“ఓం భూర్భువస్స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్| ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్స్వరోః ||”.
“భూర్భువస్స్వః” ఇతివ్యాహృతి త్రయం. ‘భూః’ ఇతి సన్మార్గ ఉచ్యతే. ‘భువః’ ఇతి సర్వం భావయతి, ప్రకాశయతి. ‘సువః’ ఇతి సర్వం ప్రియమాణం సుఖస్వరూపం”
(‘భూః భువః సువః’ అను నీమూడును వ్యాహృతి త్రయము - మూడు వ్యాహృతులు - భూలోకము, భువర్లోకము, స్వర్లోకము - ఈ మూడింటిని ‘ఓం’ = పరబ్రహ్మ అని భావించవలెను - ‘భూః’ అనగా సన్మార్గము. ‘భువః’ అనగా అన్నింటినీ ప్రకాశింపచేయునది. ‘సువః’ అనగా సుఖస్వరూపము - అనగా ఈ మూడు సత్, చిత్, ఆనందములు - వ్యాహృతులు ఏడు అని కూడ చెప్పబడినవి : - “ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం” అని ఈ ఏడును వ్యాహృతులు, ఏడు లోకములు - ఇవన్నియు పరబ్రహ్మ రూపమే).
(ఈ మంత్రార్థము ఈ క్రిందవిధముగా కూడనున్నది : -
‘యః’ = రూపరహితమై సత్యజ్ఞానందములు మొదలగు లక్షణములుగల ఏ పరమాత్మ; ‘నః’ = భేద అభిప్రాయములుగల మాయొక్క; ‘ధియః’ = బుద్ధులను - అంతఃకరణవృత్తులను; ‘ప్రచోదయాత్’ = ప్రేరణ చేయుచున్నాడో; ‘తత్ సవితుః’ = ‘తత్’ అనగా పరబ్రహ్మము - ఓం తత్సత్ ఇతి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధిః స్మృతః. (‘ఓం’ అని, ‘తత్’ అని, ‘సత్’ అని మూడు విధములుగ పరబ్రహ్మయే చెప్పబడుచున్నాడు) అని శ్రీమద్భగవద్గీతలో చెప్పబడినది - అందుచేత ‘తత్’ అనగా పరబ్రహ్మ - ‘తత్సవితుః’ = సృష్టి స్థితి లయములు చేసినవాడున్నూ, అంతర్యామిగానుండి అన్నింటిని తన సత్తాస్ఫూర్తిచేత - తేజో రూపముచేత - ప్రేరేపించువాడున్నూ, అయిన ఆ పరబ్రహ్మ యొక్క; ‘వరేణ్యం’ శ్రేష్టమైన; ‘భర్గః’ తేజస్సును, తేజో రూపమును. - సూర్యమండలమధ్యమందున్న ఆ తేజస్సునకు కారణమైన ఆ దేవునికి నాకు భేదము (అహం బ్రహ్మస్మి) లేకుండుటకు ధ్యానించుచున్నాను).
(‘తత్ సవితుః’ అనుదానిలో సవితా అనగా - ‘సూతే జగత్’ ఇతి సవితా - జగత్తును పుట్టించువాడు, - సువతి ప్రేరయతి జగత్ ఇతి వా సవితా - పుట్టించిన జగత్తును ప్రేరేపించువాడు - “సవితా సర్వ భూతానాం, సర్వభవాన్ ప్రసూయతే, సవనాత్ ప్రేరణాచ్చైవ సవితా తేన చోచ్యతే ||” దీనిని బట్టి ‘సవితా’ అనగా ప్రతివస్తువులోనుండి దానిలోనుండి ఇంకొక వస్తువును పుట్టించువాడు, ప్రతివస్తువుచేత దానిపని చేయించువాడు).
