(ఉన్నది అని అభిప్రాయముకలవాడు ఆస్తికుడు, అతనిభావము ఆస్తిక్యము). (చూడుము - ‘ఆస్తికః’).
ఆస్తికత; ఆస్తికత్వము.
అస్తి పరలోకః ఇతి నిశ్చయం - (పరలోకమున్నదను నిశ్చయము).
ఆస్తికభావః, శ్రద్ధధానతా ఆగమే మార్థేషు.
(ఉన్నది అను నమ్మకము, ఆస్తికుని భావము, వేదము భోధించు విషయములందు శ్రద్ధ కలిగియుండుట).
(వేదములందు. దేవునియందు, ద్విజులందు, గురువునందు విశ్వాసము - నమ్మకము కలిగియుండుట).
శ్రద్ధా - (శ్రద్ధకలిగియుండుట).
“ఆస్తిక్యం నామ వేదోక్త ధర్మాధర్మేషు విశ్వాసః.” (శాండిల్యోపనిషత్)
(వేదములో చెప్పబడిన ధర్మాధర్మములందు విశ్వాసము - నమ్మకము కలిగియుండుట)
(శ్రుతి, స్మృతులందు నమ్మకము కలిగియుండుట).
(పరమార్థమైన మోక్షమునందు, ఆగమములందు శ్రద్ధకలిగియుండుట).
(వేదములో చెప్పిన విషయమంతయు ప్రకృష్టముగా నిశ్చయించబడినది. ఏ కారణముచేతనైనను అది మారుటకు సాధ్యముకానిది. భగవంతుడు పురుషోత్తముడు, వాసుదేవుడు పరబ్రహ్మ యను పేర్లు గలవాడు, ఏ విధమైన దోషములు లేనివాడు. స్వాభావికమైనటువంటిన్నీ, అపరిమితమైనటువంటిన్నీ జ్ఞానము, బలము మొదలగు లెక్కలేనన్ని కల్యాణగుణములు గలవాడు, ఉపనిషత్తులలోని అర్థమెఱిగినవాడు - అతనే సమస్త జగత్తు నకు ఆధారమైనవాడు, అన్నింటినీ ప్రవర్తింపచేయువాడు, వేదములో చెప్పబడిన కర్మ యావత్తు అతనిని ఆరాధించుట గుఱించియే చెప్పబడినదే. ఆ ప్రకారముగా చెప్పబడిన కర్మలద్వారా ఆరాధింపబడినవాడై ధర్మార్థకామమోక్షములను చతుర్విధఫలములనిచ్చువాడు. ఈ పైవిషయము నిజమని నిశ్చయింపబడినవని తెలిసి నమ్ముటయే ఆస్తిక్యము).
(లోకములో ఏదైతే ఉన్నదో అది ఘటము మొదలగు వాటివలె కంటికికనబడుచున్నవి. కుందేటి కొమ్మువలె ఏది లేదో అది దొరుకుటలేదు - లభ్యముకాదు. ఆ ప్రకారముగానే బ్రహ్మ కనబడుటలేదు, కనుక లేడు అని చెప్పుటకు వీలులేదు. బ్రహ్మ ఆకాశము మొదలగువాటికి కారణభూతుడగుటవలన బ్రహ్మలేడు అని చెప్పుటకు వీలులేదు.బ్రహ్మ చేసిన కార్యమగుటవలన ఆకాశము మొదలగు ప్రపంచము కనబడుచున్నది. మట్టియొక్క కార్యవస్తువు కుండ అయినట్లునూ, విత్తనముయొక్క కార్యవస్తువు అంకురము (మొలక) అయినట్లును, దేనివలన ఏది పుట్టునో అది దానిలోనుండి పుట్టినదానికి కారణమగుత అంగీకరింపవ;అసిన విషయము. అందుచేత ఈ కనబడుచున్న ఆకాశము మొదలగువాటికి కారణము బ్రహ్మ అయి యున్నది. బ్రహ్మ సద్వస్తువు; బ్రహ్మకానిది అసత్. అసద్వస్తువునుండి పుట్టిన వస్తువు సత్తు కానేరదు. అందుచేత బ్రహ్మ కలడు).
