ఆప్నోతీతి ఆపః. (అంతటను వ్యాపించియుండునది - నీరు).
చేతనాచేతనం ఆప్నోతి కార్యజాతం బ్రహ్మాదిస్తంబపర్యంతం ఆరంభకత్వేన ఇత్యాపః పరమాత్మా -
(వ్యాపించువాడు. చతుర్ముఖబ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు గల కార్యవస్తువులన్నింటిని సృష్టించి వాటి అన్నింటిలోను వ్యాపించియున్నాడు, అట్లు వ్యాపించియున్నవాడు పరమాత్మ).
“ఆపో హవై రసః, ఆపో హవైనారాయణః”. (జలమే రసము, జలమే నారాయణుడు). త్వం తదాపః, ఆపో జ్యోతి రసో (అ)మృతం, బ్రహ్మ, భూర్భువస్సువరోం ” - (ఆ జలమునీవే - ఆజలమే రసము, అమృతము, బ్రహ్మ భూలోకము, భువర్లోకము, సువర్లోకము)“.
(నారాయణోపనిషత్)
(ప్రపంచమంతయు జలమయము - భూతములన్నియు జలమే, వాటికి కారణవస్తువులు నీరు. నీరు పాలుగామారును. అందుచేత పశువులు నీరే - ఔషధులు నీరే - నీరు లేనిదే సస్యములు పెరగవు. హిరణ్యగర్భుడు, విరాట్పురుషుడు, ఛందస్సులు, జ్యోతీరూపములు, ఇంద్రాదిదేవతలు లోకములు - అన్నియు జలమయములే –
ఆసీత్త దీక్షణా జ్జాతం జగత్సర్వం సచరాచరం |
ఆప ఏవ నసర్జాదౌ తాస్వ వాసీద్యతః స్వయం |
తేన నారాయణః ప్రోక్తః పరబ్రహ్మాఖ్య ఈశ్వరః ||“. (గీతాభావప్రకాశము - 1 - 56)
(సృష్టికి పూర్వము నారాయణుడను పేరుతో పరబ్రహ్మ ఉండెను - చరాచరరూపమైన జగత్తు అనతయు అతని ఈక్షణమాత్రమున కలిగెను. మొదట అతను ఉదకములను సృష్టించెను. అందులో అతను ప్రవేశించెను - నారములు అనగా ఉదకములు - అప్పులు. అందులో నివాసము చేసుకొనియున్న వాడు కనుక అతనికి నారా యణుడని పేరు వచ్చెను). (చూడుము - ‘నారాయణుడు’, ‘సృష్టి’).
దీనినిబట్టి తెలియునదేమనగా, మొదటిసృష్టి సూక్ష్మరూపములోనున్న నీరు - (Hydrogen gas). అందులో భగవంతుడు నివసించి యున్నాడు అనగా ఆ సూక్ష్మరూపములోనున్న జలములో ప్రాణవాయువురూపములో భగవంతుడు ప్రవేశించగా అది నీరు అయినది - (Hydrogen + Oxygen = water). నీటిలో ప్రాణవాయువు - Oxygen - ఉన్నది). ఈ విషయమే శ్రీమదాంధ్రమహాభాగవతములో ఈ క్రిందవిధముగా చెప్పబడినది :-
“అమ్మహాత్ముండు లీలార్థంబై జగత్సర్జనంబుసేయు తలంపున బ్రహ్మాండంబు వినిర్భేదించి, తనకు సుఖశయనంబునపేక్షించి మొదల జలతత్వంబు సృజియించె. సృజియించె. స్వతః పరిశుద్ధుండు గావున స్వసృష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు జేయుటంజేసి -”ఆపోనారా ఇతి ప్రోక్తా ఆపోవైనర సూనవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్స్మృతః” యను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు” - (శ్రీమదాంధ్రమహాబహగవతము - 2 - 10 - 268)
“ఆపో హ వై రసః”. “ఆపోహవై నారాయణః”. (ఉదకములే రసము; ఉదకములే నారాయణుడు).