భ్రాజతే దీప్యతే యస్మాత్ జగదంత్యే హరత్యపి |
కాలాగ్ని రూపమాస్థాయ సప్తార్చిః సప్తరశ్మిభిః |
భ్రాజతే తత్స్వరూపేణ తస్మాత్ భర్గః స ఉచ్యతే |
భాతి భాసయతే లోకాన్ రేతి రంజయతే ప్రజాః |
గ ఇత్యాగచ్చతే అజస్రం భరగో భర్గ ఉచ్యతే|
ఆదిత్యాంతరగతం యచ్ఛ జోతిషాం జ్యోతిరుత్తమం |
హృదయే సర్వభూతానాం జీవభూతస్స తిష్టతి |
హృద్యోమ్ని తపతిహ్యేష బాహ్యే సూర్యస్య చాంతరే |
అగ్నేవా ధూమకేతేచ జ్యోతిశ్చిత్రకరం చ యతే |
హృద్యాకాశేచ యో దేవః సాధకై రూపవర్ణ్యతే |
స ఏవ ఆదిత్య రూపేణ బహిర్నభసి రాజతే |
వరేణ్యం వరణీయంచ జన్మ సంసార భీరుభిః |
ఆదిత్యాంతరగతం యచ్చ భర్గాఖ్యం వై ముముక్షుభిః |
జన్మ మృత్యు వినాశాయ దుఃఖస్య త్రివిధస్య చ |
ధ్యానేన పురుషో యస్తు ద్రష్టవ్యః సూర్యమండలే |
ఈశ్వరం పురుషాఖ్యంతు సత్య ధర్మాణ మచ్యుతం |
భర్గాఖ్య రుద్ర సంజ్ఞంతు జ్ఞాత్వాత్వమృత మిచ్చతి|
రవి మధ్యే స్థితః సోమః సోమమధ్యే హుతాశనః |
తేజోమధ్యే స్థితం సత్యం సత్యమధ్యే స్థితో(అ)చ్యుతః |
అంగుష్టమాత్రః పురుషః పూర్వమిద మయేరితః |
శంకరేణ తథా దృష్టః ప్రభవః సర్వ తేజసాం |
సవిష్ణుర్భువ నాధారో యస్యేదం సకలం జగత్ ||“.
(భర్గః అనుమాట ‘భృజః’ అను ధాతువునుండికలిగినది. దాని అర్థము పాకము,పచనము చేయునది కనుక ‘భర్గః - ప్రకాశించునది. ప్రళయకాలమందు కాలాగ్ని (ప్రళయాగ్ని), రూపము దాల్చి ఆ రూప ములో ప్రకాశించును కనుక ’భర్గః’ అని చెప్పబడినది. ‘భ’ అనగా లోకములను ప్రకాశింపచేయునది అని చెప్పబడినది. ‘భ’ అనగా లోకములను ప్రకాశింపచేయునది.’ర’ అనగా ప్రజలను రంజింపచేయు నది.’గ’ అనగా ఎల్లపుడు ప్రవాహమువలె నడచునది. ఈ మూడు అక్షరములు కలిసి (భరగ) భర్గః అయినది - జ్యోతిస్సులకు (ప్రకాశించువాటికి) జ్యోతి అయినదిన్నీ - (“జ్యోతి షామపి తజ్జ్యోతిః” - శ్రీ మద్భగవద్గీత - 13 - 17)
(“తం దేవా జ్యోతిషాం జ్యోతిః” - తైత్తిరీయోపనిషత్ - 2 - 4). -
సూర్యుడు మొదలగు ప్రకాశరూపములలోపల ( అంతరమందు ) నుండు తేజస్సు అయినదిన్నీ, సమస్త భూతముల హృదయమందు జీవముగానుండి లోపల పైన తపింప చేయుచుండునది - వేడిమి కలుగచేసి శక్తినిచ్చునదిన్నీ, ఒకవస్తువులోనుండి ఇంకొక వస్తువును ఉద్భవింపచేయునదిన్నీసూర్యునిలోపలనుండు అగ్ని అయినదిన్నీ, సాధకులచేత - యోగులచేత - హృదయాకాశమందుండునదని వర్ణింపబడినదిన్నీ - అదియే పైన ఆకాశములో ఆదిత్యరూపముతో ప్రకాశించునది. దీనివలన పరబ్రహ్మ యొక్క శక్తియే తేజోరూపముతో సూర్యుడు మొదలగు ప్రకాశవంతములగు అకారము గలదిగా, ప్రత్యక్షదైవముగా, వెలయుచున్నదనియు, అదియే సూర్యమండలమధ్యమందు ఉన్న గాయత్రిస్వరూపము అని ధ్యానించవలెనను అభిప్రాయము స్పష్టమగుచున్నది - (“సవితుః” వరేణ్యం భర్గః“) (”పరమాత్మం స్వరూపం“). గాయత్రీ మంత్రాంగములలో మంత్రాధిష్టానదేవత”సవితా దేవతా” యనిన్నీ, “సవితృనామక శ్రీనారాయణో దేవతా” అనిన్నీ - ధ్యానశ్లోకములో “ధ్యేయస్సదా సవితృమండల మధ్య వర్తీ నారాయణః - - - ఆదిత్య వర్గాభః, సూర్యమండల వధ్య గః” అనిన్నీ చెప్పబడినది. ఇంకను - “సవితృనామక శ్రీలక్ష్మీనారాణ ప్రేరణయా, సవితృనామక శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం”.”అసావాదిత్యో బ్రహ్మ” అని కూడ చెప్పబడుచున్నది).
