← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్మౌ పమ్యం ātmau pamyaṃ

Original — తెలుగు
  1. “ఆత్మా స్వయమేవ ఉపమా, తద్భావః ఔపమ్యం - యథా మమసుఖం ఇష్టం, తథా సర్వప్రాణినాం సుఖం అనుకూలం, యదివా యచ్చదుఃఖం మమప్రతికూలం అనిష్టం యథా తథా సర్వప్రాణినాం దుఃఖం అనిష్టం ప్రతికూలం - ఇత్యేవం ఆత్మౌపమ్యం. తేన ఆత్మౌ పమ్యేన సుఖదుఃఖే అనికూల ప్రతికూలే తుల్యతయా సర్వ భూతేషు సమంపశ్యతి న కస్యచిత్ ప్రతికూలం ఆచరతి - అహింసకః ఇత్యర్థః - సయోగీ పరమః ఉత్కృష్టః” (శ్రీశంకరః)

(తానే ఉపమానముగా తలచుత ఔపమ్యము - నాకు సుఖముగానుండుట ఇష్టమైనట్లు - నాకు సుఖముగానుండుటకు యేది ఇష్టమైనదో అట్లే సమస్త ప్రాణులకు అది ఇష్టమైనది, సుఖమైనది, అనుకూలమైనది. ఏ దుఃఖము నాకు ప్రతికూలమో ఏది ఇష్టముకానిదో అదే సమస్త ప్రాణులకు ప్రతికూలమైనది, ఇష్టముకానిది - ఇట్లు భావించుట ఆత్మౌపమ్యము - ఆత్మతో - తనతో - సమానముగా భావించుట. ఈ ఆత్మౌ పమ్యమువలన సుఖమునందు, దుఃఖమునందు సర్వభూతములను సమముగా చూచును - ఎవరికిని ప్రతికూలము చేయడు - అనగా హింసచేయనివాడు అని అర్థము - అట్టియోగి పరమయోగి, ఉత్కృష్టమైన యోగి).

  1. “స్వాత్మనః అన్యేషాం ఆత్మనాం అసంకుచిత జ్ఞానైకాకారతయా ఔపమ్యేన స్వాత్మని చ అన్యేషుచ సర్వత్ర వర్తమానం పుత్ర జన్మాది రూపం సుఖం తన్మరణాది రూపంచ దుఃఖం అసంబంధసామ్యాత్ సమం యః పశ్యతి - పరపుత్ర జన్మమరణాది సమం స్వపుత్ర జన్మ మరణాదికం యః పశ్యతి ఇత్యర్థః - సయోగీ పరమో మతః, యోగకాష్ఠాం గతోమతః” (శ్రీరామానుజః)

(తన ఆత్మయు ఇతరుల ఆత్మయు ఒకే మరమాత్మయొక్క అంశలని, తనకు కొడుకుపుట్టుట మొదలగునవి తనకు సుఖమును కలిగించునట్లే అందఱికి ఆ ప్రకారముగానే కొడుకు పుట్టిన సుఖమును కలిగించుననిన్నీ, తనకొడుకు మరణించుట తనకు ఏ ప్రకారము దుఃఖమును కలిగించునో ఆ ప్రకారమే అందఱికి కలిగిన అందఱికి దుఃఖముకలుగునని ఎవడు తలచి అట్లు ప్రవర్తించునో - అనగా ఇతరుల పుత్ర జననమరణములను తన పుత్ర జననమరణములుగా ఎవడు తలంచునో ఆ ప్రకారము ఆచరించునో, అట్టివాడు యోగులలో ఉత్తముడు).

  1. “ఉపమా శబ్దః తుల్య వచనః, తస్య భావః ఔపమ్యం సర్వేషాం ఆత్మనాం దేహ విలక్షణత్వాదిసామ్యేనఇత్యర్థః” (శ్రీ వేదాంతదేశికః)

(ఉపమానము అనగా సమానము - దాని భావము, సమానముగానుండుట ఔపమ్యము - అందఱి ఆత్మలు దేహముకంటె వేరైనవే యగుటచేత ఒకటే అని తలంచుట ఆత్మౌపమ్యము).

  1. “నీవలనే ఇతరులను చూచుకొనుట - నీవు నీకేమి యొనర్పదలంచుకొందువో దానిని ఇతరులకు చేయుము. నిన్ను నీవు సుఖపెట్టతలచినచో అట్టి సుఖమును ఇతరులకు కలుగచేయుము - - - ఒకరు నిన్నుభాధించకూడదని తలచితివా ఇతరులకు నీవు బాధకలుగచేయకూడదు” –

  2. “ఆత్మౌ పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో(అ)ర్జున |

సుఖం వా యదివా దుఃఖం స యోగీ పరమో మతః ||“. (శ్రీమద్భగవద్గీత - 6 - 32)

“స్వ దృష్టాంతేన సర్వత్ర సముపశ్యతి యో(అ)ర్జున |

సుఖం వా యది వా దుఃఖం తుల్యం యః పరిపశ్యతి |

యదా మమ సుఖం నిత్యమిష్టమేవం హి దేహినాం |

సర్వే షా మనుకూలం స్యాదితి పశ్యతి సన్మతిః |

ప్రతికూలం యదా దుఃఖం మమైవం సర్వదేహినాం |

ప్రతికూలం తథా చాయం సర్వభూతహితే రతః |

కస్య చిన్మనసా వాచా పీడామ్నాచ రతీహయః |

కర్మణా వాస యోగీతు సర్వోత్కృష్ట తయా మతః ||“. (గీతాభావప్రకాశము - 6 - 161 to 165)

(చూడుము - 2).

