(శ్రీదేవీ భాగవతమందు మేరు తంత్రశాస్త్రము మొదలగువాటియందు గాయత్రి సాక్షాత్ శ్రీదేవియే యని ప్రతిపాదింపబడినది).
(గాయత్రి స్త్రీరూపమని శాక్తేయులు, స్మార్తులు తాలుకు సాంప్రదాయము)
“ఉత్తిష్తదేవి స్థాతవ్యం ప్రవిశ్య హృదయం మమ” అనియు,“సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి” అని కూడ చెప్పబడినది.
(పూర్వహ్నమందు గాయత్రియనియు, మధ్యాహ్నకాలమందు సావిత్రియనియు, సాయంకాలమందు సరస్వతియనియు ఆ సంధ్యా దేవియే చెప్పబడుచున్నది).
జగతః ప్రసవి తృత్వాత్ వాగ్రూపత్వాత్ సరస్వతీ |
సర్వాత్మనాహియా దేవి సర్వభూతేషు సంస్థితా |
గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణం ||”
(సూర్యునిలోనుండి సూర్యుని ప్రకాశింపచేయుటచేతను, జగత్తును సృష్టిచేయుటవలనను గాయత్రి సావిత్రియని కీర్తింపబడుచున్నది. అదియే వాగ్రూపమగుటవలన సరస్వతియని చెప్ప బడుచున్నది. సమస్తమైనవాటికి ఆత్మ అయినది, సమస్తభూతములందు ఉండునది, గాయత్రి మోక్షమునకు కారణమైనది. (గాయత్రి పరమాత్మయే - పరబ్రహ్మమేయని ఉపాసించుటవలన మోక్షదాయి యగును - మోక్షస్థానమగు లక్షణముగలది).
“బ్రహ్మ శిరః, విష్ణుర్హృదయమ్రుద్రః శిఖా” ఇతి మంత్రేణ శివాదీనాం విన్యాసోప వర్ణనం సర్వథాన సంగచ్ఛతే.
తస్మాత్ స్త్రీత్వ విశిష్టా పరాశక్తిః గాయత్రీ దేవతైవ గాయత్రీ మంత్రేణ సర్వ ద్విజాతిభిః నిత్యతయా ఉపాస్యా“.
(విష్ణువు, శివుడు, గణపతి మొదలగు దేవతులనుగుఱించి కూడా పురాణములలోను ఆగమములలోను అవి గాయత్రియనియే ప్రతిపాదించబడినది. అది ఏట్లంటే - మైత్రాయిణీ శ్రుతిలో శివుడు గాయత్రియని ప్రతిపాదించబడినది. అగ్నిపురాణములోను, తంత్రములోను నారాయణుడు గాయత్రియని ప్రతిపాదించబడినది. అందుచేత గాయత్రి పురుషరూపమే, గాయత్రీమంత్ర దేవత పరాప్రకృతి అయిన దేవత (స్త్రీరూపము) అను నియమములేదు అని చెప్పుటకు వీలులేదు. ఎందుచేతననగా, గాయత్రీమంత్ర దేవత అంతర్యామి యని చెప్పబడుచున్నది. నాలుగు వేదములలోను గాయత్రీ ఉపాసన సందర్భములోస్త్రీదేవతయే చెప్పబడినది : - “ఛందస్సులకు మాత అయినటువంటిన్నీ, వరములిచ్చునదిన్నీ, అక్షరమైనదిన్నీ, బ్రహ్మ సమ్మితమైన గాయత్రీదేవి బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుటకు వచ్చుగాక” అని ఆవాహనమంత్రములో “భూమిమీద కొండ శిఖరమందు పుట్టిన ఓ దేవీ! బ్రాహ్మణులచేత అనుజ్ఞపొందినదానవై వెళ్ళుము.” అని విసర్జనమంత్రమందు, అని(గాయత్రిని ఆహ్వానించినపుడు, విసర్జనచేసినపుడు) దేవి అనియే - స్త్రీరూపము అనియే పేర్కొనబడినది, గాయత్రిని ధ్యానముచేయు మంత్రములో “బాలసూర్య మండల మధ్య మందున్న బాలా” అని సంబోధన చేయబడినది. ఇందువల్లపరాచిచ్ఛక్తియే గాయత్రీమంత్రమందు ప్రతిపాదింపబడినది - స్త్రీరూపమే