← Back to ఔ · Booklets 11–20 (digitized file 2)

ఔషనిషధః పురుషః auṣaniṣadhaḥ puruṣaḥ

Original — తెలుగు
  1. ఉపనిషదేక సమధి గమ్యః -

(ఉపనిషద్వాక్యములచేతనే తెలియదగు పురుషుడు - పరమాత్మ నిరాకారుడు - అందుచేత ఏ ప్రమాణములచేతనైనను తెలుసుకొనుటకు వీలుకానివాడు. ప్రమాణములు పరమాత్మ ఉన్నాడని చెప్పగలవుకాని ఎటువంటివాడో చెప్పలేవు. ఉపనిషత్తులు భగవంతుని గుఱించి - అతని స్వ స్వరూపము గుఱించి చెప్పుచున్నందున అట్లు వాటిలో చెప్పబడిన పురుషుడు ‘ఔపనిషదః పురుషః’).

  1. “తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి ఇతిచ ఔపనిషదత్వ విశేషణం పురుషస్య ఉపనిషత్సు ప్రాధాన్యేన ప్రకాశ్యమానత్వాత్ ఇతిచ నిరూపితం. అత ఏవ సర్వేషు వేదేషు ఉపనిషదయా వర్తయేదితి శ్రుతిః - ఉపనిషద మర్థతో అనుసంధద్యాదిత్యర్థః తథాచ తత్తదుపనిషది తేన తేన ప్రకారేణ ప్రతిపాదితమాత్మానం సదా భావయే దితి”.

(ఉపనిషత్తులలో ముఖ్యముగా పరమాత్మయే చెప్పబడుచున్నాడు. అందుచేత ఉపనిషత్తులన్నింటిలోను వాటిలో చెప్పబడిన ప్రకారముగనుండు పరమాత్మనే అనుసంధానము చేయవలెనని చెప్పబడినది).

  1. నిరుపాధికస్యాత్మనః స్వరూపేణవక్తు మశక్యత్వా దేహేంద్రియాద్యుపాధి నిరాసద్వారా ప్రతిపాదయి తుం దేహేంద్రియ మన ఆదిషు ఆత్మనస్సంబంధః శ్రుత్యా దర్శితః.

(ఉపాధి లేనటువంటి ఆత్మయొక్క స్వస్వరూపమును వర్ణించుటకు శక్యముకానందున, దేహము ఇంద్రియములు మొదలగు ఇంద్రియములను నిరసించుటద్వారా దేహేంద్రియాదులగు ఉపాధులతో ఆత్మకు సంబంధము శ్రుతులలో ఈ క్రింద విధముగా చెప్పబడినది:-

  1. “తత్సృష్ట్వా తదేవాను ప్రావిశదితి” (తైత్తిరీయే)

(లోకములను సృష్టించి వాటిలోనే ప్రవేశించెను - అనగా, లోకములోనున్న అన్ని వస్తువులలోను ప్రవేశించి భగవంతుడు ఉన్నాడు ఇందుమూలముగా పరమాత్మకు ఉపాధితో సంబంధము చెప్పబడినది)

  1. “స ఏ ఇహ ప్రతిష్ట ఆనఖాగ్రేభ్యః” ఇతి బృహదారణ్యకే.

(ఆ పరమాత్మ ఈ శరీరములో గోళ్ళ చివర వఱకు అంతట ఉన్నాడు - శరీరము అను ఉపాధిలో ఉన్నాడు).

  1. “ఇహైవాంతశ్శరీరే, సోమ్య! పురుష” ఇతి ప్రశ్నోపనిషది.

(ఈ పురుషుడనువాడు శరీరాంతరమందు - లోపలి శరీరమందు - ఉన్నాడు).

  1. “గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే” ఇతి కాఠకే.

(గుహవలె - లోపలనున్నది పైకి కనబడకుండా ఉండు ఉపాధిలో ఈ పరమాత్మ ఉన్నాడు. లోపల ఉన్నప్పటికీ పైకి లేనట్లు - కనబడకుండునట్లుండు ఉపాధిలో నున్నాడు).

  1. “చక్షుః శ్రోత్రం క ఉదేవోయునక్తి” ఇతిచ లేనోపనిషధి. అత్ర చక్షుః శ్రోత్రాది ప్రేరకత్వాత్ ఏవ తత్సంబంధో (అ)ర్దా ద్దర్శితః.

(చక్షువులను, శ్రోత్రములను, వాటిలోనుండి, వాటి వృత్తులలో ప్రేరేపించువాడు కనుక ఆత్మకు వాటితో సంబంధము).

  1. “స ఏవ మాయాపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం |

స్త్రి యన్నపానాది విచిత్ర భోగైః స ఏవ జాగ్రత్పరితృప్తి మేతి ||“.

ఇత్యాది నా శరీర సంబంధో అవస్థా సంబంధశ్చ దర్శితః. ఇతి కైవల్యోపనిషది.

(ఈ ఆత్మయే మాయచేత మోహపరవశమై శరీరమును పొంది అన్నియు చేయుచుండును. స్త్రీ సంభోగము, అన్నపానములు మొదలగు భోగములననుభవించుచు, జాగ్రదవస్థ మొదలగు అవస్థలను పొందుచూ తృప్తి పొందుచుండును. దీనిని బట్టి ఆత్మకు శరీరముతో సంబంధము, అవస్థా త్రయ సంబంధము కలుగుచున్నది - రూపములేని పరమాత్మకు పైన చెప్పిన ప్రకారము ఉపాధులతో సంబంధము కలదని తెలియుచున్నది - ఉపనిషద్పురుషుడు ఇటువంటువాడు).

  1. క్వచిదుపాధి నిరాసద్వారా ఆత్మాని రూప్యతే: -

(కొన్ని ఉపనిషత్తులలో ఉపాధితో కూడి ఉండని ఆత్మ చెప్పబడినది).

