← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మభావములు ātmabhāvamulu

Original — తెలుగు
  1. చిత్త వృత్తులు.

  2. “బుద్ధిర్ జ్ఞానమ సం మోహః క్షమా సత్యం దమః శమః |

సుఖం దుఃఖం భవో(అ)భావో భయం చా భయమేవ చ |

అహింసా సమతా తుష్టిః తపో దానం యశో(అ)యశః |

భవంతి భావాః భూతానాం మత్త ఏవ పృధక్ విధాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 4, 5)

(బుద్ధి, జ్ఞానము, అసమ్మోహము, క్షమ, సత్యము, దమము, శమము, సుఖము, దుఃఖము, జన్మము, నాశము, భయము, అభయము, అహింస, సమతా, తుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, - ఇవన్నియు ఆత్మభావములు - మనస్సులో పుట్టినవి. ఇవన్నియు భగవంతిని వలననే కలుగుచున్నవి - భగవంతుడు మనస్సులో ఉండుటవలననే కలుగుచున్నవి)

“ఏతే బుద్ధా దయో భావాః కార్య భేదాః సహేతుకాః |

ధర్నా ధర్మాది హేతూనాం వైచిత్రేణ పృథక్ విధాః |

సర్వేషాం ప్రాణినాం మత్తోభవంతి పరమేశ్వరాత్ ||“. (గీతాభావప్రకాశము - 10 - 24, 25)

(పైన చెప్పబడిన బుద్ధి మొదలగు భావములన్నియు సమస్త ప్రాణులకు మనసులో పుట్టినవి. ఆత్మ అనగా ఇక్కడ మనస్సు - అందుచేత ఆత్మభావములు - భవము అనగా పుట్టుట - ఇవి కార్యములు - వీటికి కారణము మనస్సు. ఈ భావములన్నియు సమస్త ప్రాణులకు భగవంతుని వలన కలుగుచున్నవి).

  1. “ఏ చైవ సాత్వికాభావా రాజసా స్తామసాశ్చ యే |

మత్త ఏవేతి తాన్ విద్ధి - - - ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 12)

(రాజసభావములు, సాత్వికభావములు, తామస్భావములు నా వలననే - భగవంతునివలననే కలుగుచున్నవి).

“భావాశ్చిత్త పరిణామాః సాత్వికాయే శమాదయః |

రాజసా హర్ష దర్పాద్యా మోహాద్యా స్తామ సాశ్చయే |

విద్యకర్మాది వశతో జాయంతే దేహినాం హితాన్ |

మత్తస్సర్వేశ్వరా త్సర్వాన్ జాయ మానా నవేహి భోః ||. (గీతాభావప్రకాశము - 7 - 65,66)

(భావములనగా చిత్తపరిణామములు; చిత్తమే ఇన్ని విధములుగా పరిణమించుచున్నది,మారుచున్నది కనుక ఇవి చిత్తపరిణామములు - ఆత్మభావములు. ఆత్మ అనగా చిత్తమని ఇక్కడ అర్థము. శమము, దమము మొదలగునవి సాత్వికభావములు; హర్షము - సంతోషము - దర్పము మొదలగునవి రాజసభావములు, - రాజస గుణమువలన కలిగినవి; మోహము మొదలగునవి తామస భావములు - తామస గుణమువలన కలిగినవి. ఇవి కర్మఫలముననుసరించి కలుగునవి. ఇవన్నియు భగవంతుని వలననే కలుగుచున్నవి. వారి వారి కర్మానుసారము భగవంతుడు వారి మనస్సులోనుండి ఆయా గుణములను కలిగించి ఆయా కర్మలను చేయుటకు తన చైతన్యముచేత చేయించుచుండును).

  1. “మహర్షయః సప్త పూర్వే, చత్వారో మనవస్తథా |

మద్భావాః మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః ||“. (శ్రీమద్భగవద్గీత - 10 - 6)

“వేద వేదార్థ ద్రష్టారః సర్వజ్ఞా యేమహర్షయః |

సర్గావకాలే సంభూతాః సంప్రదాయ ప్రవర్తకాః |

సావర్ణా మనవస్తద్వ చ్చత్వారో యదివా (అ)పరే |

సప్త భృగ్వాదయస్తేభ్యః ప్రధమాః సనకాదయః |

స్వాయంభువాదయ స్తద్వన్మనవో యే చతుర్దశ |

మ యీశే భావనా యేషాం మచ్చింతన పరాహితే |

మద్భావనా వశాదావిర్భూతా నతు యోని సముద్భవాః |

అతో విశుద్ధ జన్మత్వాత్ సర్వప్రాణివరా మతాః |

పాదుర్భూతాహి సర్గాదౌ మత్తో విశ్వ సృగాత్మనః ||“. (గీతాభావప్రకాశము - 10 - 26 to 30 )

