← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆనందరూపం ānaṃdarūpaṃ

Original — తెలుగు
  1. సర్వానర్థ దుఃఖాయాస ప్రహీణం. సుఖస్వరూపం.

(సమస్తమైన అనర్థములు, దుఃఖములు, ఆయాసము లేని సుఖస్వరూపము -).

  1. దుఃఖానం సం స్పృష్టం అమృతం యద్విభూతి సర్వదా తదిత్యర్థః -

(దుఃఖములేనటువంటిదిన్నీ, చావులేనటువంటిదిన్నీ అయినది ఏది ఎల్లపుడు ఉండునో అది ఆనందరూపము).

  1. “నిరుపాధిక నిత్యం యసుప్తే సర్వసుఖాత్పరం |

సుఖరూపమస్యేతత్ ఆనందత్వం సదామమ ||“.

(ఏవిధమైన ఉపాధిలేకయుండి, సుషుప్త్యవస్థయందు ఏది సమస్తసుఖములకన్న శ్రేష్టమైనదో అట్టి సుఖరూపమే నా ఆనందత్వము. ఆనందము అనగా సుఖముగానుండుట - పరమసుఖము, నిత్యసుఖము, శాశ్వతసుఖము).

  1. సత్యాత్మా.

(శాశ్వతముగా నుండు ఆత్మ; హెచ్చుతగ్గులు, దుఃఖము, మొదలగునవి లేక ఎప్పుడూ ఒకేరీతిగా నుండునది కనుక ఆత్మ ఆనందరూపుడు).

  1. “శ్లో ||. సౌఖ్యోత్కర్షావధిత్వా న్నిఖిల సుఖ కణాంభోనిధిత్వ శృతిభ్యో |

ముక్త ప్రాప్యత్వా వాదాన్నిరవధి పరమానంద భూమాత్మకత్వాత్ |

సర్వ ప్రత్యక్త్వావాదాన్నిధి నిలయవదాత్సుషుప్తా |

వాసందే బ్రహ్మతోక్తేరపి చ రసతయా తత్సదానంద రూపం ||’. (స్వారాజ్యసిద్ధి - అపవాదప్రకరణము)

(తైత్తిరీయోపనిషత్తులో మానుషానందము మొదలు ఒకదానికన్న ఒకటి నూరురెట్లు హెచ్చు ఆనందము గలవియగు గంధర్వానందము, మొదలగునవి చెప్పబడుచు, ఆఖరున ఆనింటికాన హెచ్చు ఆనందముకలది బ్రహ్మానందము అని చెప్పబడినది. ఆనందమునకు పరబ్రహ్మమే అవధి. అట్టి ఆనందముకలవాడగుటచేతను పరబ్రహ్మ అనంతసుఖము, అక్షయసుఖము, శాశ్వతసుఖము అని శ్రుతులలో చెప్పబడుటచేతను ముక్తిని కోరువారు ఈ పరబ్రహ్మనే చేరుచుండుటచేతను దీనంతటికీ కారణము పరమాత్మ ఆనందరూపుడగుటయే అని స్పష్టమగుచున్నది. అనంతసుఖము, శాశ్వతసుఖము అనగా మోక్షము - పరమాత్మ అనంతసుఖమునిచ్చువాడు కనుక ఆనందరూపుడు, మోక్షరూపుడు - వైకుంఠుడే వైకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు).

  1. “యా వైభూమా తత్సుఖం, యదల్పం తన్మర్త్యం”.

(పరబ్రహ్మము సమస్త జీవులకు ప్రత్యగాత్మ, అందుచేత వారందఱికి పరమానందరూపుడు).

  1. విషయ సంబంధాత్ ఆత్మస్వరూపానంద స్వభావం భవతి. ఆత్మా ఆనందరూపో యదినస్యాత్, తథా, విషయసంబంధాత్ ఆనందస్య భానం నోపపద్యతే. తస్మాత్ ఆత్మా ఆనందరూపో అస్తి.

(విషయములతో సంబంధము కలుగుటవలననే ఆత్మయొక్క ఆనందస్వరూపము స్పష్టమగుచున్నది. ఆత్మఆనందరూపముకానిచో విషయములతో సంబంధమున్నను ఆనందము కలుగదు. అందుచేత ఆత్మ ఆనందరూపము - ఆనందము విషయములందు లేదు).

  1. ఆత్మా ఆనందస్వరూపః అస్తి. ఆత్మా యది ఆనందరూపో నస్యాత్ తదా అంతర్ముఖాయాం వృత్తౌ య ఆనందో భవతి స నభవితు మర్హతి. తస్మాత్ ఆత్మా ఆనందరూపః - అయం సర్వ ప్రకరన నిష్కర్షః).

