← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మహనః ātmahanaḥ

Original — తెలుగు
  1. జన్మ నాశ వంతః.

(జన్మను నాశము చేయువారు - బలవంతముగా తమ ప్రాణములను తామే పోగొట్టుకొనువారు).

  1. పుత్ర హంతా = (ఆత్మ అనగా పుత్రుడు అని అర్థము (ఆత్మజుడు) - అందుచేత పుత్రుని చంపినవాడు).

  2. ఆత్మ ఘాతినః - అసదుపాసనయా దేహాద్యుపలాలనేన ఆత్మహనః -

(ఆత్మను చంపువారు - ఆత్మగాని అసద్వస్తువులను ఉపాసించుటవలన - అనగా దేహము మొదలగు అనాత్మ వస్తువులను కొలుచుటవలన ఆత్మను చంపినవారగుచున్నారు - అట్టివారు ఆత్మ హంతకులు -

  1. శబ్దాది విషయ సేవయా, విషయ సేవాయాః అంతతః స్థావరత్వాపాదకతయా ఆత్మనః త్రాసార తాపాదకత్వాత్ తత్సే వా పరాః ఆత్మ ఘాతినః ఏవ.

(శబ్ద స్పర్శరూపరసగంధములను విషయములను అనుభవించుటవలన అవియే స్థిత్రముగనుండునవి అని నమ్మి ఆత్మను తిరస్కరించుటవలన అట్టివారు ఆత్మఘాతకులు).

  1. ఆత్మానం తత్స్వరూపభూత సత్య జ్ఞానానంద తిరస్కారేణ దుఃఖిత్వాద్యారోపణేన చ ఘ్నంతి హింసంతి ఇత్యాత్మహనః, అవిద్వాంసః.

(సత్యజ్ఞానందములు ఆత్మ లక్షణములుకావని, దుఃఖమే దాని లక్షణమని ఆరోపణ చేయుటవలన ఆత్మను హింసించువారు ఆత్మ హంతకులు - ఆత్మజ్ఞానము లేనివారు - అవిద్వాంసులు - విద్వాంసులుకానివారు).

  1. ” ఆత్మానం ఘ్నంతి ఇతి ఆత్మహనః - యే జనాః అవిద్వాంసః అవిద్యా దోషేణ విద్యమానస్య ఆత్మనః తిరస్కారణాత్ విద్యమానస్య యత్కార్యం ఫలం అజరామరత్వాది సంవేదనాదిలక్షణం తత్ హతస్యేవ తిరోభూతం భవతి ఇతి ప్రాకృతాః. అవిద్వాంసో జనాః ఆత్మహనః ఉచ్యంతే ” (శ్రీ శంకరః)

(ఆత్మను చంపువారు, హింసించువారు ఆత్మహంతకులు, అజ్ఞానులు, అవిద్యాదోషముచేత, ఆత్మ యనినదిలేదని తిరస్కరించుటచేత, ఆత్మ జన్మ మరణములు లేనిది అను జ్ఞానము చంపబడినదానివలె తిరోభూతమగును. అందుచేత అజ్ఞానులైన ప్రాకృత జనులు ఆత్మ హంతకులు అని చెప్పబడుచున్నారు).

  1. ఆత్మహం తృత్వస్య ఉదరభేదిని ప్రసిద్ధేః కథం అవిద్వాంస ఆత్మనః ఇత్యాహ - ఉదరభేదినో ఆధ్యాత్మాధికారే ప్రసంగా భావాత్. అశుద్ధత్వాధ్యానేన తిర్స్కార ఏవ ఆత్మహిం తృత్వం ఇతి. యథా కస్య చిత్ శుద్ధస్య మిథ్యాభిశాపో అశస్త్రవధ ఉచ్యతే, తద్వత్. ఆత్మని పాపిత్వాది అథ్యాసోపి హింసా ఇత్యర్థః - అజరామరణత్వాదిలక్షణో అహం ఇతి సంవేదనః అభిధానంచ యత్కార్యం తదపి హితస్య ఇవ సదృశ్యతే ఇతి హనం ఉపచర్యతే “.