  1. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సో(అ)శ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి”. (తైత్తిరీయోపనిషత్)

“ఏకైకో విశేషణ శబ్దః పరస్పర నిరపేక్షఓ బ్రహ్మ శబ్దేన సంబధ్యతే సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మేతి. సత్య శబ్దః సత్స్వరూపం బ్రహ్మ లక్షయిత్వా, స్వరూపస్య నృతత్వం నిషేధతి జ్ఞాన శబ్దః జ్ఞప్తి స్వరూపం బ్రహ్మ లక్షయిత్వా జడతం నిషేధతి. ఆనంద శబ్దః సుఖ స్వరూపం బ్రహ్మ లక్షయిత్వా దుఃఖాత్మకత్వం నిషేదతి. అనంత శబ్దస్తు దేశకాలవస్తు కృత పరిచ్ఛేదత్రయం నిషేధతి, నతు స్వార్ధం కించిద్రూపం సమర్థయతి. తత్ యధోక్త లక్షణం బ్రహ్మ యో వేద విజానాతి నిహితం గుహాయాం బుద్ధౌ నిగూఢః, జ్ఞాన, జ్ఞాతృ జ్ఞేయ పదార్థాః అస్యామితి గుహా బుద్ధిః నిగూఢేస్యాం భోగాపవర్గా వితివా, పరమే ప్రకృష్టే వ్యోమన్ వ్యోమ్ని ఆకాశే హర్దే ప్రసిద్ధం హి హర్దాకాశస్య పరమత్వం, తస్మిన్ హార్దే యా బుద్ధిః గుహా, తస్యాం నిహితం బ్రహ్మ తద్వత్యా వివక్తయా ఉపలభ్యతే ఇతి, నహ్యన్యథా విశిష్ట దేశకాల సంబంధో(అ) స్తి బ్రహ్మణః, సర్వగతత్యాత్ నిర్విశేషత్వాచ్చ).

(“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ” అని చెప్పినపుడు ఈ మూడు విశేషణములలో ఒక్కొక్క విశేషణముతో కూడిన బ్రహ్మయనియు, ఒక విశేషణమునకు మఱియొక విశేషణమునకు సంబంధము లేనట్లుగనే అవగాహన చేసుకొనవలెను. ఒక విశేషణమును మఱియొక విశేషణముతో సంబంధము లేనిదానివలెనే - మఱియొక విశేషణము యొక్క అపేక్ష లేనిదానివలెనే - అన్వయించుకొనవలెను - అది ఎట్లనగా ‘సత్యం బ్రహ్మ’, ‘జ్ఞానం బ్రహ్మ’, ‘అనంతం బ్రహ్మ’ అని అనుకొనవలెను. ‘సత్యం బ్రహం’ అని చెప్పుటచేత బ్రహ్మ యొక్క సత్ స్వరూపము (త్రికాలములందుండునది) చెప్పుచు బ్రహ్మ స్వస్వవరూపము అనృతము కాదని తెలియచేయ బడినది. “జ్ఞానం బ్రహ్మ” యనుటచేత బ్రహ్మ జ్ఞప్తి స్వరూపము అని తెలియచేయుచు జడముకాదు అని తెలియచేయుచున్నది. “ఆనందం బ్రహ్మ” అని చెప్పుటచేత బ్రహ్మ సుఖస్వరూపము - ఆత్యంతిక సుఖస్వరూపము, (మోక్షస్థానము) అని చెప్పుచూ దుఃఖము కలిగించునది కాదు అని చెప్పబడినది. “అనంతం బ్రహ్మ” అని చెప్పుటచేత త్రివిధపరిచ్ఛేదరహితము బ్రహ్మ - దేశకాల, వస్తువులచేత పరిమితిలేనివాడు, అన్ని ప్రదేశములందు, అన్నికాలములందు, అన్ని వస్తువులందు ఉండువాడు - అని చెప్పబడినది).

(పైన చెప్పబడిన ప్రకారము సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అను లక్షణములు గల బ్రహ్మ బుద్ధియను గుహ యందున్నది. జ్ఞానము, జ్ఞాతృ, జ్ఞేయము అను మూడును గూఢమగు బుద్ధియందున్నవి కనుక బుద్ధి గుహ యని చెప్పబడుచున్నది. లేక భోగములు, మోక్షము దానిలోనే ఉన్నవి కనుక, దీనివలననే కలుగుచున్నవి కనుక ఇది గూఢమైన గుహ యని చెప్పబడుచున్నది. పరమాకాశమని ప్రసిద్ధి చెందిన హృదయమందున్న బుద్ధి గుహ యనిపించుకొనుచున్నది. అందులో పరబ్రహ్మ యున్నాడు. వివేకముగల ఆ బుద్ధియందు దాని వివేచనవృత్తి ద్వారా లభ్యమగుచున్నాడు. అట్టి పరబ్రహ్మ మఱియొకరీతిగా లభ్యముకాదు – బ్రహ్మ నిర్విశేషమగుటవలనను, అన్నింటిలోను ప్రవేశించి యుండుటచేతను ఒక్కొక్క ప్రదేశములోను, ఒక్కొక్క కాలమందును వాటి విశేషమునుబట్టి లభ్యమగుచున్నాడు).

  1. “ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్” ఇతి. (ఐతరేయోపనిషత్)

(అనేక రూపములతో, నామములతో ఇప్పుడు కనబడు ఈ ప్రపంచమంతయు మొట్టమొదట - సృష్టి ప్రారంభముకాకముందు - ఒక్క ఆత్మగానే ఉండెను - ఈ ఆత్మయే తరువాత ప్రపంచముగా మారెను).

  1. “సదేవసోమ్యే దమగ్ర ఆసీత్ - సచ్చిదానంద రూపేణ ప్రతిపాదితః సత్య జ్ఞానాం తానందాత్మకమఖండ మద్వితీయ మేకమనాద్యంతం పరమార్థ భూతం వస్తు తత్వ మసి”. (ఛాందోగ్యోపనిషత్)

(అనేక నామరూపములతో ఇప్పుడు కనబడుచున్న ఈ ప్రపంచము మొట్టమొదట - సృష్టి ప్రారంభములో - సత్ పదార్థమొకటే యుండెను - అదియే సచ్చిదానందము అని చెప్పబడుచున్నది. ఈ సత్పదార్థము అనునది ఒకటే, అటువంటిది మఱియొకటి లేదు - సరేకదా, అదికాక ఇతర వస్తువు అనునది లేదు - దానికి మొదలులేదు, తుది లేదు - జననములేదు, మరణములేదు - ఇది అఖండము - ఇదియే పరమార్థమైన మోక్షము, మోక్షస్థానము).

