ఆనందము ఎక్కువగా నున్నవాడు -
“యోహి అన్యానానందయతి సప్రచురానందః ఇతి ప్రసిద్ధం భవతి - యథా లోకేయే అన్యేషాం ధనికత్వ మాపాదయతి సప్రభురధికః ఇతి గమ్యతే తద్వత్ - తస్మాత్ ప్రాచుర్యార్థేపి మయట్ సంభవాత్ ఆనందమయః పర ఏవ ఆత్మా” (శ్రీశంకరః)
(ఎవడు ఇతరులను ఆనందపరచునో వాడు అధికానందముకలవాడు అని ప్రసిద్ధి కలదు - లోకములో ఇతరులకు ధనమిచ్చి వారిని ధనవంతులుగా చేయునో అట్టివాడు అధిక ధనవంతుడు ప్రచుర ధనికుడు అని చెప్పబడుచున్నాడు - ఆ ప్రకారముగానే పరమాత్మ హెచ్చు ఆనందము కలిగినవాడైనందును - తానే మోక్షస్వరూపుడై అత్యంతానందము కలుగచేయువాడు కనుక అతను ప్రచురానందుడు - ఆనందప్రచురుడు కనుకనే ఆనందమయుడు - ఆనందప్రచురము అనగా ఆనందమయము).
(ఆనందప్రచురమైన బ్రహ్మ అనగా ఆనందమయుడగు బ్రహ్మ అని చెప్పబడుచున్నాడు. బ్రహ్మకు ఆనందప్రచురత్వమెట్లు చెప్పబడినది అనగా - మనుష్యుని ఆనందము మొదలుకొని అంతకంటె ఆనందము ఎక్కువగాకలవాటి అన్నింటికంటె, ఒకదానికంటె ఒకదానికి హెచ్చు ఆనందము కలదు అని అన్నింటికంటె బ్రహ్మానందము హెచ్చు అయినది - దానిని మించిన ఆనందములేదు అని శ్రుతి చెప్పుటచేత పరబ్రహ్మ ఆనంద ప్రచురము).
ānaṃdamu ekkuvagā nunnavāḍu -
“yōhi anyānānaṃdayati sapracurānaṃdaḥ iti prasiddhaṃ bhavati - yathā lōkēyē anyēṣāṃ dhanikatva māpādayati saprabhuradhikaḥ iti gamyatē tadvat - tasmāt prācuryārthēpi mayaṭ saṃbhavāt ānaṃdamayaḥ para ēva ātmā” (śrīśaṃkaraḥ)
(evaḍu itarulanu ānaṃdaparacunō vāḍu adhikānaṃdamukalavāḍu ani prasiddhi kaladu - lōkamulō itarulaku dhanamicci vārini dhanavaṃtulugā cēyunō aṭṭivāḍu adhika dhanavaṃtuḍu pracura dhanikuḍu ani ceppabaḍucunnāḍu - ā prakāramugānē paramātma heccu ānaṃdamu kaliginavāḍainaṃdunu - tānē mōkṣasvarūpuḍai atyaṃtānaṃdamu kalugacēyuvāḍu kanuka atanu pracurānaṃduḍu - ānaṃdapracuruḍu kanukanē ānaṃdamayuḍu - ānaṃdapracuramu anagā ānaṃdamayamu).
(ānaṃdapracuramaina brahma anagā ānaṃdamayuḍagu brahma ani ceppabaḍucunnāḍu. brahmaku ānaṃdapracuratvameṭlu ceppabaḍinadi anagā - manuṣyuni ānaṃdamu modalukoni aṃtakaṃṭe ānaṃdamu ekkuvagākalavāṭi anniṃṭikaṃṭe, okadānikaṃṭe okadāniki heccu ānaṃdamu kaladu ani anniṃṭikaṃṭe brahmānaṃdamu heccu ayinadi - dānini miṃcina ānaṃdamulēdu ani śruti ceppuṭacēta parabrahma ānaṃda pracuramu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.