“త్వం తదాపః, ఆపోజ్యోతి రసో(అ)మృతం బ్రహ్మ, భూర్భువస్సువరోం”. (మంత్రపుష్పం)
(భగవంతుడవైన నీవే ఉదకములు, ఉదకములే జ్యోతిస్సు, రసము, అమృతం, బ్రహ్మ, భూలోకము, భువర్లోకము, సువర్లోకము - భగవంతుడు మొదట సృష్టించిన ఉదకములే జ్యోతిస్సు, రసము, అమృతము, బ్రహ్మ, భూలోకము, భువర్లోకము, సువర్లోకము). (ఉదకములే సస్యములు మొదలగువాటిని పెంచి, పోషించి వాటిసారముతో కలిసి, రసము అనిపించుకొనుచున్నవి) - (రసోవైవః)
(ప్రాణవాయువు సూక్ష్మరూపములోనున్న ఉదకములతో నిండియున్నది - అందుచేత ప్రాణవాయువు సూక్ష్మరూపములో జలమే).
తతో (అ)త్యంతం నిషేధేన నక్వచిద్వారి వార్యతే ||“. (చికిత్సా సారసంగ్రహము)
(సకల ప్రాణులకు నీరు ప్రాణముతో సమానము. జగత్తు అంతయు నీటిమయము - మన శరీరములో మూడువంతులు పైగా నీరే. అందుచేత ఎటువంటి పరిస్థితులలోను అత్యంతముగా నీటిని నిషేధింపకూడదు - ఆరోగ్యస్థితిలోను, అనారోగ్యస్థితిలోను నీటిని పుష్కలముగా త్రాగవలెను - dehydration రానీయకూడదు).
(ఉదకములలో లోకములన్నియు, లోకములకు శుభము కలుగచేయు అగ్నియు ఉన్నవని నాకు చంద్రుడు (శివుడు) చెప్పెను).
“అగ్నేరాపః” (పంచభూతములలోని అగ్నినుండి ఉదకములు పుట్టినవి).
అప్భ్యః పృధివీ. (ఉదకములలోనుండి భూమి కలిగినది).
“ప్రాణ లోహిత మూత్రాం శైః అపాం పరిణతి త్రిథా”.
(త్రాగిన నీరు శరీరములో మూడువిధములుగా మారును - సూక్ష్మభాగము ప్రాణము, మధ్యభాగము రక్తము, స్థూలభాగము మూత్రము).
(ఉదకములు చల్లగానుండునవి, స్పర్సకలిగినవి - ఉదకములు రెండు విధములు - నిత్యములు, అనిత్యములు. పరమాణురూపములో సూక్ష్మరూపములో నుండునవి నిత్యములు - కార్యములైన వస్తువులందు ఉండునవి స్థూలము).
(పంచాగ్నులందు అయిది విధములగు ఆహుతులు చేర్చిన పురుషుడెట్లగును ? అను ప్రశ్న - దీనికి సమాధా నము ఇట్లు చెప్పబడినది : -
ద్యు, పర్జన్య, పృధివీ, పురుష, యోషిత్తులు అనునవి అయిదు అగ్నులు. వీటిలో వేయు ఆహుతులు ద్యులోక్గ్నిలో శ్రద్ధయనుదానిని, పర్జన్యాగ్నిలో సోమమను పృధివీ రూపాగ్నిలో వృష్టిని, పురుషుడు అన అగ్నిలో అన్నమును, మోషిత్తు అను అగ్నిలో రేతస్సును హోమముచేసిన పురుషుడగును. ఇది ఎట్లనగా - శ్రద్ధతో అగ్నిలో హోమము చేయబడున ద్రవరూపములయిన పాలు పెరుగు మొదలగు ద్రవ్య,ములలోనుండు అప్పులు - ఉదకముల సూక్ష్మాంశ - అపూర్వము అను ప్రాకృత ధర్మముననుసరించి ఆహుతి చేసిన యజమానుని పొంది అతనితోపాటు ద్యులోకమును పొంది ద్యులోకాగ్నిలో హోమము చేయబడును. ఇట్లు హోమము చేయబడిన ఈ జల సూక్ష్మాంశ సోమరూపముగా మారును - ఈ సోమరూపమైన ఆహుతి పర్జన్యాగ్నిలో ఆహుతియై వృష్టి యగును - ఆ వృష్టి రూపమగు జలము పృధివి యను అగ్నిలో హోమము చేయబడి ధాన్యము మొదలగు అన్న పదార్థములగును. అన్నరూపమును పొందిన జలము పురుషుడను అగ్నియందు రేతస్సుగా మారును. రేతస్సు అయిన జలమే యోషత్ (స్త్రీ, భార్య) అను అగ్నియందు ఆహుతికాబడు పురుషుడగును - దీనిని పంచాగ్ని విద్య యందురు.