ధ్యానము చేయబడుచున్నది. శివుడు, విష్ణువు, గణపతి - ఈ ముగ్గురు గాయత్రియని పైన చెప్పిన ప్రకారము ప్రతిపాదించుటకు కారణమేమనగా గాయత్రి సమస్త పదార్థములందు అంతర్యామిగానుండునదికనుక. శివుడు, విష్ణువు, గణపతి గాయత్రియని చెప్పుటవలనవారికి సర్వాంతర్యామిత్వము కల్పించుటకు ఇట్లుప్రతిపాదింపబడినది. అయిననువేదములో ఉపాసనా సమయమందు గాయత్రియొక్క యేరూపము ధ్యానించవలసినదని చెప్పబడినదో ఆ రూపమునే ధ్యానించవలెను - వేదములో - “గాయత్రికి ఛందస్సు గాయత్రి, ఋషి విశ్వామిత్రుడు, దేవత సవిత, ముఖము అగ్ని, శిరస్సు బ్రహ్మ, హృదయము విష్ణువు, శిఖ రుద్రుడు” అని సవితృ రూపమే గాయత్రి యని చెప్పబడినదికదా అనిన అట్లుకాదు. ఇక్కడ సవితృరూపము అని చెప్పుటవలన సూర్యమండలము నధిష్టించియున్న ఒకానొక పురుషుడు అని చెప్పుటకాదు - ఆ సూర్యమండలములోపల సృష్టినిచేయు పరమాత్మయని చెప్పబడినది - ధ్యానమంత్రమందు గాయత్రి స్త్రీరూపము చెప్పబడియుండినందున గాయత్రి అనగా సూర్యమండలమందు ఉన్న పరమాత్మ యని చెప్పుటలో విరోధములేదు -మైత్రాయణీయ బ్రాహ్మ బ్రాహ్మణ మంత్రమందు సూర్యమండలమందు అధిష్టించియున్న పురుషునిలోనున్న పరమాత్మరూపమే గాయత్రీమంత్రముచేత ప్రతిపాదించబడినది. శ్రుతి ఇట్లు చెప్పుచున్నది : - “అధ భర్గో దేవస్య ధీమహి ఇతి సవితావై దేవః, తతో అస్య భర్గాఖ్యః తచ్చింతయామి ఇత్యాహుర్బ్రహ్మ వాదినః -” ఇతి. అనేనచ సవితుర్దేవస్య సూర్యస్య సంబంధి యదంతర్యామి భర్గాఖ్యం తేజః తత్ ధీమహి ఇత్యన్వయః ఉక్తః - దీనిని బట్టి సూర్యునికి సంబంధించిన అంతర్యామి యగు తేజస్సును ధ్యానించుచున్నాను - అని అర్థమగును. సూర్యుడు దేవతయేయగుగాక కాని ధ్యానము స్త్రీలింగపరముగా ఆ మంత్రములోనే యున్నది. “సవితా దేవతా, అగ్నిర్ముఖం - - - వినియోగః”. ఈ మంత్రము స్త్రీలింగ విశిష్టమైన, సూర్యరూపమైన పరాశక్తియే ఉపాసించ తగినది).
(గాయత్రీ మంత్ర ద్రష్టలు చాలమంది ఉన్నారు. వారిలో బ్రహ్మ, వసిష్టుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వాల్మీకిభరద్వాజుడు, నారదుడు అనువారు ఏడుగురు ముఖ్యమైనవారు.వారందఱు “భర్గోదేవస్య ధీమహి” (దేవునియొక్క తేజస్సును ధ్యానించెదను) అనుటవల్ల గాయత్రీస్వరూపము ముఖ్యముగా తేజోరూపమని వారి యిష్టదేవతా రూపముచేత ఉపాసించి సిద్ధిని పొందిరి. అందువల్లగాయత్రి అనిన కేవలము తేజోరూపము - దేవతయను శబ్దమునకు అదే అర్థము)
(“గాయత్ర్యాః గాయత్రీ ఛందో, విశ్వామిత్ర ఋషిః, సవితా దేవతా” గాయత్రీమంత్రమునకు అధిదేవత సవితా, సవితా అనగా : -
(1). “ప్రజానాం తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే” (విష్ణుధర్మోత్తరే)
(ప్రజలను పుట్టించువాడు, సృష్టిచేయువాడుకనుక సవితా అని చెప్పబడినది).
