← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకం పరాయణం ēkaṃ parāyaṇaṃ

Original — తెలుగు
  1. పరం అయనం ప్రాప్తవ్యం స్థానం యస్మి న్నిరీక్షితే |

- “భిద్యతే హృదయ గ్రంధిచ్ఛిద్యంతేసర్వ సంశయాః |

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ||“. (ముండకోపనిషత్)

(పరుడు - కారణస్వరూపుడును -, అవరుడు - కార్యస్వరూపుడును - అయిన ఆ పరమాత్మను చూచినపిదప జీవునియొక్క అవిద్య యనెడి హృదయహ్రంధి - బంధము, ముడి - వీడిపోవుచున్నది. సమస్త కర్మములు నశించిపోవుచున్నవి. అట్టివాడు ఉత్తమ గమ్యస్థానము - మోక్షరూపమైనవాడు).

  1. “యస్య విజ్ఞానమాత్రేణ ఆనంద లక్షణో మోక్షః ప్రాప్యతే, యద్విద్వాన్ బిభేతి కుతశ్చన, ఊత్ప్రవిష్టస్య నవిద్యతే పునర్భవః. యస్య చ వేదనాత్ తదేవ భవతి -”బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి” (ముండకోపనిషత్)

యద్విహాయ అపరః పంథా నృణాం నాస్తి - “నాన్యం పంథా దిద్యతే అయనాయ” (శ్వేతాశ్వతరోపనిషత్)

ఇతి శ్రుతేః - తదుక్త మేకం పరాయణం” (శ్రీశంకరః)

(దేనిని ఎఱిగిన మాత్రమున, దేనిని తెలుసుకొనిన మాత్రమున ఆనందస్వరూపమైన మోక్షము లభించునో, దేనిని ఎఱిగినవాడు దేనివలననైనను భయము చెందడో, దేనిని పొందినవానికి పునర్జన్మ కలుగదో, దేని నెఱిగిన తర్వాత “బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి” అనెడి శ్రుతి ప్రకారము జీవుడు ఆ బ్రహ్మమే యగుచున్నాడో, “నాన్యం పంథా విద్యతే అయనాయ” అనెడి శ్రుతి ప్రకారము దేనిని విడిచినవానికి మోక్షమునకు మఱియొక మార్గములేదో, అట్టివాడు, అట్టిది - ఉత్తమమైన గమ్యస్థానము - ఉత్తమగతి - మోక్షము).

Transliteration
  1. paraṃ ayanaṃ prāptavyaṃ sthānaṃ yasmi nnirīkṣitē |

- “bhidyatē hṛdaya graṃdhicchidyaṃtēsarva saṃśayāḥ |

kṣīyaṃtē cāsya karmāṇi tasmin dṛṣṭē parāvarē ||“. (muṃḍakōpaniṣat)

(paruḍu - kāraṇasvarūpuḍunu -, avaruḍu - kāryasvarūpuḍunu - ayina ā paramātmanu cūcinapidapa jīvuniyokka avidya yaneḍi hṛdayahraṃdhi - baṃdhamu, muḍi - vīḍipōvucunnadi. samasta karmamulu naśiṃcipōvucunnavi. aṭṭivāḍu uttama gamyasthānamu - mōkṣarūpamainavāḍu).

  1. “yasya vijñānamātrēṇa ānaṃda lakṣaṇō mōkṣaḥ prāpyatē, yadvidvān bibhēti kutaścana, ūtpraviṣṭasya navidyatē punarbhavaḥ. yasya ca vēdanāt tadēva bhavati -”brahma vēda brahmaiva bhavati” (muṃḍakōpaniṣat)

yadvihāya aparaḥ paṃthā nṛṇāṃ nāsti - “nānyaṃ paṃthā didyatē ayanāya” (śvētāśvatarōpaniṣat)

iti śrutēḥ - tadukta mēkaṃ parāyaṇaṃ” (śrīśaṃkaraḥ)

(dēnini eṟigina mātramuna, dēnini telusukonina mātramuna ānaṃdasvarūpamaina mōkṣamu labhiṃcunō, dēnini eṟiginavāḍu dēnivalananainanu bhayamu ceṃdaḍō, dēnini poṃdinavāniki punarjanma kalugadō, dēni neṟigina tarvāta “brahmavēda brahmaiva bhavati” aneḍi śruti prakāramu jīvuḍu ā brahmamē yagucunnāḍō, “nānyaṃ paṃthā vidyatē ayanāya” aneḍi śruti prakāramu dēnini viḍicinavāniki mōkṣamunaku maṟiyoka mārgamulēdō, aṭṭivāḍu, aṭṭidi - uttamamaina gamyasthānamu - uttamagati - mōkṣamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.