← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మ విచారము ātma vicāramu

Original — తెలుగు
  1. అమృతత్వ కామేన అద్వైతాత్మ విచార ఏవ వేదాంతవాక్యైః కర్తవ్యః.

(మోక్షమును కోరువాడు వేదాంత వాక్యములద్వారా - వేదాంత భోధను అనుసరించి - అద్వైతాత్మ విచారము - ఆత్మ అనునది ఒకటే, ఉన్నదంతయు అది ఒకటే, రెండవ వస్తువు లేదు అందుచేత ఆత్మ అద్వయము అని ఆత్మ విషయము గుఱించి విచారము చేయవలయును, అవగాహన అగునట్లు ఆలోచించవలెను - అట్లు అలోచించగ తేలిన, నిర్ణయించుకొనిన బ్రహ్మ స్వరూపమే ఆత్మ స్వరూపము).

  1. “గ్రంధ మభ్యస్య మేథావీ విచార్య చ పునః పునః| పలాలమివ ధాన్యార్థీ త్యజేత్ గ్రంధమశేషతః ||”. (పంచదశి)

(బియ్యము కావలయును అను కోరికగలవాడు ధాన్యము మీదనున్న పైపొట్టును తీసివేసినట్టు - బియ్యపు గింజను తీసుకొనునట్లు - ఆత్మవిచారముచేయు ముముక్షువు వేదాంతగ్రంధమును గురువు వద్ద చదివి, ఆ ఉపనిషత్తు లలో చెప్పబడిన విషయముగుఱించి బాగా విచారించి, చదివిన గ్రంధములను వదలివేయవలెను).

Transliteration
  1. amṛtatva kāmēna advaitātma vicāra ēva vēdāṃtavākyaiḥ kartavyaḥ.

(mōkṣamunu kōruvāḍu vēdāṃta vākyamuladvārā - vēdāṃta bhōdhanu anusariṃci - advaitātma vicāramu - ātma anunadi okaṭē, unnadaṃtayu adi okaṭē, reṃḍava vastuvu lēdu aṃducēta ātma advayamu ani ātma viṣayamu guṟiṃci vicāramu cēyavalayunu, avagāhana agunaṭlu ālōciṃcavalenu - aṭlu alōciṃcaga tēlina, nirṇayiṃcukonina brahma svarūpamē ātma svarūpamu).

  1. “graṃdha mabhyasya mēthāvī vicārya ca punaḥ punaḥ| palālamiva dhānyārthī tyajēt graṃdhamaśēṣataḥ ||”. (paṃcadaśi)

(biyyamu kāvalayunu anu kōrikagalavāḍu dhānyamu mīdanunna paipoṭṭunu tīsivēsinaṭṭu - biyyapu giṃjanu tīsukonunaṭlu - ātmavicāramucēyu mumukṣuvu vēdāṃtagraṃdhamunu guruvu vadda cadivi, ā upaniṣattu lalō ceppabaḍina viṣayamuguṟiṃci bāgā vicāriṃci, cadivina graṃdhamulanu vadalivēyavalenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.