(ప్రత్యక్షముగా మనము చూచుచూ ఉన్న వస్తువునందు అది ఉన్నది యను విశ్వాసము - నమ్మకము - కలిగియున్నట్లే, భగవంతునియందు, శాస్త్రములందును ముందుగా నమ్మకము కలిగియుండుట తగినది - మంచిది. భగవంతుడు ఉన్నాడు, అతను అన్నింటిలోను వ్యాపించియున్నాడు, అన్నింటికీ ప్రభువైనవాడు, సమస్త శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు - సమస్తమును తెలిసినవాడు - సర్వజ్ఞుడు - గొప్ప దయగల స్వభావము గలవాడు, పరమ స్నేహభావము గలవాడు,మంచి హృదయముగలవాడు, తండ్రికి పిల్లలయందుండు ప్రేమ అభిమానము వలె భక్తులయందు వాత్సల్యముగలవాడు, దీనజనులయడల బంధువువలె ఉండువాడు - ఈ ప్రకారముగా ఎల్లపుడు అన్నింటియందుండువాడు, అందఱి పాపములను, బాధలను తానే స్వయముగా నాశము చేయువాడు. ఈ సంసారములో ఏ కొంచెము సౌందర్యముగాని, మాధుర్యముగాని, ప్రేమగాని, స్నేహముగాని, జ్ఞానముకాని, వైరాగ్యముకాని, ఐశ్వర్యముగాని, ధనముగాని, భోగముకాని, సుఖముకాని మనము చూచుచున్నామో, మనకు యే గొప్ప విషయము కలుగుచున్నదో అది అంతయు ఆ భగవంతునియొక్క లేశమాత్రపు అంశలోనిదే. ఇంతేకాక ఈ జగత్తులోనుండు పదార్థములన్నియు అఖిలసౌందర్య మాదుర్యైశ్వర్యాది సద్గుణములకు సముద్రుడువంటివాడగు ఆ భగవంతునియొక్క ఒక్క బిందువు - బొట్టు చుక్క - తో సమానముకాదు. భగవంతుడిట్టివాడని తెలుసుకొనువాడు అతనియందు నమ్మకముంచును. అట్టి భగవంతుని విడిచి అర్థక్షణమాత్రమైనను ఇతరమునందు మనసును నిలుపుకొనుటకు శక్యము లేకుండును. అందుచేత తప్పకుండా ఆ భగవంతుడున్నాడని నమ్మకముతో నుండవలెను).
(మట్టి మొదలగు కారణవస్తువు లేనిదే కుండమొదలగు కార్యవస్తువులు లోకమునందు కనబడవు. అందుచేత చిత్ర విచిత్రముగా తయారయిన ఈ ప్రపంచమను కార్యమునకు దాని కారణమైన బ్రహ్మ కలడు అని అనుమానముచేతనైనా - అను ప్రమాణముచేతనైనను సిద్ధించుచున్నది. కారణములేక కార్యము కలుగదు అని శ్రుతిలో చెప్పినదానిని బట్టి సర్వ విశేషములను “ఇది కాదు ఇది కాదు” అని త్రోసిపుచ్చి, ఆఖరున మిగిలియుండునదే బ్రహ్మ అను శ్రుతివచనమే ఇందుకు ప్రమాణము).
(“ఎవనివలన ఈ సమస్తభూతములు పుట్టుచున్నవో” అని మొదలగు వాక్యము ఉపనిషత్తులలో చెప్పబడినది -ఎవనివలన సృష్టిస్థితిలయములు జరుగుచున్నవో అతనే బ్రహ్మ అని ఉపనిషత్తులో చెప్పబడినది. దీనిప్రకారము సమస్త జగత్తునకు ఒకటే కారణమైనటువంటిన్నీ, ఏ విధమైన దోషములు లేనటువంటిన్నీ, సర్వజ్ఞడు, సత్యసంకల్పుడు అను మొదలగు లెక్కలేనన్ని కల్యాణగుణములకు ఆకరమైనటువంటిన్నీ, మోక్షమిచ్చుటచేసి ఆనందఘనుడు అయినటువంటిన్నీ బ్రహ్మ అనువాడు ఉన్నాడు అని చెప్పుట సిద్ధము - సిద్ధాంతము,నిశ్చయము చేయబడినది).
