← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మమాయ ātmamāya

Original — తెలుగు
  1. స్వసంకల్పము,

  2. స్వా విద్య.

(భగవంతుని సంకల్పము; తనయొక్క అవిద్య - తాను ఎవరో తెలియనివ్వని - తాను భగవంతుని అంశయే యని - తెలియనివ్వని అజ్ఞానము).

  1. ఆత్మనః మాయ - (భగవంతుని నుండి పుట్టిన ప్రకృతి యను శక్తి).

  2. “ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా |”. (శ్రీమద్భగవద్గీత - 4 - 6)

“విచిత్రానేక శక్త్యాధ్యాం మాయాఖ్యాం ప్రకృతిం స్వికాం |

స్వోపాధిభూతా మత్యంతా సంభావిత ప్రదర్శినీ” |.

(చిత్ర విచిత్రమైన అనేక శక్తులుగల మాయ అను పేరుగల నా ప్రకృతిని, నాకు ఉపాధి అయినటివంటిన్నీ, అసంభవమైన అనంత సంఘటనలను కలిగించు శక్తిగలవి కనుక మాయ యనబడు భగవంతుని శక్తి, భగవంతుని ఒక ఆవరణమువలె ఆవరించుకొని యుండునదిన్నీ, భగవంతుని ఆశ్రయించియున్నందున సమస్త శక్తులుగలదిన్నీ, ఈ ప్రపంచసృష్టికి - కుండకు మట్టివలె - ఉపాదానకారణనమైనటువంటిది, భగవంతుని మాయా శక్తి)

  1. భగవంతుని మాయ మోక్ష ధర్మములో ఈ క్రింద విధముగా చెప్పబడినది : -

“మాయాహ్యేషా మాయాసృష్టా యన్మాం పశ్యని కేశవ |

సర్వభూత గణైర్యుక్తం నతుమాం ద్రష్టుమర్హసి ||“.

(నీవు చూచుచున్నది నన్ను కాదు. నన్ను చూచుచున్నావని తలచుచున్నావుకాని నీవు చూచుచున్నది నన్నుకాదు. ఇది నాచేత సృష్టించబడిన నా మాయ - సర్వ భూతములతో కూడియున్నది - అనగా భూతములన్నియు సూక్ష్మరూపములో తనలో నుంచుకొనియున్నది - అట్టి ఈ మాయచేత ఆవరించుకోబడియున్న నన్ను చూచు చున్నావు - అట్లు మాయచే ఆవరించబడకుండ నుండు నా నిజరూపము నీవు చూడలేవు). (సమస్త భూతములకు - ప్రపంచములోని సమస్త వస్తువులకు రూపమునిచ్చు ఈ మాయ నాకు ఇచ్చిన ఈ రూపమును నీవు చూచుచున్నావు).

Transliteration
  1. svasaṃkalpamu,

  2. svā vidya.

(bhagavaṃtuni saṃkalpamu; tanayokka avidya - tānu evarō teliyanivvani - tānu bhagavaṃtuni aṃśayē yani - teliyanivvani ajñānamu).

  1. ātmanaḥ māya - (bhagavaṃtuni nuṃḍi puṭṭina prakṛti yanu śakti).

  2. “prakṛtiṃ svāmadhiṣṭhāya saṃbhavāmyātma māyayā |”. (śrīmadbhagavadgīta - 4 - 6)

“vicitrānēka śaktyādhyāṃ māyākhyāṃ prakṛtiṃ svikāṃ |

svōpādhibhūtā matyaṃtā saṃbhāvita pradarśinī” |.

(citra vicitramaina anēka śaktulugala māya anu pērugala nā prakṛtini, nāku upādhi ayinaṭivaṃṭinnī, asaṃbhavamaina anaṃta saṃghaṭanalanu kaligiṃcu śaktigalavi kanuka māya yanabaḍu bhagavaṃtuni śakti, bhagavaṃtuni oka āvaraṇamuvale āvariṃcukoni yuṃḍunadinnī, bhagavaṃtuni āśrayiṃciyunnaṃduna samasta śaktulugaladinnī, ī prapaṃcasṛṣṭiki - kuṃḍaku maṭṭivale - upādānakāraṇanamainaṭuvaṃṭidi, bhagavaṃtuni māyā śakti)

  1. bhagavaṃtuni māya mōkṣa dharmamulō ī kriṃda vidhamugā ceppabaḍinadi : -

“māyāhyēṣā māyāsṛṣṭā yanmāṃ paśyani kēśava |

sarvabhūta gaṇairyuktaṃ natumāṃ draṣṭumarhasi ||“.

(nīvu cūcucunnadi nannu kādu. nannu cūcucunnāvani talacucunnāvukāni nīvu cūcucunnadi nannukādu. idi nācēta sṛṣṭiṃcabaḍina nā māya - sarva bhūtamulatō kūḍiyunnadi - anagā bhūtamulanniyu sūkṣmarūpamulō tanalō nuṃcukoniyunnadi - aṭṭi ī māyacēta āvariṃcukōbaḍiyunna nannu cūcu cunnāvu - aṭlu māyacē āvariṃcabaḍakuṃḍa nuṃḍu nā nijarūpamu nīvu cūḍalēvu). (samasta bhūtamulaku - prapaṃcamulōni samasta vastuvulaku rūpamuniccu ī māya nāku iccina ī rūpamunu nīvu cūcucunnāvu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.