(ఆత్మయందే రమించువాడు, ప్రీతిగల వాడు - స్వభావముచేతనే సంతుష్టి పొందువాడు, తనంతట తానే సంతుష్టి పొందువాడు).
(విషయములందుకాక ఆత్మయందే - పరమాత్మయందే రమించువాడు - నిరంతరము ధ్యానముగలవాడు).
(ఆత్మయందే ప్రీతిగలవాడు - బాహ్య సాధనములను అపేక్షించునది క్రీడయనిపించుకొనును. రతి యనగా సాధనము నపేక్షించని ప్రీతి).
(మంచిగంధము, పూదండలు మొదలగు వాటియందుకాక ఆత్మ యందే రతిగలవాడు).
ఆత్మనః రతిః యస్య ఇతివా. (ఆత్మకు సంబంధించిన రతి గలవాడు).
ఆత్మాభిముఖః.
(ఆత్మవిషయమై అభిముఖమైనవాడు, ఆత్మకు సంబంధించినవాటియందు ఇష్టమైన వాడు).
(ఆత్మ రూపమైన ప్రతిపాణిగా భగవంతుడే యుండుటవలన సర్వాత్ముడైన భగవంతునియందు రతి కలిగి యుండుట - అనగా, వాస్తవమ్య్గా భగవంతుని యందు భక్తి కలిగియుండుట).
“మోక్షకారేణ సామాగ్ర్యాం భక్తిరేవ గరీయ సీ |
స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే ||“.
(ఎడతెగకుండా శుద్ధమైన ఆత్మ స్వరూపమందు ఎల్లపుడు రతి కలిగియుండుటే ఆత్మరతి. ఇట్టి ఆత్మ రతి యందు నిత్యము ఉండుటయే అవ్యక్తోపాసకులైన మహానుభావులు భక్తియని చెప్పుదురు. ఈ విషయమే శ్రీ శంకరాచార్యుల వారు ఈ క్రింద విధముగా చెప్పి యుండిరి : - మోక్షమునకు కారణమగు సాధనములలో భక్తియే గొప్పది, భగవంతునియొక్క స్వస్వరూపమును అనుసంధానము చేయుటయే - నిత్యము ధ్యానించుటయే భక్తియని చెప్పబడినది).
ఆత్మన్యేవచ సంతుష్టః తస్యకార్యం న విద్యతే || (శ్రీమద్భగవద్గీత - 3 - 17)
“రతిం యాతీంద్రియా రామః స్రగ్గంధవనితా దిషు |
విషయా ణాం యధోక్తానామ భావే దుఃఖమేతిచ |
సాక్షాత్కృత నిజానందో ద్వైత దృష్టేర భావతః |
అతి తుచ్చతయా భోగ్యసుఖం నేచ్ఛతి తత్వవిత్ |
- - - మనోవృత్తి విశేషా హి స్యుః రతి తృప్తి తుష్టయః |
సాక్షి సిద్ధా అతో (అ)నాత్మ ధర్మాస్తేషు కథం బుధః |
సజ్జే తాత్మ సుఖే మగ్నో గలితా నాత్మధీః స్వతః |
ఆత్మన్యేవ సుఖాంభో ధౌ స్వభావా దేన తత్వవిత్ |
రతిం తృప్తించ, తుష్టించ యాత్య సౌ సుఖసాగరః |
అతో (అ)నాత్మని రత్యాదేర భావాదేన తత్వవిత్ |
సాక్షాత్కుర్వ న్పరానందముపచార తయోచ్యతే |
ఆత్మరతిరాత్మ తృప్త ఆత్మ సంతుష్ట ఇత్యపి ||“. (గీతాభావప్రకాశము - 3 - 106 to 108, 111 to 114)
(ఇంద్రియములద్వారా సుఖమును పొందువాడు స్రగ్గంధ వనితలు మొదలగువాటియందు రమించును, ఇంద్రియములకు విషయములైనవి లేనప్పుడు దుఃఖించును. సాక్షాత్కారమును పొందినప్పుడు బ్రహ్మానందము ఆ విషయములలో లేనందున ఆ విషయసుఖానుభవము లేనపుడు దుఃఖించును. తత్వమును తెలిసినవాడు - ఆత్మతత్వము తెలిసినవాడు - విషయభోగములవలన కలుగు సుఖములను తుచ్ఛమైనవని వాటిని కోరడు. ఈ విషయములవలన రతి, తృప్తి, తుష్టి యనునవి మనోవృత్తులు - మనోధర్మములు వాటికి సాక్షి అయిన పరమాత్మ వేరుగానున్నాడు. అందుచేత అవి అనాత్మధర్మములు. అనాత్మవస్తువుల సంబంధము వదలించుకొని ఆత్మ సుఖమందే మునిగి జ్ఞాని యైనవాడు అనాత్మ వస్తువులైన విషయ సుఖములందు ఎట్లుమునిగి యుండును? ఆత్మ జ్ఞానము కలవాడు సుఖమునకు సముద్రమువంటిది యగు - ఆనందఘనము, ఆనందమయమగు - ఆత్మయందే రతిని, తృప్తిని, తుష్టిని పొందును. అనాత్మ వస్తువులందు రతి, తుష్టి, తృప్తి అతనికి లేనందున పరమానందరూపమగు నాత్మయందే రతి చేయునని చెప్పబడినది).