(ఉపనిషత్తులలో చెప్పిన ప్రకారము బ్రహ్మజ్ఞానము కలిగియున్నను బ్రహ్మ అనువాడు లేనియడల పరమపురుషార్థమనెడి మోక్షము, దానిని పొందుట అని ఉపనిషత్తులు చెప్పినది పొసగదు. అందుచేత బ్రహ్మ కలడు).
(బ్రహ్మవిద్యాసుధార్ణవము - 5)
(కారణములో భేదములుండిన కార్యములోకూడ భేదములుండును - కుండ మట్టియొక్క కార్యము - అనగా కుండకు కారణమున్నది. ఆ ప్రకారముగానే ఒక మొలకకు కూడా కారణమున్నది. ఆ కారణము బీజము - గింజ. ఈ ప్రకారముగానే ప్రపంచమనునది ఒక పెద్ద కార్యము. దానికి కారణముండవలెను - ఆ కారణమే భగవంతుడని చెప్పబడినది. కారణము లేనిదే కార్యముండదు -కార్యముండిన యడల కారణము ఉండకతప్పదు. ప్రపంచము అను కార్యమున్నది కనుక దానికి కారణమైన భగవంతుడు ఉండక తప్పదు. అందుచేత భగవంతుడున్నాడు).
యజ్ఞాధిపతియైన యఖిలేశ్వరుడుగొన్ని మతముల గలడు ధీమంతులార
యట్లైన మీరలు నందుకు విప్రతి పత్తి గల్గుటను బ్రసన్న మరయ
గా దంటిరేని నా ఘనునిచే రచితమై కాంతిమంతమగుజగంబుగాన
తే. బడుచు నున్నది; యిట్టి ప్రపంచ రచిత
కర్మ వైచిత్త్యా మమ్మేటి గలుగకున్న
నమరునను తదుక్తులుపపన్నములుగావు
కాన నవ్వాసుదేవుండు గలడు - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 570)
గర్మము బుద్ధి జూడ జడకార్యముగాని ప్రపంచ కల్పనా
కర్మమునందు గర్తయనగా విలసిల్ల జాలదీ జగ
త్కర్మక కార్య కారణముగావున నీశుడు విష్ణుడారయన్ ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 581)
సందేహమువలదు; చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే గలడు దానవాగ్రణి ! వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 8 - 275)
(unnadi ani abhiprāyamukalavāḍu āstikuḍu, atanibhāvamu āstikyamu). (cūḍumu - ‘āstikaḥ’).
āstikata; āstikatvamu.
asti paralōkaḥ iti niścayaṃ - (paralōkamunnadanu niścayamu).
āstikabhāvaḥ, śraddhadhānatā āgamē mārthēṣu.
(unnadi anu nammakamu, āstikuni bhāvamu, vēdamu bhōdhiṃcu viṣayamulaṃdu śraddha kaligiyuṃḍuṭa).
(vēdamulaṃdu. dēvuniyaṃdu, dvijulaṃdu, guruvunaṃdu viśvāsamu - nammakamu kaligiyuṃḍuṭa).
śraddhā - (śraddhakaligiyuṃḍuṭa).
“āstikyaṃ nāma vēdōkta dharmādharmēṣu viśvāsaḥ.” (śāṃḍilyōpaniṣat)
(vēdamulō ceppabaḍina dharmādharmamulaṃdu viśvāsamu - nammakamu kaligiyuṃḍuṭa)
(śruti, smṛtulaṃdu nammakamu kaligiyuṃḍuṭa).
(paramārthamaina mōkṣamunaṃdu, āgamamulaṃdu śraddhakaligiyuṃḍuṭa).
