← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మైశ్వర్యం ātmaiśvaryaṃ

Original — తెలుగు
  1. ఆత్మనః ఐశ్వర్యం, అసంసారిత్వం.

(ఆత్మయొక్క ఈశ్వరత్వము, ప్రభుత్వము, అన్నింటికి ప్రభువై యుండుట - సంసారమును పొందక యుండుట, సంసారమునకు అతీతుడై యుండుట). (పరమాత్మ సృష్టి అంతటికీ ఈశ్వరుడు, ప్రభువు - అట్టి ఈశ్వరుని ప్రభావము - పరమేశ్వరత్వము).

  1. పరమాత్మ భగవంతుడు - భగవంతుడనగా “జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభిః సంపన్నః”. (శ్రీ శంకరః)

(జ్ఞానము. ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు అను ఆరు గుణములుగలవాడు. (చూడుము - “భగవంతుడు”).

  1. “పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుని ఐశ్వర్యము - ఈశ్వరత్వము - ఈశ్వరత్వ లక్ల్షణములు శ్రీమద్భగవద్గీతలో కొన్ని చెప్పబడినవి, అవి ఏవి అనగా : -

“పశ్యమే యోగమైశ్వర్యం |”;

“హరిః | దర్శయా మాస పార్థాయ పరమం రూపమైశ్వరం ||” (11 - 9);

“దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా |

యదిభాః సదృశీ సాస్యాద్భాస స్తస్య మహాత్మనః |

తత్రైకస్థం జగత్కృస్నం ప్రవిభక్తమనేకథా |

అపశ్యద్దేవ దేవ దేవస్య శరీరే పాండవస్థథా ||“. (23 - 24);

“అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామిత్వాం సర్వతో (అ) నంతరూపం” || (11 - 16);

“త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిథానం |

త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతోమే” ||(11 - 18);

అనాదిమధ్యాంత మనంతవీర్యమనంత బాహుం - - - |

“పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం || (11 - 19)

“ద్యావా పృధివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |” (11 - 20);

- - - “రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహు బాహూరుపా దం |

బహూదరం బహుదమ్ష్ట్రాకరాళం - - - (11 - 23);

“యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః |

తధైవ నాశాయ విశంతి లోకాస్త వాపివక్త్రాణి సమృద్ధ వేగాః ||” (11 - 29);

“అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్పరం యత్ |

త్వమాది దేవః పురుషః పురాణః - - (11 - 37, 38);

” అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషితతోసి సర్వః |” (11 - 40).

(ఇవి అర్జునిని వచనములు).

“ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభి ధీయతే |

యేతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విథః |

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత|” (13 - 1, 2);

“అనాది మత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే | (13 - 2);

“సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం |

అసక్తం సర్వభూతేషు నిర్గుణం గుణభోక్తృచ |

బహిరంతశ్చ భూతానామచరం చరమేవచ |

సూక్ష్మత్వాత్త విజ్ఞేయం దూరస్థం చాంతి కే చ తత్ |

అవిభక్తం చ భూతేషు విభక్త మివచ స్థితం |” (13 - 14 to 15);

“అనాదిత్వా న్నిర్గుణత్వాత్పరమాత్మాయమ వ్యయం” (13 - 31).

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానా మధర్మస్య తదాత్మానం సృజామ్యహం ||

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం |

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||“. (4 - 6, 7).

“యథా సర్వగతం సౌక్ష్మ్యా దాకాశం నోపలిప్యతే |

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే |

సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ||” (13 - 32).

“మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం |

సంభవః సర్వభూతానాం తతో భవతి బారతి |

సర్వయోనిషు కౌతేయ మూర్తయః సంభవంతి యాః |

తాషాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా|” (14 - 3) (14 - 4);

“యద్గత్వాన నివర్తంతే తద్థామ పరమం మమ |

మమైవాంశో జీవ లోకే జీవభూతః సనాతనః| ” - (15 - 6, 7);

“యదాదిత్యగతం తేజో జగద్భాసయతే(అ)ఖిలం |

యచ్ఛంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధిమామకం ||

గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |

పుష్ణామి చౌషధిః సర్వాః సోమో భూత్వారసాత్మకః |

అహం వైశ్వాచరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |

ప్రాణాపాన సమాయుక్తం పచామూన్నం చతుర్విధం | (15 - 13 to 15);

“ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మ్నేత్యుదాహృతః |

యో లోకత్రయమా విశ్వబిభర్త్య వ్యయ ఈశ్వరః ||” (15 - 27);

“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే (అ)ర్జున తిష్టతి |

భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||” (18 - 61);

“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||” (18 - 66).

(ఇవి శ్రీకృష్ణభగవానుని వచనములు). (చూడుము - ‘ఆత్మ లక్షణములు’ - 3).

(“నా ఈశ్వరత్య యోగమును చూడుము”; శ్రీకృష్ణుడు అర్జునుని కొఱకు తన ఐశ్యర్యరూపము - అన్నింటికిని ప్రభుత్వమును తెలియచేయు రూపమును - చూపించెను“;”ఆకాశమందు వేలకొలది సూర్యులు ఒక్కమారున ఉదయించినపుడు కలుగుకాంతి భగవంతునియొక్క కాంతికి సమానము కావచ్చును - ఆ దేవదేవుని శరీరమందు అనేకరూపములుగా విభక్తమై ఒకటిగా అయియున్న జగత్తు అంతటిని అర్జునుడుచూచెను“;”అనేక బాహువులు, ఉదరములు, వక్త్రములు, నేత్రములు కలిగి అంతములేనట్టి నీ రూపమును అంతటను చూచుచున్నాను“;”నీవు క్షీణించి నశించనివాడవు, ఉత్కృష్టమైనవాడవు; ఈ ప్రపంచమంతకును గొప్ప నిధానమైనవాడవు; శాశ్వత ధర్మమును రక్షించువాడవు, సనాతనమైన పురుషుడవు“;”ఆదిమధ్యాంతములు - జనన,స్థితి, మరణములు లేనివాడవు, అంతములేని వీర్యము గలవాడవు, అంతములేనన్ని బాహువులుకలవాడవు“;”బాగుగా ప్రజ్వలించిన అగ్నివలెనుండు వక్త్రము గలవాడవు; అట్టి తేజస్సుచే ఈ ప్రపంచకమునంతను తపింపచేయువాడవు“;”ఆకాశమునకు. భూమికి మధ్యప్రదేశము నంతను, అన్ని దిక్కులను నీవు ఒక్కడివే వ్యాపించియున్నావు“;”నీ రూపము అనేక వక్త్రములు, నేత్రములు, బాహవులు, తొడలు, పాదములు, ఊదరములు, దమ్ష్ట్రములు కలిగియున్నది“;”జ్వలించుచున్న రవములోనికి ఆపలేని వేగముతో, తమ నాశముకొఱకు రెక్క పురుగులు ఎట్లు ప్రవేశించుచున్నవో అట్లే ఈ లోకములన్నియు ఆపలేని వేగముతో వాటి వినాశముకొఱకు నీ నోటిలో ప్రవేశించుచున్నవి“.”నీవు కాలముచేతగాని, దేశముచేతగాని, వస్తువుచేతగాని పరిమితి లేనివాడవు, నాశములేనివాడవు, అంతములేనన్ని రూపములు గలవాడవు, దేవతులకు ఈశ్వరుడవు, జగత్తులోని అన్ని వస్తువులందు - నివసించియుండువాడవు; సర్వ వస్తువులు, అసద్వస్తువులు నీవే, నాశములేనివాడవు; అన్నింటికంటె ఉత్కృష్టమైనవాడవు; ఆది దేవుడవు - దేవతులలో మొదటివాడవు; మొదటిపురుషుడవు; అంతములేని వీర్యము, పరాక్రమము గలవాడవు, అన్నింటిలోని ప్రవేశించియుందువు - వాటిలో పూర్తిగా వ్యాపించియుండువాడవు - అందుచేత అన్నియు నీవే అయినవాడవు“).