(ఉదరభేదినులే - కడుపుకొట్టేవారే - ఆత్మహంతకులు అని ప్రసిద్ధియున్నది. అందుచేత విద్చాన్సులుకానివారు, అజ్ఞానులు ఆత్మహంతకులు ఎట్లగుదురు అనగా - ఆధ్యాత్మవిషయములో ఉదరభేదినుల ప్రసంగము లేదు - అశుద్ధమైన అధ్యాస కలిగియుండుటవలన తిరస్కారమే ఆత్మహంతృత్వము, ఆత్మను చంపుకొనుట యనబడును - ఆ ప్రకారమే వాక్శుద్ధిగలవాడు ఇంకొకనికి ఇచ్చిన శాపము ఆయుధముతో చేయని హత్య (ఆయుధముతో చంపకపోయినను) హత్యయే అని చెప్పబడుచున్నది. ఆ ప్రకారముగానే ఆత్మయడల పాపముచేయుట మొదలగు అధ్యాసము కలుగచేయుట హింసయే. ముసలితనము, మరణము లేనివాడను నేను అను ఆత్మ అక్షణములు విస్మరించుట ఆత్మహత్యచేసినట్లే యగును. అట్లు చేయువారు ఆత్మహంతకులు).

  1. “లబ్ధ్వాకథం చిన్నర జన్మ దుర్లభం తత్రావిపుంస్త్వం శ్రుతిపారదర్శనం

యస్యాత్మ ముక్తౌ న యతేత మూఢ ధీః స్వహ్యాత్మహా స్వ నిహంత్య సద్గ్రహాత్ ||“. (శ్రీ శంకరః - ‘వివేకచూడామణి’)

(ఎట్లో - అతికష్టముమీద దుర్లభమైన నరజన్మమెత్తి, పైగా వేదాంతజ్ఞానము కలిగిన పురుష పురుష జన్మమెత్తియుండియు ఎవడు ఆత్మముక్తి కొఱకు - ఆత్మను తరింప చేయుటకు - ప్రయత్నము చేయడో, అట్టి మూఢబుద్ధి కలవాడు అసత్ పదార్థమును గ్రహించుటవలన ఆత్మహంత).

  1. “హినస్తి హింసాకరోతి ఆత్మనా స్వేనైవ స్వం ఆత్మానం - అజ్ఞానం ఆత్మ తిరస్కరణోపపత్తేః సర్వోహి అజ్ఞః. అత్యంతప్రసిద్ధం సాక్షాదపరోక్షం ఆత్మానం తిరస్కృశ్త్య అనాత్మనం ఆత్మత్వేన పరిగృష్య తమపి ధర్మా ధర్మౌ కృత్వా ఉపాత్తం ఆత్మానం హత్వా అన్య,ం ఆత్మానం ఉపాదత్తే నవం, తమపి హిత్వా అన్యం, ఇత్యేవం ఉపాత్తః ఉపాత్తం ఆత్మానం హంతి ఇతి ఆత్మహా సర్వః అజ్ఞః. యస్తు పరమార్థాత్మా అసౌ అపి సర్వదా అవిద్యయా హతః ఏవ, విద్యమాన ఫలాభావాత్, ఇతి సర్వే ఆత్మహనః ఏవ అవిద్వాంసః. యస్తు ఇతరః యధోక్త ఆత్మదర్శీ సః ఉభయథాపి ఆత్మనా ఆత్మానం స హినస్తి నహంతి” (శ్రీ శంకరః )

(తన ఆత్మను తానేహింసించుకొనుట ఆత్మహత్య. ఆత్మను తిరస్కరించుట అజ్ఞానమువలన కలుగునది. అత్యంత ప్రసిద్ధమై సాక్షాత్ అపరోక్షమైన (తన యెదుటనే యున్న) (తనలోనే ప్రత్యక్షముగా నున్న) ఆత్మను తిరస్క రించి అనాత్మ వస్తువును ఆత్మయని పరిగ్రహించి, దానిని వదలివేసి మఱియొక అనాత్మవస్తువును కొత్త దానిని గ్రహించి, దానిని వదలి,మఱియొక దానిని గ్రహించి, ఈ ప్రకారముగా ఒకదాని తర్వాత నొకటిని విడుచుచూండుటచేత తన ఆత్మను హింసించుకొనును. అట్టి అజ్ఞుడు ఆత్మహంతకుడు, ఈ ప్రకారము ఆత్మ అవిద్యచేత - అజ్ఞానముచేత ఎల్లపుడు హింసింపబడుచునే యుండును. ఆత్మదర్శి అయినవాడు తన ఆత్మను తాను హింసింపడు).