(దీనివలన తేలినదేమనగా గాయత్రి అనగా పరబ్రహ్మమే . పరబ్రహ్మకు లింగభేదములులేవు, స్త్రీయని కాని పురుషుడనికాని ఉపాసించినందువల్ల దోషములేదు. ప్రపంచమును సృష్టించి, దానిలోనున్న ప్రతివస్తువును అంతరాత్మగానుండి, దానికి తగిన శక్తిని కలిగించి, దాని పనిలో దానిని ప్రోత్సహించునది ఒకే దైవమగునుకాని, వేరుకాదు. అది దేవియైనను, నారాయణుడైనను, శివుడైనను, శబల బ్రహ్మమే. అదియే శక్తివంతమైన చిచ్ఛక్తిరూపమైన, సూర్యుడుమొదలగు ప్రకాశరూపములలో ప్రత్యక్షమైనట్లు భావించి, ఆ రూపములో నున్న పరబ్రహ్మనే ధ్యానించుచున్నాను అను భావనతో గాయత్రీ మంత్రము నుపాసించవలెను అని తేలుచున్నది).
(‘ఆపః’ అనగా వ్యాపించునది. ‘జ్యోతిః’ అనగా ప్రకాశించు రూపముకలది. ‘రసః’ అనగా అన్నింటినీ అతిశయైంచి యుండునది, అన్నింటిలోను రసరూపముగానుండి పోషించునది. ‘అమృతం’ అనగా మరణము మొదలగువాటి రూపమైన సంసారము లేనిది - ఇవన్నియు తానే అయిన బ్రహ్మ. “భూర్భువస్స్వుః” అనగా సచ్చిదానందములు - ఈ ప్రకారముగా సమస్తమును వ్యాపించియుండునది, అన్నింటినీ ప్రకాశింపచేయునది, సర్వాతిశయమైనదీయిన పరబ్రహ్మ గాయత్రి శిరస్సు అని చెప్పబడినది.- ” గాయత్ర్యాః - - - అగ్నిర్ముఖం, బ్రహ్మ శిరో” అని చెప్పబడినది).
“త్రిభ్యః ఏవతు దేవేభ్యః పాదం పాద మదూదృహత్ ||”.
(గాయత్రీ మంత్రము మూడు వేదములనుండి తీయబడినది. అందుచేత మూడు పాదములు గలది. మనువు ఈ విషయమునే చెప్పెను -).
గాయత్రీ మంత్రములో మొదటను చివరను ‘ఓం’ అని చెప్పబడినది. ప్రతి మంత్రమునకు ‘ఓం’ అని ముందున, చివరను చేర్చవలెనని ఋషి సాంప్రదాయము - ‘ఓం’ అనగా బ్రహ్మ అనియే నిర్దేశింపబడినదని శ్రీమద్భగవద్గీత చెప్పుచున్నది - “ఓం తత్సత్ ఇతి బ్రహ్మణో నిర్దేశ స్త్రి విదః” -).
