← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మత్వం ātmatvaṃ

Original — తెలుగు
  1. అంతః ప్రవిశ్య నియంతృత్వం హ్యాత్మత్వం.

(ప్రతివస్తువులోను లోపల ప్రవేశించి నియంతగానుండుట - ఆ వస్తువునకు చైతన్యము కలిగించి దాని వృత్తులలో - పనులలో దానిని నియమించుట, దాని పనులు అది చేయునట్లు దానిని ప్రరేపించుట).

  1. అధిష్టా తృత్వం (సమస్త వస్తువులలోను అధిష్టించి ఉండడము - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్” దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను).

  2. పురుషార్థ ప్రతి సంబంధిత్వం, దేహ ప్రతి నియంతృతయా - వ్యాప్తిత్వం వా, తదభావో అనాత్మ త్వం.

(పురుషార్థమును సంపాదించుటలో సంబంధము కలుగచేయుట; దేహము ద్వారా కర్మలను చేయించుటకు దేహమంతటను - వస్తువునందంతటను పూర్తిగా వ్యాపించియుండుట, అట్లు వ్యాపించి యుండనిది అనాత్మయే).

Transliteration
  1. aṃtaḥ praviśya niyaṃtṛtvaṃ hyātmatvaṃ.

(prativastuvulōnu lōpala pravēśiṃci niyaṃtagānuṃḍuṭa - ā vastuvunaku caitanyamu kaligiṃci dāni vṛttulalō - panulalō dānini niyamiṃcuṭa, dāni panulu adi cēyunaṭlu dānini prarēpiṃcuṭa).

  1. adhiṣṭā tṛtvaṃ (samasta vastuvulalōnu adhiṣṭiṃci uṃḍaḍamu - “tat sṛṣṭvā tadēvānu prāviśat” dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu).

  2. puruṣārtha prati saṃbaṃdhitvaṃ, dēha prati niyaṃtṛtayā - vyāptitvaṃ vā, tadabhāvō anātma tvaṃ.

(puruṣārthamunu saṃpādiṃcuṭalō saṃbaṃdhamu kalugacēyuṭa; dēhamu dvārā karmalanu cēyiṃcuṭaku dēhamaṃtaṭanu - vastuvunaṃdaṃtaṭanu pūrtigā vyāpiṃciyuṃḍuṭa, aṭlu vyāpiṃci yuṃḍanidi anātmayē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.