← Back to గ · Booklets 11–20 (digitized file 2)

గుహ్యం guhyaṃ

Original — తెలుగు
  1. పరమ రహస్యత్వాత్, గోప్యత్వాత్ గుహ్యం, గోప్యం.

(పరమ రహస్యమైనదగుటవలన, గోప్యముగానుంచతగినదగుటవలన గుహ్యము గోప్యము).

  1. గోప్యం అతిరహస్యం అవేదనీయం మిత్రేణాపి. (మిక్కిలి రహస్యమైనది. స్నేహితునకైనను తెలియనీయ కూడనిది).

  2. అయోగిషు గోపనీయ మిత్యర్థః.(యోగికానివారినుండి రహస్యముగానుంచ తగినది).

  3. వేదాంతరహస్యం - అనధికారిణోగోపనీయత్వం గుహ్యత్వం.

(ఉపనిషదర్థముల రహస్యమును - బ్రహ్మజ్ఞానమును - తెలుసుకొనుటకు అధికారి కానివానినుండి రహస్యముగా నుంచతగినది).

  1. పరమాత్మ తత్వం పరమ పురుషార్థ హేతుత్వాత్ గుహ్యం పారమ హంస్యం అనదికారిషు గోపనీయత్వాత్.

(పరమాత్మ తత్వం, భగవత్తత్త్వము, పరమపురుషార్థమైన మోక్షమునకు కారణమగుటవలన (జ్ఞానే నైవతుకైవల్యం).గుహ్యము, రహస్యముగానుంచ తగినది. పరమహంస అయిన పరమాత్మకు సంబంధించినది.అధికారులు కానివారలనుండి రహస్యముగా నుంచతగినది).

  1. లౌకికప్రమాణ ప్రసిధ్ధ విషయేభ్యః ఆయుర్థన గంధర్వవేదార్థ నీతిశాస్త్రాది జన్యే భ్యః జానే భ్యః, ప్రకృష్టా తీంద్రి య పార లౌకిక స్వర్గాది పురుషార్థ తదుపాయ విషయం వేదాఖ్యశాస్త్ర మూలం వివిధ జ్ఞానం గుహ్య శబ్దేన వివక్షితం.

(ఆయుర్వేదము, నీతిశాస్త్రము, గాంధర్వశాస్త్రము మొదలగువాటివలన కలిగెడి జ్ఞానము, లోకములో ప్రమాణములద్వారా ప్రసిధ్ధి పొందిన విషయములగుఱించి అయిన జ్ఞానముకన్న ప్రకృష్టమై ఇంద్రియములచేత గ్రహించుటకు వీలుకానటువంటిన్నీ,పరలోకమునకు సంబంధించినటువంటి స్వర్గాది పురుషార్థములకు ఉపాయభూతమైన, వేదమూలమైన జ్ఞానము గుహ్యము అని చెప్పబడుచున్నది).

  1. సాధన భూత ధర్మతత్వ జ్ఞానం గుహ్యం, తత్సాధ్యం; దేహద్వయ వివేకాత్మ జ్ఞానం గుహ్యతరం; తత్ప్రాత్యేశ్వర తత్వజ్ఞానం గుహ తమం.

(సాధనభూత ధర్మతత్వజ్ఞానము గుహ్యము - రహస్యముగా నుంచతగినది. సూక్ష్మదేహము, స్థూలదేహము అనువాని వివేకముగల జ్ఞానము గుహ్యతరము - మొదటిదానికన్న గోప్యముగానుంచతగినది. అది ప్రాప్తించినమీదట కలుగు ఈశ్వరతత్వ జ్ఞానము ముందుచెప్పిన రెండింటికంటె హెచ్చుగా గోప్యముగా నుంచతగినది - మిక్కిలి రహస్యమైనది).

  1. “మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం |

యత్త్వయోక్తం వ చస్తేన మోహాయం విగతో మమ||“. (శ్రీమద్భగవద్గీత- 11 - 1)

. (నన్ను అనుగ్రహించుటకు మిక్కిలి రహస్యమైనవిన్నీ, అధ్యాత్మతత్వము అను జ్ఞానము నీవు ఉపదేశించినందువల్ల నా మోహము - భ్రమ - పోయినది).