(2). “సర్వస్యజగతః ప్రసవితా, ‘జనయితా’ (జగత్తునంతటినీ పుట్టించువాడు). దీనినిబట్టి సవితా అనగా జగత్తు అంతటినీ సౄష్టించువాడు అని అర్థమగుచున్నది. ధ్యానశ్లోకములో -” ధ్యేయస్సదా సవితృ మండలమధ్యవర్తీ నారాయణః - - - హిరణ్మయనపుః - - - ఆదిత్య వర్గాభః సూర్యమండలమధ్యగః - ధ్యేయ యేవ చ”.
(సవితృమండలమధ్యమందున్నవాడు, సూర్యూమండలమధ్యనున్నవాడు - ఈ రెండు విశేషముల బట్టి - సూర్యునిలోపలనుండి సూర్యునకు కాంతి, వేడిమి, శక్తినిచ్చువాడు, వాటికికారణమైనవాడు - సూర్యుని లోపల neclear fusion అగుచుండుటవలన helium అను element తయారగుచున్నందున సూర్యునికి ఆ తేజస్సు, వేడిమి, శక్తి కలుగుచున్నవి - దానికి కారణము ప్రతి అణువులోను శక్తిరూపములోనున్న పరబరహ్మమే (Every particle of matter contains Energy) - ” యదాదిత్యగతం తేజః - - - తత్తేజో విద్ధిమామకం” (సూర్యునిలోపలనుండు తేజస్సు నాదే - సూర్యునిలో నేను తేజోరూపములో నుండుటవలననే సూర్యునకు ఆ తేజస్సు - కాంతి, వేడిమి శక్తి కలిగినవి - (శ్రీమద్భగవద్గీత- 15 - 12)
అందుచేత సూర్యమండలమందున్నవాడు పరబ్రహ్మయే - సూర్యుడు స్వయంప్రకాశము కాదు - ఆ పరబ్రహ్మయే నారయణుడని చెప్పబడుచున్నాడు - నారాయణుడనగా సృష్టిలోని సమస్తవస్తువులను తనలోనుండి - ఒకదానిలోనుండి ఒకటిగా - పుట్టించి, వాటిలో తాను ప్రవేశించియుండి పోషించుచు, వాటిని అంతము చేయువాడు. అతనే సూర్యమండల మధ్యమందు తేజోరూపములో ప్రత్యక్ష పరమాత్మగానున్నవాడు అని ధ్యానించవలెను - భగవంతుడు తేజోరూపుడు - “తేజసామపి తత్తేజస్వి”,“తేజస్తేజస్వినామహం” (తేజోవంతమైన సూర్యుడు, నక్షత్రములు మొదలగువాటిలోని తేజస్సు నేనే). పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పబడువాడు నిరాకారుడు - రూపము లేనివాడు - అందుచేత అతనిని భక్తుడు ఏ రూపములో నైనను ధ్యానించవచ్చును. దేవియనిగాని, విష్ణువనిగాని, శివుడనిగాని, గణేశ్వరుడనికాని ధ్యానించవచ్చును. సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి ” (సమస్తమైన దేవతలకుచేసిన నమస్కారము కేశవునకే చెందును - అవన్నీయు అతనిరూపములేకనుక. అప్పుడు కేశవుడు అనగా నిరాకార పరబ్రహ్మయే“తత్సవితుః - - -భర్గో - - ధీమహి”(సూర్యమండలములో తేజోరూపములోనున్న ఆ పరబ్రహ్మను ధ్యానించుచున్నాను అని అర్థమగుచున్నది. ధ్యానశ్లోకములో” హిరణ్మయ వపుః” అని చెప్పబడినది -“హిరణ్మయ వపుః” అనగా సృష్టిచేయగలుగు శక్తి ఉపాదానము సృష్టికి అవసరమగు ముడిసరుకు తనలోనేగలవాడు. అట్టివాడు పరమాత్మయే - అందుచేత గాయత్రి యనగా సూర్యమండలమందు, తేజోరూపములో యున్న వాటిలోను,తేజస్సుగా ఉన్న పరబ్రహ్మయే“తధ్యాన గోచరమూర్తిన్ ధరియింతుగాదె” - (శ్రీమదాంధ్రమహాభాగవతము- 3 - 9 - 298)
(śrīdēvī bhāgavatamaṃdu mēru taṃtraśāstramu modalaguvāṭiyaṃdu gāyatri sākṣāt śrīdēviyē yani pratipādiṃpabaḍinadi).