(ఇవి అర్జునుని వచనములు).

(“ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది - దీనిని తెలుసుకొనినవాడు క్షేత్రజ్ఞుడు. ఇటువంటి క్షేత్రములన్నింటిని తెలిసిన క్షేత్రజ్ఞుడను నేను”; పరబ్రహ్మ అనునది ఆది - మొదలు, - జన్మ, - లేనిది, అది సత్ అనిగాని, అసత్ అనిగాని చెప్పుటకు అలవికానిది;” “సమస్తమైన ఇంద్రియములు, గుణములు గలదిగా కనబడును, గాని, ఇంద్రియములు లేనిది, గుణములు - త్రిగుణములు - లేనిది, కాని గుణభోక్త”, భూతములలోపల, బైట ఉండువాడు; చలనముగలది, చలనము లేనిది; మిక్కిలి చిన్నదగుటవలన తెలుసుకొనుటకు అవకాశము లేనిది; దూరముగాను, దగ్గరగాను ఉండునది; విభక్తముకానిదైనను - వేఱు వేఱుగా, అనేకముగా, ఉండునది కాకపోయినను భూతములన్నింటిలోను ఉండుటవలన విభక్తమైనట్లు, అనేకమైనట్లు ఉండువాడు; “ఆదిలేనివాడు, జన్మ లేనివాడు, ఎప్పటినుండియో యున్నవాడు అగుటవలనను, గుణములు లేనివాడగుటవలనను అవ్యయుడు - క్షీణించనివాడు, నశించనివాడు;” “ధర్మము ఎప్పుడెప్పుడు క్షీణించి అడగంటిపోవుచుండునో, అప్పుడు ఆ ధర్మమును తిరిగి లేవనెత్తి నిలబెట్టుటకు నన్ను నేనే సృజించుకొనుచుందును - ప్రాకృత రూపముతో అవతరించుచుందును. సాధువులను రక్షించుటకు, దుర్జనులను నశింపచేయుటకు, ధర్మమును స్థిరముగా స్థాపించుటకును ప్రతి యుగమందు పుట్టుచుందును - అవతరించుచుందును”, “సూక్ష్మమైనదగుటచేత ఆకాశము అన్నింటిలోను ప్రవేశించియున్నను ఏ ప్రకారము అది దేనిని అంటియుండదో ఆ ప్రకారముగానే దేహమందంతటను వ్యాపించియున్నను దేనిని అంటదు”, మహత్ బ్రహ్మ - చతుర్ముఖ బ్రహ్మ (ప్రకృతి) నా యోని - సృష్టి చేయు వస్తువు, సృష్టిలోని వస్తువులను కనునది దానిలో గర్భము ధరించునట్లు చేయుచున్నాను. దానిలోనుండి సమస్త భూతములు పుట్టుచున్నవి. భూతములు ఒకదానిలోనుండి ఒకటి పుట్టుటకు ప్రతిభూతము ఒకయోని యగుచున్నది. అట్లు సమస్త యోనులందు పుట్టుమూర్తులకు - రూపములకు - చతుర్ముఖబ్రహ్మ (లేక ప్రకృతి) మహద్యోని - (మూల యోని) (మొదటి యోని) - తల్లివంటిది. ఆ మహద్యోనిలో బీజమును (చిచ్ఛక్తిని) వేయువాడను నేనే - ఉంచువాడను నేనే - అందుచేత వాటికి నేను తండ్రిని, ప్రకృతి తల్లి - (ప్రకృతి పురుష సంయోగమువలననే సృష్టి జరుగుచున్నది) - ఒకవస్తువులోనుండి ఇంకొకవస్తువు పుట్టుచున్నది –

“జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ |”

(జగత్తునకు తలిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుచున్నాను). (పార్వతీ పరమేశ్వర = లక్ష్మీ నారాయణులు, సీతారాములు, ప్రకృతి పురుషులు). (“మధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరం). (= నేను ప్రకృతిలో అధివసించియుండుటచేత ప్రకృతి స్వతః జడమైనను చరాచర జగత్తునంతను పుట్టించుచున్నది - కనుచున్నది) (9 - 10); (”పితాహ మస్య జగతో మాతాధాతా పితామహః ||” (9 - 17). (ఈ జగత్తుకు నేను, తల్లిని, తండ్రిని, తాతని); (పరమాత్మను, ప్రకృతిని, చతుర్ముఖ బ్రహ్మను నేనే).

(“జన్మ పరంపర లేకుండనుండుటకు గమ్యస్థానమైన పరమధామము నాదే - అదినేనే; జీవలోకములో సనాతనుడు, అయిన జీవుడు నా అంశయే”, “జగత్తునంతటినీ ప్రకాశింపచేయ సూర్యునిలో తేజస్సు, చంద్రునిలోనున్న తేజస్సు, అగ్నిలోనున్నతేజస్సు నాదే అని తెలుసుకొనుము”; “నా ఓజశక్తిచే భూమిని ఆవేశించియుండి భూతములను ధరించియున్నాను”; “ఔషధులలోని రసము - జీవరసము - నేనే అయి సోముడనై ఔషధులను పోషించుచున్నాను”, “వైశ్యానరుడనై ప్రాణుల దేహమును ఆశ్రయించి, ప్రాణాపానవాయువులతో కూడి నాలుగు విధములైన అన్నమును శరీరములో జీర్ణమగునట్టి దానినిగా చేయుదును”. “మూడు లోకములను - పదునాలుగులోకములను - ఆవేశించియుండి వాటిని భరించుదును - ఉత్తమపురుషుడనని, పరమాత్ముడని చెప్పబడుచున్నాను”; “సమస్త భూతముల హృదయమందుండి వాటిని తనమాయచేత యంత్రముమీదనుండి తిరుగు బొమ్మలవలె భ్రమింపచేయును -”, (ఇటువంటి శక్తి సామర్థ్యములు గలవాడగుట చేత -), (“సమస్తమైన ధర్మములను విడిచిపెట్టి నన్ను ఒక్కడినే - ప్రపంచమంతటిలోను ఉన్న నన్ను ఒక్కడినే శరణు పొందుము. సమస్త పాపములనుండినేను నిన్ను విముక్తుని చేసెదను”). (ఆత్మ ఇటువంటిదగుటచేత ఈశ్వరత్వముగలది - అట్లుండుటే దాని ఐశ్వర్యము).

Transliteration
  1. ātmanaḥ aiśvaryaṃ, asaṃsāritvaṃ.

(ātmayokka īśvaratvamu, prabhutvamu, anniṃṭiki prabhuvai yuṃḍuṭa - saṃsāramunu poṃdaka yuṃḍuṭa, saṃsāramunaku atītuḍai yuṃḍuṭa). (paramātma sṛṣṭi aṃtaṭikī īśvaruḍu, prabhuvu - aṭṭi īśvaruni prabhāvamu - paramēśvaratvamu).

  1. paramātma bhagavaṃtuḍu - bhagavaṃtuḍanagā “jñānaiśvarya śakti balavīrya tējōbhiḥ saṃpannaḥ”. (śrī śaṃkaraḥ)

(jñānamu. aiśvaryamu, śakti, balamu, vīryamu, tējassu anu āru guṇamulugalavāḍu. (cūḍumu - “bhagavaṃtuḍu”).

