← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గోవిందః gōviṃdaḥ

Original — తెలుగు
  1. గాః ఇంద్రియాణి విందతీతి గోవిందః. (ఇంద్రియములకు సాక్షి అయినవాడు).

  2. గాం విందతి, రక్షతీతి ఇంద్రియజేతా ఇతివా గోవిందః.

(ఇంద్రియములను జయించినవాడు, ఇంద్రియములకు చేతనత్వము కలిగించి వాటిచేత పని చేయించుచు వాటిని రక్షించువాడు).

  1. గోవింద శబ్ద వాచ్యాని ఇంద్రియాణి అధిష్ఠానతయా నిత్యం ప్రాప్తః..

(ఇంద్రియములను అధిష్టించియుండిన వాటి యందు ఎల్లపుడు ఉండువాడు).

“తత్వమింద్రియాణ్యధిష్టానతయాప్రాప్నోషి సర్వదా |

ఫలే రాగం విరాగం చ జానాసీ త్యేవ సూచయన్ గోవిందే త్యాహ ||“.

(ఇంద్రియములను ఎల్లపుడు అధిష్టించియుండి రాగవిరాగములను తెలుసుకొనువాడు అని సూచించుటకు అర్జునుడు శ్రీకృష్ణపరమాత్మను గోవింద! అని సంబోధించెను).

  1. “గాం, పృధ్వీం, ధేనుం వా విందతీతి గోవిందః.(భూమిని, ఆవును రక్షించువాడుకనుక గోవిందుడు).

“దృక్ ధేను దీప్తి, స్వర్గేషు గోశబ్దః పరికీర్తితః”.

(గో’ శబ్దము వృష్టి, ఆవు, కాంతి, స్వర్గము అను అర్థములలో ఉపయోగించ బడుచున్నది).

  1. “అహం కిలేంద్రో దావానాం త్వం గవామింద్రతాం గతః |

గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువిశాశ్వతం ||”

గౌరేషా తం తథావాణీ తాం చ విందయతే భవాన్ |

గోవిందస్తు తతో దేవ| మునిభిః కధ్యతే భవానీ ||“.

(ఇతిహరివన్శే).

(నేను దేవతులకు ఇంద్రుడను, నీవు గోవులకు ఇంద్రుడ వైతివి. అందుచేత, గోవులకు ఇంద్రుడవగుటచేత లోకములు నిన్ను గోవిందుడని యందురు - గో శబ్దమునకు సరస్వతి యని యర్థము, దాని నెఱింగిన వాడవుగాన మునులు నిన్ను గోవిందుడందురు).

  1. “గాం అవిందత్ సముద్రమగ్నాం పృధివీం ప్రాప్తవాన్”

(వరాహరూపముతో సముద్రములోమునిగియున్నభూమిని, పొందినవాడు - ఎత్తినవాడు).

“నష్టాం వైధరణీం పూర్వం అవిందత్ వై గుహాగతాం |

గోవింద ఇతి తేనాహం దేవైః వాగ్భిః అభిష్టు తః ||”

ఇతి మోక్ష ధర్మవచనాత్ గోవిందః - (శ్రీశంకరః)

(అసురినిచేత ఎత్తుకొనిపోబడి సముద్రముననున్న భూమిని పైకి ఎత్తినవాడగుటచేత, దేవతులచేతను, వేదములోను గోవిందుడని చెప్పబడుచున్నాను).

  1. “గో భిరేన యతో వేద్యో గోవిందః సముదాహృతః” (విష్ణు తిలకే). “గోభిః వాణీభిః విందతే, వేత్తి వేదాంత వాక్యైః ఇతి వా గోవిందః”.

(వేదాంత వాక్కులచే తెలియబడువాడు, పొగడబడువాడు).

“గాం వేదలక్షణాం వాణీం విందతి ఇతి వ్యుత్పత్యా సర్వవేదోపాదానత్వేన సర్వజ్ఞః.

(వేదవాక్కులచేత తెలియబడువాడు; వేదములకు ఉపాదానకారణమైనవాడు కనుక సర్వజ్ఞుడు - సర్వమును తెలిసినవాడు).

  1. “గోభిః గీర్భిః తత్వమస్యాది మహావాక్య తతిభిః స్వాతిరిక్తా విద్యా పద తత్కార్యజా తాసంభవ ప్రబోధ నిర్ధం బ్రహ్మ నిష్ప్రతి యోగిక స్వమాత్రమితి విందతే ఉపలభ్యతే ఇతి గోవిందః”.

(‘తత్వమసి’ అను మొదలగు మహావాక్యములచేత తనకన్న వేరైన అవిద్య, దాని కార్యములు అసంభములు,లేనివియే, ఉన్నదంత తానొక్కడేయను వేదాంతవాక్యములచేత తెలియబడువాడు).

  1. గాం భూమిం, ధేనుం, స్వర్గం, వేదం వా విదం తీతి గోవిందః.

(స్థూలశరీరమను భూమిని, సంకల్పరూపంబగు మనస్సు అను ధేనువును, సహస్రారమను పరాకాశంబును, అభేద తత్వసారరూపమగు వేదమును పొందినవాడు).

