(సత్వరజస్తమములను మూడుగుణములలోను ఏ ఒక్క గుణము మిగిలిన గుణములతో కలియ కుండగ నుండదు. ఈ త్రిగుణములు ఒకదానితో నొకటి కలిసియుండు స్వభావముగలవికనుక ఎప్పుడూ కలిసియే యుండును - ఇవి ఇట్లుకలిసియుండుటచేతనే సుఖ దుఃఖములు, మోహము కలుగుచున్నవి, ఇతరకారణములవలనకాదు - ఇది ఎట్లనగా - ఒకే స్త్రీ ఒకవ్యక్తికి సుఖము, ఇంకొక వ్యక్తికి దుఃఖము, ఇంకొకనికి మోహము కలుగచేయును - లేక ఒకే వ్యక్తికి ఒకప్పుడు సుఖమును, ఒకప్పుడు దుఃఖమును, ఒకప్పుడు మోహమును కలుగచేయును - ఆ ప్రకారముగానే సత్వముకూడా, ఆ సత్వగుణమువలన ఒకపురుషునికి సుఖము కలుగచేయు ప్రవృత్తికలుగచేయును, ఇంకొక సమయములో ఇతరుని భార్యాసంభోగ వాంచవలన కలుగు దుఃఖమును రజోగుణము పుట్టించును -- లేక, తమోగుణములకు సంబంధించిన వౄత్తులను కలుగచేయును. ఆ పురుషునకు ఇంకొక సమయమందు సుఖమును కలుగచేయును, అందుచేత ఈ గుణములు ఒకదానితో నొకటి కలిసియుండకపోయిన ఇట్టి ఫలితము నీయజాలవు - ఇట్టి వేరువేరు విధములైనవృత్తులను ఒకే వ్యక్తిలో కలుగచేయవు. అందుచేత ఈ మూడు గుణములు ఎల్లపుడు కలిసియే యుండును).
యథాగాని లఘాన్యేవ నేత్రాదీని ఇంద్రియాణిచ |
నిర్మలం చ తథా చేతో గృహ్ణాతి విషయాన్ నతాన్ |
తథా సత్వం శరీరేవై మంతవ్యంచ సముత్కటం ||.
జృంభాం స్తంభంచ తంద్రాంచ చలంబైవ రజః పునః |
యదా తదుత్కటం జాతం దేహే యస్యచ కస్యచిత్||.
కలిం మృగయతే కర్తుం గంతుం గ్రామాంతరం తథా |
చలచిత్తస్య సోత్యర్థం బోధ్యతః తథా |
గురుమావరణం కామం తమో భవతి తద్యదా |
తదాంగాని గురూణ్యాసు ప్రభవంతి ఆవృతానిచ |
ఇంద్రియాణి మనస్సూన్యం నిద్రాం నైవాభివాంచతి |
గుణానాం లక్షణాన్యేవం విజ్ఞానానీహ నారద ||. (శ్రీదేవీ భాగవతం)
(సత్వరజస్తమములను గుణములు ఈ క్రింద చెప్పబడినరీతిగా నుండును : -
సత్వగుణము లఘప్రకాశకము, నిర్మలమైనది స్పష్టముగా తెలియబడునది. శరీరాంగములు, నేత్రములు, ఇంద్రియములు తేలికగా నుండును. వీటివలన సత్వగుణము అధికముగానున్నదని తెలియనగును. ఆలస్యము, చలము, విజృభించినయడల, స్తంభించినయడల రజోగుణము హెచ్చుగానున్నదని తెలుసుకొనవచ్చును, అబద్దము, అన్యాయము, గ్రామాంతరము పోవనిశ్చయించుట, చంచలమైన మనస్సు కలిగియుండుట, వివాదముచేయుట యందాసక్తి కలిగియుండుట, అధికకామము కలిగియుండుట - ఇవి తమోగుణ లక్షణములు).
(దీపములోని వత్తులు, నూనె వేరు వేరు అయినను అన్నియుకలిసి ఒకే దీపము అయి వెలుతురునిచ్చుచు, చుట్టుప్రక్కలనుండు వాటిని ప్రకాశింపచేయును, ఆ ప్రకారముగానే ఈ మూడుగుణములు వేరువేరు అయినను వస్తువులను ప్రకాశింపచేయును - వాటి వాటి వృత్తులను చేయునట్లు పురికొల్పును).