  1. “నిత్యో, నిష్కలో, నిరాఖ్యాతో, నిర్వికల్పో. నిరంజనః |

శుద్ధో (అ)ద్వితీయోస్తి కశ్చిత్, - య వేం వేద” (నారాయణోపనిషత్)

(అన్నికాలములందు ఉండువాడు, కళలు లేనివాడు, పేరులేనివాడు, నిర్వికల్పుడు, నిరంబరుడు, శుద్ధుడు, అద్వితీయుడు, అని పరమాత్మను యెలుసుకొనువాడు - - - ).

  1. “తదేవ నిష్కలం బ్రహ్మ, నిర్వికల్పం, ఇరంజనం, తద్బ్రహ్మా హమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం ||

నిర్వికల్పమనం తంచ హేతు దృష్టాంతవర్జితం |

అప్రమేయ మనాదించ యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః ||“. (అమృతబిందూపనిషత్)

(బ్రహ్మ నిష్కలము, నిర్వికల్పము, నిరంజనము; అట్టి బ్రహ్మ నేనే యని తెలుసుకొని బ్రహ్మపదమును పొందును. నిర్వికల్పము, అనంతము, కారణ దృష్టాంతములు లేనివాడు - ఏ విధమైన ప్రమాణములచేత తెలియబడనివాడు, జన్మ లేనివాడు అని ఈ విధముగా బ్రహ్మను తెలుసుకొనినవాడు, జ్ఞాని,ముక్తిని పొందును).

  1. “సదా అయం సర్వేషు దేహేషు వ్యాప్తో వర్తతే, యదాహ్యగ్నిః కాష్టేషు తైలమివ, తం విదిత్వా అతిమృత్యుమేతి -” (హంసోపనిషత్)

“యదా కాష్టేషు అగ్నిరసభివ్యక్తస్సన్ మధనేనభి వ్యజ్యతే, యథావా. తిలేషు తైలమనభివ్యక్తసత్, యంత్ర నిష్పీడనేనాభివ్యజ్యతే, ఏవమాత్మా సర్వత్ర వ్యాప్తోపి అవిద్యయా తిరోహి తస్సన్ శ్రవణమననాది జన్య సాక్షాత్కారేణ అభివ్యజ్యతే తం పరమాత్మానం ప్రత్యగభిన్నత్వేన”అహమస్మి పరబ్రహ్మే” తి విదిత్వా మృత్యుం జననమరణ ప్రవాహరూపం సంసారం పునర్న ఆప్నోతి, సంసారమూలాజ్ఞానస్య జ్ఞానేన నాశాదితి“.

(కట్టెలందు అగ్ని వ్యాపించియున్నట్లు, తిలలందు - నువ్వులలో - తైలము - నూనె - అడగి యున్నట్లు ఈ ఆత్మ సమస్త దేహములందు వ్యాపించియున్నది. అట్టి ఆత్మను, ఆ ప్రకారముగనున్న ఆత్మను తెలుసుకొనినచో మృత్యువును పొందడు).

(కట్టెలందు అగ్ని ఉన్నప్పటికీ పైకి కనబడకుండా ఉండి మధించిన పైన పైకి వచ్చి ఎట్లు కానబడునో, తిలలో పైకి కనబడకుండ ఉన్న తైలము యంత్రముచే పీడించబడినదై పైకి ఎట్లు కనబడునో, ఆ ప్రకారముగానే ఆత్మ అన్నింటిలోను వ్యాపించియున్నప్పటికీ అవిద్యవలన కానరాకయుండి, శ్రవణము, మననము మొదలగువాటివలన కలుగు సాక్షాత్కారము చేత కనబడును. అట్టి పరమాత్మ ప్రత్యగాత్మకన్న వేఱుకాదని - జీవాత్మకన్న వేఱుకాదని, నేనే పరబ్రహ్మను - జీవుడే పరబ్రహ్మ - అని తెలుసుకొని చావు పుట్టువుల ప్రవాహరూపమలో నుండునదియే యగు సంసారమును పొందడు - సంసారమునకు మూలమైన అజ్ఞానము జ్ఞానముచే నశించును కనుక).

  1. “పర ఈశోవా శివ ఏకో ధ్యేయః శివంకరః, సర్వ మన్యత్పరిత్యజ్య సమాప్తా(అ) ధర్వ శిఖేతి” (అధర్వశిఖోపనిషత్)

“కృత్స్నా ధర్వ శిఖార్థో సరూపమిదం సర్వ వేదాంతార్థ సార సంగ్రహ జాతంచ - ఆత్మ వ్యతిరిక్తస్య సర్వస్యఅనాత్మత్వేన మిధ్యాత్వాత్ తత్పరిత్యాగ పూర్వకం ప్రత్యగభిన్నః శివ ఏవ సాక్షాత్కార పర్యంతం ధ్యేయః”.

(అధ్ర్వ శిఖోపనిషత్ యొక్క అర్థమిదియే - సర్వోపనిషత్తులలోని సారము సంగ్రహింపబడినదిదియే - ఆత్మకానిది అంతయు అనాత్మయే, మిధ్యయే అని వాటిని వదలి ప్రత్యగాత్మకన్న వేఱుకాని - జీవాత్మకన్న వేఱుకాని - శివుడే, శివంకరుడే - మంగళకరుడైన శివు డే - ధ్యానింపతగినవాడు).

  1. “ఔపనిషధమేవ సువిజ్ఞాతం సకృద్విభావ్యం పురతో అస్మాత్, సర్వస్మాత్ సువిజ్ఞాతమపస్యత”అహంసః సోహమితి”

(ఉత్తరతాపినీయోపనిషత్)

“యద్యస్యేవం సర్వ విశేషణవతం తథా ఉపనిషద్భిరేవ లక్షణయా జ్ఞాతవ్యం. ఉపనిషద్భిర్లక్షణయా జ్ఞాతే స్పష్టతయా బ్రహ్మ జ్ఞాతం భవతి”.

