము - ఆనందప్రచురం - 3).

  2. తైత్తిరీయోపనిషత్తులో అన్నమయకోశము, ప్రాణమయకోశము, మనోమయకోశము, విజ్ఞానమయకోశమునుచెప్పి వాటికంటె మించినది సూక్ష్మమైనది అయిన ఆనందమయకోశము ఉన్నదని, దానిలో పరమాత్మయున్నాడని చెప్పబడినది - ” తస్మాద్వా ఏతస్మా ద్వి జ్ఞానమ యాత్ అన్యో(అ)ంతరో ఆత్మా ఆనందమయః ” - అన్నికోశములకంటె లోపల ఉన్న ఆనందమ యకోశము ఉన్నదని దానిలో ఉన్న పరమాత్మ ఆనందమయుడని చెప్పబడినది.

  3. సీ. “అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమున బంచకోశ వ్యవస్థ

నభివృద్ధి బొరయుచు నందులోపల నున్న ప్రాణాన్న బుద్ధి విజ్ఞానమయము

లను చతుష్కోశంబులవ్వల వెలుగొందు నానందమయుడను - - - “.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 1211)

  1. “యథా అరుంధతీ దర్శనే బహ్వీష్వపి తారాసు అముఖ్యాసు అరుంధతీషు దర్శితాసు యా అంత్యా ప్రదర్శితేసాముఖ్యేవ అరుంధతీ భవతి, ఏవ మిహాప్యానందమయ్య సర్వాంతరత్వాత్ ముఖ్యం ఆత్మత్వం - అనందమయః పర ఏ ఆత్మా”.

(శ్రీశంకరః - బ్రహ్మసూత్రభాష్యే)

(అరుంధతీ నక్షత్రమును చూపునపుడు, అది చిన్నది వెంటనే కనబడుట కష్టము కనుక ముఖ్యముకానటు వంటి - అరుంధతికానటువంటి - అనేకనక్షత్రములను మొదటచూపించి, వాటికి దగ్గరగానున్న దానిని ఆఖరున చూపించి ఇదియే అరుంధతీ నక్షత్రమని చూపినట్లు, పరమాత్మ సర్వాంతర్యామి యగుటవలన కొన్ని కోశములను చెప్పి తర్వాత ఆనందమయుడు అగుటవలన ఆ పేరున ఉన్న అతిసూక్ష్మమైన ఆనందమయ కోశమును చెప్పి, దానిలో ఉన్న ఆత్మయే ఆనందమయుడు అని చెప్పెను).

“తస్మా ద్వా ఏతస్మా ద్విజ్ఞాన మయాత్ అన్య్యోంతర ఆత్మానందమయః”. (తైత్తిరీయోపనిషత్)

  1. “ఈశ్వరాదితరో జీవో నానందమయః,కుతః? - అనుపపత్తేః -”సో కామయత బహుస్యాం ప్రజాయాయేతి” ఇత్యాది శ్రూయమాణస్య సృష్టిః ప్రాక్ కామ యి తృత్వ స్రష్ట వ్యాత్మకత్వాదే రనుప పత్తేః“.

(ఈశ్వరుడుకంటె ఇతరుడు - జీవుడు - ఆనందమయుడు కాడు - ఎందుచేతననగా, సందర్భమును బట్టి అట్లు చెప్పుట కుదరదు - ” నేను అనేకములుగా, అనేకరూపములుగా, అనేక ప్రకారములుగా పుట్టుదును - మారుదును - అని పరమాత్మకు కోరిక జనించెను - అని సృష్టి పూర్వము సృష్టి చేసెదనను కోరిక కలుగుటచేత అది పరమాత్మకేకాని జీవునకు వర్తించదు కనుక).

Transliteration
  1. “ānaṃdaghanaḥ” (śrīraṃgarāmānujaḥ)

(kuddiṃci, karaḍukaṭṭinaṭlu unna ānaṃdamugalavāḍu. - ānaṃdamutō pūrtigā niṃḍiyunnavāḍu).

  1. ānaṃdapracuraḥ - pūrṇānaṃdaḥ iti yāvat.

(adhikamaina ānaṃdamukalavāḍu. pūrtigā ānaṃdamu galavāḍu).