(వేదములను వేదార్థములను తమ దివ్యదృష్టితో గ్రహించి లోకమునకు అందచేసిన సర్వజ్ఞులైన సప్తమహా ఋషులు సృష్టి ప్రారంభములో వారి సాంప్రదాయమును ప్రవర్తింప చేసినవారు భృగువు మొదలగు ఋషు లును, సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులు అనువారును, స్వాయంభువుడు మొదలగు పదు నలుగురు మనువులు - వీరందఱు ఈశ్వరుడనైన నాయందే ధ్యానముగలవారు - నాయందే భావముగలవారు - కునుక 'మద్భావాః' అని చెప్పబడిరి. నేను భావించనంతమాత్రమున - నేను తలచుకున్నంత మాత్రమున, నా సంకల్పమాత్రమున పుట్టినవారు - అందుచేత 'మద్భావాః' (నా వలన, నానుండి పుట్టినవారు). వీరు నా సంకల్పమాత్రమున పుట్టినవారు కనుక ప్రపంచములోని ఇతర జీవులవలె యోనిద్వారా పుట్టినవారు కారు. ప్రపంచమును సృష్టిచేయు నుద్దేశముతోనున్న నానుండి సృష్టి ప్రారంభములో పుట్టినవారు. వీరివలన ప్రపంచములో మానవసృష్టి కలిగినది. అందుచేత వీరు ఆత్మభావులు - పరమాత్మనుండి పుట్టినవారు, వారినుండి లోకములో పుట్టినవారు ఆత్మభావులే).

  1. ఆత్మానం భావయతి ప్రకాశయతి ఇతి ఆత్మభావం .

(ఆత్మను ప్రకాశింప చేయుట; ధ్యానము).

  1. ఆత్మనః మనసః భావం - సద్భావం -

(మనసులోని భావము, మనస్సంకల్పము; సత్సంకల్పము).

  1. ఆత్మనః స్వభావం, స్వతస్సిద్ధ రూపం, నిర్దోషత్వం -

(ఆత్మస్వభావము - ప్రకృతి, దాని పరిణామములు ఆత్మను కలియక ఉండునప్పటి రూపము, లక్షణము - దోషము లేకుండనుండుట. ఆత్మ ప్రకృతితోను, దాని పరిణామములతోను కలిసియుండుటవలననే ప్రకృతియొక్కదోషములు అత్మకు ఉన్నట్లు అనిపించును. కాని ఆత్మ స్వతః శుద్ధము - ఏ విధమైన దోషము లేనిది).

Transliteration
  1. citta vṛttulu.

  2. “buddhir jñānama saṃ mōhaḥ kṣamā satyaṃ damaḥ śamaḥ |

sukhaṃ duḥkhaṃ bhavō(a)bhāvō bhayaṃ cā bhayamēva ca |

ahiṃsā samatā tuṣṭiḥ tapō dānaṃ yaśō(a)yaśaḥ |

bhavaṃti bhāvāḥ bhūtānāṃ matta ēva pṛdhak vidhāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 4, 5)

(buddhi, jñānamu, asammōhamu, kṣama, satyamu, damamu, śamamu, sukhamu, duḥkhamu, janmamu, nāśamu, bhayamu, abhayamu, ahiṃsa, samatā, tuṣṭi, tapassu, dānamu, kīrti, apakīrti, - ivanniyu ātmabhāvamulu - manassulō puṭṭinavi. ivanniyu bhagavaṃtini valananē kalugucunnavi - bhagavaṃtuḍu manassulō uṃḍuṭavalananē kalugucunnavi)

“ētē buddhā dayō bhāvāḥ kārya bhēdāḥ sahētukāḥ |

dharnā dharmādi hētūnāṃ vaicitrēṇa pṛthak vidhāḥ |

sarvēṣāṃ prāṇināṃ mattōbhavaṃti paramēśvarāt ||“. (gītābhāvaprakāśamu - 10 - 24, 25)

(paina ceppabaḍina buddhi modalagu bhāvamulanniyu samasta prāṇulaku manasulō puṭṭinavi. ātma anagā ikkaḍa manassu - aṃducēta ātmabhāvamulu - bhavamu anagā puṭṭuṭa - ivi kāryamulu - vīṭiki kāraṇamu manassu. ī bhāvamulanniyu samasta prāṇulaku bhagavaṃtuni valana kalugucunnavi).

  1. “ē caiva sātvikābhāvā rājasā stāmasāśca yē |

matta ēvēti tān viddhi - - - ||“. (śrīmadbhagavadgīta - 7 - 12)

(rājasabhāvamulu, sātvikabhāvamulu, tāmasbhāvamulu nā valananē - bhagavaṃtunivalananē kalugucunnavi).