(ఏ విధమైన విశేషములు లేనటువంటి - నిర్విశేషమైన - పరబ్రహ్మ ఉపనిషత్తులవలననే తెలియనగును. ఉపనిషత్తులలోని లక్షణములుచేత పరబ్రహ్మను స్పష్టముగా తెలియనగును) - “నేనే ఆ పరబ్రహ్మను, అతనే నేను” - ‘అహం బ్రహ్మస్మి’ అను మహావాక్యార్థము స్పష్టముగా తెలియనగును).

  1. “సహోవాచ తద్వా ఏతత్ బ్రహ్మాద్వయం, బృహత్వాన్నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం, సత్యం, సూక్ష్మం, పరిపూర్ణమద్వయం, సదానందం, చిన్మాత్రమాత్మైవా వ్యవహార్యం కేనచ న తదేతదాత్మ జ్ఞానమోమిత్య పశ్యంతః పశ్యత. తదేతత్సత్య మాత్మా బ్రహ్మైవ, బ్రహ్మాత్మైవ. అత్రహ్యేవ న విచికి త్సు మిత్యోం సత్యం తదేతత్ పండితా ఏవ పశ్యత్యే తద్ధి అశబ్ద మస్పర్శ మరూపమరస మగంధమవ్యక్త మనా దాత వ్యయ గంతవ్యమ విసర్జియి తస్య మనానంద యి తవ్యమంతవ్య మబోద్ధవ్య మబోద్ధవ్య మన హంకర్తవ్య మచేత యితవ్య మ ప్రాణ యితవ్య మపాన యితవ్య మవ్యాన యితవ్య మనుదాశ యితవ్య మసమాన యితవ్య మనింద్రియ మవిషయీ కరణం మసమాన యితవ్య మలక్షణ మసంగమ గుణ మవికార్య మవ్యపదేశ్య మసత్వ మరజస్క మతమస్క మమాయ మప్యౌపనిషధమేవ పురుషం విభాతం పురతో (అ) స్మాత్ సర్వస్మాత్ సువిభాతమద్వయం పశ్యత”అహం సః సోహమితి“.

“సహోవాచ ప్రజాపతిః - తదితి కారణత్వేన పరోక్షం, ఏ తదితి కార్యే ప్రతిష్ట మపరోక్షముక్తం. బ్రహ్మ అద్వయం - అద్వయే హేతుమాహ బృహద్వా దితి - బృహతేర్థాతోరద్వయ త్వే ఏవ ముఖ్యార్థలాభాత్ అద్వయమేవ బ్రహ్మ - ఓంకారేణ బ్రహ్మాత్మైక్యం ప్రపంచితః - యధోక్తం బ్రహ్మా ఆత్మరూపేణైవ అపశ్యంతః. ఆత్మో బ్రహ్మైవ బ్రహ్మాత్మైవేతి సత్యం, సర్వ విశేషరహితం. తథాపి ఉపనిషద్భిరేవ లక్షణయా జ్ఞాతవ్యం. ఉపనిషద్భిర్లక్షణయా జ్ఞాతే స్పష్టతయా బ్రహ్మ జ్ఞాతం భవతి. వ్యతిహరేణ చైకత్వం ప్రతిపత్తవ్య మిత్యాహ”అహం సః సోహమితి” - అహంశోధితత్వం పదార్థభూతం ప్రత్యక్చైతన్యం, సః శోధిత తత్పదార్థ భూతం పరిపూర్ణం బ్రహ్మ”. (ఉత్తరతాపినీయోపనిషత్)

(ప్రజాపతియగు చతుర్ముఖబ్రహ్మ ఈ ప్రకారముగా పలికెను - ‘తత్’ అనగా ఈ సర్వమునకు కారణమై పరోక్షముగా నున్న బ్రహ్మ. ఏ తత్ అనగా కార్యరూపమై కనబడునదంతయు - అపరోక్షముగా నుండునది. ఆ బ్రహ్మయే ఆత్మ. బ్రహ్మ అద్వయము - అటువంటి బ్రహ్మ మఱియొకటిలేదు, ఆ బ్రహ్మ తప్ప రెండవ వస్తువు లేదు - అంతా ఆ బ్రహ్మమే. బ్రహ్మ పెద్దది (మహత్) అగుతవలన అద్వయము - అద్వయమనుమాటకు అర్థము బృహత్వము - పెద్దదిగానుండుట, పెద్దదిగా పెరుగుట. ఆ బ్రహ్మమే ఓంకారము, అదే ఆత్మ. ఏ విధమైన విశషములు లేనిది, మూడుకాలములందు ఉండునది అని పండితులు తెలుసుకొనుచున్నారు - అయినప్పటికీ ఉపనిషత్తులలో చెప్పబడిన లక్షణముల ప్రకారము బ్రహ్మను తెలుసుకొనవలెను - ఉపనిషత్తులలో బ్రహ్మ ఈ క్రింద ప్రకారము చెప్పబడినది:- అశబ్దము, అస్పర్శము, అరూపము, అరసము, అగంధము, అవ్యక్తము, అనాదాతవ్యము, అగంతవ్యము, అవిసర్జయి తవ్యము, అనానందయి తవ్యము, అమంతవ్యము, అబోద్ధవ్యము, అనహంకర్తవ్యము, అచేతయి తవ్యము, అప్రాణయి తవ్యము, అపానయితవ్యం, అవ్యానయి తవ్యము, అనుదానయితవ్యం, అసమానయితవ్యం, అనింద్రియము, అవిషయము, అకరణము, అలక్షణము, అసంగము, అగుణము, అవిక్రియము, అకరణము, అలక్షణము, అసంగము, అగుణము, అవిక్రియము, అవ్యపదేశ్యము, అనత్వము, అరజస్కము, అతమస్కము, అమాయము, ఇట్లు ఉపనిషత్తులలో చెప్పబడిన లక్షణముల ప్రకారమే బాగుగా తెలియబడును. అప్పుడు నేనే ఆ బ్రహ్మను అని తెలియబడును. అహం = నేను, అన్ని విధముల శోధించి తెలుసుకొనబడిన ‘త్వం’ పదమునకు అర్థము - సః = వాడు - అనునది శోధించబడిన ‘తత్’

పదార్థము. ఇట్లు ‘తత్ త్వమసి’ అను మహావాక్యములోని రెండు పదములకు అర్థము శోధించి తెలుసుకొనబడును. అదియే ‘సోహం’ = అతనే నేను అనుమాట మార్చిన ‘అహంసః’ నేనే అతను అగును. ఈ రెండింటి యర్థము మహావాక్యముయొక్క అర్థమే - జీవ బ్రహ్మల ఐక్యమే ఉపనిషత్తులు చెప్పుచున్నవి).

