← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆరోగ్యము ārōgyamu

Original — తెలుగు
  1. రోగరాహిత్యం; అరోగతా; ఆరోగస్య భావః.

(రోగము లేకుండుట; రోగములేని భావము; దేహస్వాస్థ్యం - దేహము స్వస్థతగానుండుట)

  1. ధాతు సామ్యాది; కర్మ దోషాగ్ని దోష వైషమ్యేణహి రోగాః ప్రాదుష్ట తంతి -

(వాత పిత్త శ్లేష్మములను మూడు దోషములయొక్క వైషమ్యమువలననే, హెచ్చు తగ్గులవలననే, రోగములు పుట్టుచుండును - ఈ మూడు దోషములయొక్క సమత్వ స్థితియే ఆరోగ్యము).

  1. “నిత్యం హితాహార విహార సేవీ సమీక్ష్యకారీ విషయేష్వ సక్తః |

దాతా, సమస్సత్యపరః క్షమావాన్ ఆప్తో పసేవీ చ భవత్య రోగః ||“.

(ఎల్లపుడు ఇష్టమైన ఆహారమును తినుచూ, విహరించుచు, యుక్తాయుక్త జ్ఞానముతో ప్రతి పనిచేయుచు, స్త్రీ లోలుడు, మధ్యమును సేవించువాడుకాకయుండి, దానధర్మములు చేయువాడు, అన్నింటియందు సమభావము కలిగి, సత్యసంధుడైయుండి, ఓర్మికలిగినవాడై, తన హితమును కోరు ఆప్తులైనవారి స్నేహము కలిగియున్నవాడు రోగము లేనివాడగును - ఆరోగ్యము కలవాడగును).

  1. “ప్రాణాది భేదః పవనో దేహమాశ్రిత్య తిష్టతి |

తస్య ధామాని నతయః కర్మాణి చ పృధక్ పృధక్ |

- - -

తస్మింస్థితే బలయుతే తిష్టత్యాయుః శతం సమాః |

బలహీనే చ వికలః ప్రయాతే (అ)స్మిన్ ప్రయాతి చ |

ఆయుర్బలం స్మృతిర్మేథా స్వర వర్ణేంద్రియాగ్నయః |

ప్రాణస్య భేదమాసాద్యవర్తయంతీవకృత్స్న సః |

సోపి దేహం సమాసాద్య శుభా శుభ నిబంధనం |

ఆత్మనో(అ)ధి కమల్పందా మధ్యం వా (ఆ)యుః కరోతి చ |

తస్మాద్దాన దయా ధర్మ బ్రహ్మచర్య రసాయనైః |

యత్నం ప్రాణ స్థితౌ కుర్యాత్ త్రివర్గస్తన్నిబంధనః ||“. (చికిత్సాసార సంగ్రహము)

(ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అను భేదములతో గాలి దేహమందుండును. అది బలముగా ఉన్నయడల ఆయుర్దాయము నూరు సంవత్సరములు - పూర్ణాయువు కలుగును - అది బలహీనముగానున్న యడల ఆయుర్దాయము కూడా తక్కువగానే యుండును. ఆయువు, బలము, స్మృతి, మేధస్సు, స్వరము, వర్ణము, ఇంద్రియములు, అగ్ని (వేడిమి - తేజస్సు - Energy) - ఇవన్నియు ప్రాణముయొక్క భేదములే - పరిణామములే. ఈ వాయువే దేహమున్నంతవఱకు పూర్ణాయువు, మధ్యమాయువు, స్వల్పాయువును కలుగచేయును - అందుచేత దానము, ధర్మము, దయ, బ్రహ్మచర్యము, రసాయనము (మందులు) చేత వాయువు శరీరములోనుండునట్లు చేయవలెను - త్రివర్ణములు దాని ఆధీనములే) (కుంభకము చేయ, అతినెమ్మదిగా గాలి లోపలికిపీల్చుచు అట్లే పైకి నెమ్మదిగా వదలుట అభ్యాసము చేసిన ఆరోగ్యము బాగుగా నుండును - ఇది మొదటిలో నాలుగు లేక అయిదు పర్యాయములు, ఆహారము తినకముందు, చేయవలెను - తొందరపడి ఆరంభములో ఎక్కువగా చేయరాదు).

  1. “ధరమార్థకామమోక్షాణాం ఆరోగ్యం మూలముత్తమం”.

(ధర్మము, అర్థము, కామము,మోక్షము అను నాలుగు పురుషార్థములను సాధించుటకు ఆరోగ్యము మూలము).

  1. “జాతమాత్రం నయః శత్రుం వ్యాధింవా ప్రశమన యేత్ |

అతి పుష్టాంగ యుక్తోపి న పశ్చాత్న్ తేనహన్యతే ||“.

(శత్రువునిగాని, వ్యాధినిగాని ఎవడు, ఎంత బలముగలవాడైనను, పుట్టగానే - మొదటిలోనే, చంపకయున్నయడలవాటి చేతనే వాడు చంపబడును).

“క. ఒత్తికొనిరానీ జన

దెత్తిన రోగముల రిపుల నింద్రియములను

త్పత్తి సమయముల జెఱుపక

మెత్తనగారాదు; రాదు మీద జయింపన్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 10 - పూ.భా. - 167)

  1. “ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” - ఇత్యాద్యాగమాత్ సూర్యన్యైవ రోగనాశకరత్వం ప్రసిద్ధం.

(ఆరోగ్యమును కోరువారు సూర్యుని ఉపాసించవలెను. అని ఆగమములు చెప్పుచుండుటచేత లోకములో సూర్యుడు రోగములను నాశము చేయువాడని ప్రసిద్ధి). (సూర్య కిరణములు, దాని వేడిమి సత్తువ (energy ని) ఇచ్చును). (చూడుము - ఆపః - 9).