ఈ గాయత్రీ మంత్రమునకు ఋషి విశ్వామిత్రుడు - అనగా మంత్రమును, దాని ఫలమును కనుగొనినవాడు - “గాయత్ర్యాః - - - విశ్వామిత్ర ఋషిః”.
“స ప్రణవ సప్త వ్యాహౄతి పూర్వక పాద చతుష్టయ విశిష్ట గాయత్రీ జపకర్తుః గాయత్ర్యార్థాను సంధానం వినా గాయత్రీ స్వరూప ప్రాప్తిర్న సిధ్యతే”.
(ముందు ఓంకారము, తర్వాత సప్త వ్యాహృతులు, తర్వాత నాలుగు పాదములతో కూడిన గాయత్రిని జపించువారు గాయత్రీ అర్థమును తెలుసుకొని భావించనిదే గాయత్రీ స్వరూపమును - గాయత్రీ సాక్షాత్కారమును - పొందలేరు).
తయోః సం యోగకాలేతు వస్త్రమాచ్ఛాద్య గణ్యతే ||“.
(ఓంకారము పురుషుడు - గాయత్రి స్త్రీ రూపము - ఆ ఇద్దరి సం యోగకాలమందు - ఓంకారముతో గాయత్రి జపము - మననము - చెసినపుడు బట్టకప్పవలెను).
“ఉపనిషత్తులకంటె నూర్ధ్వ పదవి | మంత్ర రాజంబు గాయత్రి మహిమగాంచు ప్రణవమను క్రేపుతోగూడి పాడి బిదుకు | నవని నరులకు గాయత్రియనెడి సురభి ||”. (శ్రీనాధుడు - కాశీఖండము)
(1) “ఓం నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి,తన్నో విష్ణుః ప్రచోదయాత్”
(2) “ఓం మహలక్ష్మ్యై చ విద్మహే, విష్ణుప్రియా యై ధీమహి | తన్నో లక్ష్మీ ప్రచోదయాత్”.
(3) “ఓం సరస్వత్వై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి | తన్నో దేవీ ప్రచోదయాత్|”.
(4).”ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి | తన్నో సూర్యః ప్రచోదయాత్“.
(5) “ఓం దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి | తన్నో రామః ప్రచోదయాత్”.
“ōṃ bhūrbhuvassvaḥ, ōṃ tatsaviturvarēṇyaṃ bhargō dēvasya dhīmahi, dhīyō yōnaḥ pracōdayāt| āpōjyōti rasōmṛtaṃ brahma bhūrbhuvassvarōḥ ||”.
“bhūrbhuvassvaḥ” itivyāhṛti trayaṃ. ‘bhūḥ’ iti sanmārga ucyatē. ‘bhuvaḥ’ iti sarvaṃ bhāvayati, prakāśayati. ‘suvaḥ’ iti sarvaṃ priyamāṇaṃ sukhasvarūpaṃ”
(‘bhūḥ bhuvaḥ suvaḥ’ anu nīmūḍunu vyāhṛti trayamu - mūḍu vyāhṛtulu - bhūlōkamu, bhuvarlōkamu, svarlōkamu - ī mūḍiṃṭini ‘ōṃ’ = parabrahma ani bhāviṃcavalenu - ‘bhūḥ’ anagā sanmārgamu. ‘bhuvaḥ’ anagā anniṃṭinī prakāśiṃpacēyunadi. ‘suvaḥ’ anagā sukhasvarūpamu - anagā ī mūḍu sat, cit, ānaṃdamulu - vyāhṛtulu ēḍu ani kūḍa ceppabaḍinavi : - “ōṃ bhūḥ, ōṃ bhuvaḥ, ōṃ svaḥ, ōṃ mahaḥ, ōṃ janaḥ, ōṃ tapaḥ, ōṃ satyaṃ” ani ī ēḍunu vyāhṛtulu, ēḍu lōkamulu - ivanniyu parabrahma rūpamē).