  1. “తత్సృష్టా తదేవాను ప్రావిశత్” (తైత్తిరీయోపనిషత్)

(దానిని సృష్టించి దానిలోనే ప్రవేశించెను - లోకములను సృష్టించి, లోకములోను, లోకములో నున్న ప్రతి వస్తువులోను ప్రవేశించెను).

Transliteration
  1. upaniṣadēka samadhi gamyaḥ -

(upaniṣadvākyamulacētanē teliyadagu puruṣuḍu - paramātma nirākāruḍu - aṃducēta ē pramāṇamulacētanainanu telusukonuṭaku vīlukānivāḍu. pramāṇamulu paramātma unnāḍani ceppagalavukāni eṭuvaṃṭivāḍō ceppalēvu. upaniṣattulu bhagavaṃtuni guṟiṃci - atani sva svarūpamu guṟiṃci ceppucunnaṃduna aṭlu vāṭilō ceppabaḍina puruṣuḍu ‘aupaniṣadaḥ puruṣaḥ’).

  1. “taṃ tvaupaniṣadaṃ puruṣaṃ pṛcchāmi itica aupaniṣadatva viśēṣaṇaṃ puruṣasya upaniṣatsu prādhānyēna prakāśyamānatvāt itica nirūpitaṃ. ata ēva sarvēṣu vēdēṣu upaniṣadayā vartayēditi śrutiḥ - upaniṣada marthatō anusaṃdhadyādityarthaḥ tathāca tattadupaniṣadi tēna tēna prakārēṇa pratipāditamātmānaṃ sadā bhāvayē diti”.

(upaniṣattulalō mukhyamugā paramātmayē ceppabaḍucunnāḍu. aṃducēta upaniṣattulanniṃṭilōnu vāṭilō ceppabaḍina prakāramuganuṃḍu paramātmanē anusaṃdhānamu cēyavalenani ceppabaḍinadi).

  1. nirupādhikasyātmanaḥ svarūpēṇavaktu maśakyatvā dēhēṃdriyādyupādhi nirāsadvārā pratipādayi tuṃ dēhēṃdriya mana ādiṣu ātmanassaṃbaṃdhaḥ śrutyā darśitaḥ.

(upādhi lēnaṭuvaṃṭi ātmayokka svasvarūpamunu varṇiṃcuṭaku śakyamukānaṃduna, dēhamu iṃdriyamulu modalagu iṃdriyamulanu nirasiṃcuṭadvārā dēhēṃdriyādulagu upādhulatō ātmaku saṃbaṃdhamu śrutulalō ī kriṃda vidhamugā ceppabaḍinadi:-

  1. “tatsṛṣṭvā tadēvānu prāviśaditi” (taittirīyē)

(lōkamulanu sṛṣṭiṃci vāṭilōnē pravēśiṃcenu - anagā, lōkamulōnunna anni vastuvulalōnu pravēśiṃci bhagavaṃtuḍu unnāḍu iṃdumūlamugā paramātmaku upādhitō saṃbaṃdhamu ceppabaḍinadi)

  1. “sa ē iha pratiṣṭa ānakhāgrēbhyaḥ” iti bṛhadāraṇyakē.

(ā paramātma ī śarīramulō gōḷḷa civara vaṟaku aṃtaṭa unnāḍu - śarīramu anu upādhilō unnāḍu).

  1. “ihaivāṃtaśśarīrē, sōmya! puruṣa” iti praśnōpaniṣadi.

(ī puruṣuḍanuvāḍu śarīrāṃtaramaṃdu - lōpali śarīramaṃdu - unnāḍu).

  1. “guhāṃ praviṣṭau paramē parārthē” iti kāṭhakē.

(guhavale - lōpalanunnadi paiki kanabaḍakuṃḍā uṃḍu upādhilō ī paramātma unnāḍu. lōpala unnappaṭikī paiki lēnaṭlu - kanabaḍakuṃḍunaṭluṃḍu upādhilō nunnāḍu).

  1. “cakṣuḥ śrōtraṃ ka udēvōyunakti” itica lēnōpaniṣadhi. atra cakṣuḥ śrōtrādi prērakatvāt ēva tatsaṃbaṃdhō (a)rdā ddarśitaḥ.

(cakṣuvulanu, śrōtramulanu, vāṭilōnuṃḍi, vāṭi vṛttulalō prērēpiṃcuvāḍu kanuka ātmaku vāṭitō saṃbaṃdhamu).

  1. “sa ēva māyāparimōhitātmā śarīramāsthāya karōti sarvaṃ |

stri yannapānādi vicitra bhōgaiḥ sa ēva jāgratparitṛpti mēti ||“.

ityādi nā śarīra saṃbaṃdhō avasthā saṃbaṃdhaśca darśitaḥ. iti kaivalyōpaniṣadi.

(ī ātmayē māyacēta mōhaparavaśamai śarīramunu poṃdi anniyu cēyucuṃḍunu. strī saṃbhōgamu, annapānamulu modalagu bhōgamulananubhaviṃcucu, jāgradavastha modalagu avasthalanu poṃducū tṛpti poṃducuṃḍunu. dīnini baṭṭi ātmaku śarīramutō saṃbaṃdhamu, avasthā traya saṃbaṃdhamu kalugucunnadi - rūpamulēni paramātmaku paina ceppina prakāramu upādhulatō saṃbaṃdhamu kaladani teliyucunnadi - upaniṣadpuruṣuḍu iṭuvaṃṭuvāḍu).

