← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మజ్ఞానము ātmajñānamu

Original — తెలుగు

వ. మూల ప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై మణిగణముల జొచ్చియున్న సూత్రంబు చందంబున నాత్మ యన్నింటియందునుం జొచ్చి దీపించు. ఆత్మకు జన్మ స్థితిలయంబులు గలవంచు మిథ్యాతత్పరులుగాక వివేకశుద్ధమైన మనంబునం దాత్మ వెదకవలయు. ఆత్మకు అవస్థలుగల యట్లుండుగాని యవస్థలులేవు. జాగరణ స్వప్న సుషుప్తులను వృత్తులెవ్వనిచేత నెఱుంగంబడు నతండాత్మ యండ్రు. కుసుమ ధర్మంబులైన గంధంబులచేత గంధాశ్రయుండైన వాయువు నెఱింగెడి భంగిం ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబులయిన బుద్ధి భేదంబుల నాత్మ నెఱుంగందగు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 237)

  1. “యాభిరాదిత్యస్తపతి రశ్మిభిః, తాభిః పర్జన్యో వర్షతి. పర్జన్యేనౌషధి వనస్పతయః ప్రజాయంతే; ఔషధి వనస్పతి భిః అన్నంభవతి. అన్నేన ప్రాణాః, ప్రాణైర్బలం, బలేన తపః; తపసా శ్రద్ధా, శ్రద్ధయోమేధా, మేధయా మనీషా, మనీషయా మనో,మనసా శాంతిః, శాంత్యా చిత్తం, చిత్తేన స్మృతిః, స్మృత్యా స్మారం, స్మారేణవిజ్ఞానం, విజ్ఞానేన ఆత్మానం వేదయతి. తస్మాదన్నం దదన్ సర్వాణ్యేతాని దదాతి. అన్నాత్ ప్రాణాః భవంతి భూతానాం, ప్రాణైః మనో మనసశ్చ విజ్ఞానం, విజ్ఞానా నందో బ్రహ్మయోనిః”. (నారాయణోపనిషత్)

(తపింపచేయు సూర్యకిరణములచేతనే మేఘము వర్షించుచున్నది. మేఘమువలన - వర్షమువలన - ఔషధులు, వనస్పతులు మొలయుచున్నవి. వీటిచేత అన్నము కలుగుచున్నది. అన్నమువలన ప్రాణములు, వాటివలన బలము, బలమువలన తపస్సు, తపస్సువలన శ్రద్ధ, శ్రద్ధ వలన మేథస్సు, మేథస్సువలన మనీషా (బుద్ధి), మనీషవలన మనస్సు, మనస్సువలన శాంతి, శాంతివలన చిత్తము, చిత్తమువలన స్మృతి, స్మృతివలన స్మారము, దానివలన విజ్ఞానము, విజ్ఞానమువలన ఆత్మజ్ఞానము కలుగును - అందుచేత అన్నమువలన ఇవన్నియు కలుగుచున్నవి కనుక అన్నము ఇచ్చినట్లైన ఇవన్నియు ఇచ్చినట్లే యగును. అన్నమువలన భూతములకు ప్రాణములు కలుగుచున్నవి, ప్రాణములవలన మనస్సు, మనస్సువలన విజ్ఞానము, విజ్ఞానమువలన ఆనందరూపుడగు బ్రహ్మ).

  1. “నాయమత్మా ప్రవచనేన లభ్యో, నమేధయా, న బహునా శ్రుతేన |

యమే వైష వృణుతే తేన లభ్యస్త స్యైష ఆత్మా వివృణతే తనూం స్వాం” ||. (ముండకోపనిషత్ - 6 - 3)

(ఈ ఆత్మ జ్ఞానము ప్రవచనముచేగాని, మేధచేగాని, బహుశాస్త్రజ్ఞానముచేగాని లభ్యముకాదు.భగవంతుడు ఏ పురుషుని తరింప చేయుగోరునో వానికి మాత్రమే అది అబ్బును. అట్టివానికే భగవంతుడు తన దివ్యమంగళ విగ్రహముయొక్క స్వరూప స్వభావములను తెలియచేయును).