  1. “manasō viṣaya viṣayyākāra spaṃdanāyāsa duḥkhābhāvāt ānaṃdamayaḥ, ānaṃdaprāyaḥ”. (śrīśaṃkaraḥ)

(viṣayamulavalana, vāṭi ākāramula valana manasunaku kaligeḍi āyāsamu, duḥkhamu modalagunavi lēkuṃḍuṭa valana kaligeḍi ānaṃdamukalavāḍu kanuka ānaṃdama yuḍu).

  1. “yōhi anyānānaṃdayati sapracurānaṃdaḥ iti prasiddhaṃ bhavati - yathālōkē yō anyēṣāṃ dhanikatva māpādayati sa pracuradhanaḥ iti gamyatē tasmāt prācuryārthēpi mayaṭ saṃbhavāt ānaṃdamayaḥ para ēva ātmā” (śrīśaṃkaraḥ)

(cūḍumu - ‘ānaṃdapracuraḥ - 2’).

  1. “ānaṃdapracuraṃ brahma - - -” (cūḍumu - ānaṃdapracuraṃ - 3).

  2. taittirīyōpaniṣattulō annamayakōśamu, prāṇamayakōśamu, manōmayakōśamu, vijñānamayakōśamunuceppi vāṭikaṃṭe miṃcinadi sūkṣmamainadi ayina ānaṃdamayakōśamu unnadani, dānilō paramātmayunnāḍani ceppabaḍinadi - ” tasmādvā ētasmā dvi jñānama yāt anyō(a)ṃtarō ātmā ānaṃdamayaḥ ” - annikōśamulakaṃṭe lōpala unna ānaṃdama yakōśamu unnadani dānilō unna paramātma ānaṃdamayuḍani ceppabaḍinadi.

  3. sī. “anayaṃbu dēhi nityānitya sadvilakṣaṇamuna baṃcakōśa vyavastha

nabhivṛddhi borayucu naṃdulōpala nunna prāṇānna buddhi vijñānamayamu

lanu catuṣkōśaṃbulavvala velugoṃdu nānaṃdamayuḍanu - - - “.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. - 1211)

  1. “yathā aruṃdhatī darśanē bahvīṣvapi tārāsu amukhyāsu aruṃdhatīṣu darśitāsu yā aṃtyā pradarśitēsāmukhyēva aruṃdhatī bhavati, ēva mihāpyānaṃdamayya sarvāṃtaratvāt mukhyaṃ ātmatvaṃ - anaṃdamayaḥ para ē ātmā”.

(śrīśaṃkaraḥ - brahmasūtrabhāṣyē)

(aruṃdhatī nakṣatramunu cūpunapuḍu, adi cinnadi veṃṭanē kanabaḍuṭa kaṣṭamu kanuka mukhyamukānaṭu vaṃṭi - aruṃdhatikānaṭuvaṃṭi - anēkanakṣatramulanu modaṭacūpiṃci, vāṭiki daggaragānunna dānini ākharuna cūpiṃci idiyē aruṃdhatī nakṣatramani cūpinaṭlu, paramātma sarvāṃtaryāmi yaguṭavalana konni kōśamulanu ceppi tarvāta ānaṃdamayuḍu aguṭavalana ā pēruna unna atisūkṣmamaina ānaṃdamaya kōśamunu ceppi, dānilō unna ātmayē ānaṃdamayuḍu ani ceppenu).

“tasmā dvā ētasmā dvijñāna mayāt anyyōṃtara ātmānaṃdamayaḥ”. (taittirīyōpaniṣat)

  1. “īśvarāditarō jīvō nānaṃdamayaḥ,kutaḥ? - anupapattēḥ -”sō kāmayata bahusyāṃ prajāyāyēti” ityādi śrūyamāṇasya sṛṣṭiḥ prāk kāma yi tṛtva sraṣṭa vyātmakatvādē ranupa pattēḥ”.

(īśvaruḍukaṃṭe itaruḍu - jīvuḍu - ānaṃdamayuḍu kāḍu - eṃducētananagā, saṃdarbhamunu baṭṭi aṭlu ceppuṭa kudaradu - ” nēnu anēkamulugā, anēkarūpamulugā, anēka prakāramulugā puṭṭudunu - mārudunu - ani paramātmaku kōrika janiṃcenu - ani sṛṣṭi pūrvamu sṛṣṭi cēsedananu kōrika kaluguṭacēta adi paramātmakēkāni jīvunaku vartiṃcadu kanuka).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.