(ī maṃtrārthamu ī kriṃdavidhamugā kūḍanunnadi : -
‘yaḥ’ = rūparahitamai satyajñānaṃdamulu modalagu lakṣaṇamulugala ē paramātma; ‘naḥ’ = bhēda abhiprāyamulugala māyokka; ‘dhiyaḥ’ = buddhulanu - aṃtaḥkaraṇavṛttulanu; ‘pracōdayāt’ = prēraṇa cēyucunnāḍō; ‘tat savituḥ’ = ‘tat’ anagā parabrahmamu - ōṃ tatsat iti nirdēśō brahmaṇa strividhiḥ smṛtaḥ. (‘ōṃ’ ani, ‘tat’ ani, ‘sat’ ani mūḍu vidhamuluga parabrahmayē ceppabaḍucunnāḍu) ani śrīmadbhagavadgītalō ceppabaḍinadi - aṃducēta ‘tat’ anagā parabrahma - ‘tatsavituḥ’ = sṛṣṭi sthiti layamulu cēsinavāḍunnū, aṃtaryāmigānuṃḍi anniṃṭini tana sattāsphūrticēta - tējō rūpamucēta - prērēpiṃcuvāḍunnū, ayina ā parabrahma yokka; ‘varēṇyaṃ’ śrēṣṭamaina; ‘bhargaḥ’ tējassunu, tējō rūpamunu. - sūryamaṃḍalamadhyamaṃdunna ā tējassunaku kāraṇamaina ā dēvuniki nāku bhēdamu (ahaṃ brahmasmi) lēkuṃḍuṭaku dhyāniṃcucunnānu).
(‘tat savituḥ’ anudānilō savitā anagā - ‘sūtē jagat’ iti savitā - jagattunu puṭṭiṃcuvāḍu, - suvati prērayati jagat iti vā savitā - puṭṭiṃcina jagattunu prērēpiṃcuvāḍu - “savitā sarva bhūtānāṃ, sarvabhavān prasūyatē, savanāt prēraṇāccaiva savitā tēna cōcyatē ||” dīnini baṭṭi ‘savitā’ anagā prativastuvulōnuṃḍi dānilōnuṃḍi iṃkoka vastuvunu puṭṭiṃcuvāḍu, prativastuvucēta dānipani cēyiṃcuvāḍu).
bhrājatē dīpyatē yasmāt jagadaṃtyē haratyapi |
kālāgni rūpamāsthāya saptārciḥ saptaraśmibhiḥ |
bhrājatē tatsvarūpēṇa tasmāt bhargaḥ sa ucyatē |
bhāti bhāsayatē lōkān rēti raṃjayatē prajāḥ |
ga ityāgaccatē ajasraṃ bharagō bharga ucyatē|
ādityāṃtaragataṃ yaccha jōtiṣāṃ jyōtiruttamaṃ |
hṛdayē sarvabhūtānāṃ jīvabhūtassa tiṣṭati |
hṛdyōmni tapatihyēṣa bāhyē sūryasya cāṃtarē |
agnēvā dhūmakētēca jyōtiścitrakaraṃ ca yatē |
hṛdyākāśēca yō dēvaḥ sādhakai rūpavarṇyatē |
sa ēva āditya rūpēṇa bahirnabhasi rājatē |
varēṇyaṃ varaṇīyaṃca janma saṃsāra bhīrubhiḥ |
ādityāṃtaragataṃ yacca bhargākhyaṃ vai mumukṣubhiḥ |
janma mṛtyu vināśāya duḥkhasya trividhasya ca |
dhyānēna puruṣō yastu draṣṭavyaḥ sūryamaṃḍalē |
īśvaraṃ puruṣākhyaṃtu satya dharmāṇa macyutaṃ |
bhargākhya rudra saṃjñaṃtu jñātvātvamṛta miccati|
ravi madhyē sthitaḥ sōmaḥ sōmamadhyē hutāśanaḥ |
tējōmadhyē sthitaṃ satyaṃ satyamadhyē sthitō(a)cyutaḥ |
aṃguṣṭamātraḥ puruṣaḥ pūrvamida mayēritaḥ |
śaṃkarēṇa tathā dṛṣṭaḥ prabhavaḥ sarva tējasāṃ |
saviṣṇurbhuva nādhārō yasyēdaṃ sakalaṃ jagat ||“.
