← Back to ఆ · Booklets 11–20 (digitized file 2)

ఆయుః āyuḥ

Original — తెలుగు
  1. ఆయుస్సు; ఆయుర్దాయము.

  2. జీవితకాలం, జీవనకాలః -; జీవితావధికాలం; జీవన యోగ్యకాలం.

(జీవించియుండుకాలము; జీవముతో కలిగియుండు కాలము).

  1. ప్రాణోహి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే.

(సమస్త భూతములకు ప్రాణమే ఆయువు. అందుచేతనే ప్రాణము సర్వాయువు అని చెప్పబడినది).

  1. సర్వప్రాణి ప్రాణిన హేతుభూతం -

(సమస్త ప్రాణులకు, సమస్త జీవులకు - జీవించియుండుటకు కారణమైనది).

  1. “సర్వేషాం భూతానాం యావత్ శరీరే ప్రాణోవసతి తావదాయుః” (కౌషీతకీ ఉపనిషత్)

ఇతి ప్రాణస్యఉచ్ఛ్వాస నిశ్వాసనాది లక్షణ సర్వభూతాయుర్హేతుత్వం.

(సమస్త భూతములకు శరీరములో ఎంతకాలము ప్రాణము ఉండునో అంతకాలము వాటికి ఆయుర్దాయము అని శ్రుతి చెప్పుచున్నది. అందుచేత ఉచ్ఛ్వాసనిశ్వాసములే లక్షణముగా గల ప్రాణము సమస్త భూతములకు ఆయుర్దాయమునకు కారణము).

  1. ప్రాణవాయువు శరీరములో సంచరించుట.

  2. ఆయుస్స్వరూపం బ్రహ్మ, కాలాన వచ్ఛిన్నత్వాత్, అన్యన్మ్రియతే, ఇదంతు ఆదిత్యాది జ్యోతిషామిద భాసకం, నమ్రియతే. అతః ఆయుష్కామేన ఆయుర్గుణ విశిష్టం బ్రహ్మోపాస్యమిత్యర్థః

(కాలమువలన పరిచ్ఛిన్నముకానిది కనుక ఆయువు బ్రహ్మరూపమని ఉపాసించవలెను - సూర్యుడు మొదలగు తేజోరూపములువలె ప్రకాశించునది - తాను ఉన్నట్లు తెలియచేయునది. ఈ బ్రహ్మరూపమైన ఆయుస్సు అన్నింటిని చంపునదికాని తాను నాశము నొందునదికాదు - అందుచేత దీర్ఘాయువుకావలెనని కోరువాడు పరబ్రహ్మను ఉపాసింపవలెను.)

  1. “ఆయుష్కామునకు అశ్వనీదేవతలు - - భజనీయంబులగుదురు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 3 - 38)

  2. శతాయుర్వై పురుషః. (పురుషుడు నూరు సంవత్సరములు జీవించువాడు).

  3. “క్షీరేణాయుః ప్రవర్థతే” (పాలు త్రాగుటవలన ఆయుర్దాయము వృద్ధియగును).

  4. “దిన యామిన్యౌ సాయంప్రాత శ్శిశిరవసంతౌ పునరాయాతః |

కాలః క్రీడతి గచ్ఛత్యయుస్తదపి నముంచత్యాశా వాయుః“. (‘భజగోవిందం’)

(పగలు, రాత్రి; ఉదయము, సామంకాలము, శిశిర ఋతువు వసంత ఋతువు మరల మరల వచ్చుచు పోవుచుండును. ఈ ప్రకారము కాలము క్రీడవలె నడుచుచున్నది. కాలము నడిచినకొలది ఆయువు క్షీణించుచున్నది, కాని ఆశ అనునది మట్టుకు వదలకయుండి, పట్టుకొని మఱింత మఱింత పెరుగుచున్నది -).

  1. “ఆయుష్యం జలలోల బిందు చపలం”.

(ఆయుర్దాయము నీటిలోని బిందువు వలె చపలము - ఎప్పుడు అంతరించునో తెలియనిది).