  1. “paramātma ayina śrīkṛṣṇa bhagavānuni aiśvaryamu - īśvaratvamu - īśvaratva laklṣaṇamulu śrīmadbhagavadgītalō konni ceppabaḍinavi, avi ēvi anagā : -

“paśyamē yōgamaiśvaryaṃ |”;

“hariḥ | darśayā māsa pārthāya paramaṃ rūpamaiśvaraṃ ||” (11 - 9);

“divi sūrya sahasrasya bhavēdyugapadutthitā |

yadibhāḥ sadṛśī sāsyādbhāsa stasya mahātmanaḥ |

tatraikasthaṃ jagatkṛsnaṃ pravibhaktamanēkathā |

apaśyaddēva dēva dēvasya śarīrē pāṃḍavasthathā ||“. (23 - 24);

“anēkabāhūdaravaktranētraṃ paśyāmitvāṃ sarvatō (a) naṃtarūpaṃ” || (11 - 16);

“tvamakṣaraṃ paramaṃ vēditavyaṃ tvamasya viśvasya paraṃ nithānaṃ |

tvamavyayaḥ śāśvata dharmagōptā sanātanastvaṃ puruṣō matōmē” ||(11 - 18);

anādimadhyāṃta manaṃtavīryamanaṃta bāhuṃ - - - |

“paśyāmi tvāṃ dīpta hutāśavaktraṃ svatējasā viśvamidaṃ tapaṃtaṃ || (11 - 19)

“dyāvā pṛdhivyōridamaṃtaraṃ hi vyāptaṃ tvayaikēna diśaśca sarvāḥ |” (11 - 20);

- - - “rūpaṃ mahattē bahuvaktranētraṃ mahābāhō bahu bāhūrupā daṃ |

bahūdaraṃ bahudamṣṭrākarāḷaṃ - - - (11 - 23);

“yathā pradīptaṃ jvalanaṃ pataṃgā viśaṃti nāśāya samṛddha vēgāḥ |

tadhaiva nāśāya viśaṃti lōkāsta vāpivaktrāṇi samṛddha vēgāḥ ||” (11 - 29);

“anaṃta dēvēśa jagannivāsa tvamakṣaraṃ sadasatparaṃ yat |

tvamādi dēvaḥ puruṣaḥ purāṇaḥ - - (11 - 37, 38);

” anaṃtavīryāmita vikramastvaṃ sarvaṃ samāpnōṣitatōsi sarvaḥ |” (11 - 40).

(ivi arjunini vacanamulu).

“idaṃ śarīraṃ kauṃtēya kṣētramityabhi dhīyatē |

yētadyō vētti taṃ prāhuḥ kṣētrajña iti tadvithaḥ |

kṣētrajñaṃ cāpi māṃ viddhi sarva kṣētrēṣu bhārata|” (13 - 1, 2);

“anādi matparaṃ brahma na sattannā saducyatē | (13 - 2);

“sarvēṃdriya guṇābhāsaṃ sarvēṃdriya vivarjitaṃ |

asaktaṃ sarvabhūtēṣu nirguṇaṃ guṇabhōktṛca |

bahiraṃtaśca bhūtānāmacaraṃ caramēvaca |

sūkṣmatvātta vijñēyaṃ dūrasthaṃ cāṃti kē ca tat |

avibhaktaṃ ca bhūtēṣu vibhakta mivaca sthitaṃ |” (13 - 14 to 15);

“anāditvā nnirguṇatvātparamātmāyama vyayaṃ” (13 - 31).

yadā yadāhi dharmasya glānirbhavati bhārata |

abhyutthānā madharmasya tadātmānaṃ sṛjāmyahaṃ ||

paritrāṇāya sādhūnāṃ vināśāya ca duṣkṛtāṃ |

dharma saṃsthāpanārthāya saṃbhavāmi yugē yugē ||“. (4 - 6, 7).