(ఆత్మ ఆనందరూపుడు. ఆత్మ ఆనందరూపుడుకానిచో, ధ్యానము అంతర్ముఖమైనపుడు - భగవంతుని మనసులో ధ్యానించునపుడు, ఏ ఆనంద కలుగునో అది కలుగదు - మనసులో ధ్యానించు ఆత్మ ఆనందరూపుడు అగుటచేతనే ఈ అనందము కలుగును - అందుచేత ఆత్మ ఆనందరూపుడు).

  1. “తస్యాః సంవిదః యతః పరమ ప్రేమాస్పదత్వం అనుభూయతే, తస్మాత్ అస్యాః సంవిధః ఆనందరూపతా అస్తి ఇత్యర్థః”.

(బాహ్య దృష్టి మాని అంతర్ధ్యానము చేయువాడు, పరప్రేమకు ఆస్పదమైనట్లు భగవంతుని అనుభవమువలన - భగవంతుని తెలుసుకొనుట వలన పరమాత్మ ఆనందరూపుడు).

  1. విషయే యది ఆనందో భవేత్ తదా యస్మిన్ విషయే కస్య చిత్సుఖం భవతి, తస్మిన్నేవ విషయే అన్యస్య ఉత్పద్య మానం న ఘటేత. తథాహి అగ్నేః స్పర్శేన అగ్నికీటస్య, సర్ప దర్శనేన సర్పిణ్యాః, సిమ్హం దర్శనేన సిమ్హ్యః ఆనందో భవతి, అన్యేషాం పురుషాణాం తు దుఃఖమేవ భవతి; తత్ న ఉపపద్యేత యది విషయే ఆనందో భవతి. సిద్ధాంతేతు అగ్ని కీటస్య అగ్ని స్పర్సేచ్ఛా భవతి, తదా తస్య చంచలా యాం బుద్ధౌ స్వరూపానంద భానం న భవతి. సిద్ధేతు అగ్ని సంబంధే క్షణమాత్రమిచ్ఛా దూరీ భవతి. తథా నిశ్చలాంతస్య బుద్ధౌ స్వరూపానందో భాతి,అన్యేషాం, పురుషాణాం తు అగ్ని సంబంధేచ్ఛా న భవతి, కింతు పదార్థాంతర సంబంధేచ్ఛా అస్తి. సా చ పదార్థరేచ్ఛా అగ్ని సంబంధాత్ నదూరీ భవతి. తస్మాత్ చంచలే అంతఃకరణే అగ్ని సంబంధాత్ ఆనందో న భవతి.

(విషయమందే ఆనందమున్నయడల ఏ విషయమువలన ఒకనికి ఆనందము కలుగునో ఆ విషయమువలననే ఇంకొకనికి దుఃఖము కలుగనేరదు - అగ్నిని చూచిన అగ్నికీటకమునకు, సర్పమును చూచిన ఆడుపామునకును, సిమ్హమును చూచిన సివంగికిని ఆనందము కలుగును. మిగిలినవారికి అగ్ని అనినను, సిమ్హమనినను, పాము అనినను భయమే కలుగును, కాని ఆనందము కలుగదు. ఆ ప్రకారముగా కాక ఆ విషయమువలన సుఖమే కలిగినయెడల విషయములందే ఆనందముండును - అట్లు ప్రతిపదార్థము అందఱికి సుఖమే కలుగచేయదుకనుక, పదార్థమునందు - విషయమునందు - ఆనందములేదు. పైన చెప్పిన అగ్నికీటకము మొదలగువాటియందు, అన్నింటియందు, పరమాత్మయే యుండుటవలన ఆనందమనునది ఆ పరమాత్మయందు కలదు; కాన పరమాత్మ ఆనందరూపము. విషయములానందమును కలుగచేయవు).

  1. “నవా అరే సర్వస్యకామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియంభవతి” ఇతిశ్రుతేః.

(లోకములో ఎవరికైనను దేనియందైనను ప్రేమ యున్నదనగా అవి తనకు ప్రియమైనదగుటకు కారణము. ఆ వస్తువులలోని ప్రత్యేకత వలనకాదు. అవి తనకు - తన ఆత్మకు - ప్రియమైనవగుటవలనే, తండ్రికి పుత్రునియడల కలుగు అభిమానము, భర్తకు భార్యయడలకలుగు అభిమానము ఇటువంటిది, తనకు పుత్రుడగుటవలనను, తనకు భార్య యగుటవలనను ఈ అభిమానము కలిగియుండుట. తనతో సంబంధము లేనపుడు వాటిమీద అటువంటి ప్రేమయుండదు. కనుక వస్తువులు - విషయములు - ప్రేమాస్పదములుకావు. ఆత్మయే ప్రేమాస్పదము - అందుచేత ఆత్మ ఆనందరూపుడు).

