(స్పష్టముకానిది; ఆవిర్భవించనిది; సూక్ష్మరూపములో నున్నది, స్థూలరూపమును పొందనిది; రహస్యముగా నున్నది).
(మిక్కిలి సూక్ష్మమైనది కనుక గూఢమైనది - గహనము - ‘అణోరణీయాన్’ (అతి చిన్నవస్తువైన అణువుకన్న - పరమాణువుకన్న - చిన్నది అగుటచేత సాధారణులకుకనబడనివాడు;మరుగైనవాడు. “మరుగేలరా, ఓ రాఘవా !”. (శ్రీ త్యాగరాజు)
(స్వయముగా, స్వభావసిధ్ధముగా ప్రకాశించు వాడైనను, ప్రకాశించుటవలన పైకి కనబడువాడైనను మాయచేత - ప్రకృతిచేత - కప్పబడినవాడగుటచేత కనబడనివాడు.
(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్తంబమువరకుగల సమస్త భూతములందు కనబడకుండ నుండువాడు) –
“ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే”.
(ఈ ఆత్మ సమస్తభూతములందు కనుపించని ఆకారము - శరీరము - గలవాడై, అట్లు ఉన్నట్లు పైకి కనబడడు. సమస్త భూతములందు ప్రవేశించియుండుటవలన వాటిలో గూఢముగానున్నాడు ) –
“తత్సృష్టా తదేవాను ప్రావిశత్” –
(లోకములను సృష్టించి దానిలోనే ప్రవేశించెను).
(సర్వజ్ఞుడైనప్పటికీ తన సామర్థ్యమును (శక్తిని) పైకి అందఱికి తెలియునట్లు ప్రకటన చేయనివాడు; స్పష్టముగా కనబడనివాడు. తులావిద్యచేత కప్పబడినవానివలె గూఢమైనవాడు).
గుణత్రయ తిరోహితత్వాత్ -(సత్వ రజస్తమములను మూడు గుణములచే ఆవరించబడినవాడగుటచేత; కప్పబడియుండుటచేత కనబడకుండ చేయబడినవాడు).
సర్వభూతేషు ఆత్మైకత్వేక విదుషాం భాస మానోపి అవిదుషాం గూఢవన్న భాసతే.
(సమస్తభూతములలోనున్న ఆత్మ ఒకటే అయినప్పటికీ జ్ఞానులకు - బ్రహ్మజ్ఞానులకు, పండితులకు కనబడినప్పటికీ అజ్ఞానులకు - మూఢులకు గూఢుడుగా ఉండి కనబడనివాడు).
(సాక్షి మాత్రముగా నుండువాడు - లోపలనున్నప్పటికీ ఏమీ ఎఱుగనట్లు తటస్థముగా - తాను దగ్గరలేనట్లు, చూడనట్లు ఉండువాడు).
(మరుగుపఱచు అవిద్యాదులవలన మరుగుపడినవాడగుటచేత గూఢుడు).
అవతారములలోవలె మారు శరీరమును దాల్చుటవలన స్వస్వరూపమును మఱుగుపఱచినవాడు.
యథా సూర్యః స్వవిభవైః మేఘహిమోపరాగైః అభ్రతుషార రాహుభిః ఆచ్ఛన్నః, తథా భగవాన్ స్వవిభవైః - స్వకార్యైః - క్లేశకర్మాదిభిః (క్లేశాః రాగా దయశ్చ, తత్సూర్వకాణి కర్మాణిచ, తత్సరిపాకే సుఖ దుఃఖేచ. సత్వాది గుణానాం పునః పునః ప్రవాహశ్చ, తైః). ప్రాణాదిభిశ్చ ఉపగూఢః, ఆచ్ఛన్నః.
(ఏ ప్రకారముగా సూర్యుడు తన విభవములచేత - అనగా, మేఘము, మంచు, ధూళి, రాహువు మొదలగువాటిచేత - కప్పబడియుండునో ఆ ప్రకారముగానే భగవంతుడు తన విభవములైన - తనకార్యములైన రాగము, వాటికి కారణమైన కర్మలు, వాటి ఫలమైన సుఖదుఃఖములు, సత్వము, రజస్సు, తమస్సు అను త్రిగుణములు వాటి ప్రవాహము రూపము మొదలగువాటిచేత కప్పబడియున్నాడు).