“yathā sarvagataṃ saukṣmyā dākāśaṃ nōpalipyatē |

sarvatrāvasthitō dēhē tathātmā nōpalipyatē |

sarvatrāvasthitō dēhē tathātmā nōpalipyatē ||” (13 - 32).

“mama yōnirmahadbrahma tasmin garbhaṃ dadhāmyahaṃ |

saṃbhavaḥ sarvabhūtānāṃ tatō bhavati bārati |

sarvayōniṣu kautēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tāṣāṃ brahma mahadyōnirahaṃ bījapradaḥ pitā|” (14 - 3) (14 - 4);

“yadgatvāna nivartaṃtē tadthāma paramaṃ mama |

mamaivāṃśō jīva lōkē jīvabhūtaḥ sanātanaḥ| ” - (15 - 6, 7);

“yadādityagataṃ tējō jagadbhāsayatē(a)khilaṃ |

yacchaṃdramasi yacchāgnau tattējō viddhimāmakaṃ ||

gāmāviśya ca bhūtāni dhārayāmyahamōjasā |

puṣṇāmi cauṣadhiḥ sarvāḥ sōmō bhūtvārasātmakaḥ |

ahaṃ vaiśvācarō bhūtvā prāṇināṃ dēhamāśritaḥ |

prāṇāpāna samāyuktaṃ pacāmūnnaṃ caturvidhaṃ | (15 - 13 to 15);

“uttamaḥ puruṣastvanyaḥ paramātmnētyudāhṛtaḥ |

yō lōkatrayamā viśvabibhartya vyaya īśvaraḥ ||” (15 - 27);

“īśvaraḥ sarvabhūtānāṃ hṛddēśē (a)rjuna tiṣṭati |

bhrāmayan sarvabhūtāni yaṃtrārūḍhāni māyayā ||” (18 - 61);

“sarvadharmān parityajya māmēkaṃ śaraṇaṃ vraja |

ahaṃtvā sarvapāpēbhyō mōkṣayiṣyāmi mā śucaḥ ||” (18 - 66).

(ivi śrīkṛṣṇabhagavānuni vacanamulu). (cūḍumu - ‘ātma lakṣaṇamulu’ - 3).

(“nā īśvaratya yōgamunu cūḍumu”; śrīkṛṣṇuḍu arjununi koṟaku tana aiśyaryarūpamu - anniṃṭikini prabhutvamunu teliyacēyu rūpamunu - cūpiṃcenu”; “ākāśamaṃdu vēlakoladi sūryulu okkamāruna udayiṃcinapuḍu kalugukāṃti bhagavaṃtuniyokka kāṃtiki samānamu kāvaccunu - ā dēvadēvuni śarīramaṃdu anēkarūpamulugā vibhaktamai okaṭigā ayiyunna jagattu aṃtaṭini arjunuḍucūcenu”; “anēka bāhuvulu, udaramulu, vaktramulu, nētramulu kaligi aṃtamulēnaṭṭi nī rūpamunu aṃtaṭanu cūcucunnānu”; “nīvu kṣīṇiṃci naśiṃcanivāḍavu, utkṛṣṭamainavāḍavu; ī prapaṃcamaṃtakunu goppa nidhānamainavāḍavu; śāśvata dharmamunu rakṣiṃcuvāḍavu, sanātanamaina puruṣuḍavu”; “ādimadhyāṃtamulu - janana,sthiti, maraṇamulu lēnivāḍavu, aṃtamulēni vīryamu galavāḍavu, aṃtamulēnanni bāhuvulukalavāḍavu”; “bāgugā prajvaliṃcina agnivalenuṃḍu vaktramu galavāḍavu; aṭṭi tējassucē ī prapaṃcakamunaṃtanu tapiṃpacēyuvāḍavu”; “ākāśamunaku. bhūmiki madhyapradēśamu naṃtanu, anni dikkulanu nīvu okkaḍivē vyāpiṃciyunnāvu”; “nī rūpamu anēka vaktramulu, nētramulu, bāhavulu, toḍalu, pādamulu, ūdaramulu, damṣṭramulu kaligiyunnadi”; “jvaliṃcucunna ravamulōniki āpalēni vēgamutō, tama nāśamukoṟaku rekka purugulu eṭlu pravēśiṃcucunnavō aṭlē ī lōkamulanniyu āpalēni vēgamutō vāṭi vināśamukoṟaku nī nōṭilō pravēśiṃcucunnavi”. “nīvu kālamucētagāni, dēśamucētagāni, vastuvucētagāni parimiti lēnivāḍavu, nāśamulēnivāḍavu, aṃtamulēnanni rūpamulu galavāḍavu, dēvatulaku īśvaruḍavu, jagattulōni anni vastuvulaṃdu - nivasiṃciyuṃḍuvāḍavu; sarva vastuvulu, asadvastuvulu nīvē, nāśamulēnivāḍavu; anniṃṭikaṃṭe utkṛṣṭamainavāḍavu; ādi dēvuḍavu - dēvatulalō modaṭivāḍavu; modaṭipuruṣuḍavu; aṃtamulēni vīryamu, parākramamu galavāḍavu, anniṃṭilōni pravēśiṃciyuṃduvu - vāṭilō pūrtigā vyāpiṃciyuṃḍuvāḍavu - aṃducēta anniyu nīvē ayinavāḍavu”).