Transliteration
  1. gāḥ iṃdriyāṇi viṃdatīti gōviṃdaḥ. (iṃdriyamulaku sākṣi ayinavāḍu).

  2. gāṃ viṃdati, rakṣatīti iṃdriyajētā itivā gōviṃdaḥ.

(iṃdriyamulanu jayiṃcinavāḍu, iṃdriyamulaku cētanatvamu kaligiṃci vāṭicēta pani cēyiṃcucu vāṭini rakṣiṃcuvāḍu).

  1. gōviṃda śabda vācyāni iṃdriyāṇi adhiṣṭhānatayā nityaṃ prāptaḥ..

(iṃdriyamulanu adhiṣṭiṃciyuṃḍina vāṭi yaṃdu ellapuḍu uṃḍuvāḍu).

“tatvamiṃdriyāṇyadhiṣṭānatayāprāpnōṣi sarvadā |

phalē rāgaṃ virāgaṃ ca jānāsī tyēva sūcayan gōviṃdē tyāha ||“.

(iṃdriyamulanu ellapuḍu adhiṣṭiṃciyuṃḍi rāgavirāgamulanu telusukonuvāḍu ani sūciṃcuṭaku arjunuḍu śrīkṛṣṇaparamātmanu gōviṃda! ani saṃbōdhiṃcenu).

  1. “gāṃ, pṛdhvīṃ, dhēnuṃ vā viṃdatīti gōviṃdaḥ.(bhūmini, āvunu rakṣiṃcuvāḍukanuka gōviṃduḍu).

“dṛk dhēnu dīpti, svargēṣu gōśabdaḥ parikīrtitaḥ”.

(gō’ śabdamu vṛṣṭi, āvu, kāṃti, svargamu anu arthamulalō upayōgiṃca baḍucunnadi).

  1. “ahaṃ kilēṃdrō dāvānāṃ tvaṃ gavāmiṃdratāṃ gataḥ |

gōviṃda iti lōkāstvāṃ stōṣyaṃti bhuviśāśvataṃ ||”

gaurēṣā taṃ tathāvāṇī tāṃ ca viṃdayatē bhavān |

gōviṃdastu tatō dēva| munibhiḥ kadhyatē bhavānī ||“.

(itiharivanśē).

(nēnu dēvatulaku iṃdruḍanu, nīvu gōvulaku iṃdruḍa vaitivi. aṃducēta, gōvulaku iṃdruḍavaguṭacēta lōkamulu ninnu gōviṃduḍani yaṃduru - gō śabdamunaku sarasvati yani yarthamu, dāni neṟiṃgina vāḍavugāna munulu ninnu gōviṃduḍaṃduru).

  1. “gāṃ aviṃdat samudramagnāṃ pṛdhivīṃ prāptavān”

(varāharūpamutō samudramulōmunigiyunnabhūmini, poṃdinavāḍu - ettinavāḍu).

“naṣṭāṃ vaidharaṇīṃ pūrvaṃ aviṃdat vai guhāgatāṃ |

gōviṃda iti tēnāhaṃ dēvaiḥ vāgbhiḥ abhiṣṭu taḥ ||”

iti mōkṣa dharmavacanāt gōviṃdaḥ - (śrīśaṃkaraḥ)

(asurinicēta ettukonipōbaḍi samudramunanunna bhūmini paiki ettinavāḍaguṭacēta, dēvatulacētanu, vēdamulōnu gōviṃduḍani ceppabaḍucunnānu).

  1. “gō bhirēna yatō vēdyō gōviṃdaḥ samudāhṛtaḥ” (viṣṇu tilakē). “gōbhiḥ vāṇībhiḥ viṃdatē, vētti vēdāṃta vākyaiḥ iti vā gōviṃdaḥ”.

(vēdāṃta vākkulacē teliyabaḍuvāḍu, pogaḍabaḍuvāḍu).

“gāṃ vēdalakṣaṇāṃ vāṇīṃ viṃdati iti vyutpatyā sarvavēdōpādānatvēna sarvajñaḥ.

(vēdavākkulacēta teliyabaḍuvāḍu; vēdamulaku upādānakāraṇamainavāḍu kanuka sarvajñuḍu - sarvamunu telisinavāḍu).

  1. “gōbhiḥ gīrbhiḥ tatvamasyādi mahāvākya tatibhiḥ svātiriktā vidyā pada tatkāryajā tāsaṃbhava prabōdha nirdhaṃ brahma niṣprati yōgika svamātramiti viṃdatē upalabhyatē iti gōviṃdaḥ”.

(‘tatvamasi’ anu modalagu mahāvākyamulacēta tanakanna vēraina avidya, dāni kāryamulu asaṃbhamulu,lēniviyē, unnadaṃta tānokkaḍēyanu vēdāṃtavākyamulacēta teliyabaḍuvāḍu).

  1. gāṃ bhūmiṃ, dhēnuṃ, svargaṃ, vēdaṃ vā vidaṃ tīti gōviṃdaḥ.

(sthūlaśarīramanu bhūmini, saṃkalparūpaṃbagu manassu anu dhēnuvunu, sahasrāramanu parākāśaṃbunu, abhēda tatvasārarūpamagu vēdamunu poṃdinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.