  1. “ఆనందరూపం వరదం ప్రసన్నం” (శ్రీరామకర్ణామృతం - 4 - 36 - )
Transliteration
  1. sarvānartha duḥkhāyāsa prahīṇaṃ. sukhasvarūpaṃ.

(samastamaina anarthamulu, duḥkhamulu, āyāsamu lēni sukhasvarūpamu -).

  1. duḥkhānaṃ saṃ spṛṣṭaṃ amṛtaṃ yadvibhūti sarvadā tadityarthaḥ -

(duḥkhamulēnaṭuvaṃṭidinnī, cāvulēnaṭuvaṃṭidinnī ayinadi ēdi ellapuḍu uṃḍunō adi ānaṃdarūpamu).

  1. “nirupādhika nityaṃ yasuptē sarvasukhātparaṃ |

sukharūpamasyētat ānaṃdatvaṃ sadāmama ||“.

(ēvidhamaina upādhilēkayuṃḍi, suṣuptyavasthayaṃdu ēdi samastasukhamulakanna śrēṣṭamainadō aṭṭi sukharūpamē nā ānaṃdatvamu. ānaṃdamu anagā sukhamugānuṃḍuṭa - paramasukhamu, nityasukhamu, śāśvatasukhamu).

  1. satyātmā.

(śāśvatamugā nuṃḍu ātma; heccutaggulu, duḥkhamu, modalagunavi lēka eppuḍū okērītigā nuṃḍunadi kanuka ātma ānaṃdarūpuḍu).

  1. “ślō ||. saukhyōtkarṣāvadhitvā nnikhila sukha kaṇāṃbhōnidhitva śṛtibhyō |

mukta prāpyatvā vādānniravadhi paramānaṃda bhūmātmakatvāt |

sarva pratyaktvāvādānnidhi nilayavadātsuṣuptā |

vāsaṃdē brahmatōktērapi ca rasatayā tatsadānaṃda rūpaṃ ||’. (svārājyasiddhi - apavādaprakaraṇamu)

(taittirīyōpaniṣattulō mānuṣānaṃdamu modalu okadānikanna okaṭi nūrureṭlu heccu ānaṃdamu galaviyagu gaṃdharvānaṃdamu, modalagunavi ceppabaḍucu, ākharuna āniṃṭikāna heccu ānaṃdamukaladi brahmānaṃdamu ani ceppabaḍinadi. ānaṃdamunaku parabrahmamē avadhi. aṭṭi ānaṃdamukalavāḍaguṭacētanu parabrahma anaṃtasukhamu, akṣayasukhamu, śāśvatasukhamu ani śrutulalō ceppabaḍuṭacētanu muktini kōruvāru ī parabrahmanē cērucuṃḍuṭacētanu dīnaṃtaṭikī kāraṇamu paramātma ānaṃdarūpuḍaguṭayē ani spaṣṭamagucunnadi. anaṃtasukhamu, śāśvatasukhamu anagā mōkṣamu - paramātma anaṃtasukhamuniccuvāḍu kanuka ānaṃdarūpuḍu, mōkṣarūpuḍu - vaikuṃṭhuḍē vaikuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu).

  1. “yā vaibhūmā tatsukhaṃ, yadalpaṃ tanmartyaṃ”.

(parabrahmamu samasta jīvulaku pratyagātma, aṃducēta vāraṃdaṟiki paramānaṃdarūpuḍu).

  1. viṣaya saṃbaṃdhāt ātmasvarūpānaṃda svabhāvaṃ bhavati. ātmā ānaṃdarūpō yadinasyāt, tathā, viṣayasaṃbaṃdhāt ānaṃdasya bhānaṃ nōpapadyatē. tasmāt ātmā ānaṃdarūpō asti.

(viṣayamulatō saṃbaṃdhamu kaluguṭavalananē ātmayokka ānaṃdasvarūpamu spaṣṭamagucunnadi. ātmaānaṃdarūpamukānicō viṣayamulatō saṃbaṃdhamunnanu ānaṃdamu kalugadu. aṃducēta ātma ānaṃdarūpamu - ānaṃdamu viṣayamulaṃdu lēdu).

  1. ātmā ānaṃdasvarūpaḥ asti. ātmā yadi ānaṃdarūpō nasyāt tadā aṃtarmukhāyāṃ vṛttau ya ānaṃdō bhavati sa nabhavitu marhati. tasmāt ātmā ānaṃdarūpaḥ - ayaṃ sarva prakarana niṣkarṣaḥ).