  1. తిలేషు యంత్ర పీడనేన తైలం గృహ్యతే, దధిని మధనేన సర్పిరివ, ఆపః శ్రోతస్సు నదీషు భూఖననేన, అరణీషు చాగ్నిర్మధనేన, ఏవం ఆత్మా ఆత్మని స్వాత్మని గృహ్యతే. అసౌ మననేన ఆత్మభూత దేహాదిషు అన్నమయాద్యశే షోపాధి ప్రవిలాపనేన నిర్విశేషే పరిపూర్ణానందే స్వాత్మన్యేవ అవగమ్యతే సత్యేన - యధాభూతం - హితార్థవచనేన పురుషేణ”.

(యంత్రముచేత పిండిన నువ్వులనుండి నూనె గ్రహింపబడుచున్నది. ఆ ప్రకారముగానే పెరుగును చిలికిన వెన్న - నెయ్యి - లభ్యమగుచున్నది. ఏరు పారెడు భూమిని త్రవ్వుటచేత నీరు దొరుకుచున్నది. కట్టెలనుమధించుటచేత అగ్ని కలుగుచున్నది. ఈ ప్రకారముగానే తన శరీరములోనే ఆత్మను పొందవచ్చును. అన్నమయమగు దేహము మొదలగు ఉపాధులన్నింటియందు నిర్విశేషము, పరిపూర్ణానందము అయిన జీవాత్మలోనే ఆత్మను చూడవచ్చును).

  1. ఉపలక్షణభూత ప్రపంచజ్ఞానమేవ ఆత్మజ్ఞాన సాధనం.

(ఆత్మకు ప్రపంచము ఉపలక్షణము - ఆత్మయే ప్రపంచరూపముగా పరిణమించినది, మారినది. అందుచేత ప్రపంచ జ్ఞానమే - ప్రపంచముయొక్క సృష్టి స్థితి లయములు - ప్రపంచములోని సమస్త వస్తువుల సృష్టి స్థితిలయములు,వాటి వాటి తత్వములు క్షుణ్ణముగా తెలుసుకొనుటే ఆత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానమునకు సా ధనము ఆత్మే. పరమాత్మే ప్రపంచము, భగవంతుడు విశ్వరూపుడు - ప్రపంచమే రూపముగాగలవాడు).

  1. “ప్రపంచములోగల సమస్త ప్రాణులందు, చిన్నవి పెద్దవి, మంచిది, చెడ్డది అని విచక్షణ లేకుండ, పూవులమాలలోని దారమువలె అన్నింటియందును పరమాత్మ అనున్యూతమై వ్యాపించి యున్నాడని తెలుసుకొనుటే ఆత్మజ్ఞానము”-

  2. “ఆ. అన్నమవనియందు అమృతంబు గోవుల

యందు, వహ్ని సమిధలందు సమర

యోగవశతబొందునో జను బుద్ధిచే

అగుణు నిన్ను గాంతురాత్మ విదులు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 6 - 166). (చూడుము - 'ఆత్మ' – 10.3)

  1. “ఆత్మజ్ఞా ప్రదానానామిద మేవ మహా మతే |

శాస్త్రాణాం పరమం శాస్త్రం మహారామాయణం శుభం |

ఇతిహాసోత్తమా దస్మాత్ శ్రుతాత్ బోధః ప్రవర్తతే |

సర్వేషా మితిహాసానా మయం సార ఉదా హృతః ||“. (యోగవాశిష్టము)

(ఆత్మజ్ఞానమును తెలియచేయు శాస్త్రములలో శ్రీమద్రామాయణము పరమము - ఉత్కృష్టమైనది. సమస్త ఇతిహాసముల సారము దీనిలో నున్నది).