Transliteration
  1. “ātmā svayamēva upamā, tadbhāvaḥ aupamyaṃ - yathā mamasukhaṃ iṣṭaṃ, tathā sarvaprāṇināṃ sukhaṃ anukūlaṃ, yadivā yaccaduḥkhaṃ mamapratikūlaṃ aniṣṭaṃ yathā tathā sarvaprāṇināṃ duḥkhaṃ aniṣṭaṃ pratikūlaṃ - ityēvaṃ ātmaupamyaṃ. tēna ātmau pamyēna sukhaduḥkhē anikūla pratikūlē tulyatayā sarva bhūtēṣu samaṃpaśyati na kasyacit pratikūlaṃ ācarati - ahiṃsakaḥ ityarthaḥ - sayōgī paramaḥ utkṛṣṭaḥ” (śrīśaṃkaraḥ)

(tānē upamānamugā talacuta aupamyamu - nāku sukhamugānuṃḍuṭa iṣṭamainaṭlu - nāku sukhamugānuṃḍuṭaku yēdi iṣṭamainadō aṭlē samasta prāṇulaku adi iṣṭamainadi, sukhamainadi, anukūlamainadi. ē duḥkhamu nāku pratikūlamō ēdi iṣṭamukānidō adē samasta prāṇulaku pratikūlamainadi, iṣṭamukānidi - iṭlu bhāviṃcuṭa ātmaupamyamu - ātmatō - tanatō - samānamugā bhāviṃcuṭa. ī ātmau pamyamuvalana sukhamunaṃdu, duḥkhamunaṃdu sarvabhūtamulanu samamugā cūcunu - evarikini pratikūlamu cēyaḍu - anagā hiṃsacēyanivāḍu ani arthamu - aṭṭiyōgi paramayōgi, utkṛṣṭamaina yōgi).

  1. “svātmanaḥ anyēṣāṃ ātmanāṃ asaṃkucita jñānaikākāratayā aupamyēna svātmani ca anyēṣuca sarvatra vartamānaṃ putra janmādi rūpaṃ sukhaṃ tanmaraṇādi rūpaṃca duḥkhaṃ asaṃbaṃdhasāmyāt samaṃ yaḥ paśyati - paraputra janmamaraṇādi samaṃ svaputra janma maraṇādikaṃ yaḥ paśyati ityarthaḥ - sayōgī paramō mataḥ, yōgakāṣṭhāṃ gatōmataḥ” (śrīrāmānujaḥ)

(tana ātmayu itarula ātmayu okē maramātmayokka aṃśalani, tanaku koḍukupuṭṭuṭa modalagunavi tanaku sukhamunu kaligiṃcunaṭlē aṃdaṟiki ā prakāramugānē koḍuku puṭṭina sukhamunu kaligiṃcunaninnī, tanakoḍuku maraṇiṃcuṭa tanaku ē prakāramu duḥkhamunu kaligiṃcunō ā prakāramē aṃdaṟiki kaligina aṃdaṟiki duḥkhamukalugunani evaḍu talaci aṭlu pravartiṃcunō - anagā itarula putra jananamaraṇamulanu tana putra jananamaraṇamulugā evaḍu talaṃcunō ā prakāramu ācariṃcunō, aṭṭivāḍu yōgulalō uttamuḍu).

  1. “upamā śabdaḥ tulya vacanaḥ, tasya bhāvaḥ aupamyaṃ sarvēṣāṃ ātmanāṃ dēha vilakṣaṇatvādisāmyēnaityarthaḥ” (śrī vēdāṃtadēśikaḥ)

(upamānamu anagā samānamu - dāni bhāvamu, samānamugānuṃḍuṭa aupamyamu - aṃdaṟi ātmalu dēhamukaṃṭe vērainavē yaguṭacēta okaṭē ani talaṃcuṭa ātmaupamyamu).

  1. “nīvalanē itarulanu cūcukonuṭa - nīvu nīkēmi yonarpadalaṃcukoṃduvō dānini itarulaku cēyumu. ninnu nīvu sukhapeṭṭatalacinacō aṭṭi sukhamunu itarulaku kalugacēyumu - - - okaru ninnubhādhiṃcakūḍadani talacitivā itarulaku nīvu bādhakalugacēyakūḍadu” –

  2. “ātmau pamyēna sarvatra samaṃ paśyati yō(a)rjuna |

sukhaṃ vā yadivā duḥkhaṃ sa yōgī paramō mataḥ ||“. (śrīmadbhagavadgīta - 6 - 32)

“sva dṛṣṭāṃtēna sarvatra samupaśyati yō(a)rjuna |

sukhaṃ vā yadi vā duḥkhaṃ tulyaṃ yaḥ paripaśyati |

yadā mama sukhaṃ nityamiṣṭamēvaṃ hi dēhināṃ |

sarvē ṣā manukūlaṃ syāditi paśyati sanmatiḥ |

pratikūlaṃ yadā duḥkhaṃ mamaivaṃ sarvadēhināṃ |

pratikūlaṃ tathā cāyaṃ sarvabhūtahitē rataḥ |

kasya cinmanasā vācā pīḍāmnāca ratīhayaḥ |

karmaṇā vāsa yōgītu sarvōtkṛṣṭa tayā mataḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 161 to 165)

(cūḍumu - 2).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.