← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకం దైవతం ēkaṃ daivataṃ

Original — తెలుగు
  1. “ఏకమేవా ద్వితీయం బ్రహ్మ” (ఛాందోగ్యోపనిషత్)

(పరబ్రహ్మ ఒక్కడే, రెండవ బ్రహ్మకాని, మరియే ఇతరవస్తువుగాని లేదు. ఉన్నదాంతా బ్రహ్మమే).

  1. “ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, నాన్యత్ కించిన మిషత్” (ఐతరేయోపనిషత్)

(ఇప్పుడు నామరూపములతో కనబడుచున్న ప్రపంచమంతయు సృష్టికి ముందు ఒకే ఆత్మగా ఉండెను - మరియొకటి ఏమియు లేకుండెను).

  1. “సృష్టి స్థిత్యంత కరిణీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం |

స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్థనః ||“. (విష్ణుపురాణం)

(జనార్దునుడైన విష్ణువు ఒకడే అయినను ప్రపంచమునకు సృష్టి స్థితిలయములు చేయునట్టి బ్రహ్మ, విష్ణు, శివులుగా రూపములను పొందుచున్నాడు).

  1. “ఏకో దేవః బహుథా సన్నివిష్టః” (తైత్తిరీయోఅనిషత్)

(ఒకడే అయిన దేవుడు అనేకరూపములలో అనేక విధములుగా ఉన్నాడు).

  1. “ఏకో దేవః సర్వభూతేషు గూఢః” (శ్వేతాశ్వతరోపనిషత్)

ఒకడే అయిన దేవుడు సమస్త భూతములందు గూఢముగా నున్నాడు. ఉన్నట్లు కనబడకుండా ఉన్నాడు - “తత్ సృష్ట్వా తదేవాను ప్రావశత్”. (దానిని - లోకములను సృష్టించి దానిలోనే - లోకములోనున్న అన్నింటిలోను ప్రవేశించెను - ఇట్లు అన్నింటిలోని ప్రవేశించగల శక్తిగలవాడు కనుకనే విష్ణువు - ప్రవేశిన శీలః - అని చెప్పబడుచున్నాడు. ఇట్లు అన్నింటిలోను ప్రవేశింపగలశక్తి ఇంకొకరికి లేదు - రెండు కత్తులు ఒక ఒరలో దూరలేవు).

“యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్త్రూయతే పివా |

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః ||“.

(మన కంటికి కనబడుచున్నది, ఇంకా ఉన్నదని తెలిసినవారు చెప్పినది కాక ఇంకా ఎంత ఉన్నదో జగత్తు దాని అంతటిలోను, దానిలో ఉన్న ప్రతివస్తువులోను, లోపల బైట పూర్తిగా వ్యాపించి నారాయణుడున్నాడు) - ప్రపంచములోని ప్రతివస్తువులోను, ప్రతివస్తువులోని ప్రతి అణువులోను భగవంతుడు పూర్తిగా వ్యాపించియున్నాడు - ఇట్లు ప్రతి వస్తువులోను, ప్రతివస్తువులోని ప్రతి అణువులోను ఇంకొకరు వ్యాపించియుండుటలేదు - అందుచేత దైవము అను వాడు ఒక్కడే.-”

“క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు, సంశయము పనిలేదా

హరిమయము కాని ద్రవ్య,ము

పరమాణువు లేదు వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - - )

  1. “యదాజ్ఞయా ప్రవర్తతే సర్వం”..

(ఎవని ఆజ్ఞ ప్రకారము ఈ సర్వ ప్రపంచము ప్రవర్తించుచున్నదో అని భగవంతుని గుఱించి చెప్పబడినదో అతడొకడే దేవుడు).

