ప్రపత్తి పూర్వక భజనం. (శరణుపొంది భజించుట; సేవించుట).
ఆధారము; ప్రాపు.
యథా భూతేషు చరాచరేషుమహాభూతానిఖం, వాయుశ్చ, అగ్నిశ్చ, జలం,మహీ, తథా భగవాన్ మనః ప్రాణ బుద్ధీంద్రియ గుణాశ్రయః. మనః ఆదీని కార్యాణి. గుణాః కారణం, తేషాం ఆశ్రయత్వేన అనుగతః ఇత్యర్థః.
(చరాచర భూతములందు మహాభూతములైన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఎట్లు ఆశ్రయించియున్నవో - చరాచర భూతములకు పంచమహాభూతములు ఎట్లు ఆశ్రయమైనవో - అనగా, వాటి పుట్టుటకు, పోషణకు, లయమునకు పంచభూతములు ఆశ్రయమైనవో, అట్లే భగవంతుడు మనస్సు, ప్రాణము, బుద్ధి, ఇంద్రియములు, గుణములకు ఆశ్రయుడు - మనస్సు, ప్రాణము, బుద్ధి, ఇంద్రియములు, కార్యములు, వాటికి కారణము త్రిగుణములు - వీటికి ఆశ్రయుడు కనుక వాటిలో ప్రవేశించియుండి వాటిని లయింపచేయువాడు).
(ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు పరబ్రహ్మవలననే కలుగుచున్నవని నిశ్చయిమనబడుచున్నందున అతనే ఆశ్రయము. సకల ప్రపంచమునకు ఉపాదానకారణమగుటవలన బ్రహ్మమే ఆశ్రయమని చెప్పబడుచున్నాడు).
ఈ విషయము శ్రీమదాంధ్రమహాభాగవతమునందు ఈ రీతిగ చెప్పబడినది : -
“ఉత్పత్తి స్థితిలయంబులెం దణగుచు ప్రకాశింపబడునది ఆశ్రయంబనంబడు. అదియ పరామత్మ బ్రహ్మశబ్దవాచ్యంబు” (- 2 - 10 - 268 )
(ప్రపంచమునకు ఆశ్రయమైనవాడు పరబ్రహ్మ, పరమాత్మయని చెప్పబడుచున్నాడు).
“ద్రష్టయు, దృక్కును, దృశ్యంబుననందగు నీమాటయందు నొకటిలేకున్న నొకటి గానరాదు. ఈ త్రితయంబు నెవ్వడెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండైయుండు, అతండె పరమాత్మ”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 10 - 268)
“వినాశ్రయం న తిష్టతి పండితాః వనితా లతాః ||”.
(పండితులుగాని, స్త్రీలుగాని, లతలుగాని ఆశ్రయములేనిదే నిలువలేరు).
prapatti pūrvaka bhajanaṃ. (śaraṇupoṃdi bhajiṃcuṭa; sēviṃcuṭa).
ādhāramu; prāpu.
yathā bhūtēṣu carācarēṣumahābhūtānikhaṃ, vāyuśca, agniśca, jalaṃ,mahī, tathā bhagavān manaḥ prāṇa buddhīṃdriya guṇāśrayaḥ. manaḥ ādīni kāryāṇi. guṇāḥ kāraṇaṃ, tēṣāṃ āśrayatvēna anugataḥ ityarthaḥ.
(carācara bhūtamulaṃdu mahābhūtamulaina ākāśamu, vāyuvu, agni, jalamu, bhūmi eṭlu āśrayiṃciyunnavō - carācara bhūtamulaku paṃcamahābhūtamulu eṭlu āśrayamainavō - anagā, vāṭi puṭṭuṭaku, pōṣaṇaku, layamunaku paṃcabhūtamulu āśrayamainavō, aṭlē bhagavaṃtuḍu manassu, prāṇamu, buddhi, iṃdriyamulu, guṇamulaku āśrayuḍu - manassu, prāṇamu, buddhi, iṃdriyamulu, kāryamulu, vāṭiki kāraṇamu triguṇamulu - vīṭiki āśrayuḍu kanuka vāṭilō pravēśiṃciyuṃḍi vāṭini layiṃpacēyuvāḍu).
(prapaṃcamu yokka sṛṣṭi sthiti layamulu parabrahmavalananē kalugucunnavani niścayimanabaḍucunnaṃduna atanē āśrayamu. sakala prapaṃcamunaku upādānakāraṇamaguṭavalana brahmamē āśrayamani ceppabaḍucunnāḍu).
ī viṣayamu śrīmadāṃdhramahābhāgavatamunaṃdu ī rītiga ceppabaḍinadi : -
“utpatti sthitilayaṃbuleṃ daṇagucu prakāśiṃpabaḍunadi āśrayaṃbanaṃbaḍu. adiya parāmatma brahmaśabdavācyaṃbu” (- 2 - 10 - 268 )
(prapaṃcamunaku āśrayamainavāḍu parabrahma, paramātmayani ceppabaḍucunnāḍu).
“draṣṭayu, dṛkkunu, dṛśyaṃbunanaṃdagu nīmāṭayaṃdu nokaṭilēkunna nokaṭi gānarādu. ī tritayaṃbu nevvaḍeṟuṃgu nataṃḍu sarvalōkāśrayuṃḍaiyuṃḍu, ataṃḍe paramātma”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 10 - 268)
“vināśrayaṃ na tiṣṭati paṃḍitāḥ vanitā latāḥ ||”.
(paṃḍitulugāni, strīlugāni, latalugāni āśrayamulēnidē niluvalēru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.