(bhargaḥ anumāṭa ‘bhṛjaḥ’ anu dhātuvunuṃḍikaliginadi. dāni arthamu pākamu,pacanamu cēyunadi kanuka ‘bhargaḥ - prakāśiṃcunadi. praḷayakālamaṃdu kālāgni (praḷayāgni), rūpamu dālci ā rūpa mulō prakāśiṃcunu kanuka ’bhargaḥ’ ani ceppabaḍinadi. ‘bha’ anagā lōkamulanu prakāśiṃpacēyunadi ani ceppabaḍinadi. ‘bha’ anagā lōkamulanu prakāśiṃpacēyunadi.’ra’ anagā prajalanu raṃjiṃpacēyu nadi.’ga’ anagā ellapuḍu pravāhamuvale naḍacunadi. ī mūḍu akṣaramulu kalisi (bharaga) bhargaḥ ayinadi - jyōtissulaku (prakāśiṃcuvāṭiki) jyōti ayinadinnī - (“jyōti ṣāmapi tajjyōtiḥ” - śrī madbhagavadgīta - 13 - 17)
(“taṃ dēvā jyōtiṣāṃ jyōtiḥ” - taittirīyōpaniṣat - 2 - 4). -
sūryuḍu modalagu prakāśarūpamulalōpala ( aṃtaramaṃdu ) nuṃḍu tējassu ayinadinnī, samasta bhūtamula hṛdayamaṃdu jīvamugānuṃḍi lōpala paina tapiṃpa cēyucuṃḍunadi - vēḍimi kalugacēsi śaktiniccunadinnī, okavastuvulōnuṃḍi iṃkoka vastuvunu udbhaviṃpacēyunadinnīsūryunilōpalanuṃḍu agni ayinadinnī, sādhakulacēta - yōgulacēta - hṛdayākāśamaṃduṃḍunadani varṇiṃpabaḍinadinnī - adiyē paina ākāśamulō ādityarūpamutō prakāśiṃcunadi. dīnivalana parabrahma yokka śaktiyē tējōrūpamutō sūryuḍu modalagu prakāśavaṃtamulagu akāramu galadigā, pratyakṣadaivamugā, velayucunnadaniyu, adiyē sūryamaṃḍalamadhyamaṃdu unna gāyatrisvarūpamu ani dhyāniṃcavalenanu abhiprāyamu spaṣṭamagucunnadi - (“savituḥ” varēṇyaṃ bhargaḥ”) (“paramātmaṃ svarūpaṃ”). gāyatrī maṃtrāṃgamulalō maṃtrādhiṣṭānadēvata “savitā dēvatā” yaninnī, “savitṛnāmaka śrīnārāyaṇō dēvatā” aninnī - dhyānaślōkamulō “dhyēyassadā savitṛmaṃḍala madhya vartī nārāyaṇaḥ - - - āditya vargābhaḥ, sūryamaṃḍala vadhya gaḥ” aninnī ceppabaḍinadi. iṃkanu - “savitṛnāmaka śrīlakṣmīnārāṇa prēraṇayā, savitṛnāmaka śrīlakṣmīnārāyaṇa prītyarthaṃ”.”asāvādityō brahma” ani kūḍa ceppabaḍucunnadi).
(dīnivalana tēlinadēmanagā gāyatri anagā parabrahmamē . parabrahmaku liṃgabhēdamululēvu, strīyani kāni puruṣuḍanikāni upāsiṃcinaṃduvalla dōṣamulēdu. prapaṃcamunu sṛṣṭiṃci, dānilōnunna prativastuvunu aṃtarātmagānuṃḍi, dāniki tagina śaktini kaligiṃci, dāni panilō dānini prōtsahiṃcunadi okē daivamagunukāni, vērukādu. adi dēviyainanu, nārāyaṇuḍainanu, śivuḍainanu, śabala brahmamē. adiyē śaktivaṃtamaina cicchaktirūpamaina, sūryuḍumodalagu prakāśarūpamulalō pratyakṣamainaṭlu bhāviṃci, ā rūpamulō nunna parabrahmanē dhyāniṃcucunnānu anu bhāvanatō gāyatrī maṃtramu nupāsiṃcavalenu ani tēlucunnadi).