(ātmayaṃdē ramiṃcuvāḍu, prītigala vāḍu - svabhāvamucētanē saṃtuṣṭi poṃduvāḍu, tanaṃtaṭa tānē saṃtuṣṭi poṃduvāḍu).
(viṣayamulaṃdukāka ātmayaṃdē - paramātmayaṃdē ramiṃcuvāḍu - niraṃtaramu dhyānamugalavāḍu).
(ātmayaṃdē prītigalavāḍu - bāhya sādhanamulanu apēkṣiṃcunadi krīḍayanipiṃcukonunu. rati yanagā sādhanamu napēkṣiṃcani prīti).
(maṃcigaṃdhamu, pūdaṃḍalu modalagu vāṭiyaṃdukāka ātma yaṃdē ratigalavāḍu).
ātmanaḥ ratiḥ yasya itivā. (ātmaku saṃbaṃdhiṃcina rati galavāḍu).
ātmābhimukhaḥ.
(ātmaviṣayamai abhimukhamainavāḍu, ātmaku saṃbaṃdhiṃcinavāṭiyaṃdu iṣṭamaina vāḍu).
(ātma rūpamaina pratipāṇigā bhagavaṃtuḍē yuṃḍuṭavalana sarvātmuḍaina bhagavaṃtuniyaṃdu rati kaligi yuṃḍuṭa - anagā, vāstavamygā bhagavaṃtuni yaṃdu bhakti kaligiyuṃḍuṭa).
“mōkṣakārēṇa sāmāgryāṃ bhaktirēva garīya sī |
svasvarūpānusaṃdhānaṃ bhaktirityabhidhīyatē ||“.
(eḍategakuṃḍā śuddhamaina ātma svarūpamaṃdu ellapuḍu rati kaligiyuṃḍuṭē ātmarati. iṭṭi ātma rati yaṃdu nityamu uṃḍuṭayē avyaktōpāsakulaina mahānubhāvulu bhaktiyani ceppuduru. ī viṣayamē śrī śaṃkarācāryula vāru ī kriṃda vidhamugā ceppi yuṃḍiri : - mōkṣamunaku kāraṇamagu sādhanamulalō bhaktiyē goppadi, bhagavaṃtuniyokka svasvarūpamunu anusaṃdhānamu cēyuṭayē - nityamu dhyāniṃcuṭayē bhaktiyani ceppabaḍinadi).
ātmanyēvaca saṃtuṣṭaḥ tasyakāryaṃ na vidyatē || (śrīmadbhagavadgīta - 3 - 17)
“ratiṃ yātīṃdriyā rāmaḥ sraggaṃdhavanitā diṣu |
viṣayā ṇāṃ yadhōktānāma bhāvē duḥkhamētica |
sākṣātkṛta nijānaṃdō dvaita dṛṣṭēra bhāvataḥ |
ati tuccatayā bhōgyasukhaṃ nēcchati tatvavit |
- - - manōvṛtti viśēṣā hi syuḥ rati tṛpti tuṣṭayaḥ |
sākṣi siddhā atō (a)nātma dharmāstēṣu kathaṃ budhaḥ |
sajjē tātma sukhē magnō galitā nātmadhīḥ svataḥ |
ātmanyēva sukhāṃbhō dhau svabhāvā dēna tatvavit |
ratiṃ tṛptiṃca, tuṣṭiṃca yātya sau sukhasāgaraḥ |
atō (a)nātmani ratyādēra bhāvādēna tatvavit |
sākṣātkurva nparānaṃdamupacāra tayōcyatē |
ātmaratirātma tṛpta ātma saṃtuṣṭa ityapi ||“. (gītābhāvaprakāśamu - 3 - 106 to 108, 111 to 114)
(iṃdriyamuladvārā sukhamunu poṃduvāḍu sraggaṃdha vanitalu modalaguvāṭiyaṃdu ramiṃcunu, iṃdriyamulaku viṣayamulainavi lēnappuḍu duḥkhiṃcunu. sākṣātkāramunu poṃdinappuḍu brahmānaṃdamu ā viṣayamulalō lēnaṃduna ā viṣayasukhānubhavamu lēnapuḍu duḥkhiṃcunu. tatvamunu telisinavāḍu - ātmatatvamu telisinavāḍu - viṣayabhōgamulavalana kalugu sukhamulanu tucchamainavani vāṭini kōraḍu. ī viṣayamulavalana rati, tṛpti, tuṣṭi yanunavi manōvṛttulu - manōdharmamulu vāṭiki sākṣi ayina paramātma vērugānunnāḍu. aṃducēta avi anātmadharmamulu. anātmavastuvula saṃbaṃdhamu vadaliṃcukoni ātma sukhamaṃdē munigi jñāni yainavāḍu anātma vastuvulaina viṣaya sukhamulaṃdu eṭlumunigi yuṃḍunu? ātma jñānamu kalavāḍu sukhamunaku samudramuvaṃṭidi yagu - ānaṃdaghanamu, ānaṃdamayamagu - ātmayaṃdē ratini, tṛptini, tuṣṭini poṃdunu. anātma vastuvulaṃdu rati, tuṣṭi, tṛpti ataniki lēnaṃduna paramānaṃdarūpamagu nātmayaṃdē rati cēyunani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.