(ātma ānaṃdarūpuḍu. ātma ānaṃdarūpuḍukānicō, dhyānamu aṃtarmukhamainapuḍu - bhagavaṃtuni manasulō dhyāniṃcunapuḍu, ē ānaṃda kalugunō adi kalugadu - manasulō dhyāniṃcu ātma ānaṃdarūpuḍu aguṭacētanē ī anaṃdamu kalugunu - aṃducēta ātma ānaṃdarūpuḍu).

  1. “tasyāḥ saṃvidaḥ yataḥ parama prēmāspadatvaṃ anubhūyatē, tasmāt asyāḥ saṃvidhaḥ ānaṃdarūpatā asti ityarthaḥ”.

(bāhya dṛṣṭi māni aṃtardhyānamu cēyuvāḍu, paraprēmaku āspadamainaṭlu bhagavaṃtuni anubhavamuvalana - bhagavaṃtuni telusukonuṭa valana paramātma ānaṃdarūpuḍu).

  1. viṣayē yadi ānaṃdō bhavēt tadā yasmin viṣayē kasya citsukhaṃ bhavati, tasminnēva viṣayē anyasya utpadya mānaṃ na ghaṭēta. tathāhi agnēḥ sparśēna agnikīṭasya, sarpa darśanēna sarpiṇyāḥ, simhaṃ darśanēna simhyaḥ ānaṃdō bhavati, anyēṣāṃ puruṣāṇāṃ tu duḥkhamēva bhavati; tat na upapadyēta yadi viṣayē ānaṃdō bhavati. siddhāṃtētu agni kīṭasya agni sparsēcchā bhavati, tadā tasya caṃcalā yāṃ buddhau svarūpānaṃda bhānaṃ na bhavati. siddhētu agni saṃbaṃdhē kṣaṇamātramicchā dūrī bhavati. tathā niścalāṃtasya buddhau svarūpānaṃdō bhāti,anyēṣāṃ, puruṣāṇāṃ tu agni saṃbaṃdhēcchā na bhavati, kiṃtu padārthāṃtara saṃbaṃdhēcchā asti. sā ca padārtharēcchā agni saṃbaṃdhāt nadūrī bhavati. tasmāt caṃcalē aṃtaḥkaraṇē agni saṃbaṃdhāt ānaṃdō na bhavati.

(viṣayamaṃdē ānaṃdamunnayaḍala ē viṣayamuvalana okaniki ānaṃdamu kalugunō ā viṣayamuvalananē iṃkokaniki duḥkhamu kaluganēradu - agnini cūcina agnikīṭakamunaku, sarpamunu cūcina āḍupāmunakunu, simhamunu cūcina sivaṃgikini ānaṃdamu kalugunu. migilinavāriki agni aninanu, simhamaninanu, pāmu aninanu bhayamē kalugunu, kāni ānaṃdamu kalugadu. ā prakāramugā kāka ā viṣayamuvalana sukhamē kaliginayeḍala viṣayamulaṃdē ānaṃdamuṃḍunu - aṭlu pratipadārthamu aṃdaṟiki sukhamē kalugacēyadukanuka, padārthamunaṃdu - viṣayamunaṃdu - ānaṃdamulēdu. paina ceppina agnikīṭakamu modalaguvāṭiyaṃdu, anniṃṭiyaṃdu, paramātmayē yuṃḍuṭavalana ānaṃdamanunadi ā paramātmayaṃdu kaladu; kāna paramātma ānaṃdarūpamu. viṣayamulānaṃdamunu kalugacēyavu).

  1. “navā arē sarvasyakāmāya sarvaṃ priyaṃ bhavati, ātmanastu kāmāya sarvaṃ priyaṃbhavati” itiśrutēḥ.

(lōkamulō evarikainanu dēniyaṃdainanu prēma yunnadanagā avi tanaku priyamainadaguṭaku kāraṇamu. ā vastuvulalōni pratyēkata valanakādu. avi tanaku - tana ātmaku - priyamainavaguṭavalanē, taṃḍriki putruniyaḍala kalugu abhimānamu, bhartaku bhāryayaḍalakalugu abhimānamu iṭuvaṃṭidi, tanaku putruḍaguṭavalananu, tanaku bhārya yaguṭavalananu ī abhimānamu kaligiyuṃḍuṭa. tanatō saṃbaṃdhamu lēnapuḍu vāṭimīda aṭuvaṃṭi prēmayuṃḍadu. kanuka vastuvulu - viṣayamulu - prēmāspadamulukāvu. ātmayē prēmāspadamu - aṃducēta ātma ānaṃdarūpuḍu).

  1. “ānaṃdarūpaṃ varadaṃ prasannaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 36 - )
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.