  1. “నాన్య దతో అస్తి ద్రష్టా” (బృహదారణ్యకోపనిషత్)

(సమస్త భూతములలో నుండుటచేత అవి చేయు పనులన్నింటిని చూచుటచే సాక్షి - ద్రష్ట - అయినవాడు వేరొకడులేడు. అందుచేత అట్లు సాక్షి అయినవాడొకడే దైవము - ఇంకొక ద్రష్ట లేడు)

  1. “సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచ -” (శ్రీమద్భగవద్గీత - 18 - 66)

(అన్ని ధర్మములను వదలివేసి, నన్ను ఒక్కడినే శరణు పొందుము - నేను నిన్ను ఏ విధమైన పాపములు అంటకుండునట్లుచేసి మోక్షమిచ్చెదను - విచారింపకుము - “మోక్షమిచ్చుటంజేసి నారాయణుండు సేవ్యుండు” మోక్షమిచ్చుటకు నారాయణునికి తప్ప ఇంకెవరికి శక్తి లేదు - “ముకుం మోక్షం దాదాతీతి ముకుందః” - మోక్షమిచ్చువాడు కనుక ముకుందుడని చెప్పబడుచున్నాడు. ఇంతేకాక ప్రపంచమంత ఇతర దేవతులతోసహా నేను ఒక్కడినే ఉన్నాను - ఉన్నదంతా నేను ఒక్కడినే).

  1. “సీ. ముని నాయకులతోడ దనవోయి వచ్చిన తెఱగులు దనమది దృష్టమైన

మూడు మూర్తుల విధంబును నెఱిగించిన వినివారు మనమున విస్మయంబు

నంది, చిత్తంబున సందేహమును బాసి చిన్మయకారుడు, శ్రీ సతీశు

డనుపముడు - - - ఆది మధ్యాంతరహితు

తే. డై తనర్చిన పుండరీకాక్షుడొకడ

కాక గణుతింప దైవమొక్కరుండు వేఱ

కలడె యను బుద్ధి విజ్ఞానకలితులగుచు

హరి పదాబ్జాత యుగళంబు నర్థి గొలిచి

వ, అట్లు సేవించి యవ్యయానందంబైన వైకుంఠధామంబు నొందిరి“.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ. భా. - 1279) (చూడుము - ‘ఏకః’). (ఏకో దేవః).

Transliteration
  1. “ēkamēvā dvitīyaṃ brahma” (chāṃdōgyōpaniṣat)

(parabrahma okkaḍē, reṃḍava brahmakāni, mariyē itaravastuvugāni lēdu. unnadāṃtā brahmamē).

  1. “ātmāvā idamēka ēvāgra āsīt, nānyat kiṃcina miṣat” (aitarēyōpaniṣat)

(ippuḍu nāmarūpamulatō kanabaḍucunna prapaṃcamaṃtayu sṛṣṭiki muṃdu okē ātmagā uṃḍenu - mariyokaṭi ēmiyu lēkuṃḍenu).

  1. “sṛṣṭi sthityaṃta kariṇīṃ brahma viṣṇu śivātmikāṃ |

sa saṃjñāṃ yāti bhagavān ēka ēva janārthanaḥ ||“. (viṣṇupurāṇaṃ)

(janārdunuḍaina viṣṇuvu okaḍē ayinanu prapaṃcamunaku sṛṣṭi sthitilayamulu cēyunaṭṭi brahma, viṣṇu, śivulugā rūpamulanu poṃducunnāḍu).

  1. “ēkō dēvaḥ bahuthā sanniviṣṭaḥ” (taittirīyōaniṣat)

(okaḍē ayina dēvuḍu anēkarūpamulalō anēka vidhamulugā unnāḍu).

  1. “ēkō dēvaḥ sarvabhūtēṣu gūḍhaḥ” (śvētāśvatarōpaniṣat)

okaḍē ayina dēvuḍu samasta bhūtamulaṃdu gūḍhamugā nunnāḍu. unnaṭlu kanabaḍakuṃḍā unnāḍu - “tat sṛṣṭvā tadēvānu prāvaśat”. (dānini - lōkamulanu sṛṣṭiṃci dānilōnē - lōkamulōnunna anniṃṭilōnu pravēśiṃcenu - iṭlu anniṃṭilōni pravēśiṃcagala śaktigalavāḍu kanukanē viṣṇuvu - pravēśina śīlaḥ - ani ceppabaḍucunnāḍu. iṭlu anniṃṭilōnu pravēśiṃpagalaśakti iṃkokariki lēdu - reṃḍu kattulu oka oralō dūralēvu).

