← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆత్యంతిక ప్రళయము ātyaṃtika praḷayamu

Original — తెలుగు
  1. ప్రళయములు నాలుగు విధములు : - నిత్యప్రళయము, నైమిత్తిక ప్రళయము,

ప్రాకృత ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, - త్రిగుణములకు మూలమైన ప్రకృతి పురుషునిలో - పరమాత్మలో కలియుట ప్రాకృత ప్రళయము - ఆత్యంతిక ప్రలయమనగా చతుర్థ ప్రళయము, తురీయ ప్రళయము -

  1. “రెండు మూడు అని వేరు వేరుగా తోచే భేద జ్ఞానాన్ని పోగొట్టి అద్వైతానుభవాన్ని మోక్షానందాన్ని ఇచ్చేదే ఆత్యంతిక ప్రలయం”.

  2. “మృగి జలం ఉండగనే దబ్బరైనట్టు, ఆకాశమందు నీలత్వం ఉండగనే దబ్బరైనట్టు ఈ ప్రపంచము విచారిస్తే మిధ్య, న్రహ్మమే సత్యము, సకలమున్నూ కలిగే లేకుండును, కేవలబ్రహ్మ చైతన్యము సత్యము. ఈ ప్రకారాన సకల జీవకృతియైన సకల ప్రపంచమున్నూ వివేక ప్రళయుడు సమ్హారం చేసును. ఇది ప్రత్యర్థ ప్రళయం. ఇదేఆత్యంతిక ప్రళయం”. (బ్రహ్మవిద్యా సుధార్ణవము - 1)

  3. “బ్రహ్మ సాక్షాత్కార నిమిత్తికః సర్వమోక్షః. సబైక జీవవాదే యుగపదేవ, నానా జీవ వాదే తు క్రమేన.”సర్వ ఏకీ భవంతి” ఇత్యాది శ్రుతేః. తత్రాద్యాస్త్రయోపి లయాః కర్మోపరతి నిమిత్తాః తురీయస్తు జ్ఞానోదయ నిమిత్తో లయో జ్ఞానేన సహైవేతి విశేషః“. (వేదాంత పరిభాషా)

(మోక్షవిధములన్నియు బ్రహ్మసాక్షాత్కారముకొఱకే. జీవుడు అనువాడు ఒకడే అను వాదములో ఒక్కమారే మోక్షము కలిగుట. జీవులు అనేకములు అను వాదములో క్రమముగా ఒకటీ ఒకటీ ముక్తిపొందును. మొదటి మూడువిధములు అగు లయప్రకారము కర్మయోగమువలన కలిగినవి. నాలుగవది జ్ఞానమువలన కలుగునది).

Transliteration
  1. praḷayamulu nālugu vidhamulu : - nityapraḷayamu, naimittika praḷayamu,

prākṛta praḷayamu, ātyaṃtika praḷayamu, - triguṇamulaku mūlamaina prakṛti puruṣunilō - paramātmalō kaliyuṭa prākṛta praḷayamu - ātyaṃtika pralayamanagā caturtha praḷayamu, turīya praḷayamu -

  1. “reṃḍu mūḍu ani vēru vērugā tōcē bhēda jñānānni pōgoṭṭi advaitānubhavānni mōkṣānaṃdānni iccēdē ātyaṃtika pralayaṃ”.

  2. “mṛgi jalaṃ uṃḍaganē dabbarainaṭṭu, ākāśamaṃdu nīlatvaṃ uṃḍaganē dabbarainaṭṭu ī prapaṃcamu vicāristē midhya, nrahmamē satyamu, sakalamunnū kaligē lēkuṃḍunu, kēvalabrahma caitanyamu satyamu. ī prakārāna sakala jīvakṛtiyaina sakala prapaṃcamunnū vivēka praḷayuḍu samhāraṃ cēsunu. idi pratyartha praḷayaṃ. idēātyaṃtika praḷayaṃ”. (brahmavidyā sudhārṇavamu - 1)

  3. “brahma sākṣātkāra nimittikaḥ sarvamōkṣaḥ. sabaika jīvavādē yugapadēva, nānā jīva vādē tu kramēna.”sarva ēkī bhavaṃti” ityādi śrutēḥ. tatrādyāstrayōpi layāḥ karmōparati nimittāḥ turīyastu jñānōdaya nimittō layō jñānēna sahaivēti viśēṣaḥ”. (vēdāṃta paribhāṣā)

(mōkṣavidhamulanniyu brahmasākṣātkāramukoṟakē. jīvuḍu anuvāḍu okaḍē anu vādamulō okkamārē mōkṣamu kaliguṭa. jīvulu anēkamulu anu vādamulō kramamugā okaṭī okaṭī muktipoṃdunu. modaṭi mūḍuvidhamulu agu layaprakāramu karmayōgamuvalana kaliginavi. nālugavadi jñānamuvalana kalugunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.