  1. “నానా శాస్త్రం పఠేల్లోకే, నానా దేవాన్ ప్రపూజ యేత్ |

ఆత్మజ్ఞానం వినా పార్థ స్ర్వకర్మ నిరర్థకం ||“. (దేవీభాగవతము - )

(ఎన్ని శాస్త్రములు చదివినను, ఎన్ని దేవతులను పూజించినను ఆత్మజ్ఞానము లేనియడల, ఈ చేసిన పని అంతయు వ్యర్థమే).

Transliteration

va. mūla prakṛti modalayina vargaṃbunaku vēṟai maṇigaṇamula jocciyunna sūtraṃbu caṃdaṃbuna nātma yanniṃṭiyaṃdunuṃ jocci dīpiṃcu. ātmaku janma sthitilayaṃbulu galavaṃcu mithyātatparulugāka vivēkaśuddhamaina manaṃbunaṃ dātma vedakavalayu. ātmaku avasthalugala yaṭluṃḍugāni yavasthalulēvu. jāgaraṇa svapna suṣuptulanu vṛttulevvanicēta neṟuṃgaṃbaḍu nataṃḍātma yaṃḍru. kusuma dharmaṃbulaina gaṃdhaṃbulacēta gaṃdhāśrayuṃḍaina vāyuvu neṟiṃgeḍi bhaṃgiṃ driguṇātmakaṃbulayi karmajanyaṃbulayina buddhi bhēdaṃbula nātma neṟuṃgaṃdagu” - (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 237)

  1. “yābhirādityastapati raśmibhiḥ, tābhiḥ parjanyō varṣati. parjanyēnauṣadhi vanaspatayaḥ prajāyaṃtē; auṣadhi vanaspati bhiḥ annaṃbhavati. annēna prāṇāḥ, prāṇairbalaṃ, balēna tapaḥ; tapasā śraddhā, śraddhayōmēdhā, mēdhayā manīṣā, manīṣayā manō,manasā śāṃtiḥ, śāṃtyā cittaṃ, cittēna smṛtiḥ, smṛtyā smāraṃ, smārēṇavijñānaṃ, vijñānēna ātmānaṃ vēdayati. tasmādannaṃ dadan sarvāṇyētāni dadāti. annāt prāṇāḥ bhavaṃti bhūtānāṃ, prāṇaiḥ manō manasaśca vijñānaṃ, vijñānā naṃdō brahmayōniḥ”. (nārāyaṇōpaniṣat)

(tapiṃpacēyu sūryakiraṇamulacētanē mēghamu varṣiṃcucunnadi. mēghamuvalana - varṣamuvalana - auṣadhulu, vanaspatulu molayucunnavi. vīṭicēta annamu kalugucunnadi. annamuvalana prāṇamulu, vāṭivalana balamu, balamuvalana tapassu, tapassuvalana śraddha, śraddha valana mēthassu, mēthassuvalana manīṣā (buddhi), manīṣavalana manassu, manassuvalana śāṃti, śāṃtivalana cittamu, cittamuvalana smṛti, smṛtivalana smāramu, dānivalana vijñānamu, vijñānamuvalana ātmajñānamu kalugunu - aṃducēta annamuvalana ivanniyu kalugucunnavi kanuka annamu iccinaṭlaina ivanniyu iccinaṭlē yagunu. annamuvalana bhūtamulaku prāṇamulu kalugucunnavi, prāṇamulavalana manassu, manassuvalana vijñānamu, vijñānamuvalana ānaṃdarūpuḍagu brahma).

  1. “nāyamatmā pravacanēna labhyō, namēdhayā, na bahunā śrutēna |

yamē vaiṣa vṛṇutē tēna labhyasta syaiṣa ātmā vivṛṇatē tanūṃ svāṃ” ||. (muṃḍakōpaniṣat - 6 - 3)

(ī ātma jñānamu pravacanamucēgāni, mēdhacēgāni, bahuśāstrajñānamucēgāni labhyamukādu.bhagavaṃtuḍu ē puruṣuni tariṃpa cēyugōrunō vāniki mātramē adi abbunu. aṭṭivānikē bhagavaṃtuḍu tana divyamaṃgaḷa vigrahamuyokka svarūpa svabhāvamulanu teliyacēyunu).