Transliteration
  1. rōgarāhityaṃ; arōgatā; ārōgasya bhāvaḥ.

(rōgamu lēkuṃḍuṭa; rōgamulēni bhāvamu; dēhasvāsthyaṃ - dēhamu svasthatagānuṃḍuṭa)

  1. dhātu sāmyādi; karma dōṣāgni dōṣa vaiṣamyēṇahi rōgāḥ prāduṣṭa taṃti -

(vāta pitta ślēṣmamulanu mūḍu dōṣamulayokka vaiṣamyamuvalananē, heccu taggulavalananē, rōgamulu puṭṭucuṃḍunu - ī mūḍu dōṣamulayokka samatva sthitiyē ārōgyamu).

  1. “nityaṃ hitāhāra vihāra sēvī samīkṣyakārī viṣayēṣva saktaḥ |

dātā, samassatyaparaḥ kṣamāvān āptō pasēvī ca bhavatya rōgaḥ ||“.

(ellapuḍu iṣṭamaina āhāramunu tinucū, vihariṃcucu, yuktāyukta jñānamutō prati panicēyucu, strī lōluḍu, madhyamunu sēviṃcuvāḍukākayuṃḍi, dānadharmamulu cēyuvāḍu, anniṃṭiyaṃdu samabhāvamu kaligi, satyasaṃdhuḍaiyuṃḍi, ōrmikaliginavāḍai, tana hitamunu kōru āptulainavāri snēhamu kaligiyunnavāḍu rōgamu lēnivāḍagunu - ārōgyamu kalavāḍagunu).

  1. “prāṇādi bhēdaḥ pavanō dēhamāśritya tiṣṭati |

tasya dhāmāni natayaḥ karmāṇi ca pṛdhak pṛdhak |

- - -

tasmiṃsthitē balayutē tiṣṭatyāyuḥ śataṃ samāḥ |

balahīnē ca vikalaḥ prayātē (a)smin prayāti ca |

āyurbalaṃ smṛtirmēthā svara varṇēṃdriyāgnayaḥ |

prāṇasya bhēdamāsādyavartayaṃtīvakṛtsna saḥ |

sōpi dēhaṃ samāsādya śubhā śubha nibaṃdhanaṃ |

ātmanō(a)dhi kamalpaṃdā madhyaṃ vā (ā)yuḥ karōti ca |

tasmāddāna dayā dharma brahmacarya rasāyanaiḥ |

yatnaṃ prāṇa sthitau kuryāt trivargastannibaṃdhanaḥ ||“. (cikitsāsāra saṃgrahamu)

(prāṇamu, apānamu, vyānamu, udānamu, samānamu anu bhēdamulatō gāli dēhamaṃduṃḍunu. adi balamugā unnayaḍala āyurdāyamu nūru saṃvatsaramulu - pūrṇāyuvu kalugunu - adi balahīnamugānunna yaḍala āyurdāyamu kūḍā takkuvagānē yuṃḍunu. āyuvu, balamu, smṛti, mēdhassu, svaramu, varṇamu, iṃdriyamulu, agni (vēḍimi - tējassu - Energy) - ivanniyu prāṇamuyokka bhēdamulē - pariṇāmamulē. ī vāyuvē dēhamunnaṃtavaṟaku pūrṇāyuvu, madhyamāyuvu, svalpāyuvunu kalugacēyunu - aṃducēta dānamu, dharmamu, daya, brahmacaryamu, rasāyanamu (maṃdulu) cēta vāyuvu śarīramulōnuṃḍunaṭlu cēyavalenu - trivarṇamulu dāni ādhīnamulē) (kuṃbhakamu cēya, atinemmadigā gāli lōpalikipīlcucu aṭlē paiki nemmadigā vadaluṭa abhyāsamu cēsina ārōgyamu bāgugā nuṃḍunu - idi modaṭilō nālugu lēka ayidu paryāyamulu, āhāramu tinakamuṃdu, cēyavalenu - toṃdarapaḍi āraṃbhamulō ekkuvagā cēyarādu).

  1. “dharamārthakāmamōkṣāṇāṃ ārōgyaṃ mūlamuttamaṃ”.

(dharmamu, arthamu, kāmamu,mōkṣamu anu nālugu puruṣārthamulanu sādhiṃcuṭaku ārōgyamu mūlamu).

  1. “jātamātraṃ nayaḥ śatruṃ vyādhiṃvā praśamana yēt |

ati puṣṭāṃga yuktōpi na paścātn tēnahanyatē ||“.

(śatruvunigāni, vyādhinigāni evaḍu, eṃta balamugalavāḍainanu, puṭṭagānē - modaṭilōnē, caṃpakayunnayaḍalavāṭi cētanē vāḍu caṃpabaḍunu).

“ka. ottikonirānī jana

dettina rōgamula ripula niṃdriyamulanu

tpatti samayamula jeṟupaka

mettanagārādu; rādu mīda jayiṃpan ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 10 - pū.bhā. - 167)

  1. “ārōgyaṃ bhāskarādicchēt” - ityādyāgamāt sūryanyaiva rōganāśakaratvaṃ prasiddhaṃ.

(ārōgyamunu kōruvāru sūryuni upāsiṃcavalenu. ani āgamamulu ceppucuṃḍuṭacēta lōkamulō sūryuḍu rōgamulanu nāśamu cēyuvāḍani prasiddhi). (sūrya kiraṇamulu, dāni vēḍimi sattuva (energy ni) iccunu). (cūḍumu - āpaḥ - 9).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.