ఈశతే భగావానేకః సత్యమే తధ్బ్రవీమితే |.
(కాలమును, మృత్యువును, చరాచరభూతములను శాసించి నడుపువాడు ఒకే ఒక భగవంతుడు. ఇతి నిజమని చెప్పుచున్నాను).
(ప్రస్తుతము అనేక నామ రూపములతో నిండియున్న యీ కనబడు ప్రపంచము సృష్టికిముందు ఒక్క ఆత్మగానే యుండెను. దానినుండి ఈ ప్రపంచము పుట్టినది. అందుచేత ఆత్మ దేవుడు, పరమాత్మ, పరబ్రహ్మ అనువాడు ఒక్కడే).
స సంజ్ఞాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్థనః ||” (విష్ణుపురాణము)
(జనార్థనుడని వ్యవహరింపబడు ఈశ్వరుడొక్కడే, సృష్టి క్రియ చేయుచు బ్రహ్మయనియు, స్థితి క్రియయందు విష్ణువనియు, లయము చేయుటబట్టి శివుడనియు పేరున చెప్పబడుచున్నాడు).
ఏకం సంతం యం బహుదాహుర్మతి భేదాత్ తం సంసార ధ్వాంత వినాశం హరిమీ ళే ||“. (హరిమీ డేస్తవము)
(బ్రహ్మయని, విష్ణువని, రుద్రుడని, హుతాశనుడని, సూర్యుడని, చంద్రుడని, ఇంద్రుడని, వాయువని, యజ్ఞమూర్తియని,. అనేక పేర్లతో వారి వారి మతానుసారముగ చెప్పబడుచున్నవాడు జననమరణాది రూపమైన సంసారమును లేకుండ చేయువాడు భగవంతుడగు హరినే స్మరించుచున్నాను). (చూడుము - “ఏకం దైవతం”).
(అనేక రూపములతోను, అనేక రసములతోను కూడిన బెల్లము, పాలు మొదలగునవి ఒకే పదార్థము అయినను ఇంద్రియవృత్తులనుబట్టి వేరు వేరుగా గ్రహించబడును - కంటికి తెల్లదిగాను, నాలుకకు - రుచికి - తియ్యగాను, స్పర్శమునకు - పట్టుకొనునప్పుడు చల్లగాను ఉండును. ఆ ప్రకారముగానే భగవంతుడొకడే అయినను అనేక రూపములతో నున్నట్లు తెలుసుకొనబడుచున్నాడు).
īśatē bhagāvānēkaḥ satyamē tadhbravīmitē |.
(kālamunu, mṛtyuvunu, carācarabhūtamulanu śāsiṃci naḍupuvāḍu okē oka bhagavaṃtuḍu. iti nijamani ceppucunnānu).
(prastutamu anēka nāma rūpamulatō niṃḍiyunna yī kanabaḍu prapaṃcamu sṛṣṭikimuṃdu okka ātmagānē yuṃḍenu. dāninuṃḍi ī prapaṃcamu puṭṭinadi. aṃducēta ātma dēvuḍu, paramātma, parabrahma anuvāḍu okkaḍē).
sa saṃjñāṃ yāti bhagavān ēka ēva janārthanaḥ ||” (viṣṇupurāṇamu)
(janārthanuḍani vyavahariṃpabaḍu īśvaruḍokkaḍē, sṛṣṭi kriya cēyucu brahmayaniyu, sthiti kriyayaṃdu viṣṇuvaniyu, layamu cēyuṭabaṭṭi śivuḍaniyu pēruna ceppabaḍucunnāḍu).
ēkaṃ saṃtaṃ yaṃ bahudāhurmati bhēdāt taṃ saṃsāra dhvāṃta vināśaṃ harimī ḷē ||“. (harimī ḍēstavamu)
(brahmayani, viṣṇuvani, rudruḍani, hutāśanuḍani, sūryuḍani, caṃdruḍani, iṃdruḍani, vāyuvani, yajñamūrtiyani,. anēka pērlatō vāri vāri matānusāramuga ceppabaḍucunnavāḍu jananamaraṇādi rūpamaina saṃsāramunu lēkuṃḍa cēyuvāḍu bhagavaṃtuḍagu harinē smariṃcucunnānu). (cūḍumu - “ēkaṃ daivataṃ”).
(anēka rūpamulatōnu, anēka rasamulatōnu kūḍina bellamu, pālu modalagunavi okē padārthamu ayinanu iṃdriyavṛttulanubaṭṭi vēru vērugā grahiṃcabaḍunu - kaṃṭiki telladigānu, nālukaku - ruciki - tiyyagānu, sparśamunaku - paṭṭukonunappuḍu callagānu uṃḍunu. ā prakāramugānē bhagavaṃtuḍokaḍē ayinanu anēka rūpamulatō nunnaṭlu telusukonabaḍucunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.