(‘āpaḥ’ anagā vyāpiṃcunadi. ‘jyōtiḥ’ anagā prakāśiṃcu rūpamukaladi. ‘rasaḥ’ anagā anniṃṭinī atiśayaiṃci yuṃḍunadi, anniṃṭilōnu rasarūpamugānuṃḍi pōṣiṃcunadi. ‘amṛtaṃ’ anagā maraṇamu modalaguvāṭi rūpamaina saṃsāramu lēnidi - ivanniyu tānē ayina brahma. “bhūrbhuvassvuḥ” anagā saccidānaṃdamulu - ī prakāramugā samastamunu vyāpiṃciyuṃḍunadi, anniṃṭinī prakāśiṃpacēyunadi, sarvātiśayamainadīyina parabrahma gāyatri śirassu ani ceppabaḍinadi.- ” gāyatryāḥ - - - agnirmukhaṃ, brahma śirō” ani ceppabaḍinadi).
“tribhyaḥ ēvatu dēvēbhyaḥ pādaṃ pāda madūdṛhat ||”.
(gāyatrī maṃtramu mūḍu vēdamulanuṃḍi tīyabaḍinadi. aṃducēta mūḍu pādamulu galadi. manuvu ī viṣayamunē ceppenu -).
gāyatrī maṃtramulō modaṭanu civaranu ‘ōṃ’ ani ceppabaḍinadi. prati maṃtramunaku ‘ōṃ’ ani muṃduna, civaranu cērcavalenani ṛṣi sāṃpradāyamu - ‘ōṃ’ anagā brahma aniyē nirdēśiṃpabaḍinadani śrīmadbhagavadgīta ceppucunnadi - “ōṃ tatsat iti brahmaṇō nirdēśa stri vidaḥ” -).
ī gāyatrī maṃtramunaku ṛṣi viśvāmitruḍu - anagā maṃtramunu, dāni phalamunu kanugoninavāḍu - “gāyatryāḥ - - - viśvāmitra ṛṣiḥ”.
“sa praṇava sapta vyāhṝti pūrvaka pāda catuṣṭaya viśiṣṭa gāyatrī japakartuḥ gāyatryārthānu saṃdhānaṃ vinā gāyatrī svarūpa prāptirna sidhyatē”.
(muṃdu ōṃkāramu, tarvāta sapta vyāhṛtulu, tarvāta nālugu pādamulatō kūḍina gāyatrini japiṃcuvāru gāyatrī arthamunu telusukoni bhāviṃcanidē gāyatrī svarūpamunu - gāyatrī sākṣātkāramunu - poṃdalēru).
tayōḥ saṃ yōgakālētu vastramācchādya gaṇyatē ||“.
(ōṃkāramu puruṣuḍu - gāyatri strī rūpamu - ā iddari saṃ yōgakālamaṃdu - ōṃkāramutō gāyatri japamu - mananamu - cesinapuḍu baṭṭakappavalenu).
“upaniṣattulakaṃṭe nūrdhva padavi | maṃtra rājaṃbu gāyatri mahimagāṃcu praṇavamanu krēputōgūḍi pāḍi biduku | navani narulaku gāyatriyaneḍi surabhi ||”. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu)
(1) “ōṃ nārāyaṇāya vidmahē, vāsudēvāya dhīmahi,tannō viṣṇuḥ pracōdayāt”
(2) “ōṃ mahalakṣmyai ca vidmahē, viṣṇupriyā yai dhīmahi | tannō lakṣmī pracōdayāt”.
(3) “ōṃ sarasvatvai vidmahē brahmaputryai dhīmahi | tannō dēvī pracōdayāt|”.
(4).”ōṃ bhāskarāya vidmahē divākarāya dhīmahi | tannō sūryaḥ pracōdayāt”.
(5) “ōṃ dāśaradhāya vidmahē sītāvallabhāya dhīmahi | tannō rāmaḥ pracōdayāt”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.