(spaṣṭamukānidi; āvirbhaviṃcanidi; sūkṣmarūpamulō nunnadi, sthūlarūpamunu poṃdanidi; rahasyamugā nunnadi).
(mikkili sūkṣmamainadi kanuka gūḍhamainadi - gahanamu - ‘aṇōraṇīyān’ (ati cinnavastuvaina aṇuvukanna - paramāṇuvukanna - cinnadi aguṭacēta sādhāraṇulakukanabaḍanivāḍu;marugainavāḍu. “marugēlarā, ō rāghavā !”. (śrī tyāgarāju)
(svayamugā, svabhāvasidhdhamugā prakāśiṃcu vāḍainanu, prakāśiṃcuṭavalana paiki kanabaḍuvāḍainanu māyacēta - prakṛticēta - kappabaḍinavāḍaguṭacēta kanabaḍanivāḍu.
(caturmukhabrahma modalu staṃbamuvarakugala samasta bhūtamulaṃdu kanabaḍakuṃḍa nuṃḍuvāḍu) –
“ēṣa sarvēṣu bhūtēṣu gūḍhātmāna prakāśatē”.
(ī ātma samastabhūtamulaṃdu kanupiṃcani ākāramu - śarīramu - galavāḍai, aṭlu unnaṭlu paiki kanabaḍaḍu. samasta bhūtamulaṃdu pravēśiṃciyuṃḍuṭavalana vāṭilō gūḍhamugānunnāḍu ) –
“tatsṛṣṭā tadēvānu prāviśat” –
(lōkamulanu sṛṣṭiṃci dānilōnē pravēśiṃcenu).
(sarvajñuḍainappaṭikī tana sāmarthyamunu (śaktini) paiki aṃdaṟiki teliyunaṭlu prakaṭana cēyanivāḍu; spaṣṭamugā kanabaḍanivāḍu. tulāvidyacēta kappabaḍinavānivale gūḍhamainavāḍu).
guṇatraya tirōhitatvāt -(satva rajastamamulanu mūḍu guṇamulacē āvariṃcabaḍinavāḍaguṭacēta; kappabaḍiyuṃḍuṭacēta kanabaḍakuṃḍa cēyabaḍinavāḍu).
sarvabhūtēṣu ātmaikatvēka viduṣāṃ bhāsa mānōpi aviduṣāṃ gūḍhavanna bhāsatē.
(samastabhūtamulalōnunna ātma okaṭē ayinappaṭikī jñānulaku - brahmajñānulaku, paṃḍitulaku kanabaḍinappaṭikī ajñānulaku - mūḍhulaku gūḍhuḍugā uṃḍi kanabaḍanivāḍu).
(sākṣi mātramugā nuṃḍuvāḍu - lōpalanunnappaṭikī ēmī eṟuganaṭlu taṭasthamugā - tānu daggaralēnaṭlu, cūḍanaṭlu uṃḍuvāḍu).
(marugupaṟacu avidyādulavalana marugupaḍinavāḍaguṭacēta gūḍhuḍu).
avatāramulalōvale māru śarīramunu dālcuṭavalana svasvarūpamunu maṟugupaṟacinavāḍu.
yathā sūryaḥ svavibhavaiḥ mēghahimōparāgaiḥ abhratuṣāra rāhubhiḥ ācchannaḥ, tathā bhagavān svavibhavaiḥ - svakāryaiḥ - klēśakarmādibhiḥ (klēśāḥ rāgā dayaśca, tatsūrvakāṇi karmāṇica, tatsaripākē sukha duḥkhēca. satvādi guṇānāṃ punaḥ punaḥ pravāhaśca, taiḥ). prāṇādibhiśca upagūḍhaḥ, ācchannaḥ.
(ē prakāramugā sūryuḍu tana vibhavamulacēta - anagā, mēghamu, maṃcu, dhūḷi, rāhuvu modalaguvāṭicēta - kappabaḍiyuṃḍunō ā prakāramugānē bhagavaṃtuḍu tana vibhavamulaina - tanakāryamulaina rāgamu, vāṭiki kāraṇamaina karmalu, vāṭi phalamaina sukhaduḥkhamulu, satvamu, rajassu, tamassu anu triguṇamulu vāṭi pravāhamu rūpamu modalaguvāṭicēta kappabaḍiyunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.