సుషుమ్నా నాడికి ఎడమభాగమునందు ఇడ అను నాడియు, కుడివైపు పింగళయను నాడియు గలవు. ఇవి మూలాధారము మొదలు ముక్కు చివరవరకు వ్యాపించియుండును. ఎడమముక్కునుండి వచ్చు నిశ్వాసము ఇడానాడినుండివచ్చును - కుడిముక్కునుండివచ్చునది పింగళానాడినుండి వచ్చును - మొదటిది చంద్రమండలమునాశ్రయించి యున్నది, రెండవది సూర్యమండలమును ఆశ్రయించుయున్నది - కావున ఇవి చంద్రనాడి, సూర్యనాడి అనియు చెప్పబడుచున్నవి. చంద్రనాడినుండి వచ్చు నిశ్వాసము చల్లగను,సూర్యనాడి ద్వారా వచ్చునది వేడిగాను ఉండును - ఇందువలన శరీర శీతోష్ణస్థితి సమముగా నుండును.
suṣumnā nāḍiki eḍamabhāgamunaṃdu iḍa anu nāḍiyu, kuḍivaipu piṃgaḷayanu nāḍiyu galavu. ivi mūlādhāramu modalu mukku civaravaraku vyāpiṃciyuṃḍunu. eḍamamukkunuṃḍi vaccu niśvāsamu iḍānāḍinuṃḍivaccunu - kuḍimukkunuṃḍivaccunadi piṃgaḷānāḍinuṃḍi vaccunu - modaṭidi caṃdramaṃḍalamunāśrayiṃci yunnadi, reṃḍavadi sūryamaṃḍalamunu āśrayiṃcuyunnadi - kāvuna ivi caṃdranāḍi, sūryanāḍi aniyu ceppabaḍucunnavi. caṃdranāḍinuṃḍi vaccu niśvāsamu callaganu,sūryanāḍi dvārā vaccunadi vēḍigānu uṃḍunu - iṃduvalana śarīra śītōṣṇasthiti samamugā nuṃḍunu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.