← Back to ఏ · Booklets 11–20 (digitized file 2)

ఏకవిజ్ఞాన ప్రతిజ్ఞా ēkavijñāna pratijñā

Original — తెలుగు
  1. “కస్మిన్ భగవో, విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి ?” (ముండకోపనిషత్).

“పరమాత్మని, సర్వాత్మకే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం స్యాత్”.

(పూజ్యుడా! దేనిని తెలుసుకొనినచో ఈ ప్రపంచమంతయు, ఈ ప్రపంచములోని వస్తువులన్నియు తెలియనగును? అను ప్రశ్నకు ఈ క్రిందవిధముగా సమాధానము చెప్పబడినది: -

(సర్వాత్మ అయిన పరమాత్మను తెలుసుకొనినచో ఈ ప్రపంచమంతయు తెలియనగును).

  1. “తత్ర చైకేన విజ్ఞాతేన సర్వ మన్య ద విజ్ఞాత మపి విజ్ఞాతం భవతి ప్రతీయతే. తచ్ఛో పాదాన కారణ విజ్ఞానే సర్వ విజ్ఞానం భవతి. ఉపాదాన కారణ వ్యతిరేకాత్ కార్యస్య నిమిత్త కారణా వ్యతిరేకాత్కార్యస్య, నిమిత్త కారణా వ్యతిరేకస్తు కార్యస్యనాస్తి. లోకే తక్ష ప్రాసాద వ్యతిరేక దర్సనాత్, దృష్టాంతోపి”యథా సోమ్యకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాద్వాచారాభణం వికారో నామధేయం మౄత్తికేత్యేవ సత్యం” (ఛాందోగ్యోపనిషత్ - 6 - 1 - 4)

ఇత్యుపాదానకారణ గోచర ఏవామ్నాయతే”

(ఒక వస్తువును తెలుసుకొనినయడల మిగిలిన అటువంటి వస్తువులన్నియు తెలియనివైనను తెలియబడుచున్నవి. ఎట్లనగా - మొదటి వస్తువుయొక్క ఉపాదానకారణము తెలిసినయడల అటువంటి మిగిలిన వస్తువులకు కూడ ఉపాదానకారణమదియే కనుక అవి అన్నియు తెలియనగును - మట్టితో చేయబడిన కుండకు మట్టి ఉపాదానకారణము. ఆ ప్రకారముగానే. ఆ ప్రకారముగానే మట్టితో చేయబడిన మిగిలినవస్తువులు కూడా తెలియనగును - లోకములో ఉపాదానకారణమునకు వ్యతిరేకమైన కార్యము, నిమిత్తకారణమునకు వ్యతిరేకముకాని, లేదు. కుండకు ఉపాదానకారణమైన మట్టికంటె, వ్యతిరేకముగా మట్టి కార్యమైన కుండ ఉండదు. ఆ ప్రకారముగానే కుండకు కుమ్మరివాడు నిమిత్తకారణము - నిమిత్తకారణమైన కుమ్మరివానికంటె వ్యతిరిక్తముగా కాని కుండ ఉండదు. అందుచేత ఉపాదానకారణము ఒకటే అయిన వస్తువులలో ఒకటి తెలిసినయడల మిగిలినవన్నియు తెలియనగును. భగవంతుడిలోనుండి ప్రపంచము పుట్టినది. అందుచేత ప్రపంచమునకు భగవంతుడు ఉపాదానకారణము - ఉపాదానమైన భగవంతుని తెలుసుకొనినచో అన్నియు తెలియనగును - ప్రపంచమంతా, ప్రపంచములోని వస్తువులన్నియు తెలియనగును -).

  1. తథా బృహదారణ్యకే - “ఆత్మ నిఖల్వరే దృష్టే, శ్రుతే విజ్జాతే ఇదం సర్వం విదితమతి ప్రతిజ్ఞా -” (శ్రీశంకరః - బ్రహ్మ సూత్రభాష్యే)

(ఆత్మ సాక్షాత్కారమైన యడల, ఆత్మ గుఱించి వినినయడల, ఆత్మను తెలుసుకొనినయడల ఈ ప్రపంచ మంతయు - దానిలోనుండు వస్తువులన్నియు తెలియనగును). “బ్రహ్మై వేదం సర్వం” (ముండకోపనిషత్ - 2 - 2 - 11)

“సర్వ ఖిలిదం బ్రహ్మ” - (ఛాందోగ్యోపనిషత్ - 3 - 14 - 1)

(ఈ కనబడు ప్రపంచమంతయు బ్రహ్మమే).; “వాసుదేవ వ్యతిరిక్తంబులేదు” - (శ్రీమదాంధ్రమహాభాగవతము - - )

“విష్ణుండు విశ్వంబు వేరేమియును లేదు” (శ్రీమదాంధ్రమహాహాగవతము - 1 - 5 - 65)

Transliteration
  1. “kasmin bhagavō, vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati ?” (muṃḍakōpaniṣat).

