← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆతతాయి ātatāyi

Original — తెలుగు
  1. “అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్థనాపహః |

క్షేత్ర దారహరశ్చైతే షడేతే ఆతతాయినః ||“.

(ఇంటికి నిప్పు పెట్టువాడు, విషము పెట్టువాడు, శస్త్రము ధరించి చంపుటకు మీదకు వచ్చువాడు, ధనము నపహరించువాడు, భూమిని, బార్యను అపహరించువాడు - ఈ ఆరుగురు ఆతతాయినులు).

  1. “గురుం వా బాలవృద్ధం వా బ్రాహ్మణం వా బహుశ్రుతం |

ఆతతాయిన మాయాంతం హన్యే దేవా విచారయన్ |

ఆత తాయిన మాయాంతమపి వేదాంతపారగం |

జఘం సంతం జి ఘాంసీ యాన్న తేన బ్రహ్మాహా భవేత్ |

నాతతాయి వధే దోషో హంతుర్భవతి కశ్చన ||” (మనుః)

(ఆతతాయి అయినవాడు గురువైనను, బాలుడైనను, బ్రాహ్మణుడైనను, పండితుడైనను, చంపుటకు ఉద్యుక్తుడై వచ్చినవాడిని చంపవచ్చునా, చంపకూడదా అని విచారించక చంపవలసినదే. దాని వలన అట్లు చంపువానికి ఏ విధమైన దోషము కలుగదు).

(భీష్ముడు, ద్రోణాచార్యులు మొదలగువారు యుద్ధములో వారి ధర్మముననుసరించి అర్జునుని చంపుటకు సిద్ధముగానున్నారు - అట్టివారిని అర్జునుడు తాతగారని, గురువు అని చంపకపోయినను, వారు అర్జునుని చంపుటకు సిద్ధముగానున్నారు. కనుక వారు ఆతతాయినులు - అట్టివారిని చంపినను అర్జునునకు పాపము కలుగదు - అని శ్రీకృష్ణుడు భోధించెను).

Transliteration
  1. “agnidō garadaścaiva śastrapāṇirthanāpahaḥ |

kṣētra dāraharaścaitē ṣaḍētē ātatāyinaḥ ||“.

(iṃṭiki nippu peṭṭuvāḍu, viṣamu peṭṭuvāḍu, śastramu dhariṃci caṃpuṭaku mīdaku vaccuvāḍu, dhanamu napahariṃcuvāḍu, bhūmini, bāryanu apahariṃcuvāḍu - ī āruguru ātatāyinulu).

  1. “guruṃ vā bālavṛddhaṃ vā brāhmaṇaṃ vā bahuśrutaṃ |

ātatāyina māyāṃtaṃ hanyē dēvā vicārayan |

āta tāyina māyāṃtamapi vēdāṃtapāragaṃ |

jaghaṃ saṃtaṃ ji ghāṃsī yānna tēna brahmāhā bhavēt |

nātatāyi vadhē dōṣō haṃturbhavati kaścana ||” (manuḥ)

(ātatāyi ayinavāḍu guruvainanu, bāluḍainanu, brāhmaṇuḍainanu, paṃḍituḍainanu, caṃpuṭaku udyuktuḍai vaccinavāḍini caṃpavaccunā, caṃpakūḍadā ani vicāriṃcaka caṃpavalasinadē. dāni valana aṭlu caṃpuvāniki ē vidhamaina dōṣamu kalugadu).

(bhīṣmuḍu, drōṇācāryulu modalaguvāru yuddhamulō vāri dharmamunanusariṃci arjununi caṃpuṭaku siddhamugānunnāru - aṭṭivārini arjunuḍu tātagārani, guruvu ani caṃpakapōyinanu, vāru arjununi caṃpuṭaku siddhamugānunnāru. kanuka vāru ātatāyinulu - aṭṭivārini caṃpinanu arjununaku pāpamu kalugadu - ani śrīkṛṣṇuḍu bhōdhiṃcenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.