(ivi arjununi vacanamulu).

(“ī śarīramu kṣētramani ceppabaḍucunnadi - dīnini telusukoninavāḍu kṣētrajñuḍu. iṭuvaṃṭi kṣētramulanniṃṭini telisina kṣētrajñuḍanu nēnu”; parabrahma anunadi ādi - modalu, - janma, - lēnidi, adi sat anigāni, asat anigāni ceppuṭaku alavikānidi;” “samastamaina iṃdriyamulu, guṇamulu galadigā kanabaḍunu, gāni, iṃdriyamulu lēnidi, guṇamulu - triguṇamulu - lēnidi, kāni guṇabhōkta”, bhūtamulalōpala, baiṭa uṃḍuvāḍu; calanamugaladi, calanamu lēnidi; mikkili cinnadaguṭavalana telusukonuṭaku avakāśamu lēnidi; dūramugānu, daggaragānu uṃḍunadi; vibhaktamukānidainanu - vēṟu vēṟugā, anēkamugā, uṃḍunadi kākapōyinanu bhūtamulanniṃṭilōnu uṃḍuṭavalana vibhaktamainaṭlu, anēkamainaṭlu uṃḍuvāḍu; “ādilēnivāḍu, janma lēnivāḍu, eppaṭinuṃḍiyō yunnavāḍu aguṭavalananu, guṇamulu lēnivāḍaguṭavalananu avyayuḍu - kṣīṇiṃcanivāḍu, naśiṃcanivāḍu;” “dharmamu eppuḍeppuḍu kṣīṇiṃci aḍagaṃṭipōvucuṃḍunō, appuḍu ā dharmamunu tirigi lēvanetti nilabeṭṭuṭaku nannu nēnē sṛjiṃcukonucuṃdunu - prākṛta rūpamutō avatariṃcucuṃdunu. sādhuvulanu rakṣiṃcuṭaku, durjanulanu naśiṃpacēyuṭaku, dharmamunu sthiramugā sthāpiṃcuṭakunu prati yugamaṃdu puṭṭucuṃdunu - avatariṃcucuṃdunu”, “sūkṣmamainadaguṭacēta ākāśamu anniṃṭilōnu pravēśiṃciyunnanu ē prakāramu adi dēnini aṃṭiyuṃḍadō ā prakāramugānē dēhamaṃdaṃtaṭanu vyāpiṃciyunnanu dēnini aṃṭadu”, mahat brahma - caturmukha brahma (prakṛti) nā yōni - sṛṣṭi cēyu vastuvu, sṛṣṭilōni vastuvulanu kanunadi dānilō garbhamu dhariṃcunaṭlu cēyucunnānu. dānilōnuṃḍi samasta bhūtamulu puṭṭucunnavi. bhūtamulu okadānilōnuṃḍi okaṭi puṭṭuṭaku pratibhūtamu okayōni yagucunnadi. aṭlu samasta yōnulaṃdu puṭṭumūrtulaku - rūpamulaku - caturmukhabrahma (lēka prakṛti) mahadyōni - (mūla yōni) (modaṭi yōni) - tallivaṃṭidi. ā mahadyōnilō bījamunu (cicchaktini) vēyuvāḍanu nēnē - uṃcuvāḍanu nēnē - aṃducēta vāṭiki nēnu taṃḍrini, prakṛti talli - (prakṛti puruṣa saṃyōgamuvalananē sṛṣṭi jarugucunnadi) - okavastuvulōnuṃḍi iṃkokavastuvu puṭṭucunnadi –