(vēdamulō ceppina viṣayamaṃtayu prakṛṣṭamugā niścayiṃcabaḍinadi. ē kāraṇamucētanainanu adi māruṭaku sādhyamukānidi. bhagavaṃtuḍu puruṣōttamuḍu, vāsudēvuḍu parabrahma yanu pērlu galavāḍu, ē vidhamaina dōṣamulu lēnivāḍu. svābhāvikamainaṭuvaṃṭinnī, aparimitamainaṭuvaṃṭinnī jñānamu, balamu modalagu lekkalēnanni kalyāṇaguṇamulu galavāḍu, upaniṣattulalōni arthameṟiginavāḍu - atanē samasta jagattu naku ādhāramainavāḍu, anniṃṭinī pravartiṃpacēyuvāḍu, vēdamulō ceppabaḍina karma yāvattu atanini ārādhiṃcuṭa guṟiṃciyē ceppabaḍinadē. ā prakāramugā ceppabaḍina karmaladvārā ārādhiṃpabaḍinavāḍai dharmārthakāmamōkṣamulanu caturvidhaphalamulaniccuvāḍu. ī paiviṣayamu nijamani niścayiṃpabaḍinavani telisi nammuṭayē āstikyamu).
(lōkamulō ēdaitē unnadō adi ghaṭamu modalagu vāṭivale kaṃṭikikanabaḍucunnavi. kuṃdēṭi kommuvale ēdi lēdō adi dorukuṭalēdu - labhyamukādu. ā prakāramugānē brahma kanabaḍuṭalēdu, kanuka lēḍu ani ceppuṭaku vīlulēdu. brahma ākāśamu modalaguvāṭiki kāraṇabhūtuḍaguṭavalana brahmalēḍu ani ceppuṭaku vīlulēdu.brahma cēsina kāryamaguṭavalana ākāśamu modalagu prapaṃcamu kanabaḍucunnadi. maṭṭiyokka kāryavastuvu kuṃḍa ayinaṭlunū, vittanamuyokka kāryavastuvu aṃkuramu (molaka) ayinaṭlunu, dēnivalana ēdi puṭṭunō adi dānilōnuṃḍi puṭṭinadāniki kāraṇamaguta aṃgīkariṃpava;asina viṣayamu. aṃducēta ī kanabaḍucunna ākāśamu modalaguvāṭiki kāraṇamu brahma ayi yunnadi. brahma sadvastuvu; brahmakānidi asat. asadvastuvunuṃḍi puṭṭina vastuvu sattu kānēradu. aṃducēta brahma kalaḍu).
(pratyakṣamugā manamu cūcucū unna vastuvunaṃdu adi unnadi yanu viśvāsamu - nammakamu - kaligiyunnaṭlē, bhagavaṃtuniyaṃdu, śāstramulaṃdunu muṃdugā nammakamu kaligiyuṃḍuṭa taginadi - maṃcidi. bhagavaṃtuḍu unnāḍu, atanu anniṃṭilōnu vyāpiṃciyunnāḍu, anniṃṭikī prabhuvainavāḍu, samasta śaktulu galavāḍu, sarvajñuḍu - samastamunu telisinavāḍu - sarvajñuḍu - goppa dayagala svabhāvamu galavāḍu, parama snēhabhāvamu galavāḍu,maṃci hṛdayamugalavāḍu, taṃḍriki pillalayaṃduṃḍu prēma abhimānamu vale bhaktulayaṃdu vātsalyamugalavāḍu, dīnajanulayaḍala baṃdhuvuvale uṃḍuvāḍu - ī prakāramugā ellapuḍu anniṃṭiyaṃduṃḍuvāḍu, aṃdaṟi pāpamulanu, bādhalanu tānē svayamugā nāśamu cēyuvāḍu. ī saṃsāramulō ē koṃcemu sauṃdaryamugāni, mādhuryamugāni, prēmagāni, snēhamugāni, jñānamukāni, vairāgyamukāni, aiśvaryamugāni, dhanamugāni, bhōgamukāni, sukhamukāni manamu cūcucunnāmō, manaku yē goppa viṣayamu kalugucunnadō adi aṃtayu ā bhagavaṃtuniyokka lēśamātrapu aṃśalōnidē. iṃtēkāka ī jagattulōnuṃḍu padārthamulanniyu akhilasauṃdarya māduryaiśvaryādi sadguṇamulaku samudruḍuvaṃṭivāḍagu ā bhagavaṃtuniyokka okka biṃduvu - boṭṭu cukka - tō samānamukādu. bhagavaṃtuḍiṭṭivāḍani telusukonuvāḍu ataniyaṃdu nammakamuṃcunu. aṭṭi bhagavaṃtuni viḍici arthakṣaṇamātramainanu itaramunaṃdu manasunu nilupukonuṭaku śakyamu lēkuṃḍunu. aṃducēta tappakuṃḍā ā bhagavaṃtuḍunnāḍani nammakamutō nuṃḍavalenu).
