జీవాత్మ పరమాత్మ తత్వం. (జీవాత్మ పరమాత్మ తత్వం).
అనాత్మా వహ్న నసిద్ధాత్మ మాత్రావ శేషో హి ఆత్మ యాధాత్మ్యం.
(తనను కప్పిపుచ్చి యుండు ప్రకృతి, దాని వికారములను త్రోసివేసి లోపల ఆత్మ మాత్రముగా నుండునది. ఆత్మ పరమాత్మ సృష్టి అంతటిలోను ప్రకృతితోను, ప్రకృతి వికారములతోను విడదీయలేని సంబంధముతో కలిసియున్నాడు. అట్టి ప్రకృతి, దాని వికారములు పరమాత్మను పైకి కనబడకుండా కప్పిపుచ్చి యున్నవి, అట్లు వాటిచే కప్పబడకయుండునట్టి ఆత్మ కేవలము ఆత్మగానే యుండుస్థితి ఆత్మ యాదాత్మ్యము - లేక, సృష్టి ప్రారంభములోనే పరమాత్మ ప్రకృతిలో ప్రవేశించుటకుముందు ఉన్న ఆత్మస్థితి - యదార్థస్థితి - సృష్టిలోని అన్ని వస్తువులలోను పూర్తిగా వ్యాపించియున్నప్పటికీ ఆ వస్తువుల రూపములోనే కనబడును కాని ఆ వస్తువులను వదలి వెలిగా వచ్చి తన నిజరూపముతో ఎన్నడూ కనబడడు. ఆ వస్తువులను - ఆ ఉపాధులను - అందులోని ఆత్మను విడదీయుట సాధ్యముకాదు - ప్రకృతి పురుషులను విడదీయుట సాధ్యముకాదు. అర్థనారీశ్వర విగ్రహములోని పార్వతినిపరమేశ్వరుని విడదీయుటకు శక్యము కానట్లే).
jīvātma paramātma tatvaṃ. (jīvātma paramātma tatvaṃ).
anātmā vahna nasiddhātma mātrāva śēṣō hi ātma yādhātmyaṃ.
(tananu kappipucci yuṃḍu prakṛti, dāni vikāramulanu trōsivēsi lōpala ātma mātramugā nuṃḍunadi. ātma paramātma sṛṣṭi aṃtaṭilōnu prakṛtitōnu, prakṛti vikāramulatōnu viḍadīyalēni saṃbaṃdhamutō kalisiyunnāḍu. aṭṭi prakṛti, dāni vikāramulu paramātmanu paiki kanabaḍakuṃḍā kappipucci yunnavi, aṭlu vāṭicē kappabaḍakayuṃḍunaṭṭi ātma kēvalamu ātmagānē yuṃḍusthiti ātma yādātmyamu - lēka, sṛṣṭi prāraṃbhamulōnē paramātma prakṛtilō pravēśiṃcuṭakumuṃdu unna ātmasthiti - yadārthasthiti - sṛṣṭilōni anni vastuvulalōnu pūrtigā vyāpiṃciyunnappaṭikī ā vastuvula rūpamulōnē kanabaḍunu kāni ā vastuvulanu vadali veligā vacci tana nijarūpamutō ennaḍū kanabaḍaḍu. ā vastuvulanu - ā upādhulanu - aṃdulōni ātmanu viḍadīyuṭa sādhyamukādu - prakṛti puruṣulanu viḍadīyuṭa sādhyamukādu. arthanārīśvara vigrahamulōni pārvatiniparamēśvaruni viḍadīyuṭaku śakyamu kānaṭlē).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.