(పరబ్రహ్మ చైతన్య మాత్రమున, దీనికి వేరైన మరొక రూపము లేనిదని నిర్విశేషమని శ్రుతి చెప్పుచున్నది - ఉప్పుగల్లు లోపల పైన అంతా ఉప్పే, ఉప్పు కానిది దానిలోపలగాని, పైనగాని మరేదియు లేదు - ఆ ప్రకారముగానే ఈ ఆత్మ లోపలగాని, పైనగాని ఇతరమేమియును లేనిది. ఆత్మ అంతా ప్రజ్ఞాన ఘనము - చైతన్యమాత్రము - అందుచేత ఆత్మ ఏకరూపము - ఒకే రూపముగలది).
(ఈ ఆత్మకు లోపల పైన చైతన్యము తప్ప మరొకరూపము లేదు - దాని రూపము ఎల్లపుడు చైతన్యమే. ఉప్పుగడ్డకు లోపల పైన ఉప్పురసమే ఎల్లపుడూ ఉండునట్లు - మరొక రసము లేనట్లు).
(జ్యోతిర్మయుడైన సూర్యుడు నిజానికి ఒకడే అయినప్పటికీ వేరు వేరు కుండలలోని నీళ్ళలో ప్రతిబింబించుట వలన నేక సూర్యులుగా ఏ ప్రకారము కనబడుచుండునో ఆ ప్రకారముగానే స్వయం ప్రకాశరూపుడైనటువంటిన్నీ, జన్మ లేనటువంటిన్నీ ఆత్మ తనకుపాధియైన మాయ కారణముగా అనేక క్షేత్రములందు - శరీరములందు - ఉండుటవలన అనేకముగా - అనేక ఆత్మలుగా, అనేక రూపములుగా - ఉన్నట్టు స్ఫురించుచున్నాడు - ఈ దృష్టాంతమువలన బ్రహ్మ నిర్విశేషమని తెలియుచున్నది. భూతములన్నింటిలోను అంతరాత్మగా - ఒక్కొక్క దానిలో భూతాత్మగాను ఒకే ఆత్మయున్నది).
(parabrahma caitanya mātramuna, dīniki vēraina maroka rūpamu lēnidani nirviśēṣamani śruti ceppucunnadi - uppugallu lōpala paina aṃtā uppē, uppu kānidi dānilōpalagāni, painagāni marēdiyu lēdu - ā prakāramugānē ī ātma lōpalagāni, painagāni itaramēmiyunu lēnidi. ātma aṃtā prajñāna ghanamu - caitanyamātramu - aṃducēta ātma ēkarūpamu - okē rūpamugaladi).
(ī ātmaku lōpala paina caitanyamu tappa marokarūpamu lēdu - dāni rūpamu ellapuḍu caitanyamē. uppugaḍḍaku lōpala paina uppurasamē ellapuḍū uṃḍunaṭlu - maroka rasamu lēnaṭlu).
(jyōtirmayuḍaina sūryuḍu nijāniki okaḍē ayinappaṭikī vēru vēru kuṃḍalalōni nīḷḷalō pratibiṃbiṃcuṭa valana nēka sūryulugā ē prakāramu kanabaḍucuṃḍunō ā prakāramugānē svayaṃ prakāśarūpuḍainaṭuvaṃṭinnī, janma lēnaṭuvaṃṭinnī ātma tanakupādhiyaina māya kāraṇamugā anēka kṣētramulaṃdu - śarīramulaṃdu - uṃḍuṭavalana anēkamugā - anēka ātmalugā, anēka rūpamulugā - unnaṭṭu sphuriṃcucunnāḍu - ī dṛṣṭāṃtamuvalana brahma nirviśēṣamani teliyucunnadi. bhūtamulanniṃṭilōnu aṃtarātmagā - okkokka dānilō bhūtātmagānu okē ātmayunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.