← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆశాపాశము āśāpāśamu

Original — తెలుగు
  1. ఆశైవపాశః ఆశాపాశః; ఆశాఖ్య పాశాః ఆశాపాశాః.

(ఆశ అనగా కోరిక, ఇచ్చ, అదియే పాశము, త్రాడువలె కట్టివేయునది).

  1. ఆశా విషయ తృష్ణా, అలంబుద్ధివిరహ రూపాసా పాశ ఇవ రజ్జురివ - పాశసాదృశ్యం చ అశాయాః బంధకత్వేనాశాపాశః.

(ఆశయనగా విషయములయడల కలుగు తృష్ణ - గాఢమైన కోరిక, చాలును అను అంతములేని కోరిక - అదియేపాశము - తాడు. తాడు వలె ఆశ బంధించును గనుక ఆశను పాశముతో పోల్చబడినది).

  1. “శా. ఆశాపాశంబు దా గడున్ నిడువు, లేదంతంబు, రాజేంద్ర! వా

రాశి ప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం

గాశంబొందిరిగాక వైన్యగయ భూకాంతాదులున్నర్థకా

మాశం బాయగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 19 - 575)

  1. “క. కడలేదాశాలతకుం

గడ జూడగ గానరాదు; కడగని రేనిన్

గడు ముదమున సంసారము

గడగందురు తత్వవిదులు, గమలదళాక్ష”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 18 - 575)

Transliteration
  1. āśaivapāśaḥ āśāpāśaḥ; āśākhya pāśāḥ āśāpāśāḥ.

(āśa anagā kōrika, icca, adiyē pāśamu, trāḍuvale kaṭṭivēyunadi).

  1. āśā viṣaya tṛṣṇā, alaṃbuddhiviraha rūpāsā pāśa iva rajjuriva - pāśasādṛśyaṃ ca aśāyāḥ baṃdhakatvēnāśāpāśaḥ.

(āśayanagā viṣayamulayaḍala kalugu tṛṣṇa - gāḍhamaina kōrika, cālunu anu aṃtamulēni kōrika - adiyēpāśamu - tāḍu. tāḍu vale āśa baṃdhiṃcunu ganuka āśanu pāśamutō pōlcabaḍinadi).

  1. “śā. āśāpāśaṃbu dā gaḍun niḍuvu, lēdaṃtaṃbu, rājēṃdra! vā

rāśi prāvṛta mēdinīvalaya sāmrājyaṃbu cēkūḍiyuṃ

gāśaṃboṃdirigāka vainyagaya bhūkāṃtādulunnarthakā

māśaṃ bāyaga nērcirē munu nijāśāṃtaṃbulaṃ jūcirē “. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 19 - 575)

  1. “ka. kaḍalēdāśālatakuṃ

gaḍa jūḍaga gānarādu; kaḍagani rēnin

gaḍu mudamuna saṃsāramu

gaḍagaṃduru tatvavidulu, gamaladaḷākṣa”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 18 - 575)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.