  1. “సూర్యోదయాస్తమయంబులం బ్రతిదినంబు నాయువు క్షీణంబునొందు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 54 - )

  2. “స్వకర్మ ధర్మే హ్రసతి హ్రాసత్యాయుర్నృణామివ |

వృద్ధౌ వృద్ధి ముపాయాతి సమమేవచ భవేత్సమే ||’. (యోగవాశిష్టం)

“దేశకాలక్రియా ద్రవ్య శుద్ధ్య శుద్ధ స్వకర్మణాం |

న్యూనతాచాధికత్వేచ నృణాం కారణమాయుషం ||“. (యోగవాశిష్టము)

(దేశము, కాలము. క్రియ, ద్రవ్యము - వీటియొక్క మంచి చెడ్డలుననుసరించి కర్మఫలము హెచ్చు తగ్గులు గలదియగును. దీని ననుసరించియే ఆయుర్దాయ,ము కలుగుచుండును).

  1. “విషయాశీ, విషాసంగ పరిజర్జర చేతసాం |

అప్రౌఢాత్మవివేకానా మాయురాయాస కారణం |

యేతు విజ్ఞాత విజ్జేయ విశ్రాంతా వితతే పదే|

భావా భావ సమశ్వాసమాయుస్తేషాం సుఖాయ తే ||“. (యోగవాశిష్టము - 14 - 2 - 3)

(విషయములవలన విషసర్పములవలన చితికిన మనస్సుగలవారు, వివేకములేనివారు, - వీరికి ఆయుర్దాయము దుఃఖమునకే యగును - దుఃఖము కలిగించునదే యగును. తత్వజ్ఞానబలమున బ్రహ్మపదమునుండి శాంతిపొందినవారికిని, లాభా లాభములను సమదృష్టితో చూచువారికిని, ఆయువు సుఖమును కలుగచేయునదే యగును).

  1. “క. ఏ నరుడే నొకనిమిషం

బైన వృథావాదగతిని హరి పదకమల

ధ్యానానందుడు కాడే

నానరునకు నాయువల్పమగు నరనాధా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 193)

  1. “మృణ్మయంబైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దిన దినంబునకు నాయువు క్షయంబై మృత్యువు సన్నిహితంబై వచ్చు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 109)

Transliteration
  1. āyussu; āyurdāyamu.

  2. jīvitakālaṃ, jīvanakālaḥ -; jīvitāvadhikālaṃ; jīvana yōgyakālaṃ.

(jīviṃciyuṃḍukālamu; jīvamutō kaligiyuṃḍu kālamu).

  1. prāṇōhi bhūtānāmāyuḥ tasmāt sarvāyuṣamucyatē.

(samasta bhūtamulaku prāṇamē āyuvu. aṃducētanē prāṇamu sarvāyuvu ani ceppabaḍinadi).

  1. sarvaprāṇi prāṇina hētubhūtaṃ -

(samasta prāṇulaku, samasta jīvulaku - jīviṃciyuṃḍuṭaku kāraṇamainadi).

  1. “sarvēṣāṃ bhūtānāṃ yāvat śarīrē prāṇōvasati tāvadāyuḥ” (kauṣītakī upaniṣat)

iti prāṇasyaucchvāsa niśvāsanādi lakṣaṇa sarvabhūtāyurhētutvaṃ.

(samasta bhūtamulaku śarīramulō eṃtakālamu prāṇamu uṃḍunō aṃtakālamu vāṭiki āyurdāyamu ani śruti ceppucunnadi. aṃducēta ucchvāsaniśvāsamulē lakṣaṇamugā gala prāṇamu samasta bhūtamulaku āyurdāyamunaku kāraṇamu).

  1. prāṇavāyuvu śarīramulō saṃcariṃcuṭa.

