← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ కర్తృత్వం ātma kartṛtvaṃ

Original — తెలుగు
  1. “ఆత్మనః స్వతః పరిశుద్ధ స్వభావస్య పూర్వ పూర్వ కర్మ మూల గుణ సంగనిమిత్తం వివిధ కర్మసు కర్తృత్వం. ఆత్మా స్వతః తు. అకర్తా అపరిచ్ఛిన్న జ్ఞానైకా కారః గుణాః ఏవ స్వానుగుణ ప్రవృత్తిషు కర్తారః”. (శ్రీరామానుజః)

(ఆత్మ స్వభాతః గా పరిశుద్ధ స్వభావముగలది. అయినను జీవుని శరీరమును ప్రవేశించి జీవాత్మ యగుటవలన ఇంతకుముందు జన్మమలలో చేసిన కర్మలకు మూలమగు త్రిగుణములకారణముగా ఆయా కర్మల కర్తృత్వము చెప్పబడుచున్నది. కాని ఆత్మ స్వతహా ఆకర్మల కర్తకాడు. అనంతము అగు జ్ఞానమే - చైతన్యమే - ఆకారముగా గలవాడు - సత్వరజస్త,మములను త్రిగుణములే వాటి వాటి ప్రవృత్తికి - వాటి మూలముగా చేయు కర్మలకు, కర్తలు).

  1. అనాదిత్వా న్నిర్గుణత్వాత్పరమాత్మాయమ వ్యయః |

శరీరస్థోపి కౌంతేయ న కోరోతి న లిప్యతే |

యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోప లిప్యతే |

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 31, 32)

(ఆకాశము సూక్ష్మమగుటవలన అన్నింటిలోను వ్యాపించియున్నను దేనితోను అంటియుండనట్లు, అనాది యగుటవలనను - జన్మములేని వాడగుటచేతను - సత్వరజస్తమము లు లేనివాడగుటచేతను - వాటి ప్రభావము లేనివాడగుటచేతను - అవ్యయుడు అగు - నాశములేని - పరమాత్మ శరీరములోనున్నను ఏ విధమైన కర్మను చేయుటలేదు. శరీరము కర్మలను చేయుచున్నను ఆ కర్మలు పరమాత్మను అంటవు - అందుచేత పరమాత్మ కర్తకాడు - పరమాత్మకు కర్తృత్వము లేదు).

Transliteration
  1. “ātmanaḥ svataḥ pariśuddha svabhāvasya pūrva pūrva karma mūla guṇa saṃganimittaṃ vividha karmasu kartṛtvaṃ. ātmā svataḥ tu. akartā aparicchinna jñānaikā kāraḥ guṇāḥ ēva svānuguṇa pravṛttiṣu kartāraḥ”. (śrīrāmānujaḥ)

(ātma svabhātaḥ gā pariśuddha svabhāvamugaladi. ayinanu jīvuni śarīramunu pravēśiṃci jīvātma yaguṭavalana iṃtakumuṃdu janmamalalō cēsina karmalaku mūlamagu triguṇamulakāraṇamugā āyā karmala kartṛtvamu ceppabaḍucunnadi. kāni ātma svatahā ākarmala kartakāḍu. anaṃtamu agu jñānamē - caitanyamē - ākāramugā galavāḍu - satvarajasta,mamulanu triguṇamulē vāṭi vāṭi pravṛttiki - vāṭi mūlamugā cēyu karmalaku, kartalu).

  1. anāditvā nnirguṇatvātparamātmāyama vyayaḥ |

śarīrasthōpi kauṃtēya na kōrōti na lipyatē |

yathā sarvagataṃ saukṣmyādākāśaṃ nōpa lipyatē |

sarvatrāvasthitō dēhē tathātmā nōpalipyatē ||“. (śrīmadbhagavadgīta - 13 - 31, 32)

(ākāśamu sūkṣmamaguṭavalana anniṃṭilōnu vyāpiṃciyunnanu dēnitōnu aṃṭiyuṃḍanaṭlu, anādi yaguṭavalananu - janmamulēni vāḍaguṭacētanu - satvarajastamamu lu lēnivāḍaguṭacētanu - vāṭi prabhāvamu lēnivāḍaguṭacētanu - avyayuḍu agu - nāśamulēni - paramātma śarīramulōnunnanu ē vidhamaina karmanu cēyuṭalēdu. śarīramu karmalanu cēyucunnanu ā karmalu paramātmanu aṃṭavu - aṃducēta paramātma kartakāḍu - paramātmaku kartṛtvamu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.