“yacca kiṃcit jagatsarvaṃ dṛśyatē śtrūyatē pivā |

aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇa sthitaḥ ||“.

(mana kaṃṭiki kanabaḍucunnadi, iṃkā unnadani telisinavāru ceppinadi kāka iṃkā eṃta unnadō jagattu dāni aṃtaṭilōnu, dānilō unna prativastuvulōnu, lōpala baiṭa pūrtigā vyāpiṃci nārāyaṇuḍunnāḍu) - prapaṃcamulōni prativastuvulōnu, prativastuvulōni prati aṇuvulōnu bhagavaṃtuḍu pūrtigā vyāpiṃciyunnāḍu - iṭlu prati vastuvulōnu, prativastuvulōni prati aṇuvulōnu iṃkokaru vyāpiṃciyuṃḍuṭalēdu - aṃducēta daivamu anu vāḍu okkaḍē.-”

“ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu, saṃśayamu panilēdā

harimayamu kāni dravya,mu

paramāṇuvu lēdu vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - - )

  1. “yadājñayā pravartatē sarvaṃ”..

(evani ājña prakāramu ī sarva prapaṃcamu pravartiṃcucunnadō ani bhagavaṃtuni guṟiṃci ceppabaḍinadō ataḍokaḍē dēvuḍu).

  1. “nānya datō asti draṣṭā” (bṛhadāraṇyakōpaniṣat)

(samasta bhūtamulalō nuṃḍuṭacēta avi cēyu panulanniṃṭini cūcuṭacē sākṣi - draṣṭa - ayinavāḍu vērokaḍulēḍu. aṃducēta aṭlu sākṣi ayinavāḍokaḍē daivamu - iṃkoka draṣṭa lēḍu)

  1. “sarva dharmān parityajya māmēkaṃ śaraṇaṃ vraja |

ahaṃ tvā sarvapāpēbhyō mōkṣa iṣyāmi māśuca -” (śrīmadbhagavadgīta - 18 - 66)

(anni dharmamulanu vadalivēsi, nannu okkaḍinē śaraṇu poṃdumu - nēnu ninnu ē vidhamaina pāpamulu aṃṭakuṃḍunaṭlucēsi mōkṣamiccedanu - vicāriṃpakumu - “mōkṣamiccuṭaṃjēsi nārāyaṇuṃḍu sēvyuṃḍu” mōkṣamiccuṭaku nārāyaṇuniki tappa iṃkevariki śakti lēdu - “mukuṃ mōkṣaṃ dādātīti mukuṃdaḥ” - mōkṣamiccuvāḍu kanuka mukuṃduḍani ceppabaḍucunnāḍu. iṃtēkāka prapaṃcamaṃta itara dēvatulatōsahā nēnu okkaḍinē unnānu - unnadaṃtā nēnu okkaḍinē).

  1. “sī. muni nāyakulatōḍa danavōyi vaccina teṟagulu danamadi dṛṣṭamaina

mūḍu mūrtula vidhaṃbunu neṟigiṃcina vinivāru manamuna vismayaṃbu

naṃdi, cittaṃbuna saṃdēhamunu bāsi cinmayakāruḍu, śrī satīśu

ḍanupamuḍu - - - ādi madhyāṃtarahitu

tē. ḍai tanarcina puṃḍarīkākṣuḍokaḍa

kāka gaṇutiṃpa daivamokkaruṃḍu vēṟa

kalaḍe yanu buddhi vijñānakalitulagucu

hari padābjāta yugaḷaṃbu narthi golici

va, aṭlu sēviṃci yavyayānaṃdaṃbaina vaikuṃṭhadhāmaṃbu noṃdiri”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u. bhā. - 1279) (cūḍumu - ‘ēkaḥ’). (ēkō dēvaḥ).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.