“paramātmani, sarvātmakē vijñātē sarvamidaṃ vijñātaṃ syāt”.

(pūjyuḍā! dēnini telusukoninacō ī prapaṃcamaṃtayu, ī prapaṃcamulōni vastuvulanniyu teliyanagunu? anu praśnaku ī kriṃdavidhamugā samādhānamu ceppabaḍinadi: -

(sarvātma ayina paramātmanu telusukoninacō ī prapaṃcamaṃtayu teliyanagunu).

  1. “tatra caikēna vijñātēna sarva manya da vijñāta mapi vijñātaṃ bhavati pratīyatē. tacchō pādāna kāraṇa vijñānē sarva vijñānaṃ bhavati. upādāna kāraṇa vyatirēkāt kāryasya nimitta kāraṇā vyatirēkātkāryasya, nimitta kāraṇā vyatirēkastu kāryasyanāsti. lōkē takṣa prāsāda vyatirēka darsanāt, dṛṣṭāṃtōpi”yathā sōmyakēna mṛtpiṃḍēna sarvaṃ mṛṇmayaṃ vijñātaṃ syādvācārābhaṇaṃ vikārō nāmadhēyaṃ mṝttikētyēva satyaṃ” (chāṃdōgyōpaniṣat - 6 - 1 - 4)

ityupādānakāraṇa gōcara ēvāmnāyatē”

(oka vastuvunu telusukoninayaḍala migilina aṭuvaṃṭi vastuvulanniyu teliyanivainanu teliyabaḍucunnavi. eṭlanagā - modaṭi vastuvuyokka upādānakāraṇamu telisinayaḍala aṭuvaṃṭi migilina vastuvulaku kūḍa upādānakāraṇamadiyē kanuka avi anniyu teliyanagunu - maṭṭitō cēyabaḍina kuṃḍaku maṭṭi upādānakāraṇamu. ā prakāramugānē. ā prakāramugānē maṭṭitō cēyabaḍina migilinavastuvulu kūḍā teliyanagunu - lōkamulō upādānakāraṇamunaku vyatirēkamaina kāryamu, nimittakāraṇamunaku vyatirēkamukāni, lēdu. kuṃḍaku upādānakāraṇamaina maṭṭikaṃṭe, vyatirēkamugā maṭṭi kāryamaina kuṃḍa uṃḍadu. ā prakāramugānē kuṃḍaku kummarivāḍu nimittakāraṇamu - nimittakāraṇamaina kummarivānikaṃṭe vyatiriktamugā kāni kuṃḍa uṃḍadu. aṃducēta upādānakāraṇamu okaṭē ayina vastuvulalō okaṭi telisinayaḍala migilinavanniyu teliyanagunu. bhagavaṃtuḍilōnuṃḍi prapaṃcamu puṭṭinadi. aṃducēta prapaṃcamunaku bhagavaṃtuḍu upādānakāraṇamu - upādānamaina bhagavaṃtuni telusukoninacō anniyu teliyanagunu - prapaṃcamaṃtā, prapaṃcamulōni vastuvulanniyu teliyanagunu -).

  1. tathā bṛhadāraṇyakē - “ātma nikhalvarē dṛṣṭē, śrutē vijjātē idaṃ sarvaṃ viditamati pratijñā -” (śrīśaṃkaraḥ - brahma sūtrabhāṣyē)

(ātma sākṣātkāramaina yaḍala, ātma guṟiṃci vininayaḍala, ātmanu telusukoninayaḍala ī prapaṃca maṃtayu - dānilōnuṃḍu vastuvulanniyu teliyanagunu). “brahmai vēdaṃ sarvaṃ” (muṃḍakōpaniṣat - 2 - 2 - 11)

“sarva khilidaṃ brahma” - (chāṃdōgyōpaniṣat - 3 - 14 - 1)

(ī kanabaḍu prapaṃcamaṃtayu brahmamē).; “vāsudēva vyatiriktaṃbulēdu” - (śrīmadāṃdhramahābhāgavatamu - - )

“viṣṇuṃḍu viśvaṃbu vērēmiyunu lēdu” (śrīmadāṃdhramahāhāgavatamu - 1 - 5 - 65)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.