“jagataḥ pitarau vaṃdē pārvatī paramēśvarau |”

(jagattunaku talidaṃḍrulaina pārvatī paramēśvarulaku namaskariṃcucunnānu). (pārvatī paramēśvara = lakṣmī nārāyaṇulu, sītārāmulu, prakṛti puruṣulu). (“madhyakṣēṇa prakṛtiḥ sūyatē sa carācaraṃ). (= nēnu prakṛtilō adhivasiṃciyuṃḍuṭacēta prakṛti svataḥ jaḍamainanu carācara jagattunaṃtanu puṭṭiṃcucunnadi - kanucunnadi) (9 - 10); (”pitāha masya jagatō mātādhātā pitāmahaḥ ||” (9 - 17). (ī jagattuku nēnu, tallini, taṃḍrini, tātani); (paramātmanu, prakṛtini, caturmukha brahmanu nēnē).

(“janma paraṃpara lēkuṃḍanuṃḍuṭaku gamyasthānamaina paramadhāmamu nādē - adinēnē; jīvalōkamulō sanātanuḍu, ayina jīvuḍu nā aṃśayē”, “jagattunaṃtaṭinī prakāśiṃpacēya sūryunilō tējassu, caṃdrunilōnunna tējassu, agnilōnunnatējassu nādē ani telusukonumu”; “nā ōjaśakticē bhūmini āvēśiṃciyuṃḍi bhūtamulanu dhariṃciyunnānu”; “auṣadhulalōni rasamu - jīvarasamu - nēnē ayi sōmuḍanai auṣadhulanu pōṣiṃcucunnānu”, “vaiśyānaruḍanai prāṇula dēhamunu āśrayiṃci, prāṇāpānavāyuvulatō kūḍi nālugu vidhamulaina annamunu śarīramulō jīrṇamagunaṭṭi dāninigā cēyudunu”. “mūḍu lōkamulanu - padunālugulōkamulanu - āvēśiṃciyuṃḍi vāṭini bhariṃcudunu - uttamapuruṣuḍanani, paramātmuḍani ceppabaḍucunnānu”; “samasta bhūtamula hṛdayamaṃduṃḍi vāṭini tanamāyacēta yaṃtramumīdanuṃḍi tirugu bommalavale bhramiṃpacēyunu -”, (iṭuvaṃṭi śakti sāmarthyamulu galavāḍaguṭa cēta -), (“samastamaina dharmamulanu viḍicipeṭṭi nannu okkaḍinē - prapaṃcamaṃtaṭilōnu unna nannu okkaḍinē śaraṇu poṃdumu. samasta pāpamulanuṃḍinēnu ninnu vimuktuni cēsedanu”). (ātma iṭuvaṃṭidaguṭacēta īśvaratvamugaladi - aṭluṃḍuṭē dāni aiśvaryamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.