(ఆపత్కాలమందు - అనగా, ప్రాణభయము కలిగినప్పుడు - అనుసరింపవలసిన ధర్మము).
ఆపద అనగా విపత్తు; కష్టము.
(ఆపద రెండు విధములుగా కలుగును –
1. దైవమువలన కలుగునది - అగ్ని, జలము, వ్యాధి, కరువు, మరణము అని అయిదు విధములు –
2. మనుష్యులవలన కలుగునది - ఆయుధములు, దొంగలు, రాజులు, రాజుల లోభము, వ్యసనము, అని అయిదు విధములు).
(ఆపత్కాలమందు చేయవలసిన ధర్మము - ఇది సాధారణధర్మము కన్న వేరైనది. సత్యము పలుకవలెననునది సాధారణ ధర్మము - సత్యము పలికిన ఇంకొక జీవికి ఆపద కలుగునేని అసత్యము పలుకుట ధర్మమే. ఇందుకు శుక్రనీతి ఉదాహరణము : -
ఆ. వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చునఘము పొంద డధిప (శ్రీమదాంధ్రమహాభాగవతము - )
(āpatkālamaṃdu - anagā, prāṇabhayamu kaliginappuḍu - anusariṃpavalasina dharmamu).
āpada anagā vipattu; kaṣṭamu.
(āpada reṃḍu vidhamulugā kalugunu –
1. daivamuvalana kalugunadi - agni, jalamu, vyādhi, karuvu, maraṇamu ani ayidu vidhamulu –
2. manuṣyulavalana kalugunadi - āyudhamulu, doṃgalu, rājulu, rājula lōbhamu, vyasanamu, ani ayidu vidhamulu).
(āpatkālamaṃdu cēyavalasina dharmamu - idi sādhāraṇadharmamu kanna vērainadi. satyamu palukavalenanunadi sādhāraṇa dharmamu - satyamu palikina iṃkoka jīviki āpada kalugunēni asatyamu palukuṭa dharmamē. iṃduku śukranīti udāharaṇamu : -
ā. vārijākṣulaṃdu vaivāhikamulaṃdu
prāṇa vitta māna bhaṃgamaṃdu
cakita gōkulāgra janmarakṣaṇamaṃdu
boṃkavaccunaghamu poṃda ḍadhipa (śrīmadāṃdhramahābhāgavatamu - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.