  1. “ఆ సుర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః |

తాం స్తే ప్రత్యాభి గచ్ఛంతి యే కే చాత్మహనో జనాః ||“. (ఈ శానశ్యోపనిషత్)

(ఆత్మహంతకులైన జనులు అంధతమసముచేత - అంధతామిశ్రముచేత ఆవృతమైన లోకములను పొందుదురు). (చూడుము - “అసూర్య లోకాః”).

Transliteration
  1. janma nāśa vaṃtaḥ.

(janmanu nāśamu cēyuvāru - balavaṃtamugā tama prāṇamulanu tāmē pōgoṭṭukonuvāru).

  1. putra haṃtā = (ātma anagā putruḍu ani arthamu (ātmajuḍu) - aṃducēta putruni caṃpinavāḍu).

  2. ātma ghātinaḥ - asadupāsanayā dēhādyupalālanēna ātmahanaḥ -

(ātmanu caṃpuvāru - ātmagāni asadvastuvulanu upāsiṃcuṭavalana - anagā dēhamu modalagu anātma vastuvulanu kolucuṭavalana ātmanu caṃpinavāragucunnāru - aṭṭivāru ātma haṃtakulu -

  1. śabdādi viṣaya sēvayā, viṣaya sēvāyāḥ aṃtataḥ sthāvaratvāpādakatayā ātmanaḥ trāsāra tāpādakatvāt tatsē vā parāḥ ātma ghātinaḥ ēva.

(śabda sparśarūparasagaṃdhamulanu viṣayamulanu anubhaviṃcuṭavalana aviyē sthitramuganuṃḍunavi ani nammi ātmanu tiraskariṃcuṭavalana aṭṭivāru ātmaghātakulu).

  1. ātmānaṃ tatsvarūpabhūta satya jñānānaṃda tiraskārēṇa duḥkhitvādyārōpaṇēna ca ghnaṃti hiṃsaṃti ityātmahanaḥ, avidvāṃsaḥ.

(satyajñānaṃdamulu ātma lakṣaṇamulukāvani, duḥkhamē dāni lakṣaṇamani ārōpaṇa cēyuṭavalana ātmanu hiṃsiṃcuvāru ātma haṃtakulu - ātmajñānamu lēnivāru - avidvāṃsulu - vidvāṃsulukānivāru).

  1. ” ātmānaṃ ghnaṃti iti ātmahanaḥ - yē janāḥ avidvāṃsaḥ avidyā dōṣēṇa vidyamānasya ātmanaḥ tiraskāraṇāt vidyamānasya yatkāryaṃ phalaṃ ajarāmaratvādi saṃvēdanādilakṣaṇaṃ tat hatasyēva tirōbhūtaṃ bhavati iti prākṛtāḥ. avidvāṃsō janāḥ ātmahanaḥ ucyaṃtē ” (śrī śaṃkaraḥ)

(ātmanu caṃpuvāru, hiṃsiṃcuvāru ātmahaṃtakulu, ajñānulu, avidyādōṣamucēta, ātma yaninadilēdani tiraskariṃcuṭacēta, ātma janma maraṇamulu lēnidi anu jñānamu caṃpabaḍinadānivale tirōbhūtamagunu. aṃducēta ajñānulaina prākṛta janulu ātma haṃtakulu ani ceppabaḍucunnāru).

  1. ātmahaṃ tṛtvasya udarabhēdini prasiddhēḥ kathaṃ avidvāṃsa ātmanaḥ ityāha - udarabhēdinō ādhyātmādhikārē prasaṃgā bhāvāt. aśuddhatvādhyānēna tirskāra ēva ātmahiṃ tṛtvaṃ iti. yathā kasya cit śuddhasya mithyābhiśāpō aśastravadha ucyatē, tadvat. ātmani pāpitvādi athyāsōpi hiṃsā ityarthaḥ - ajarāmaraṇatvādilakṣaṇō ahaṃ iti saṃvēdanaḥ abhidhānaṃca yatkāryaṃ tadapi hitasya iva sadṛśyatē iti hanaṃ upacaryatē “.