(యజ్ఞ యాగములలో ఆహుతి చేయ బడిన వస్తువులలోని జలభాగము (జలాంశ) రేతస్సుగామారి సూక్ష్మరూపములోనున్న జీవుని తనలోనుంచుకొని స్త్రీగర్భములో శిశువుగా మార్చును. ఈ సూక్ష్మరూపములోనున్న జలాంశలో పంచభూతములలో మిగిలిన భూతముల అంశ కలిగియుండియు, తన అంశ అధికముగా గలిగియుండును. ఈ ప్రకారముగా సూక్ష్మరూపములో పురుషుడు ఒక దేహమునుండి మఱియొక దేహమును పొందుచున్నాడు. ఒక దేహములోనున్న జీవుడు సూక్ష్మరూపములోనున్న పంచభూతములతో కలిసియే ఇంకొక దేహమును ప్రవేశించును కాని, జీవుడు ఒక్కడే ఒక దేహమునుండి ఇంకొక దేహములో ప్రవేశించడు. పురుషుని రేతస్సులో జీవుడు, తత్వములన్నింటి సూక్ష్మరూపములు ఇమిడియే యుండును. ఆ రేతస్సు స్త్రీ గర్భములో చేరునమీదట అందులోనున్న జీవుడు ఆ సూక్ష్మతత్వములను పెంచుకొని శరీరముగా చేసుకొనును. జలమే ఇన్ని విధములుగా మారుచున్నది).
āpnōtīti āpaḥ. (aṃtaṭanu vyāpiṃciyuṃḍunadi - nīru).
cētanācētanaṃ āpnōti kāryajātaṃ brahmādistaṃbaparyaṃtaṃ āraṃbhakatvēna ityāpaḥ paramātmā -
(vyāpiṃcuvāḍu. caturmukhabrahma modalu gaḍḍipōca varaku gala kāryavastuvulanniṃṭini sṛṣṭiṃci vāṭi anniṃṭilōnu vyāpiṃciyunnāḍu, aṭlu vyāpiṃciyunnavāḍu paramātma).
“āpō havai rasaḥ, āpō havainārāyaṇaḥ”. (jalamē rasamu, jalamē nārāyaṇuḍu). tvaṃ tadāpaḥ, āpō jyōti rasō (a)mṛtaṃ, brahma, bhūrbhuvassuvarōṃ ” - (ā jalamunīvē - ājalamē rasamu, amṛtamu, brahma bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu)“.
(nārāyaṇōpaniṣat)
(prapaṃcamaṃtayu jalamayamu - bhūtamulanniyu jalamē, vāṭiki kāraṇavastuvulu nīru. nīru pālugāmārunu. aṃducēta paśuvulu nīrē - auṣadhulu nīrē - nīru lēnidē sasyamulu peragavu. hiraṇyagarbhuḍu, virāṭpuruṣuḍu, chaṃdassulu, jyōtīrūpamulu, iṃdrādidēvatalu lōkamulu - anniyu jalamayamulē –
āsītta dīkṣaṇā jjātaṃ jagatsarvaṃ sacarācaraṃ |
āpa ēva nasarjādau tāsva vāsīdyataḥ svayaṃ |
tēna nārāyaṇaḥ prōktaḥ parabrahmākhya īśvaraḥ ||“. (gītābhāvaprakāśamu - 1 - 56)
(sṛṣṭiki pūrvamu nārāyaṇuḍanu pērutō parabrahma uṃḍenu - carācararūpamaina jagattu anatayu atani īkṣaṇamātramuna kaligenu. modaṭa atanu udakamulanu sṛṣṭiṃcenu. aṃdulō atanu pravēśiṃcenu - nāramulu anagā udakamulu - appulu. aṃdulō nivāsamu cēsukoniyunna vāḍu kanuka ataniki nārā yaṇuḍani pēru vaccenu). (cūḍumu - ‘nārāyaṇuḍu’, ‘sṛṣṭi’).
