మోక్ష ప్రాప్తి.
“త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |
కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ |
ఏ తైర్విముక్తః కౌంతేయ! తమో ద్వారైః త్రిభిర్నరః |
ఆచర త్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం ||” (శ్రీమద్భగవద్గీత - 16 - 21, 22)
(కామము,క్రోధము,లోభము అను ఈ మూడు ఆత్మను అధోగతికి తీసుకొనిపోయి నరకములో ప్రవేశింపచేయుటకు ద్వారము వంటివి. ఈ మూడింటివలన నరకమే కలుగును. అందుచేత ఈ మూడింటిని వదలివేయవలేను. ఈ మూడింటిని వదలివేయుటవలన ఆత్మ శ్రేయస్సు కలుగును, దానివలన పరమపదమును మోక్షమును పొందును).
(ఇల్లు తగులబడుతూ ఉన్నపుడు దానిని ఆర్పుటకు కావలసిన నీటికై అప్పుడు నుయ్యి త్రవ్వ ప్రయత్నము నిష్ఫలము - ఆ ప్రకారముగానే మరణకాలమందు ఆత్మ శ్రేయస్సు కొఱకు చేయుసాధన ప్రయత్నము ఫలించదు -అందుచేత బుద్ధిమంతుడైనవాడు శరీరము ఆరోగ్యముగా ఉన్నపుడే ఆత్మ శ్రేయస్సుకొఱకు సాధనము చేయవలయును).
యా వచ్చేంద్రియశక్తి రప్రతిహతా యావత్ క్షయోనా యుషః |
ఆత్మ శ్రేయసి తావదేవ విధుషాః కార్య ప్రయత్నో మహాన్ |
ప్రోద్దీప్తే భవనేచ కూప ఖననం ప్రత్యుద్య యః కో దృశః ||“. (భర్తృహరి - వైరాగ్య శతకం - 76)
(శరీరము ఆరోగ్యముగా ఉన్నపుడే, ముసలితనము రాక మునుపే, ఇంద్రియముల పటుత్వము తగ్గకమునుపే, ఆయుష్షు క్షీణించకమునుపే పండితులైనవారు - జ్ఞానులైనవారు - ఆత్మ శ్రేయస్సు కొఱకు - ఆత్మనుద్ధరించుటకు, బంధవిముక్తి చేసి మోక్షము చేకూర్చుకొనుటకు - ప్రయత్నించవలెను - మరణము దగ్గరపడినపుడు ప్రయత్నించిన ఫలితముండదు. ఇల్లు కాలుచున్నపుడు దానిని ఆర్పుటకు అప్పుడు నుయ్యి త్రవ్వి ఆ నూతిలోని నీరుతో ఇంటి మంటను ఆర్పుటకు చేయు ప్రయత్నము ఎట్లుండునో మరణకాలమందు ఆత్మ శ్రేయస్సుకొఱకు చేయు ప్రయత్నము అట్లే యుండును - ఫలించదు - ఉపయోగపడదు).
mōkṣa prāpti.
“trividhaṃ narakasyēdaṃ dvāraṃ nāśanamātmanaḥ |
kāmaḥ krōdhastathā lōbhaḥ tasmādētattrayaṃ tyajēt |
ē tairvimuktaḥ kauṃtēya! tamō dvāraiḥ tribhirnaraḥ |
ācara tyātmanaḥ śrēyaḥ tatō yāti parāṃ gatiṃ ||” (śrīmadbhagavadgīta - 16 - 21, 22)
(kāmamu,krōdhamu,lōbhamu anu ī mūḍu ātmanu adhōgatiki tīsukonipōyi narakamulō pravēśiṃpacēyuṭaku dvāramu vaṃṭivi. ī mūḍiṃṭivalana narakamē kalugunu. aṃducēta ī mūḍiṃṭini vadalivēyavalēnu. ī mūḍiṃṭini vadalivēyuṭavalana ātma śrēyassu kalugunu, dānivalana paramapadamunu mōkṣamunu poṃdunu).
(illu tagulabaḍutū unnapuḍu dānini ārpuṭaku kāvalasina nīṭikai appuḍu nuyyi travva prayatnamu niṣphalamu - ā prakāramugānē maraṇakālamaṃdu ātma śrēyassu koṟaku cēyusādhana prayatnamu phaliṃcadu -aṃducēta buddhimaṃtuḍainavāḍu śarīramu ārōgyamugā unnapuḍē ātma śrēyassukoṟaku sādhanamu cēyavalayunu).
yā vaccēṃdriyaśakti rapratihatā yāvat kṣayōnā yuṣaḥ |
ātma śrēyasi tāvadēva vidhuṣāḥ kārya prayatnō mahān |
prōddīptē bhavanēca kūpa khananaṃ pratyudya yaḥ kō dṛśaḥ ||“. (bhartṛhari - vairāgya śatakaṃ - 76)
(śarīramu ārōgyamugā unnapuḍē, musalitanamu rāka munupē, iṃdriyamula paṭutvamu taggakamunupē, āyuṣṣu kṣīṇiṃcakamunupē paṃḍitulainavāru - jñānulainavāru - ātma śrēyassu koṟaku - ātmanuddhariṃcuṭaku, baṃdhavimukti cēsi mōkṣamu cēkūrcukonuṭaku - prayatniṃcavalenu - maraṇamu daggarapaḍinapuḍu prayatniṃcina phalitamuṃḍadu. illu kālucunnapuḍu dānini ārpuṭaku appuḍu nuyyi travvi ā nūtilōni nīrutō iṃṭi maṃṭanu ārpuṭaku cēyu prayatnamu eṭluṃḍunō maraṇakālamaṃdu ātma śrēyassukoṟaku cēyu prayatnamu aṭlē yuṃḍunu - phaliṃcadu - upayōgapaḍadu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.