← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గంధర్వనగరము gaṃdharvanagaramu

Original — తెలుగు
  1. ఆకాశమున మేఘములు చిత్ర విచిత్ర రూపముల పొందుచు మారుచు, ఒక నగర ముగా కనబడునది, ఒక భ్రాంతిని కలుగచేయునది.

  2. భూమిమీద కనబడు ఎండమావులవలె ఆకాశమున తోచు మిధ్యానగరము -

  3. “గంధర్వ నగరం హి అకస్మా దేవక్వచిత్ ఆయాతి, అపయాతి చ ఇతి ప్రసిద్ధం; తదేవం అనిత్యం, శోకాది హేతుత్వం ఆగమాపా యిత్వం ఉక్తం శబ్దాది విషయేషు”

(గంధర్వనగరమనగా నగరరూపములో అకస్మాత్తుగా వచ్చునది పోవునది అని ప్రసిద్ధి. అందుచేత నిత్యమైనది కాదు, శోకమునకు కారణమైనదనిన్నీ, వచ్చుచూ పోవుచుండుననిన్నీ చెప్పుట - ఇది శబ్దము మొదలగు విషయములగుఱించి చెప్పబడినది).

  1. “యధా చ నభః ప్రసాంత పురగోపుర స్వపక్ష, పరపక్ష చం చాద్యా కర్ణమివ గంధర్వనగరం దృశ్య మానం సత్ అకస్మాత్ అసత్పదం గతం దృష్టం, తదా స్వావిద్యాపద తత్కార్య జాతం ఆత్మత్వేన సత్య త్వేన వ్యావహారికత్వేన ప్రాతి భాసికత్వేన వా స్తీతి విశ్వసనీయం విశ్వం శశ శృంగవత్ అసత్ దృష్టం - తతః తద్విశ్వాపహ్నవ సిద్ధం బ్రహ్మమాత్రం స్వావశేష తయా దృష్ట మిత్యర్థః”

(ఆకాశములో మేఘములతో, ఇళ్ళు, గోపురములు కలిగిన నగరమువలె అప్పుడప్పుడు కనుపించుచూ మాయమగుచుండును. దీనినే గంధర్వనగరమందురు. ఈ గంధర్వనగరమువలెనే అవిద్యవలన అవిద్యవలనకలిగిన కార్యవస్తువైన ఈ ప్రపంచమంతయు అసద్వస్తువైనప్పటికీ సత్పదార్థమైన ఆత్మ వలెనే ప్రకాశించుచున్నది - భావింపబడుచున్నది. ఈ విశ్వము (ప్రపంచము) కుందేటి కొమ్మువలె అసత్పదార్థమే, లేనిదే. ఈ ప్రపంచముచేత - ప్రకృతి, దాని పరిణామములచేత - ఆవరించబడిన అత్మ తత్వమే, ప్రపంచము నశించునను తాను నశింపక మిగిలియుండునది).

Transliteration
  1. ākāśamuna mēghamulu citra vicitra rūpamula poṃducu mārucu, oka nagara mugā kanabaḍunadi, oka bhrāṃtini kalugacēyunadi.

  2. bhūmimīda kanabaḍu eṃḍamāvulavale ākāśamuna tōcu midhyānagaramu -

  3. “gaṃdharva nagaraṃ hi akasmā dēvakvacit āyāti, apayāti ca iti prasiddhaṃ; tadēvaṃ anityaṃ, śōkādi hētutvaṃ āgamāpā yitvaṃ uktaṃ śabdādi viṣayēṣu”

(gaṃdharvanagaramanagā nagararūpamulō akasmāttugā vaccunadi pōvunadi ani prasiddhi. aṃducēta nityamainadi kādu, śōkamunaku kāraṇamainadaninnī, vaccucū pōvucuṃḍunaninnī ceppuṭa - idi śabdamu modalagu viṣayamulaguṟiṃci ceppabaḍinadi).

  1. “yadhā ca nabhaḥ prasāṃta puragōpura svapakṣa, parapakṣa caṃ cādyā karṇamiva gaṃdharvanagaraṃ dṛśya mānaṃ sat akasmāt asatpadaṃ gataṃ dṛṣṭaṃ, tadā svāvidyāpada tatkārya jātaṃ ātmatvēna satya tvēna vyāvahārikatvēna prāti bhāsikatvēna vā stīti viśvasanīyaṃ viśvaṃ śaśa śṛṃgavat asat dṛṣṭaṃ - tataḥ tadviśvāpahnava siddhaṃ brahmamātraṃ svāvaśēṣa tayā dṛṣṭa mityarthaḥ”

(ākāśamulō mēghamulatō, iḷḷu, gōpuramulu kaligina nagaramuvale appuḍappuḍu kanupiṃcucū māyamagucuṃḍunu. dīninē gaṃdharvanagaramaṃduru. ī gaṃdharvanagaramuvalenē avidyavalana avidyavalanakaligina kāryavastuvaina ī prapaṃcamaṃtayu asadvastuvainappaṭikī satpadārthamaina ātma valenē prakāśiṃcucunnadi - bhāviṃpabaḍucunnadi. ī viśvamu (prapaṃcamu) kuṃdēṭi kommuvale asatpadārthamē, lēnidē. ī prapaṃcamucēta - prakṛti, dāni pariṇāmamulacēta - āvariṃcabaḍina atma tatvamē, prapaṃcamu naśiṃcunanu tānu naśiṃpaka migiliyuṃḍunadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.