dīninibaṭṭi teliyunadēmanagā, modaṭisṛṣṭi sūkṣmarūpamulōnunna nīru - (Hydrogen gas). aṃdulō bhagavaṃtuḍu nivasiṃci yunnāḍu anagā ā sūkṣmarūpamulōnunna jalamulō prāṇavāyuvurūpamulō bhagavaṃtuḍu pravēśiṃcagā adi nīru ayinadi - (Hydrogen + Oxygen = water). nīṭilō prāṇavāyuvu - Oxygen - unnadi). ī viṣayamē śrīmadāṃdhramahābhāgavatamulō ī kriṃdavidhamugā ceppabaḍinadi :-
“ammahātmuṃḍu līlārthaṃbai jagatsarjanaṃbusēyu talaṃpuna brahmāṃḍaṃbu vinirbhēdiṃci, tanaku sukhaśayanaṃbunapēkṣiṃci modala jalatatvaṃbu sṛjiyiṃce. sṛjiyiṃce. svataḥ pariśuddhuṃḍu gāvuna svasṛṣṭaṃbai yēkārṇavākāraṃbaina jalarāśiyaṃdu śayanaṃbu jēyuṭaṃjēsi -”āpōnārā iti prōktā āpōvainara sūnavaḥ ayanaṃ tasya tāḥ pūrvaṃ tēna nārāyaṇa ssmṛtaḥ” yanu pramāṇamu coppuna nārāyaṇa śabdavācyuṃḍu” - (śrīmadāṃdhramahābahagavatamu - 2 - 10 - 268)
“āpō ha vai rasaḥ”. “āpōhavai nārāyaṇaḥ”. (udakamulē rasamu; udakamulē nārāyaṇuḍu).
“tvaṃ tadāpaḥ, āpōjyōti rasō(a)mṛtaṃ brahma, bhūrbhuvassuvarōṃ”. (maṃtrapuṣpaṃ)
(bhagavaṃtuḍavaina nīvē udakamulu, udakamulē jyōtissu, rasamu, amṛtaṃ, brahma, bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu - bhagavaṃtuḍu modaṭa sṛṣṭiṃcina udakamulē jyōtissu, rasamu, amṛtamu, brahma, bhūlōkamu, bhuvarlōkamu, suvarlōkamu). (udakamulē sasyamulu modalaguvāṭini peṃci, pōṣiṃci vāṭisāramutō kalisi, rasamu anipiṃcukonucunnavi) - (rasōvaivaḥ)
(prāṇavāyuvu sūkṣmarūpamulōnunna udakamulatō niṃḍiyunnadi - aṃducēta prāṇavāyuvu sūkṣmarūpamulō jalamē).
tatō (a)tyaṃtaṃ niṣēdhēna nakvacidvāri vāryatē ||“. (cikitsā sārasaṃgrahamu)
(sakala prāṇulaku nīru prāṇamutō samānamu. jagattu aṃtayu nīṭimayamu - mana śarīramulō mūḍuvaṃtulu paigā nīrē. aṃducēta eṭuvaṃṭi paristhitulalōnu atyaṃtamugā nīṭini niṣēdhiṃpakūḍadu - ārōgyasthitilōnu, anārōgyasthitilōnu nīṭini puṣkalamugā trāgavalenu - dehydration rānīyakūḍadu).
(udakamulalō lōkamulanniyu, lōkamulaku śubhamu kalugacēyu agniyu unnavani nāku caṃdruḍu (śivuḍu) ceppenu).
