(ఆత్మ యొక్క తత్వము, జీవపరమాత్మల తత్వము; బ్రహ్మతత్వము) (భగవత్తత్వము).
యాథాత్మ్యం = ఆత్మ ఎట్లున్నదో, ఏమిటో అది.
ఆత్మనః పరమాత్మనః తత్వం.నిఖిల జగత్కారణత్వ సర్వ పురుషార్థ ప్రదాతృత్వాది రూపం తత్వం.
(పరమాత్మ తత్వం సమస్త జగత్తుకు కారణమై యుండుట, చతుర్విధ పురుషార్థములను ఇచ్చునది).
(ఆత్మయొక్క నిజరూపమైన సచ్చిదానందరూపము - నిత్యమై యుండుట, చైతన్యము కలిగి యుండుట, మోక్షరూపమై యుండుట).
ఆత్మయొక్క స్వభావము, నిజస్థితి, యధార్థ స్థితి; ప్రకృతి వికారములైన ఏ విధమైన ఉపాధితోను కలియక (అంటక) ఉండునప్పటి కేవలస్థితి.
అహమేవ పరం తత్వం మత్తో జాతం జగత్ సురాః |
మయ్యేవ సంస్థితం నష్టం మత్సమో నాధికస్సదా |
తస్మా దజ్ఞానమూలస్య సంసారస్య క్షయో హరే |
ఆత్మ నస్తత్వ విజ్ఞానాత్ తత్వం బ్రహ్మైవ కేవలం ||“. (సూత సమ్హి తా యాం)
(నేనే పరతత్వమును జగత్తు నావలననే, నాలోనుండియే పుట్టినది, నాలోనే ఉండి పోషింపబడుచున్నది; నాలోనే నశించుచున్నది - లయమగుచున్నది. అందుచేత ఆత్మ తత్వ జ్ఞానము వలననే అజ్ఞానమే కారణమైన సంసారము నశించి ముక్తి కలుగును - తత్వమనగా కేవలము బ్రహ్మమే -
(సమస్త ప్రపంచముయొక్క నిజరూపము పరమాత్మయే - ఈ ప్రపంచమంతా - ఈ ప్రపంచములోని వస్తువులన్నియు - పర బ్రహ్మములోనుండి పుట్టినవే, వాటి అన్నింటిలోను లోపల పైన పూర్తిగా వ్యాపించి యున్నది పరబ్రహ్మమే కనుక ఈ ప్రపంచమంతా పరబ్రహ్మమే; కాని అజ్ఞానమువలన - భ్రాంతివలన - ఒక్కొక్క వస్తువువలె కనబడుచున్నది. పరమార్థ దృష్టిలో ఉన్నదంతయు పరమాత్మయే - “అంతా రామమయం బీజగమంతా రామమయం”. “ఉండేదీ రాముడొకడు”; “హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు”.
నేది ప్రకాశించునెప్పుడు; నట్టి స్వయంజ్యోతి, నిత్యంబు, నవ్యయంబు,
నాకాశమునుబోలి యవిరళ వ్యాపకమగు నాత్మ తత్వంబు నధికమహిమ
నమరు పరబ్రహ్మమగునని పల్కి, యిట్లనియె న విక్రయుండైనవాడు
తే. నెవ్వడాతడు దనయందునెపుడు నాత్మ
కార్య కరణ సమర్థంబు గాని భేద
బుద్ధి జనకంబునా దగు భూరి మాయ
జేసి విశ్వంబు సత్యంబుగా సృజించె“.
“ఆ. మఱల మఱల పెక్కుమాఱులీ విశ్వంబు
జననవృద్ధి విలయ సంగతులను
నంద జేయుచుండు నట్టి యీశ్వరుడవై
తనరు నిన్ను నాత్మ తత్వముగను.
