← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ సామ్యం ātma sāmyaṃ

Original — తెలుగు
  1. స్వసమాన రూపతాం.

(తనతో సమానమైన రూపము కలిగియుండుట - ఆత్మలక్షణములతో సమానమైన లక్షణములు గలిగియుండుట).

  1. “నిరుపాధికాత్మస్వరూపం జ్ఞానైకాకారతయా సమం”. (శ్రీ వేదాంత దేశికః)

(ఉపాధితో కూడియుండని ఆత్మ స్వరూపము - జ్ఞానమే ఆకారముగా కలిగియుండుదానితో సమానమైనది - చిద్రూపము - ఆత్మతో సమానమైనది).

  1. “సర్వభూతానాం ప్రకృతి వియుక్తానాం జ్ఞానైకాకార తయా సామ్యం - ప్రకృతి సంసర్గ దోష వినిర్ముక్తం ఆత్మస్వరూపం సమం”.

(శ్రీరామానుజః)

(ప్రకృతితో సంబంధములేనటువంటి స్థితిలోనున్న సమస్త భూతములు ఒకే చిద్రూపమైనందువలన ఆత్మతో సామ్యము - సమానావస్థలో ఉన్నట్లు చెప్పబడును).

  1. నామరూప వినుర్ముక్తస్య ఆత్మ వస్తునః పరస్వరూపసామ్యం అనగమ్యతే.

(నామరూపములు లేనటువంటి ఆత్మ పరతత్వముతో సమానముగా ఉండుట - ప్రకృతి సంబంధములేని ప్రతి ఆత్మయు పరస్పరము ఒకదానికొకటి సమము - భగవంతునితో సమానము).

  1. “ఆత్మ సామ్యే స్థితశ్చేత్ బ్రహ్మణి స్థితా ఏవతే. బ్రహ్మణి స్థిత రేవ సంసార జయః. ఆత్మ సుజ్ఞానైకాకారతయా సామ్యమేవ అనుసంధానాః ముక్తాః దేవ ఇత్యర్థః” (శ్రీరామానుజః)

(ఆత్మ సామ్య స్థితిలో - అత్మతో సమానమైన స్థితిలో ఉన్నారు అనగా బ్రహ్మయందున్నారనియే అర్థము - బ్రహ్మస్థితి. బ్రహ్మయందుండటయే సంసార జయము - ఆత్మజ్ఞానము కలిగియుండుటవలన ఆత్మతో ఏకాకారముగ నుండుటయే - ఆత్మ సామ్యమును అనుసంథానము చేయువారు ముక్తులే).

Transliteration
  1. svasamāna rūpatāṃ.

(tanatō samānamaina rūpamu kaligiyuṃḍuṭa - ātmalakṣaṇamulatō samānamaina lakṣaṇamulu galigiyuṃḍuṭa).

  1. “nirupādhikātmasvarūpaṃ jñānaikākāratayā samaṃ”. (śrī vēdāṃta dēśikaḥ)

(upādhitō kūḍiyuṃḍani ātma svarūpamu - jñānamē ākāramugā kaligiyuṃḍudānitō samānamainadi - cidrūpamu - ātmatō samānamainadi).

  1. “sarvabhūtānāṃ prakṛti viyuktānāṃ jñānaikākāra tayā sāmyaṃ - prakṛti saṃsarga dōṣa vinirmuktaṃ ātmasvarūpaṃ samaṃ”.

(śrīrāmānujaḥ)

(prakṛtitō saṃbaṃdhamulēnaṭuvaṃṭi sthitilōnunna samasta bhūtamulu okē cidrūpamainaṃduvalana ātmatō sāmyamu - samānāvasthalō unnaṭlu ceppabaḍunu).

  1. nāmarūpa vinurmuktasya ātma vastunaḥ parasvarūpasāmyaṃ anagamyatē.

(nāmarūpamulu lēnaṭuvaṃṭi ātma paratatvamutō samānamugā uṃḍuṭa - prakṛti saṃbaṃdhamulēni prati ātmayu parasparamu okadānikokaṭi samamu - bhagavaṃtunitō samānamu).

  1. “ātma sāmyē sthitaścēt brahmaṇi sthitā ēvatē. brahmaṇi sthita rēva saṃsāra jayaḥ. ātma sujñānaikākāratayā sāmyamēva anusaṃdhānāḥ muktāḥ dēva ityarthaḥ” (śrīrāmānujaḥ)

(ātma sāmya sthitilō - atmatō samānamaina sthitilō unnāru anagā brahmayaṃdunnāraniyē arthamu - brahmasthiti. brahmayaṃduṃḍaṭayē saṃsāra jayamu - ātmajñānamu kaligiyuṃḍuṭavalana ātmatō ēkākāramuga nuṃḍuṭayē - ātma sāmyamunu anusaṃthānamu cēyuvāru muktulē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.