వ్రాతము సత్వమున, భూతరాశి దమమునన్
జాతులుగానొనరించు గు
ణా తీతుడవీవు గుణగణాలంకారాః . (పోతన తెలుగు భాగవతము- 9-284)
(satvarajastamamulanu mūḍuguṇamulalōnu ē okka guṇamu migilina guṇamulatō kaliya kuṃḍaga nuṃḍadu. ī triguṇamulu okadānitō nokaṭi kalisiyuṃḍu svabhāvamugalavikanuka eppuḍū kalisiyē yuṃḍunu - ivi iṭlukalisiyuṃḍuṭacētanē sukha duḥkhamulu, mōhamu kalugucunnavi, itarakāraṇamulavalanakādu - idi eṭlanagā - okē strī okavyaktiki sukhamu, iṃkoka vyaktiki duḥkhamu, iṃkokaniki mōhamu kalugacēyunu - lēka okē vyaktiki okappuḍu sukhamunu, okappuḍu duḥkhamunu, okappuḍu mōhamunu kalugacēyunu - ā prakāramugānē satvamukūḍā, ā satvaguṇamuvalana okapuruṣuniki sukhamu kalugacēyu pravṛttikalugacēyunu, iṃkoka samayamulō itaruni bhāryāsaṃbhōga vāṃcavalana kalugu duḥkhamunu rajōguṇamu puṭṭiṃcunu -- lēka, tamōguṇamulaku saṃbaṃdhiṃcina vṝttulanu kalugacēyunu. ā puruṣunaku iṃkoka samayamaṃdu sukhamunu kalugacēyunu, aṃducēta ī guṇamulu okadānitō nokaṭi kalisiyuṃḍakapōyina iṭṭi phalitamu nīyajālavu - iṭṭi vēruvēru vidhamulainavṛttulanu okē vyaktilō kalugacēyavu. aṃducēta ī mūḍu guṇamulu ellapuḍu kalisiyē yuṃḍunu).
yathāgāni laghānyēva nētrādīni iṃdriyāṇica |
nirmalaṃ ca tathā cētō gṛhṇāti viṣayān natān |
tathā satvaṃ śarīrēvai maṃtavyaṃca samutkaṭaṃ ||.
jṛṃbhāṃ staṃbhaṃca taṃdrāṃca calaṃbaiva rajaḥ punaḥ |
yadā tadutkaṭaṃ jātaṃ dēhē yasyaca kasyacit||.
kaliṃ mṛgayatē kartuṃ gaṃtuṃ grāmāṃtaraṃ tathā |
calacittasya sōtyarthaṃ bōdhyataḥ tathā |
gurumāvaraṇaṃ kāmaṃ tamō bhavati tadyadā |
tadāṃgāni gurūṇyāsu prabhavaṃti āvṛtānica |
iṃdriyāṇi manassūnyaṃ nidrāṃ naivābhivāṃcati |
guṇānāṃ lakṣaṇānyēvaṃ vijñānānīha nārada ||. (śrīdēvī bhāgavataṃ)
(satvarajastamamulanu guṇamulu ī kriṃda ceppabaḍinarītigā nuṃḍunu : -
satvaguṇamu laghaprakāśakamu, nirmalamainadi spaṣṭamugā teliyabaḍunadi. śarīrāṃgamulu, nētramulu, iṃdriyamulu tēlikagā nuṃḍunu. vīṭivalana satvaguṇamu adhikamugānunnadani teliyanagunu. ālasyamu, calamu, vijṛbhiṃcinayaḍala, staṃbhiṃcinayaḍala rajōguṇamu heccugānunnadani telusukonavaccunu, abaddamu, anyāyamu, grāmāṃtaramu pōvaniścayiṃcuṭa, caṃcalamaina manassu kaligiyuṃḍuṭa, vivādamucēyuṭa yaṃdāsakti kaligiyuṃḍuṭa, adhikakāmamu kaligiyuṃḍuṭa - ivi tamōguṇa lakṣaṇamulu).
(dīpamulōni vattulu, nūne vēru vēru ayinanu anniyukalisi okē dīpamu ayi veluturuniccucu, cuṭṭuprakkalanuṃḍu vāṭini prakāśiṃpacēyunu, ā prakāramugānē ī mūḍuguṇamulu vēruvēru ayinanu vastuvulanu prakāśiṃpacēyunu - vāṭi vāṭi vṛttulanu cēyunaṭlu purikolpunu).
vrātamu satvamuna, bhūtarāśi damamunan
jātulugānonariṃcu gu
ṇā tītuḍavīvu guṇagaṇālaṃkārāḥ . (pōtana telugu bhāgavatamu- 9-284)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.