(maṭṭi modalagu kāraṇavastuvu lēnidē kuṃḍamodalagu kāryavastuvulu lōkamunaṃdu kanabaḍavu. aṃducēta citra vicitramugā tayārayina ī prapaṃcamanu kāryamunaku dāni kāraṇamaina brahma kalaḍu ani anumānamucētanainā - anu pramāṇamucētanainanu siddhiṃcucunnadi. kāraṇamulēka kāryamu kalugadu ani śrutilō ceppinadānini baṭṭi sarva viśēṣamulanu “idi kādu idi kādu” ani trōsipucci, ākharuna migiliyuṃḍunadē brahma anu śrutivacanamē iṃduku pramāṇamu).
(“evanivalana ī samastabhūtamulu puṭṭucunnavō” ani modalagu vākyamu upaniṣattulalō ceppabaḍinadi -evanivalana sṛṣṭisthitilayamulu jarugucunnavō atanē brahma ani upaniṣattulō ceppabaḍinadi. dīniprakāramu samasta jagattunaku okaṭē kāraṇamainaṭuvaṃṭinnī, ē vidhamaina dōṣamulu lēnaṭuvaṃṭinnī, sarvajñaḍu, satyasaṃkalpuḍu anu modalagu lekkalēnanni kalyāṇaguṇamulaku ākaramainaṭuvaṃṭinnī, mōkṣamiccuṭacēsi ānaṃdaghanuḍu ayinaṭuvaṃṭinnī brahma anuvāḍu unnāḍu ani ceppuṭa siddhamu - siddhāṃtamu,niścayamu cēyabaḍinadi).
(upaniṣattulalō ceppina prakāramu brahmajñānamu kaligiyunnanu brahma anuvāḍu lēniyaḍala paramapuruṣārthamaneḍi mōkṣamu, dānini poṃduṭa ani upaniṣattulu ceppinadi posagadu. aṃducēta brahma kalaḍu).
(brahmavidyāsudhārṇavamu - 5)
(kāraṇamulō bhēdamuluṃḍina kāryamulōkūḍa bhēdamuluṃḍunu - kuṃḍa maṭṭiyokka kāryamu - anagā kuṃḍaku kāraṇamunnadi. ā prakāramugānē oka molakaku kūḍā kāraṇamunnadi. ā kāraṇamu bījamu - giṃja. ī prakāramugānē prapaṃcamanunadi oka pedda kāryamu. dāniki kāraṇamuṃḍavalenu - ā kāraṇamē bhagavaṃtuḍani ceppabaḍinadi. kāraṇamu lēnidē kāryamuṃḍadu -kāryamuṃḍina yaḍala kāraṇamu uṃḍakatappadu. prapaṃcamu anu kāryamunnadi kanuka dāniki kāraṇamaina bhagavaṃtuḍu uṃḍaka tappadu. aṃducēta bhagavaṃtuḍunnāḍu).
yajñādhipatiyaina yakhilēśvaruḍugonni matamula galaḍu dhīmaṃtulāra
yaṭlaina mīralu naṃduku viprati patti galguṭanu brasanna maraya
gā daṃṭirēni nā ghanunicē racitamai kāṃtimaṃtamagujagaṃbugāna
tē. baḍucu nunnadi; yiṭṭi prapaṃca racita
karma vaicittyā mammēṭi galugakunna
namarunanu taduktulupapannamulugāvu
kāna navvāsudēvuṃḍu galaḍu - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 570)
garmamu buddhi jūḍa jaḍakāryamugāni prapaṃca kalpanā
karmamunaṃdu gartayanagā vilasilla jāladī jaga
tkarmaka kārya kāraṇamugāvuna nīśuḍu viṣṇuḍārayan ” (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 581)
saṃdēhamuvaladu; cakri sarvōpagatuṃ
ḍeṃdeṃdu vedaki cūcina
naṃdaṃdē galaḍu dānavāgraṇi ! viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 8 - 275)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.