“bhāvāścitta pariṇāmāḥ sātvikāyē śamādayaḥ |

rājasā harṣa darpādyā mōhādyā stāma sāścayē |

vidyakarmādi vaśatō jāyaṃtē dēhināṃ hitān |

mattassarvēśvarā tsarvān jāya mānā navēhi bhōḥ ||. (gītābhāvaprakāśamu - 7 - 65,66)

(bhāvamulanagā cittapariṇāmamulu; cittamē inni vidhamulugā pariṇamiṃcucunnadi,mārucunnadi kanuka ivi cittapariṇāmamulu - ātmabhāvamulu. ātma anagā cittamani ikkaḍa arthamu. śamamu, damamu modalagunavi sātvikabhāvamulu; harṣamu - saṃtōṣamu - darpamu modalagunavi rājasabhāvamulu, - rājasa guṇamuvalana kaliginavi; mōhamu modalagunavi tāmasa bhāvamulu - tāmasa guṇamuvalana kaliginavi. ivi karmaphalamunanusariṃci kalugunavi. ivanniyu bhagavaṃtuni valananē kalugucunnavi. vāri vāri karmānusāramu bhagavaṃtuḍu vāri manassulōnuṃḍi āyā guṇamulanu kaligiṃci āyā karmalanu cēyuṭaku tana caitanyamucēta cēyiṃcucuṃḍunu).

  1. “maharṣayaḥ sapta pūrvē, catvārō manavastathā |

madbhāvāḥ mānasā jātāḥ yēṣāṃ lōka imāḥ prajāḥ ||“. (śrīmadbhagavadgīta - 10 - 6)

“vēda vēdārtha draṣṭāraḥ sarvajñā yēmaharṣayaḥ |

sargāvakālē saṃbhūtāḥ saṃpradāya pravartakāḥ |

sāvarṇā manavastadva ccatvārō yadivā (a)parē |

sapta bhṛgvādayastēbhyaḥ pradhamāḥ sanakādayaḥ |

svāyaṃbhuvādaya stadvanmanavō yē caturdaśa |

ma yīśē bhāvanā yēṣāṃ macciṃtana parāhitē |

madbhāvanā vaśādāvirbhūtā natu yōni samudbhavāḥ |

atō viśuddha janmatvāt sarvaprāṇivarā matāḥ |

pādurbhūtāhi sargādau mattō viśva sṛgātmanaḥ ||“. (gītābhāvaprakāśamu - 10 - 26 to 30 )

(vēdamulanu vēdārthamulanu tama divyadṛṣṭitō grahiṃci lōkamunaku aṃdacēsina sarvajñulaina saptamahā ṛṣulu sṛṣṭi prāraṃbhamulō vāri sāṃpradāyamunu pravartiṃpa cēsinavāru bhṛguvu modalagu ṛṣu lunu, sanaka, sanaṃdana, sanatkumāra, sanatsu jātulu anuvārunu, svāyaṃbhuvuḍu modalagu padu naluguru manuvulu - vīraṃdaṟu īśvaruḍanaina nāyaṃdē dhyānamugalavāru - nāyaṃdē bhāvamugalavāru - kunuka 'madbhāvāḥ' ani ceppabaḍiri. nēnu bhāviṃcanaṃtamātramuna - nēnu talacukunnaṃta mātramuna, nā saṃkalpamātramuna puṭṭinavāru - aṃducēta 'madbhāvāḥ' (nā valana, nānuṃḍi puṭṭinavāru). vīru nā saṃkalpamātramuna puṭṭinavāru kanuka prapaṃcamulōni itara jīvulavale yōnidvārā puṭṭinavāru kāru. prapaṃcamunu sṛṣṭicēyu nuddēśamutōnunna nānuṃḍi sṛṣṭi prāraṃbhamulō puṭṭinavāru. vīrivalana prapaṃcamulō mānavasṛṣṭi kaliginadi. aṃducēta vīru ātmabhāvulu - paramātmanuṃḍi puṭṭinavāru, vārinuṃḍi lōkamulō puṭṭinavāru ātmabhāvulē).

  1. ātmānaṃ bhāvayati prakāśayati iti ātmabhāvaṃ .

(ātmanu prakāśiṃpa cēyuṭa; dhyānamu).

  1. ātmanaḥ manasaḥ bhāvaṃ - sadbhāvaṃ -

(manasulōni bhāvamu, manassaṃkalpamu; satsaṃkalpamu).

  1. ātmanaḥ svabhāvaṃ, svatassiddha rūpaṃ, nirdōṣatvaṃ -

(ātmasvabhāvamu - prakṛti, dāni pariṇāmamulu ātmanu kaliyaka uṃḍunappaṭi rūpamu, lakṣaṇamu - dōṣamu lēkuṃḍanuṃḍuṭa. ātma prakṛtitōnu, dāni pariṇāmamulatōnu kalisiyuṃḍuṭavalananē prakṛtiyokkadōṣamulu atmaku unnaṭlu anipiṃcunu. kāni ātma svataḥ śuddhamu - ē vidhamaina dōṣamu lēnidi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.