  1. kvacidupādhi nirāsadvārā ātmāni rūpyatē: -

(konni upaniṣattulalō upādhitō kūḍi uṃḍani ātma ceppabaḍinadi).

  1. “satyaṃ jñānamanaṃtaṃ brahma yō vēdanihitaṃ guhāyāṃ paramē vyōman sō(a)śnutē sarvān kāmān saha brahmaṇā vipaścitēti”. (taittirīyōpaniṣat)

“ēkaikō viśēṣaṇa śabdaḥ paraspara nirapēkṣaō brahma śabdēna saṃbadhyatē satyaṃ brahma, jñānaṃ brahma anaṃtaṃ brahmēti. satya śabdaḥ satsvarūpaṃ brahma lakṣayitvā, svarūpasya nṛtatvaṃ niṣēdhati jñāna śabdaḥ jñapti svarūpaṃ brahma lakṣayitvā jaḍataṃ niṣēdhati. ānaṃda śabdaḥ sukha svarūpaṃ brahma lakṣayitvā duḥkhātmakatvaṃ niṣēdati. anaṃta śabdastu dēśakālavastu kṛta paricchēdatrayaṃ niṣēdhati, natu svārdhaṃ kiṃcidrūpaṃ samarthayati. tat yadhōkta lakṣaṇaṃ brahma yō vēda vijānāti nihitaṃ guhāyāṃ buddhau nigūḍhaḥ, jñāna, jñātṛ jñēya padārthāḥ asyāmiti guhā buddhiḥ nigūḍhēsyāṃ bhōgāpavargā vitivā, paramē prakṛṣṭē vyōman vyōmni ākāśē hardē prasiddhaṃ hi hardākāśasya paramatvaṃ, tasmin hārdē yā buddhiḥ guhā, tasyāṃ nihitaṃ brahma tadvatyā vivaktayā upalabhyatē iti, nahyanyathā viśiṣṭa dēśakāla saṃbaṃdhō(a) sti brahmaṇaḥ, sarvagatatyāt nirviśēṣatvācca).

(“satyaṃ jñānamanaṃtaṃ brahma” ani ceppinapuḍu ī mūḍu viśēṣaṇamulalō okkokka viśēṣaṇamutō kūḍina brahmayaniyu, oka viśēṣaṇamunaku maṟiyoka viśēṣaṇamunaku saṃbaṃdhamu lēnaṭluganē avagāhana cēsukonavalenu. oka viśēṣaṇamunu maṟiyoka viśēṣaṇamutō saṃbaṃdhamu lēnidānivalenē - maṟiyoka viśēṣaṇamu yokka apēkṣa lēnidānivalenē - anvayiṃcukonavalenu - adi eṭlanagā ‘satyaṃ brahma’, ‘jñānaṃ brahma’, ‘anaṃtaṃ brahma’ ani anukonavalenu. ‘satyaṃ brahaṃ’ ani ceppuṭacēta brahma yokka sat svarūpamu (trikālamulaṃduṃḍunadi) ceppucu brahma svasvavarūpamu anṛtamu kādani teliyacēya baḍinadi. “jñānaṃ brahma” yanuṭacēta brahma jñapti svarūpamu ani teliyacēyucu jaḍamukādu ani teliyacēyucunnadi. “ānaṃdaṃ brahma” ani ceppuṭacēta brahma sukhasvarūpamu - ātyaṃtika sukhasvarūpamu, (mōkṣasthānamu) ani ceppucū duḥkhamu kaligiṃcunadi kādu ani ceppabaḍinadi. “anaṃtaṃ brahma” ani ceppuṭacēta trividhaparicchēdarahitamu brahma - dēśakāla, vastuvulacēta parimitilēnivāḍu, anni pradēśamulaṃdu, annikālamulaṃdu, anni vastuvulaṃdu uṃḍuvāḍu - ani ceppabaḍinadi).

(paina ceppabaḍina prakāramu satyaṃ, jñānaṃ, anaṃtaṃ, ānaṃdaṃ anu lakṣaṇamulu gala brahma buddhiyanu guha yaṃdunnadi. jñānamu, jñātṛ, jñēyamu anu mūḍunu gūḍhamagu buddhiyaṃdunnavi kanuka buddhi guha yani ceppabaḍucunnadi. lēka bhōgamulu, mōkṣamu dānilōnē unnavi kanuka, dīnivalananē kalugucunnavi kanuka idi gūḍhamaina guha yani ceppabaḍucunnadi. paramākāśamani prasiddhi ceṃdina hṛdayamaṃdunna buddhi guha yanipiṃcukonucunnadi. aṃdulō parabrahma yunnāḍu. vivēkamugala ā buddhiyaṃdu dāni vivēcanavṛtti dvārā labhyamagucunnāḍu. aṭṭi parabrahma maṟiyokarītigā labhyamukādu – brahma nirviśēṣamaguṭavalananu, anniṃṭilōnu pravēśiṃci yuṃḍuṭacētanu okkokka pradēśamulōnu, okkokka kālamaṃdunu vāṭi viśēṣamunubaṭṭi labhyamagucunnāḍu).

  1. “ātmāvā idamēka ēvāgra āsīt” iti. (aitarēyōpaniṣat)

(anēka rūpamulatō, nāmamulatō ippuḍu kanabaḍu ī prapaṃcamaṃtayu moṭṭamodaṭa - sṛṣṭi prāraṃbhamukākamuṃdu - okka ātmagānē uṃḍenu - ī ātmayē taruvāta prapaṃcamugā mārenu).