వ. తెలియుదుము“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 24 - 720 - 722)
ఈశ్వరారా ధనార్థంచ కుర్వాణాః కర్మ కేవలం |
ధీశుద్ధి ద్వారతో వేదవాక్య జన్యాత్మ ధీయుతాః |
సంతో జన్మాఖ్య బందేన వినిర్ముక్తా అశేషతః |
ఆత్మ తత్వం పదం బ్రహ్మానందం మాయా వివర్జితం |
పురుషార్థం విమోక్షాఖ్యం ప్రాప్ను వంతీహ తాదృశాః |
త్వమస్యేతా దృశోభూత్వా గచ్ఛ విష్ణోః పరం పదం ||“. (గీతాభావప్రకాశము - 2 - 523 to 525)
(కర్మవలన కలిగెడు ఫలమును విడిచిపెట్టి, కేవలము భగవంతుని ఆతాధన నిమిత్తమే కర్మ చేయుచు, చిత్త శుద్ధి కలిగియుండుటచేత వేదవాక్యములవలన కలిగిన ఆత్మజ్ఞానము కలవారై సత్పురుషులైనవారు జన్మము అను బంధమునుండి పూర్తిగా విడువబడినవారై ఆత్మతత్వమను బ్రహ్మానందపదమును పొందుదురు. ఇదియే మాయతోకలియని బ్రహ్మానందపదము, పరమపదము, పరమపురుషార్థము,మోక్షము -).
సానుభూత్యేకమానంచ యత్తత్వం తదసౌ స్థితః |
యదేకం చాప్యనేకంచ సాంజనంచ నిరంజనం |
యత్సర్వం చాప్య సర్వం చ యత్తత్వం త తదసౌ స్థితః ||“. (వాసిష్టే)
(తేజో రూపములైన సూర్యుడు మొదలగువాటికన్న తేజోవంతమైనది, దానికంటె ఉత్తమమైనది మఱి యొకటి లేనిది, తాను ఒకటే అయినది - తనవంటి వస్తువు ఇంకొకటి లేనిది -, అన్నియు తానే అయినది, అంజనముతో కూడియున్నది, అంజనము లేనిది -; అంతా తానే అయినది, అంతా తనుకానిది. ఇటువంటిది తత్వము - అది ఈ శివుడే - ఇక్కడనే ఉన్నాడు).
(ātma yokka tatvamu, jīvaparamātmala tatvamu; brahmatatvamu) (bhagavattatvamu).
yāthātmyaṃ = ātma eṭlunnadō, ēmiṭō adi.
ātmanaḥ paramātmanaḥ tatvaṃ.nikhila jagatkāraṇatva sarva puruṣārtha pradātṛtvādi rūpaṃ tatvaṃ.
(paramātma tatvaṃ samasta jagattuku kāraṇamai yuṃḍuṭa, caturvidha puruṣārthamulanu iccunadi).
(ātmayokka nijarūpamaina saccidānaṃdarūpamu - nityamai yuṃḍuṭa, caitanyamu kaligi yuṃḍuṭa, mōkṣarūpamai yuṃḍuṭa).
ātmayokka svabhāvamu, nijasthiti, yadhārtha sthiti; prakṛti vikāramulaina ē vidhamaina upādhitōnu kaliyaka (aṃṭaka) uṃḍunappaṭi kēvalasthiti.