  2. āyussvarūpaṃ brahma, kālāna vacchinnatvāt, anyanmriyatē, idaṃtu ādityādi jyōtiṣāmida bhāsakaṃ, namriyatē. ataḥ āyuṣkāmēna āyurguṇa viśiṣṭaṃ brahmōpāsyamityarthaḥ

(kālamuvalana paricchinnamukānidi kanuka āyuvu brahmarūpamani upāsiṃcavalenu - sūryuḍu modalagu tējōrūpamuluvale prakāśiṃcunadi - tānu unnaṭlu teliyacēyunadi. ī brahmarūpamaina āyussu anniṃṭini caṃpunadikāni tānu nāśamu noṃdunadikādu - aṃducēta dīrghāyuvukāvalenani kōruvāḍu parabrahmanu upāsiṃpavalenu.)

  1. “āyuṣkāmunaku aśvanīdēvatalu - - bhajanīyaṃbulaguduru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 3 - 38)

  2. śatāyurvai puruṣaḥ. (puruṣuḍu nūru saṃvatsaramulu jīviṃcuvāḍu).

  3. “kṣīrēṇāyuḥ pravarthatē” (pālu trāguṭavalana āyurdāyamu vṛddhiyagunu).

  4. “dina yāminyau sāyaṃprāta śśiśiravasaṃtau punarāyātaḥ |

kālaḥ krīḍati gacchatyayustadapi namuṃcatyāśā vāyuḥ”. (‘bhajagōviṃdaṃ’)

(pagalu, rātri; udayamu, sāmaṃkālamu, śiśira ṛtuvu vasaṃta ṛtuvu marala marala vaccucu pōvucuṃḍunu. ī prakāramu kālamu krīḍavale naḍucucunnadi. kālamu naḍicinakoladi āyuvu kṣīṇiṃcucunnadi, kāni āśa anunadi maṭṭuku vadalakayuṃḍi, paṭṭukoni maṟiṃta maṟiṃta perugucunnadi -).

  1. “āyuṣyaṃ jalalōla biṃdu capalaṃ”.

(āyurdāyamu nīṭilōni biṃduvu vale capalamu - eppuḍu aṃtariṃcunō teliyanidi).

  1. “sūryōdayāstamayaṃbulaṃ bratidinaṃbu nāyuvu kṣīṇaṃbunoṃdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 54 - )

  2. “svakarma dharmē hrasati hrāsatyāyurnṛṇāmiva |

vṛddhau vṛddhi mupāyāti samamēvaca bhavētsamē ||’. (yōgavāśiṣṭaṃ)

“dēśakālakriyā dravya śuddhya śuddha svakarmaṇāṃ |

nyūnatācādhikatvēca nṛṇāṃ kāraṇamāyuṣaṃ ||“. (yōgavāśiṣṭamu)

(dēśamu, kālamu. kriya, dravyamu - vīṭiyokka maṃci ceḍḍalunanusariṃci karmaphalamu heccu taggulu galadiyagunu. dīni nanusariṃciyē āyurdāya,mu kalugucuṃḍunu).

  1. “viṣayāśī, viṣāsaṃga parijarjara cētasāṃ |

aprauḍhātmavivēkānā māyurāyāsa kāraṇaṃ |

yētu vijñāta vijjēya viśrāṃtā vitatē padē|

bhāvā bhāva samaśvāsamāyustēṣāṃ sukhāya tē ||“. (yōgavāśiṣṭamu - 14 - 2 - 3)

(viṣayamulavalana viṣasarpamulavalana citikina manassugalavāru, vivēkamulēnivāru, - vīriki āyurdāyamu duḥkhamunakē yagunu - duḥkhamu kaligiṃcunadē yagunu. tatvajñānabalamuna brahmapadamunuṃḍi śāṃtipoṃdinavārikini, lābhā lābhamulanu samadṛṣṭitō cūcuvārikini, āyuvu sukhamunu kalugacēyunadē yagunu).

  1. “ka. ē naruḍē nokanimiṣaṃ

baina vṛthāvādagatini hari padakamala

dhyānānaṃduḍu kāḍē

nānarunaku nāyuvalpamagu naranādhā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 193)

  1. “mṛṇmayaṃbaina ghaṭaṃbuna jalaṃbulu jālugonu teṟaṃguna dina dinaṃbunaku nāyuvu kṣayaṃbai mṛtyuvu sannihitaṃbai vaccu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 109)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.