మూత్రపురీషాదిష్టివ ఇచ్చా రాహిత్యం -
(ఈ లోకములో మంచిగంధము, స్త్రీలు మొదలగువాటియందున్నూ, పరలోకములో స్వర్గములోని భోగములగు రంభాసంభోగమందున్నూ, వాంతిచేసిన అన్నము, మూత్రము, పురీషము మొదలగు వస్తువులందువలె, ఏహ్యమైనవని వాటియందు కోరిక లేకుండుట),
“ఇహపరంబులందు వనితాది విషయభోగంబులెల్ల కర్మ జన్యంబులగుటంజేసి అనిత్యంబులగుటంజేసి సంపాదించెనేని భోగ సిద్ధ్యంతంబునందు క్రమంబున మహాప్రయాస వైరస్యంబగుటయు దుఃఖరూపంబులని మనంబున తిరస్కరించుటయే ఇహముత్రఫలభోగ విరాగ లక్షణంబు” (వివేకచింతామణి - శ్రీపరమానందతీర్థ)
“ఐహికానాం స్రక్చందన వనితాది విషయభోగానాం కర్మజన్యతయా నిత్యత్వవత్, ఆముష్మికాణాం అపి అమృతాది విషయభోగానాం అనిత్యతయా తేభ్యోనితరాం విరతిః”.
(“తద్యథా ఇహకర్మజితాః లోకాః క్షీయతే, ఏవమేవ అముత్ర పుణ్య జితాః లోకాః క్షీయతే” కర్మలచేత సంపాదింపబడిన భోగములుగల ఈ లోకము శాశ్వతముగానుండక ఏట్లు నశించుచున్నదో, ఆ ప్రకారముగానే పుణ్యకర్మలు చేసిన ఫలితముగా స్వర్గములోని, అమృతపానము, రంభాసంభోగము మొదలగు భోగములుగల పరలోకములుకూడా శాశ్వతముగా నుండక నశించిపోవును అని శ్రుతి చెప్పుచున్నది - “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అని శ్రీమద్భగవద్గీత చెప్పుచున్నది. (చేసిన పుణ్యము అనుభవమువలన క్షీణించగానే స్వర్గలోకమునుండి తిరిగి భూలోకము వచ్చెదరు). అందుచేత ఆ స్వర్గములోని అనుభవములు శాశ్వతముకాదని తెలుసుకొని, ఆ కర్మలు, వాటి ఫలముందు కోరికలేకయుండుటే ఇహా ముత్రఫలభోగ విరాగము). “ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున” (శ్రీమద్భగవద్గీత - 8 - 16)
(బ్రహ్మలోకము మొదలు లోకములన్నియు తిరిగి తిరిగి పుట్టవలసినవే, శాశ్వతములుకావు).
(మూడువేదములు చదివినవారు యజ్ఞముచేసి, యజ్ఞావశిష్టమైన సోమరసము పానముచేసి, పాపము పోగొట్టుకొనినవారై స్వర్గమును చేరి అక్కడ దేవలోకములో దివ్యమైన దేవభోగములైన అమృతపానము, రంభాసంభోగము మొదలైనవాటిని అనుభవించి, ఆ పుణ్యఫలము ఆ భోగములవలన క్షీణించగా తిరిగి భూలోకమునకు వచ్చెదరు - అందుచేత ఆ లోకముల భోగములుకూడా శాశ్వతములుకావు. ఆ లోకములే శాశ్వతములుకావు. అందుచేత ఇహలోకములోని సుఖములు పరలోకములోని సుఖములు శాశ్వతములుకావని నిశ్చయముగా తెలుసుకొని వాటియంది కోరికలేక వైరాగ్యము కలిగియుండుటే ఇహాముత్ర ఫలభోగవిరాగము).
mūtrapurīṣādiṣṭiva iccā rāhityaṃ -
(ī lōkamulō maṃcigaṃdhamu, strīlu modalaguvāṭiyaṃdunnū, paralōkamulō svargamulōni bhōgamulagu raṃbhāsaṃbhōgamaṃdunnū, vāṃticēsina annamu, mūtramu, purīṣamu modalagu vastuvulaṃduvale, ēhyamainavani vāṭiyaṃdu kōrika lēkuṃḍuṭa),
“ihaparaṃbulaṃdu vanitādi viṣayabhōgaṃbulella karma janyaṃbulaguṭaṃjēsi anityaṃbulaguṭaṃjēsi saṃpādiṃcenēni bhōga siddhyaṃtaṃbunaṃdu kramaṃbuna mahāprayāsa vairasyaṃbaguṭayu duḥkharūpaṃbulani manaṃbuna tiraskariṃcuṭayē ihamutraphalabhōga virāga lakṣaṇaṃbu” (vivēkaciṃtāmaṇi - śrīparamānaṃdatīrtha)
“aihikānāṃ srakcaṃdana vanitādi viṣayabhōgānāṃ karmajanyatayā nityatvavat, āmuṣmikāṇāṃ api amṛtādi viṣayabhōgānāṃ anityatayā tēbhyōnitarāṃ viratiḥ”.
(“tadyathā ihakarmajitāḥ lōkāḥ kṣīyatē, ēvamēva amutra puṇya jitāḥ lōkāḥ kṣīyatē” karmalacēta saṃpādiṃpabaḍina bhōgamulugala ī lōkamu śāśvatamugānuṃḍaka ēṭlu naśiṃcucunnadō, ā prakāramugānē puṇyakarmalu cēsina phalitamugā svargamulōni, amṛtapānamu, raṃbhāsaṃbhōgamu modalagu bhōgamulugala paralōkamulukūḍā śāśvatamugā nuṃḍaka naśiṃcipōvunu ani śruti ceppucunnadi - “kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti” ani śrīmadbhagavadgīta ceppucunnadi. (cēsina puṇyamu anubhavamuvalana kṣīṇiṃcagānē svargalōkamunuṃḍi tirigi bhūlōkamu vaccedaru). aṃducēta ā svargamulōni anubhavamulu śāśvatamukādani telusukoni, ā karmalu, vāṭi phalamuṃdu kōrikalēkayuṃḍuṭē ihā mutraphalabhōga virāgamu). “ā brahma bhuvanāllōkāḥ punarāvartinōrjuna” (śrīmadbhagavadgīta - 8 - 16)
(brahmalōkamu modalu lōkamulanniyu tirigi tirigi puṭṭavalasinavē, śāśvatamulukāvu).
(mūḍuvēdamulu cadivinavāru yajñamucēsi, yajñāvaśiṣṭamaina sōmarasamu pānamucēsi, pāpamu pōgoṭṭukoninavārai svargamunu cēri akkaḍa dēvalōkamulō divyamaina dēvabhōgamulaina amṛtapānamu, raṃbhāsaṃbhōgamu modalainavāṭini anubhaviṃci, ā puṇyaphalamu ā bhōgamulavalana kṣīṇiṃcagā tirigi bhūlōkamunaku vaccedaru - aṃducēta ā lōkamula bhōgamulukūḍā śāśvatamulukāvu. ā lōkamulē śāśvatamulukāvu. aṃducēta ihalōkamulōni sukhamulu paralōkamulōni sukhamulu śāśvatamulukāvani niścayamugā telusukoni vāṭiyaṃdi kōrikalēka vairāgyamu kaligiyuṃḍuṭē ihāmutra phalabhōgavirāgamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.