Transliteration
  1. parama rahasyatvāt, gōpyatvāt guhyaṃ, gōpyaṃ.

(parama rahasyamainadaguṭavalana, gōpyamugānuṃcataginadaguṭavalana guhyamu gōpyamu).

  1. gōpyaṃ atirahasyaṃ avēdanīyaṃ mitrēṇāpi. (mikkili rahasyamainadi. snēhitunakainanu teliyanīya kūḍanidi).

  2. ayōgiṣu gōpanīya mityarthaḥ.(yōgikānivārinuṃḍi rahasyamugānuṃca taginadi).

  3. vēdāṃtarahasyaṃ - anadhikāriṇōgōpanīyatvaṃ guhyatvaṃ.

(upaniṣadarthamula rahasyamunu - brahmajñānamunu - telusukonuṭaku adhikāri kānivāninuṃḍi rahasyamugā nuṃcataginadi).

  1. paramātma tatvaṃ parama puruṣārtha hētutvāt guhyaṃ pārama haṃsyaṃ anadikāriṣu gōpanīyatvāt.

(paramātma tatvaṃ, bhagavattattvamu, paramapuruṣārthamaina mōkṣamunaku kāraṇamaguṭavalana (jñānē naivatukaivalyaṃ).guhyamu, rahasyamugānuṃca taginadi. paramahaṃsa ayina paramātmaku saṃbaṃdhiṃcinadi.adhikārulu kānivāralanuṃḍi rahasyamugā nuṃcataginadi).

  1. laukikapramāṇa prasidhdha viṣayēbhyaḥ āyurthana gaṃdharvavēdārtha nītiśāstrādi janyē bhyaḥ jānē bhyaḥ, prakṛṣṭā tīṃdri ya pāra laukika svargādi puruṣārtha tadupāya viṣayaṃ vēdākhyaśāstra mūlaṃ vividha jñānaṃ guhya śabdēna vivakṣitaṃ.

(āyurvēdamu, nītiśāstramu, gāṃdharvaśāstramu modalaguvāṭivalana kaligeḍi jñānamu, lōkamulō pramāṇamuladvārā prasidhdhi poṃdina viṣayamulaguṟiṃci ayina jñānamukanna prakṛṣṭamai iṃdriyamulacēta grahiṃcuṭaku vīlukānaṭuvaṃṭinnī,paralōkamunaku saṃbaṃdhiṃcinaṭuvaṃṭi svargādi puruṣārthamulaku upāyabhūtamaina, vēdamūlamaina jñānamu guhyamu ani ceppabaḍucunnadi).

  1. sādhana bhūta dharmatatva jñānaṃ guhyaṃ, tatsādhyaṃ; dēhadvaya vivēkātma jñānaṃ guhyataraṃ; tatprātyēśvara tatvajñānaṃ guha tamaṃ.

(sādhanabhūta dharmatatvajñānamu guhyamu - rahasyamugā nuṃcataginadi. sūkṣmadēhamu, sthūladēhamu anuvāni vivēkamugala jñānamu guhyataramu - modaṭidānikanna gōpyamugānuṃcataginadi. adi prāptiṃcinamīdaṭa kalugu īśvaratatva jñānamu muṃduceppina reṃḍiṃṭikaṃṭe heccugā gōpyamugā nuṃcataginadi - mikkili rahasyamainadi).

  1. “madanugrahāya paramaṃ guhya madhyātma saṃjñitaṃ |

yattvayōktaṃ va castēna mōhāyaṃ vigatō mama||“. (śrīmadbhagavadgīta- 11 - 1)

. (nannu anugrahiṃcuṭaku mikkili rahasyamainavinnī, adhyātmatatvamu anu jñānamu nīvu upadēśiṃcinaṃduvalla nā mōhamu - bhrama - pōyinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.