“agnērāpaḥ” (paṃcabhūtamulalōni agninuṃḍi udakamulu puṭṭinavi).
apbhyaḥ pṛdhivī. (udakamulalōnuṃḍi bhūmi kaliginadi).
“prāṇa lōhita mūtrāṃ śaiḥ apāṃ pariṇati trithā”.
(trāgina nīru śarīramulō mūḍuvidhamulugā mārunu - sūkṣmabhāgamu prāṇamu, madhyabhāgamu raktamu, sthūlabhāgamu mūtramu).
(udakamulu callagānuṃḍunavi, sparsakaliginavi - udakamulu reṃḍu vidhamulu - nityamulu, anityamulu. paramāṇurūpamulō sūkṣmarūpamulō nuṃḍunavi nityamulu - kāryamulaina vastuvulaṃdu uṃḍunavi sthūlamu).
(paṃcāgnulaṃdu ayidi vidhamulagu āhutulu cērcina puruṣuḍeṭlagunu ? anu praśna - dīniki samādhā namu iṭlu ceppabaḍinadi : -
dyu, parjanya, pṛdhivī, puruṣa, yōṣittulu anunavi ayidu agnulu. vīṭilō vēyu āhutulu dyulōkgnilō śraddhayanudānini, parjanyāgnilō sōmamanu pṛdhivī rūpāgnilō vṛṣṭini, puruṣuḍu ana agnilō annamunu, mōṣittu anu agnilō rētassunu hōmamucēsina puruṣuḍagunu. idi eṭlanagā - śraddhatō agnilō hōmamu cēyabaḍuna dravarūpamulayina pālu perugu modalagu dravya,mulalōnuṃḍu appulu - udakamula sūkṣmāṃśa - apūrvamu anu prākṛta dharmamunanusariṃci āhuti cēsina yajamānuni poṃdi atanitōpāṭu dyulōkamunu poṃdi dyulōkāgnilō hōmamu cēyabaḍunu. iṭlu hōmamu cēyabaḍina ī jala sūkṣmāṃśa sōmarūpamugā mārunu - ī sōmarūpamaina āhuti parjanyāgnilō āhutiyai vṛṣṭi yagunu - ā vṛṣṭi rūpamagu jalamu pṛdhivi yanu agnilō hōmamu cēyabaḍi dhānyamu modalagu anna padārthamulagunu. annarūpamunu poṃdina jalamu puruṣuḍanu agniyaṃdu rētassugā mārunu. rētassu ayina jalamē yōṣat (strī, bhārya) anu agniyaṃdu āhutikābaḍu puruṣuḍagunu - dīnini paṃcāgni vidya yaṃduru.
(yajña yāgamulalō āhuti cēya baḍina vastuvulalōni jalabhāgamu (jalāṃśa) rētassugāmāri sūkṣmarūpamulōnunna jīvuni tanalōnuṃcukoni strīgarbhamulō śiśuvugā mārcunu. ī sūkṣmarūpamulōnunna jalāṃśalō paṃcabhūtamulalō migilina bhūtamula aṃśa kaligiyuṃḍiyu, tana aṃśa adhikamugā galigiyuṃḍunu. ī prakāramugā sūkṣmarūpamulō puruṣuḍu oka dēhamunuṃḍi maṟiyoka dēhamunu poṃducunnāḍu. oka dēhamulōnunna jīvuḍu sūkṣmarūpamulōnunna paṃcabhūtamulatō kalisiyē iṃkoka dēhamunu pravēśiṃcunu kāni, jīvuḍu okkaḍē oka dēhamunuṃḍi iṃkoka dēhamulō pravēśiṃcaḍu. puruṣuni rētassulō jīvuḍu, tatvamulanniṃṭi sūkṣmarūpamulu imiḍiyē yuṃḍunu. ā rētassu strī garbhamulō cērunamīdaṭa aṃdulōnunna jīvuḍu ā sūkṣmatatvamulanu peṃcukoni śarīramugā cēsukonunu. jalamē inni vidhamulugā mārucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.