(udarabhēdinulē - kaḍupukoṭṭēvārē - ātmahaṃtakulu ani prasiddhiyunnadi. aṃducēta vidcānsulukānivāru, ajñānulu ātmahaṃtakulu eṭlaguduru anagā - ādhyātmaviṣayamulō udarabhēdinula prasaṃgamu lēdu - aśuddhamaina adhyāsa kaligiyuṃḍuṭavalana tiraskāramē ātmahaṃtṛtvamu, ātmanu caṃpukonuṭa yanabaḍunu - ā prakāramē vākśuddhigalavāḍu iṃkokaniki iccina śāpamu āyudhamutō cēyani hatya (āyudhamutō caṃpakapōyinanu) hatyayē ani ceppabaḍucunnadi. ā prakāramugānē ātmayaḍala pāpamucēyuṭa modalagu adhyāsamu kalugacēyuṭa hiṃsayē. musalitanamu, maraṇamu lēnivāḍanu nēnu anu ātma akṣaṇamulu vismariṃcuṭa ātmahatyacēsinaṭlē yagunu. aṭlu cēyuvāru ātmahaṃtakulu).

  1. “labdhvākathaṃ cinnara janma durlabhaṃ tatrāvipuṃstvaṃ śrutipāradarśanaṃ

yasyātma muktau na yatēta mūḍha dhīḥ svahyātmahā sva nihaṃtya sadgrahāt ||“. (śrī śaṃkaraḥ - ‘vivēkacūḍāmaṇi’)

(eṭlō - atikaṣṭamumīda durlabhamaina narajanmametti, paigā vēdāṃtajñānamu kaligina puruṣa puruṣa janmamettiyuṃḍiyu evaḍu ātmamukti koṟaku - ātmanu tariṃpa cēyuṭaku - prayatnamu cēyaḍō, aṭṭi mūḍhabuddhi kalavāḍu asat padārthamunu grahiṃcuṭavalana ātmahaṃta).

  1. “hinasti hiṃsākarōti ātmanā svēnaiva svaṃ ātmānaṃ - ajñānaṃ ātma tiraskaraṇōpapattēḥ sarvōhi ajñaḥ. atyaṃtaprasiddhaṃ sākṣādaparōkṣaṃ ātmānaṃ tiraskṛśtya anātmanaṃ ātmatvēna parigṛṣya tamapi dharmā dharmau kṛtvā upāttaṃ ātmānaṃ hatvā anya,ṃ ātmānaṃ upādattē navaṃ, tamapi hitvā anyaṃ, ityēvaṃ upāttaḥ upāttaṃ ātmānaṃ haṃti iti ātmahā sarvaḥ ajñaḥ. yastu paramārthātmā asau api sarvadā avidyayā hataḥ ēva, vidyamāna phalābhāvāt, iti sarvē ātmahanaḥ ēva avidvāṃsaḥ. yastu itaraḥ yadhōkta ātmadarśī saḥ ubhayathāpi ātmanā ātmānaṃ sa hinasti nahaṃti” (śrī śaṃkaraḥ )

(tana ātmanu tānēhiṃsiṃcukonuṭa ātmahatya. ātmanu tiraskariṃcuṭa ajñānamuvalana kalugunadi. atyaṃta prasiddhamai sākṣāt aparōkṣamaina (tana yeduṭanē yunna) (tanalōnē pratyakṣamugā nunna) ātmanu tiraska riṃci anātma vastuvunu ātmayani parigrahiṃci, dānini vadalivēsi maṟiyoka anātmavastuvunu kotta dānini grahiṃci, dānini vadali,maṟiyoka dānini grahiṃci, ī prakāramugā okadāni tarvāta nokaṭini viḍucucūṃḍuṭacēta tana ātmanu hiṃsiṃcukonunu. aṭṭi ajñuḍu ātmahaṃtakuḍu, ī prakāramu ātma avidyacēta - ajñānamucēta ellapuḍu hiṃsiṃpabaḍucunē yuṃḍunu. ātmadarśi ayinavāḍu tana ātmanu tānu hiṃsiṃpaḍu).

  1. “ā suryā nāmatē lōkāḥ aṃdhēna tamasāvṛtāḥ |

tāṃ stē pratyābhi gacchaṃti yē kē cātmahanō janāḥ ||“. (ī śānaśyōpaniṣat)

(ātmahaṃtakulaina janulu aṃdhatamasamucēta - aṃdhatāmiśramucēta āvṛtamaina lōkamulanu poṃduduru). (cūḍumu - “asūrya lōkāḥ”).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.