(gāyatri strīrūpamani śāktēyulu, smārtulu tāluku sāṃpradāyamu)
“uttiṣtadēvi sthātavyaṃ praviśya hṛdayaṃ mama” aniyu,“sarvavarṇē mahādēvi saṃdhyā vidyē sarasvati” ani kūḍa ceppabaḍinadi.
(pūrvahnamaṃdu gāyatriyaniyu, madhyāhnakālamaṃdu sāvitriyaniyu, sāyaṃkālamaṃdu sarasvatiyaniyu ā saṃdhyā dēviyē ceppabaḍucunnadi).
jagataḥ prasavi tṛtvāt vāgrūpatvāt sarasvatī |
sarvātmanāhiyā dēvi sarvabhūtēṣu saṃsthitā |
gāyatrī mōkṣahēturvai mōkṣasthānaka lakṣaṇaṃ ||”
(sūryunilōnuṃḍi sūryuni prakāśiṃpacēyuṭacētanu, jagattunu sṛṣṭicēyuṭavalananu gāyatri sāvitriyani kīrtiṃpabaḍucunnadi. adiyē vāgrūpamaguṭavalana sarasvatiyani ceppa baḍucunnadi. samastamainavāṭiki ātma ayinadi, samastabhūtamulaṃdu uṃḍunadi, gāyatri mōkṣamunaku kāraṇamainadi. (gāyatri paramātmayē - parabrahmamēyani upāsiṃcuṭavalana mōkṣadāyi yagunu - mōkṣasthānamagu lakṣaṇamugaladi).
“brahma śiraḥ, viṣṇurhṛdayamrudraḥ śikhā” iti maṃtrēṇa śivādīnāṃ vinyāsōpa varṇanaṃ sarvathāna saṃgacchatē.
tasmāt strītva viśiṣṭā parāśaktiḥ gāyatrī dēvataiva gāyatrī maṃtrēṇa sarva dvijātibhiḥ nityatayā upāsyā”.
(viṣṇuvu, śivuḍu, gaṇapati modalagu dēvatulanuguṟiṃci kūḍā purāṇamulalōnu āgamamulalōnu avi gāyatriyaniyē pratipādiṃcabaḍinadi. adi ēṭlaṃṭē - maitrāyiṇī śrutilō śivuḍu gāyatriyani pratipādiṃcabaḍinadi. agnipurāṇamulōnu, taṃtramulōnu nārāyaṇuḍu gāyatriyani pratipādiṃcabaḍinadi. aṃducēta gāyatri puruṣarūpamē, gāyatrīmaṃtra dēvata parāprakṛti ayina dēvata (strīrūpamu) anu niyamamulēdu ani ceppuṭaku vīlulēdu. eṃducētananagā, gāyatrīmaṃtra dēvata aṃtaryāmi yani ceppabaḍucunnadi. nālugu vēdamulalōnu gāyatrī upāsana saṃdarbhamulōstrīdēvatayē ceppabaḍinadi : - “chaṃdassulaku māta ayinaṭuvaṃṭinnī, varamuliccunadinnī, akṣaramainadinnī, brahma sammitamaina gāyatrīdēvi brahmajñānamunu upadēśiṃcuṭaku vaccugāka” ani āvāhanamaṃtramulō “bhūmimīda koṃḍa śikharamaṃdu puṭṭina ō dēvī! brāhmaṇulacēta anujñapoṃdinadānavai veḷḷumu.” ani visarjanamaṃtramaṃdu, ani(gāyatrini āhvāniṃcinapuḍu, visarjanacēsinapuḍu) dēvi aniyē - strīrūpamu aniyē pērkonabaḍinadi, gāyatrini dhyānamucēyu maṃtramulō “bālasūrya maṃḍala madhya maṃdunna bālā” ani saṃbōdhana cēyabaḍinadi. iṃduvallaparācicchaktiyē gāyatrīmaṃtramaṃdu pratipādiṃpabaḍinadi - strīrūpamē dhyānamu cēyabaḍucunnadi. śivuḍu, viṣṇuvu, gaṇapati - ī mugguru