  1. “sadēvasōmyē damagra āsīt - saccidānaṃda rūpēṇa pratipāditaḥ satya jñānāṃ tānaṃdātmakamakhaṃḍa madvitīya mēkamanādyaṃtaṃ paramārtha bhūtaṃ vastu tatva masi”. (chāṃdōgyōpaniṣat)

(anēka nāmarūpamulatō ippuḍu kanabaḍucunna ī prapaṃcamu moṭṭamodaṭa - sṛṣṭi prāraṃbhamulō - sat padārthamokaṭē yuṃḍenu - adiyē saccidānaṃdamu ani ceppabaḍucunnadi. ī satpadārthamu anunadi okaṭē, aṭuvaṃṭidi maṟiyokaṭi lēdu - sarēkadā, adikāka itara vastuvu anunadi lēdu - dāniki modalulēdu, tudi lēdu - jananamulēdu, maraṇamulēdu - idi akhaṃḍamu - idiyē paramārthamaina mōkṣamu, mōkṣasthānamu).

  1. “nityō, niṣkalō, nirākhyātō, nirvikalpō. niraṃjanaḥ |

śuddhō (a)dvitīyōsti kaścit, - ya vēṃ vēda” (nārāyaṇōpaniṣat)

(annikālamulaṃdu uṃḍuvāḍu, kaḷalu lēnivāḍu, pērulēnivāḍu, nirvikalpuḍu, niraṃbaruḍu, śuddhuḍu, advitīyuḍu, ani paramātmanu yelusukonuvāḍu - - - ).

  1. “tadēva niṣkalaṃ brahma, nirvikalpaṃ, iraṃjanaṃ, tadbrahmā hamiti jñātvā brahma saṃpadyatē dhruvaṃ ||

nirvikalpamanaṃ taṃca hētu dṛṣṭāṃtavarjitaṃ |

apramēya manādiṃca yat jñātvā mucyatē budhaḥ ||“. (amṛtabiṃdūpaniṣat)

(brahma niṣkalamu, nirvikalpamu, niraṃjanamu; aṭṭi brahma nēnē yani telusukoni brahmapadamunu poṃdunu. nirvikalpamu, anaṃtamu, kāraṇa dṛṣṭāṃtamulu lēnivāḍu - ē vidhamaina pramāṇamulacēta teliyabaḍanivāḍu, janma lēnivāḍu ani ī vidhamugā brahmanu telusukoninavāḍu, jñāni,muktini poṃdunu).

  1. “sadā ayaṃ sarvēṣu dēhēṣu vyāptō vartatē, yadāhyagniḥ kāṣṭēṣu tailamiva, taṃ viditvā atimṛtyumēti -” (haṃsōpaniṣat)

“yadā kāṣṭēṣu agnirasabhivyaktassan madhanēnabhi vyajyatē, yathāvā. tilēṣu tailamanabhivyaktasat, yaṃtra niṣpīḍanēnābhivyajyatē, ēvamātmā sarvatra vyāptōpi avidyayā tirōhi tassan śravaṇamananādi janya sākṣātkārēṇa abhivyajyatē taṃ paramātmānaṃ pratyagabhinnatvēna”ahamasmi parabrahmē” ti viditvā mṛtyuṃ jananamaraṇa pravāharūpaṃ saṃsāraṃ punarna āpnōti, saṃsāramūlājñānasya jñānēna nāśāditi”.

(kaṭṭelaṃdu agni vyāpiṃciyunnaṭlu, tilalaṃdu - nuvvulalō - tailamu - nūne - aḍagi yunnaṭlu ī ātma samasta dēhamulaṃdu vyāpiṃciyunnadi. aṭṭi ātmanu, ā prakāramuganunna ātmanu telusukoninacō mṛtyuvunu poṃdaḍu).

(kaṭṭelaṃdu agni unnappaṭikī paiki kanabaḍakuṃḍā uṃḍi madhiṃcina paina paiki vacci eṭlu kānabaḍunō, tilalō paiki kanabaḍakuṃḍa unna tailamu yaṃtramucē pīḍiṃcabaḍinadai paiki eṭlu kanabaḍunō, ā prakāramugānē ātma anniṃṭilōnu vyāpiṃciyunnappaṭikī avidyavalana kānarākayuṃḍi, śravaṇamu, mananamu modalaguvāṭivalana kalugu sākṣātkāramu cēta kanabaḍunu. aṭṭi paramātma pratyagātmakanna vēṟukādani - jīvātmakanna vēṟukādani, nēnē parabrahmanu - jīvuḍē parabrahma - ani telusukoni cāvu puṭṭuvula pravāharūpamalō nuṃḍunadiyē yagu saṃsāramunu poṃdaḍu - saṃsāramunaku mūlamaina ajñānamu jñānamucē naśiṃcunu kanuka).

  1. “para īśōvā śiva ēkō dhyēyaḥ śivaṃkaraḥ, sarva manyatparityajya samāptā(a) dharva śikhēti” (adharvaśikhōpaniṣat)

“kṛtsnā dharva śikhārthō sarūpamidaṃ sarva vēdāṃtārtha sāra saṃgraha jātaṃca - ātma vyatiriktasya sarvasyaanātmatvēna midhyātvāt tatparityāga pūrvakaṃ pratyagabhinnaḥ śiva ēva sākṣātkāra paryaṃtaṃ dhyēyaḥ”.

(adhrva śikhōpaniṣat yokka arthamidiyē - sarvōpaniṣattulalōni sāramu saṃgrahiṃpabaḍinadidiyē - ātmakānidi aṃtayu anātmayē, midhyayē ani vāṭini vadali pratyagātmakanna vēṟukāni - jīvātmakanna vēṟukāni - śivuḍē, śivaṃkaruḍē - maṃgaḷakaruḍaina śivu ḍē - dhyāniṃpataginavāḍu).

  1. “aupaniṣadhamēva suvijñātaṃ sakṛdvibhāvyaṃ puratō asmāt, sarvasmāt suvijñātamapasyata”ahaṃsaḥ sōhamiti”

(uttaratāpinīyōpaniṣat)

“yadyasyēvaṃ sarva viśēṣaṇavataṃ tathā upaniṣadbhirēva lakṣaṇayā jñātavyaṃ. upaniṣadbhirlakṣaṇayā jñātē spaṣṭatayā brahma jñātaṃ bhavati”.

