← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గజస్నానన్యాయము gajasnānanyāyamu

Original — తెలుగు
  1. ఏనుగు తనవంటిని ఉన్న దుమ్ము పోవుటకు చాలాకాలము స్నానము చేయును. కాని అది వడ్డుకు వచ్చినతర్వాత మరల తనవంటిమీద బుగ్గి జల్లుకొనును - అందుచేత అది చేసిన స్నానము వ్యర్థము -.

  2. “సీ. - - - కనుకలి వినుకలి గలిగినట్టి

పాసము దనకు నొప్పని దనికని చాల తప్తుడయ్యు గ్రమ్మఱ నొనర్చు

మూఢాత్మునకు దోషమోచనం బెయ్యది ? - -

---

ఆ. యిట్టి జనుడు పుణ్యమేరీతి జేసిన

నది ఫలింపనేరదని తలంతు

సలిలమందు మేని మలినంబువోకుండ

గజము గ్రుంకునెట్టు గతియుబోలె“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - 46).

  1. “కృచిన్నివర్తతే భద్రాత్, క్వచిదా చరతే పునః |

ప్రాయశ్చిత్తమధోపార్థం మన్యే కుంజరశౌచిపత్||“. (శ్రీమద్భాగవతం - 1 - 10 - )

(ఒకప్పుడు పాపము చేసి, అట్లు మరల చేయననుకొని, మరల - స్వభావమువలన - పాపము చేయువాని, గజస్నానమువలె ప్రాయశ్చిత్తము లేదు).

  1. “అవశేంద్రియచిత్తానాం హస్తిస్నానమివక్రియా”.

(ఇంద్రియములను, మనస్సును తన వశములో ఉంచుకొననివాడు చేసినపనులు గజస్నానము వలె వ్యర్థ ములు. ఒకమాటు విషయములయెడల మనసును పోనీయకూడదు అని అనుకొనినవాడు, మరల అట్లు విషయములయడల మనసు పోనిచ్చిన వాడి మనో నిశ్చయము వ్యర్థము). (చూడుము - ‘కుంజర శౌచము’).

Transliteration
  1. ēnugu tanavaṃṭini unna dummu pōvuṭaku cālākālamu snānamu cēyunu. kāni adi vaḍḍuku vaccinatarvāta marala tanavaṃṭimīda buggi jallukonunu - aṃducēta adi cēsina snānamu vyarthamu -.

  2. “sī. - - - kanukali vinukali galiginaṭṭi

pāsamu danaku noppani danikani cāla taptuḍayyu grammaṟa nonarcu

mūḍhātmunaku dōṣamōcanaṃ beyyadi ? - -

---

ā. yiṭṭi januḍu puṇyamērīti jēsina

nadi phaliṃpanēradani talaṃtu

salilamaṃdu mēni malinaṃbuvōkuṃḍa

gajamu gruṃkuneṭṭu gatiyubōle”. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - 46).

  1. “kṛcinnivartatē bhadrāt, kvacidā caratē punaḥ |

prāyaścittamadhōpārthaṃ manyē kuṃjaraśaucipat||“. (śrīmadbhāgavataṃ - 1 - 10 - )

(okappuḍu pāpamu cēsi, aṭlu marala cēyananukoni, marala - svabhāvamuvalana - pāpamu cēyuvāni, gajasnānamuvale prāyaścittamu lēdu).

  1. “avaśēṃdriyacittānāṃ hastisnānamivakriyā”.

(iṃdriyamulanu, manassunu tana vaśamulō uṃcukonanivāḍu cēsinapanulu gajasnānamu vale vyartha mulu. okamāṭu viṣayamulayeḍala manasunu pōnīyakūḍadu ani anukoninavāḍu, marala aṭlu viṣayamulayaḍala manasu pōniccina vāḍi manō niścayamu vyarthamu). (cūḍumu - ‘kuṃjara śaucamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.