gāyatriyani paina ceppina prakāramu pratipādiṃcuṭaku kāraṇamēmanagā gāyatri samasta padārthamulaṃdu aṃtaryāmigānuṃḍunadikanuka. śivuḍu, viṣṇuvu, gaṇapati gāyatriyani ceppuṭavalanavāriki sarvāṃtaryāmitvamu kalpiṃcuṭaku iṭlupratipādiṃpabaḍinadi. ayinanuvēdamulō upāsanā samayamaṃdu gāyatriyokka yērūpamu dhyāniṃcavalasinadani ceppabaḍinadō ā rūpamunē dhyāniṃcavalenu - vēdamulō - “gāyatriki chaṃdassu gāyatri, ṛṣi viśvāmitruḍu, dēvata savita, mukhamu agni, śirassu brahma, hṛdayamu viṣṇuvu, śikha rudruḍu” ani savitṛ rūpamē gāyatri yani ceppabaḍinadikadā anina aṭlukādu. ikkaḍa savitṛrūpamu ani ceppuṭavalana sūryamaṃḍalamu nadhiṣṭiṃciyunna okānoka puruṣuḍu ani ceppuṭakādu - ā sūryamaṃḍalamulōpala sṛṣṭinicēyu paramātmayani ceppabaḍinadi - dhyānamaṃtramaṃdu gāyatri strīrūpamu ceppabaḍiyuṃḍinaṃduna gāyatri anagā sūryamaṃḍalamaṃdu unna paramātma yani ceppuṭalō virōdhamulēdu -maitrāyaṇīya brāhma brāhmaṇa maṃtramaṃdu sūryamaṃḍalamaṃdu adhiṣṭiṃciyunna puruṣunilōnunna paramātmarūpamē gāyatrīmaṃtramucēta pratipādiṃcabaḍinadi. śruti iṭlu ceppucunnadi : - “adha bhargō dēvasya dhīmahi iti savitāvai dēvaḥ, tatō asya bhargākhyaḥ tacciṃtayāmi ityāhurbrahma vādinaḥ -” iti. anēnaca saviturdēvasya sūryasya saṃbaṃdhi yadaṃtaryāmi bhargākhyaṃ tējaḥ tat dhīmahi ityanvayaḥ uktaḥ - dīnini baṭṭi sūryuniki saṃbaṃdhiṃcina aṃtaryāmi yagu tējassunu dhyāniṃcucunnānu - ani arthamagunu. sūryuḍu dēvatayēyagugāka kāni dhyānamu strīliṃgaparamugā ā maṃtramulōnē yunnadi. “savitā dēvatā, agnirmukhaṃ - - - viniyōgaḥ”. ī maṃtramu strīliṃga viśiṣṭamaina, sūryarūpamaina parāśaktiyē upāsiṃca taginadi).
(gāyatrī maṃtra draṣṭalu cālamaṃdi unnāru. vārilō brahma, vasiṣṭuḍu, viśvāmitruḍu, agastyuḍu, vālmīkibharadvājuḍu, nāraduḍu anuvāru ēḍuguru mukhyamainavāru.vāraṃdaṟu “bhargōdēvasya dhīmahi” (dēvuniyokka tējassunu dhyāniṃcedanu) anuṭavalla gāyatrīsvarūpamu mukhyamugā tējōrūpamani vāri yiṣṭadēvatā rūpamucēta upāsiṃci siddhini poṃdiri. aṃduvallagāyatri anina kēvalamu tējōrūpamu - dēvatayanu śabdamunaku adē arthamu)
(“gāyatryāḥ gāyatrī chaṃdō, viśvāmitra ṛṣiḥ, savitā dēvatā” gāyatrīmaṃtramunaku adhidēvata savitā, savitā anagā : -
(1). “prajānāṃ tu prasavanāt savitēti nigadyatē” (viṣṇudharmōttarē)
(prajalanu puṭṭiṃcuvāḍu, sṛṣṭicēyuvāḍukanuka savitā ani ceppabaḍinadi).