(ē vidhamaina viśēṣamulu lēnaṭuvaṃṭi - nirviśēṣamaina - parabrahma upaniṣattulavalananē teliyanagunu. upaniṣattulalōni lakṣaṇamulucēta parabrahmanu spaṣṭamugā teliyanagunu) - “nēnē ā parabrahmanu, atanē nēnu” - ‘ahaṃ brahmasmi’ anu mahāvākyārthamu spaṣṭamugā teliyanagunu).

  1. “sahōvāca tadvā ētat brahmādvayaṃ, bṛhatvānnityaṃ, śuddhaṃ, buddhaṃ, muktaṃ, satyaṃ, sūkṣmaṃ, paripūrṇamadvayaṃ, sadānaṃdaṃ, cinmātramātmaivā vyavahāryaṃ kēnaca na tadētadātma jñānamōmitya paśyaṃtaḥ paśyata. tadētatsatya mātmā brahmaiva, brahmātmaiva. atrahyēva na viciki tsu mityōṃ satyaṃ tadētat paṃḍitā ēva paśyatyē taddhi aśabda masparśa marūpamarasa magaṃdhamavyakta manā dāta vyaya gaṃtavyama visarjiyi tasya manānaṃda yi tavyamaṃtavya mabōddhavya mabōddhavya mana haṃkartavya macēta yitavya ma prāṇa yitavya mapāna yitavya mavyāna yitavya manudāśa yitavya masamāna yitavya maniṃdriya maviṣayī karaṇaṃ masamāna yitavya malakṣaṇa masaṃgama guṇa mavikārya mavyapadēśya masatva marajaska matamaska mamāya mapyaupaniṣadhamēva puruṣaṃ vibhātaṃ puratō (a) smāt sarvasmāt suvibhātamadvayaṃ paśyata”ahaṃ saḥ sōhamiti”.

“sahōvāca prajāpatiḥ - taditi kāraṇatvēna parōkṣaṃ, ē taditi kāryē pratiṣṭa maparōkṣamuktaṃ. brahma advayaṃ - advayē hētumāha bṛhadvā diti - bṛhatērthātōradvaya tvē ēva mukhyārthalābhāt advayamēva brahma - ōṃkārēṇa brahmātmaikyaṃ prapaṃcitaḥ - yadhōktaṃ brahmā ātmarūpēṇaiva apaśyaṃtaḥ. ātmō brahmaiva brahmātmaivēti satyaṃ, sarva viśēṣarahitaṃ. tathāpi upaniṣadbhirēva lakṣaṇayā jñātavyaṃ. upaniṣadbhirlakṣaṇayā jñātē spaṣṭatayā brahma jñātaṃ bhavati. vyatiharēṇa caikatvaṃ pratipattavya mityāha”ahaṃ saḥ sōhamiti” - ahaṃśōdhitatvaṃ padārthabhūtaṃ pratyakcaitanyaṃ, saḥ śōdhita tatpadārtha bhūtaṃ paripūrṇaṃ brahma”. (uttaratāpinīyōpaniṣat)

(prajāpatiyagu caturmukhabrahma ī prakāramugā palikenu - ‘tat’ anagā ī sarvamunaku kāraṇamai parōkṣamugā nunna brahma. ē tat anagā kāryarūpamai kanabaḍunadaṃtayu - aparōkṣamugā nuṃḍunadi. ā brahmayē ātma. brahma advayamu - aṭuvaṃṭi brahma maṟiyokaṭilēdu, ā brahma tappa reṃḍava vastuvu lēdu - aṃtā ā brahmamē. brahma peddadi (mahat) agutavalana advayamu - advayamanumāṭaku arthamu bṛhatvamu - peddadigānuṃḍuṭa, peddadigā peruguṭa. ā brahmamē ōṃkāramu, adē ātma. ē vidhamaina viśaṣamulu lēnidi, mūḍukālamulaṃdu uṃḍunadi ani paṃḍitulu telusukonucunnāru - ayinappaṭikī upaniṣattulalō ceppabaḍina lakṣaṇamula prakāramu brahmanu telusukonavalenu - upaniṣattulalō brahma ī kriṃda prakāramu ceppabaḍinadi:- aśabdamu, asparśamu, arūpamu, arasamu, agaṃdhamu, avyaktamu, anādātavyamu, agaṃtavyamu, avisarjayi tavyamu, anānaṃdayi tavyamu, amaṃtavyamu, abōddhavyamu, anahaṃkartavyamu, acētayi tavyamu, aprāṇayi tavyamu, apānayitavyaṃ, avyānayi tavyamu, anudānayitavyaṃ, asamānayitavyaṃ, aniṃdriyamu, aviṣayamu, akaraṇamu, alakṣaṇamu, asaṃgamu, aguṇamu, avikriyamu, akaraṇamu, alakṣaṇamu, asaṃgamu, aguṇamu, avikriyamu, avyapadēśyamu, anatvamu, arajaskamu, atamaskamu, amāyamu, iṭlu upaniṣattulalō ceppabaḍina lakṣaṇamula prakāramē bāgugā teliyabaḍunu. appuḍu nēnē ā brahmanu ani teliyabaḍunu. ahaṃ = nēnu, anni vidhamula śōdhiṃci telusukonabaḍina ‘tvaṃ’ padamunaku arthamu - saḥ = vāḍu - anunadi śōdhiṃcabaḍina ‘tat’

padārthamu. iṭlu ‘tat tvamasi’ anu mahāvākyamulōni reṃḍu padamulaku arthamu śōdhiṃci telusukonabaḍunu. adiyē ‘sōhaṃ’ = atanē nēnu anumāṭa mārcina ‘ahaṃsaḥ’ nēnē atanu agunu. ī reṃḍiṃṭi yarthamu mahāvākyamuyokka arthamē - jīva brahmala aikyamē upaniṣattulu ceppucunnavi).

  1. “tatsṛṣṭā tadēvānu prāviśat” (taittirīyōpaniṣat)

(dānini sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu - lōkamulanu sṛṣṭiṃci, lōkamulōnu, lōkamulō nunna prati vastuvulōnu pravēśiṃcenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.