ahamēva paraṃ tatvaṃ mattō jātaṃ jagat surāḥ |
mayyēva saṃsthitaṃ naṣṭaṃ matsamō nādhikassadā |
tasmā dajñānamūlasya saṃsārasya kṣayō harē |
ātma nastatva vijñānāt tatvaṃ brahmaiva kēvalaṃ ||“. (sūta samhi tā yāṃ)
(nēnē paratatvamunu jagattu nāvalananē, nālōnuṃḍiyē puṭṭinadi, nālōnē uṃḍi pōṣiṃpabaḍucunnadi; nālōnē naśiṃcucunnadi - layamagucunnadi. aṃducēta ātma tatva jñānamu valananē ajñānamē kāraṇamaina saṃsāramu naśiṃci mukti kalugunu - tatvamanagā kēvalamu brahmamē -
(samasta prapaṃcamuyokka nijarūpamu paramātmayē - ī prapaṃcamaṃtā - ī prapaṃcamulōni vastuvulanniyu - para brahmamulōnuṃḍi puṭṭinavē, vāṭi anniṃṭilōnu lōpala paina pūrtigā vyāpiṃci yunnadi parabrahmamē kanuka ī prapaṃcamaṃtā parabrahmamē; kāni ajñānamuvalana - bhrāṃtivalana - okkokka vastuvuvale kanabaḍucunnadi. paramārtha dṛṣṭilō unnadaṃtayu paramātmayē - “aṃtā rāmamayaṃ bījagamaṃtā rāmamayaṃ”. “uṃḍēdī rāmuḍokaḍu”; “harimayamu viśvamaṃtayu, hari viśvamayuṃḍu”.
nēdi prakāśiṃcuneppuḍu; naṭṭi svayaṃjyōti, nityaṃbu, navyayaṃbu,
nākāśamunubōli yaviraḷa vyāpakamagu nātma tatvaṃbu nadhikamahima
namaru parabrahmamagunani palki, yiṭlaniye na vikrayuṃḍainavāḍu
tē. nevvaḍātaḍu danayaṃdunepuḍu nātma
kārya karaṇa samarthaṃbu gāni bhēda
buddhi janakaṃbunā dagu bhūri māya
jēsi viśvaṃbu satyaṃbugā sṛjiṃce”.
“ā. maṟala maṟala pekkumāṟulī viśvaṃbu
jananavṛddhi vilaya saṃgatulanu
naṃda jēyucuṃḍu naṭṭi yīśvaruḍavai
tanaru ninnu nātma tatvamuganu.
va. teliyudumu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 24 - 720 - 722)
īśvarārā dhanārthaṃca kurvāṇāḥ karma kēvalaṃ |
dhīśuddhi dvāratō vēdavākya janyātma dhīyutāḥ |
saṃtō janmākhya baṃdēna vinirmuktā aśēṣataḥ |
ātma tatvaṃ padaṃ brahmānaṃdaṃ māyā vivarjitaṃ |
puruṣārthaṃ vimōkṣākhyaṃ prāpnu vaṃtīha tādṛśāḥ |
tvamasyētā dṛśōbhūtvā gaccha viṣṇōḥ paraṃ padaṃ ||“. (gītābhāvaprakāśamu - 2 - 523 to 525)
(karmavalana kaligeḍu phalamunu viḍicipeṭṭi, kēvalamu bhagavaṃtuni ātādhana nimittamē karma cēyucu, citta śuddhi kaligiyuṃḍuṭacēta vēdavākyamulavalana kaligina ātmajñānamu kalavārai satpuruṣulainavāru janmamu anu baṃdhamunuṃḍi pūrtigā viḍuvabaḍinavārai ātmatatvamanu brahmānaṃdapadamunu poṃduduru. idiyē māyatōkaliyani brahmānaṃdapadamu, paramapadamu, paramapuruṣārthamu,mōkṣamu -).
sānubhūtyēkamānaṃca yattatvaṃ tadasau sthitaḥ |
yadēkaṃ cāpyanēkaṃca sāṃjanaṃca niraṃjanaṃ |
yatsarvaṃ cāpya sarvaṃ ca yattatvaṃ ta tadasau sthitaḥ ||“. (vāsiṣṭē)
(tējō rūpamulaina sūryuḍu modalaguvāṭikanna tējōvaṃtamainadi, dānikaṃṭe uttamamainadi maṟi yokaṭi lēnidi, tānu okaṭē ayinadi - tanavaṃṭi vastuvu iṃkokaṭi lēnidi -, anniyu tānē ayinadi, aṃjanamutō kūḍiyunnadi, aṃjanamu lēnidi -; aṃtā tānē ayinadi, aṃtā tanukānidi. iṭuvaṃṭidi tatvamu - adi ī śivuḍē - ikkaḍanē unnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.