  1. tilēṣu yaṃtra pīḍanēna tailaṃ gṛhyatē, dadhini madhanēna sarpiriva, āpaḥ śrōtassu nadīṣu bhūkhananēna, araṇīṣu cāgnirmadhanēna, ēvaṃ ātmā ātmani svātmani gṛhyatē. asau mananēna ātmabhūta dēhādiṣu annamayādyaśē ṣōpādhi pravilāpanēna nirviśēṣē paripūrṇānaṃdē svātmanyēva avagamyatē satyēna - yadhābhūtaṃ - hitārthavacanēna puruṣēṇa”.

(yaṃtramucēta piṃḍina nuvvulanuṃḍi nūne grahiṃpabaḍucunnadi. ā prakāramugānē perugunu cilikina venna - neyyi - labhyamagucunnadi. ēru pāreḍu bhūmini travvuṭacēta nīru dorukucunnadi. kaṭṭelanumadhiṃcuṭacēta agni kalugucunnadi. ī prakāramugānē tana śarīramulōnē ātmanu poṃdavaccunu. annamayamagu dēhamu modalagu upādhulanniṃṭiyaṃdu nirviśēṣamu, paripūrṇānaṃdamu ayina jīvātmalōnē ātmanu cūḍavaccunu).

  1. upalakṣaṇabhūta prapaṃcajñānamēva ātmajñāna sādhanaṃ.

(ātmaku prapaṃcamu upalakṣaṇamu - ātmayē prapaṃcarūpamugā pariṇamiṃcinadi, mārinadi. aṃducēta prapaṃca jñānamē - prapaṃcamuyokka sṛṣṭi sthiti layamulu - prapaṃcamulōni samasta vastuvula sṛṣṭi sthitilayamulu,vāṭi vāṭi tatvamulu kṣuṇṇamugā telusukonuṭē ātma jñānamu, ātmajñānamunaku sā dhanamu ātmē. paramātmē prapaṃcamu, bhagavaṃtuḍu viśvarūpuḍu - prapaṃcamē rūpamugāgalavāḍu).

  1. “prapaṃcamulōgala samasta prāṇulaṃdu, cinnavi peddavi, maṃcidi, ceḍḍadi ani vicakṣaṇa lēkuṃḍa, pūvulamālalōni dāramuvale anniṃṭiyaṃdunu paramātma anunyūtamai vyāpiṃci yunnāḍani telusukonuṭē ātmajñānamu”-

  2. “ā. annamavaniyaṃdu amṛtaṃbu gōvula

yaṃdu, vahni samidhalaṃdu samara

yōgavaśataboṃdunō janu buddhicē

aguṇu ninnu gāṃturātma vidulu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 6 - 166). (cūḍumu - 'ātma' – 10.3)

  1. “ātmajñā pradānānāmida mēva mahā matē |

śāstrāṇāṃ paramaṃ śāstraṃ mahārāmāyaṇaṃ śubhaṃ |

itihāsōttamā dasmāt śrutāt bōdhaḥ pravartatē |

sarvēṣā mitihāsānā mayaṃ sāra udā hṛtaḥ ||“. (yōgavāśiṣṭamu)

(ātmajñānamunu teliyacēyu śāstramulalō śrīmadrāmāyaṇamu paramamu - utkṛṣṭamainadi. samasta itihāsamula sāramu dīnilō nunnadi).

  1. “nānā śāstraṃ paṭhēllōkē, nānā dēvān prapūja yēt |

ātmajñānaṃ vinā pārtha srvakarma nirarthakaṃ ||“. (dēvībhāgavatamu - )

(enni śāstramulu cadivinanu, enni dēvatulanu pūjiṃcinanu ātmajñānamu lēniyaḍala, ī cēsina pani aṃtayu vyarthamē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.