(2). “sarvasyajagataḥ prasavitā, ‘janayitā’ (jagattunaṃtaṭinī puṭṭiṃcuvāḍu). dīninibaṭṭi savitā anagā jagattu aṃtaṭinī sṝṣṭiṃcuvāḍu ani arthamagucunnadi. dhyānaślōkamulō -” dhyēyassadā savitṛ maṃḍalamadhyavartī nārāyaṇaḥ - - - hiraṇmayanapuḥ - - - āditya vargābhaḥ sūryamaṃḍalamadhyagaḥ - dhyēya yēva ca”.
(savitṛmaṃḍalamadhyamaṃdunnavāḍu, sūryūmaṃḍalamadhyanunnavāḍu - ī reṃḍu viśēṣamula baṭṭi - sūryunilōpalanuṃḍi sūryunaku kāṃti, vēḍimi, śaktiniccuvāḍu, vāṭikikāraṇamainavāḍu - sūryuni lōpala neclear fusion agucuṃḍuṭavalana helium anu element tayāragucunnaṃduna sūryuniki ā tējassu, vēḍimi, śakti kalugucunnavi - dāniki kāraṇamu prati aṇuvulōnu śaktirūpamulōnunna parabarahmamē (Every particle of matter contains Energy) - ” yadādityagataṃ tējaḥ - - - tattējō viddhimāmakaṃ” (sūryunilōpalanuṃḍu tējassu nādē - sūryunilō nēnu tējōrūpamulō nuṃḍuṭavalananē sūryunaku ā tējassu - kāṃti, vēḍimi śakti kaliginavi - (śrīmadbhagavadgīta- 15 - 12)
aṃducēta sūryamaṃḍalamaṃdunnavāḍu parabrahmayē - sūryuḍu svayaṃprakāśamu kādu - ā parabrahmayē nārayaṇuḍani ceppabaḍucunnāḍu - nārāyaṇuḍanagā sṛṣṭilōni samastavastuvulanu tanalōnuṃḍi - okadānilōnuṃḍi okaṭigā - puṭṭiṃci, vāṭilō tānu pravēśiṃciyuṃḍi pōṣiṃcucu, vāṭini aṃtamu cēyuvāḍu. atanē sūryamaṃḍala madhyamaṃdu tējōrūpamulō pratyakṣa paramātmagānunnavāḍu ani dhyāniṃcavalenu - bhagavaṃtuḍu tējōrūpuḍu - “tējasāmapi tattējasvi”,“tējastējasvināmahaṃ” (tējōvaṃtamaina sūryuḍu, nakṣatramulu modalaguvāṭilōni tējassu nēnē). paramātma, parabrahma ani ceppabaḍuvāḍu nirākāruḍu - rūpamu lēnivāḍu - aṃducēta atanini bhaktuḍu ē rūpamulō nainanu dhyāniṃcavaccunu. dēviyanigāni, viṣṇuvanigāni, śivuḍanigāni, gaṇēśvaruḍanikāni dhyāniṃcavaccunu. sarva dēva namaskāraḥ kēśavaṃ prati gaccati ” (samastamaina dēvatalakucēsina namaskāramu kēśavunakē ceṃdunu - avannīyu atanirūpamulēkanuka. appuḍu kēśavuḍu anagā nirākāra parabrahmayē”tatsavituḥ - - -bhargō - - dhīmahi “(sūryamaṃḍalamulō tējōrūpamulōnunna ā parabrahmanu dhyāniṃcucunnānu ani arthamagucunnadi. dhyānaślōkamulō” hiraṇmaya vapuḥ” ani ceppabaḍinadi -“hiraṇmaya vapuḥ” anagā sṛṣṭicēyagalugu śakti upādānamu sṛṣṭiki avasaramagu muḍisaruku tanalōnēgalavāḍu. aṭṭivāḍu paramātmayē - aṃducēta gāyatri yanagā sūryamaṃḍalamaṃdu, tējōrūpamulō yunna vāṭilōnu,tējassugā unna parabrahmayē”tadhyāna gōcaramūrtin dhariyiṃtugāde” - (śrīmadāṃdhramahābhāgavatamu- 3 - 9 - 298)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.